
పాలకుర్తిలో ఘనంగా బోనాల పండుగ బోనమెత్తిన ఎర్రబెల్లి
Palakurthi: పాలకుర్తిలో ఘనంగా బోనాల పండుగ బోనమెత్తిన ఎర్రబెల్లి ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Palakurthi: పాలకుర్తిలో ఘనంగా బోనాల పండుగ బోనమెత్తిన ఎర్రబెల్లి ఈ వార్తకు సంబంధించిన

హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రాత్మక శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం ఆదివారం భక్తజన సంద్రమైంది. లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రకృతిని, అమ్మవారిని దైవంగా భావించే ఈ పురాతన సంప్రదాయం పాతబస్తీ వీధుల్లో ఆధ్యాత్మిక శోభను నింపింది. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు వేప ఆకులతో అలంకరించిన బోనం కుండలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి తమ కుటుంబాలకు ఆరోగ్యం, సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. పాథర్గట్టి పరిసరాలు పూర్తిగా భక్తి భావంతో నిండిపోయాయి. అమ్మవారి ఆశీస్సుల కోసం లక్షలాది మంది భక్తులు బారులు తీరారు. దీంతో, ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ కేటాయించడం విశేషం. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 2,500 మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. భక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు 100 సీసీటీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, గాయని మంగ్లీ పాల్గొన్నారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ యాదవ్, బీఆర్ఎస్ నేత కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శనం చేసుకున్నారు. ఫలితంగా, రాజకీయ ప్రముఖులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఈ నేపథ్యంలో, సాయంత్రం నిర్వహించిన శాంతి కల్యాణోత్సవం ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా సాగింది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Lal Darwaza Bonalu 2026: హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు నేడు అనగా ఆగస్టు 9న అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ 118వ వార్షిక జాతరకు నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేయడంతో పాటు వైన్ షాపులు బంద్, ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. ఉత్సవాల వేడుకలు ఇలా: నేడు (ఆగస్టు 9): అమ్మవారికి బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి. రేపు (ఆగస్టు 10): ఘటం ఊరేగింపు, భవిష్యవాణి వినిపించే 'రంగం' కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రధాన ఊరేగింపు లాల్ దర్వాజా, శాలిబండ, చార్మినార్, పత్తర్‌గట్టి మీదుగా మూసీ నది సమీపంలోని నయాపూల్ ఆలయం వరకు సాగుతుంది. మద్యం దుకాణాల మూసివేత.. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటానికి హైదరాబాద్ పోలీసు కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లలో ఆగస్టు 9 ఉదయం 10:00 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 10:00 గంటల వరకు వైన్స్, కల్లు కాంపౌండ్లు, బార్లు మూసి ఉంటాయి. అదే విధంగా చార్మినార్ జోన్లో ఉత్సవాలు ప్రధానంగా జరిగే ఈ ప్రాంతంలో రెండు రోజుల