తెలంగాణలో మందుబాబుల జోరు.. నిమిషానికి 5,200 బాటిళ్ల అమ్మకాలు , రూ.14,668 కోట్ల బిజినెస్
తెలంగాణలో మందుబాబులు బాటిళ్లను భారీగా ఖాళీ చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో జరిగే మద్యం విక్రయాల పరిమాణం చూస్తే అర్థమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రంలో ప్రతీ నిమిషానికి సగటున 5200 బీర్లు.. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) బాటిళ్లు అమ్ముడైనట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ విక్రయాల గణాంకాల ఆధారంగా వెల్లడైంది. వీటిలో సుమారు 3,600 బాటిళ్లు మద్యం కాగా.. మరో 1,600 బాటిళ్లు బీర్లు కావడం గమనార్హం. ఈ 4 నెలల వ్యవధిలో తెలంగాణలో బీర్, ఐఎంఎఫ్ఎల్ కలిపి సుమారు 3.5 కోట్ల కేసుల విక్రయాలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ.14,668 కోట్లు. ఇందులో బీర్ విక్రయాలు సుమారు 2.21 కోట్ల కేసులు ఉండగా, ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు 1.29 కోట్ల కేసులుగా నమోదయ్యాయి.ఇక బీర్ కేసుల సంఖ్య కంటే మద్యం బాటిళ్ల పరిమాణాన్ని పరిశీలిస్తే మందు అమ్మకాలు ఏ రేంజ్లో ఉన్నాయో మరింత స్పష్టమవుతుంది. వివిధ ప్యాక్ సైజులను లెక్కలోకి తీసుకుంటే ఏప్రిల్-జూలై నెలల మధ్య సుమారు 91.5 కోట్ల బాటిళ్లు.. అంటే దాదాపు 28.4 కోట్ల లీటర్ల మద్యం విక్రయమైనట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేశారు. అంటే ప్రతి నిమిషానికి సుమారు 1600 లీటర్ల మద్యం మార్కెట్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 980 లీటర్లు బీర్, 635 లీటర్లు ఐఎంఎఫ్ఎల్ ఉన్నట్లు వెల్లడైంది.నెలల వారీగా చూస్తే మద్యం విక్రయాల్లో కొన్ని ఎక్కువ తక్కువలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో నిమిషానికి సుమారు 5,100 బాటిళ్లు అమ్ముడవగా.. మేలో ఈ సంఖ్య 5,500కు పెరిగింది. జూన్ నెలలో 5,400గా ఉండగా.. జూలైలో వర్షాకాలం ప్రారంభంతో సుమారు 4,850 బాటిళ్లకు తగ్గింది. వేసవి కాలం ముగియడంతో.. మరీ ముఖ్యంగా బీర్ విక్రయాల్లో ఈ తగ్గుదల స్పష్టంగా కనిపించింది.మరోవైపు.. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) డిపోల్లో ప్రతి నెలా సుమారు 35 వేల కేసుల మద్యం, బీర్
