
Aug 18 2026 5:41 PM | Updated on Aug 18 2026 6:19 PM
ఇప్పుడంతా ఏఐ సాంకేతికదే హవా. ఎటు చూసినా..ఏం చేసినా ఏఐ సాంకేతికత లేకుండా పనికాదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అందులో కూడా దాని హవా ఏ రేంజ్లో ఉందంటే మనషుల కంటే శరవేగంగా వ్యూస్, పాపులారిటీ సంపాదించేసుకుంటున్నాయి. వాటి ఆదాయాలు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. అచ్చం మనుషుల్లాగా కనిపించే వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో సృష్టిస్తున్న ప్రభంజనం మాములుగా లేదు. అందులోనూ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత ఆర్జిస్తున్నారో తెలిస్తే కంగుతింటారు.
దీనిపై గ్రాండ్ వ్యూ రీసెర్చ్ జరిపిన సర్వే ప్రకారం.. ఈ విభాగంలో మార్కెట్ ఆదాయంలో 68% వాటా మహిళల రూపంలో ఉండే "ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ల"దే నని తేలింది. మానవ ఇన్ఫ్లుయెన్సర్ కంటే వీరు సుమారు 40 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్లలో 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు 44.76% ఉన్నారు.
ఇది సాధారణ ఇన్ఫ్లుయెన్సర్ ఖాతాల ఫాలోవర్ల సంఖ్యకు దాదాపు రెట్టింపు. అంతేకాదండోయ్ ఈ ఏఐ మహిళా అవతార్లతో అనేక ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ హౌస్‌లు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయట. మరి ఆ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరో చూద్దామా..!.
బ్రెజిలియన్ మ్యాగజైన్ 'లూయిజా' సృష్టించిన వర్చువల్ స్టార్ ‘లూ డో మగలు’ వార్షిక ఆదాయం సుమారుగా ₹25 కోట్లు. ఆమెకు ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ ఫ్లాట్‌ఫామ్‌లలో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారట.
‘లూ మిక్వేలా’ అనే మహిళా వర్చువల్ స్టార్‌తో ప్రాడా, కాల్విన్ క్లైన్ వంటి ఫ్యాషన్ హౌస్‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆమె నికర ఆస్తి విలువ ఏకంగా రూ. 150 కోట్లు.
గులాబీ రంగు జుట్టు కలిగిన స్పానిష్ ఏఐ మోడల్ ‘ఐటానా లోపెజ్’ అమెజాన్ స్పెయిన్, జియెసెలిన్ వటి బ్రాండ్లతో స్కాలర్షిప్ అందుకుంటోంది. ఆమె వార్షిక ఆదాయం రూ. 1 కోటిని మించి ఉంటుందట.
భారత్‌లో ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ల క్రేజ్.. మన దేశంలో కూడా వీటి క్రేజ్పెరుగుతోందట. సుమారు 55% ఎంగేజ్మెంట్ రేటుతో, ఈ గ్లోబల్ ట్రెండ్‌లో భారతదేశం ముందుందట. అనేక ప్రముఖ దేశీయ బ్రాండ్లు తమ ప్రచారాలలో వీటిని చేర్చుకుంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
కైరా అనే ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు దాదాపు 2.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నైనా అనే ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఏకంగా .7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వ్రిత్తికా పటేల్ అనే ఏఐ మోడల్‌కు లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారట. ఆఖరికి సాంకేతికతలో కూడా మహిళా ఏఐ అవతార్లదే అగ్రస్థానం కదూ..!.
(చదవండి: 15 రోజులకు మించి బతికే ఛాన్స్ లేదన్నారు..కానీ ఆ అమ్మాయి ఇవాళ..)
భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు)
జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)
18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)
న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)
క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత
'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు
కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్
రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద..



