
ముక్కలుగా చేసి నదిలో కలిపేస్తారు.. ఈ తెగ అంత్యక్రియల వెనుక అసలు కథ ఇదే
అరుణాచల్‌ప్రదేశ్‌లోని మోన్పా తెగకు చెందిన కొన్ని ప్రాంతాల్లో అంత్యక్రియల సంప్రదాయం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ముఖ్యంగా తవాంగ్ ప్రాంతంలో గతంలో అమల్లో ఉన్న ఓ ప్రత్యేక జల అంత్యక్రియల పద్ధతి గురించి పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఇందులో మృతదేహాన్ని 108 ముక్కలుగా చేసి నదిలో కలిపేవారని చెబుతారు. అయితే కాలానుగుణంగా ఆచారాల్లో వచ్చిన మార్పుల వల్ల దీన్ని మోన్పా తెగ ఇప్పుడు పూర్తిగా పాటించడం లేదు.మోన్పాలపై టిబెటన్ బౌద్ధ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బౌద్ధ విశ్వాసాల ప్రకారం మరణం తర్వాత ప్రాణం ‘బార్డో’ అనే మధ్యస్థ స్థితిలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఇది 49 రోజుల వరకు కొనసాగుతుందని విశ్వాసం. ఈ సమయంలో మృతుల కోసం ప్రార్థనలు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంత్యక్రియల విధానాన్ని నిర్ణయించడంలో లామాలు, మతపెద్దలు కీలక పాత్ర పోషిస్తారు.బౌద్ధ సంప్రదాయాల్లో 108 సంఖ్యకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రార్థనా మందిరాల్లో ఈ సంఖ్య కనిపిస్తుంది. మోన్పాల సంప్రదాయాల్లోనూ దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నట్లు చెబుతారు. శరీరం శాశ్వతం కాదనే బౌద్ధ భావన కూడా ఈ అంత్యక్రియల పద్ధతికి ఒక కారణంగా భావిస్తారు.సంప్రదాయ వివరాల ప్రకారం మృతదేహాన్ని నది వద్దకు తీసుకెళ్లి 108 ముక్కలుగా చేసేవారు. ఈ ప్రక్రియను ‘థంపా’గా పిలిచే వ్యక్తి నిర్వహించేవారని చెబుతారు. అనంతరం మృతదేహ భాగాలను ఒక్కొక్కటిగా నదిలో వదిలేవారు. ప్రకృతిలో కలిసిపోయేలా శరీరాన్ని అప్పగించడమే ఈ పద్ధతి వెనుక ఉన్న భావనగా సంప్రదాయ కథనాలు చెబుతున్నాయి.అయితే మోన్పాల అంత్యక్రియలు ఇంతటితో పరిమితం కాలేదు. వివిధ ప్రాంతాల్లో దహనం