
త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్ , లండన్ లో లగ్జరీప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది త్రిష. కెరీర్ ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఏజ్‌ని తినేస్తుందనేలా ఆమె అందం ఉండటం విశేషం. అదే సమయంలో హీరోయిన్గా అత్యంత సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్‌గానూ త్రిష నిలిచింది. తెలుగులో 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'అతడు' వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది త్రిష. ప్రస్తుతం ఆమె అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా ఉండటం విశేషం. దీంతో ఇప్పుడు ఆమె ఆస్తుల లెక్కలు వైరల్‌గా మారాయి. త్రిష మొత్తం ఆస్తి విలువ సుమారు ₹85 కోట్లు ఉంటుందని అంచనా. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, విలాసవంతమైన జీవనశైలి కూడా ఆమె సంపదలో భాగమని తెలుస్తోంది. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘లియో’ చిత్రాల భారీ విజయం తర్వాత త్రిష తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు సుమారు ₹10 నుంచి ₹12 కోట్లు తీసుకుంటుందని టాక్. గతంలో ఆమె ఒక్కో చిత్రానికి ₹5 నుంచి ₹10 కోట్లు తీసుకునేదని టాక్. సినిమా రెమ్యూనరేషనే కాకుండా, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా త్రిషకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఆమె బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఏటా సుమారు ₹9 కోట్లు సంపాదిస్తుందని సమాచారం. త్రిష రియల్ ఎస్టేట్ ఆస్తులలో చెన్నైలోని ఇల్లు చాలా ప్రత్యేకం. చెన్నైలోని ఆమె ఇంటి విలువ సుమారు ₹10 కోట్లు అని సమాచారం. రస్ట్ ఆరెంజ్, బేజ్, బ్రౌన్, మ్యూటెడ్ గోల్డ్ వంటి ఎర్తీ కలర్స్‌తో ఇంటి ఇంటీరియర్‌ను అందంగా తీర్చిదిద్దారు. పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్, ఇతర అలంకరణ వస్తువులతో ఇంటిని డిజైన్ చేశారు. ఈ ఇంట్లో బట్టలు, లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లతో నిండిన వాక్-ఇన్ వార్డ్రోబ్ కూడా ఉందని సమాచారం. చెన్నైలోనే కాకుండా, హైదరాబాద్‌లోనూ త్రిషకు ఖరీదైన ఇళ్లు ఉందట. దీని విలువ సుమారు ₹6 నుంచి ₹6.5 కోట్ల