
Suvendu Adhikari: కాళీమాత గుడిలో చేపలు తిన్న బెంగాల్ సీఎం.. వీడియో
Suvendu Adhikari: కాళీమాత గుడిలో చేపలు తిన్న బెంగాల్ సీఎం.. వీడియో
© 2026 nimisham.in

Suvendu Adhikari: కాళీమాత గుడిలో చేపలు తిన్న బెంగాల్ సీఎం.. వీడియో

పశ్చిమ బెంగాల్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్ రక్షణను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నూతన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సిలిగురిలో దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో సశస్త్ర సీమ బల్ ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయ పరిపాలనా భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు. దేశ సరిహద్దులు బలోపేతం కానంత వరకూ భారత్ ఎంత మాత్రం సురక్షితంగా కాదని తేల్చి చెప్పారు. నలుమూలలా వ్యాపించి ఉన్న సరిహద్దులను మరింత పటిష్ట పర్చుకోవాల్సి ఉందని అన్నారు. సిలిగురి కారిడార్‌ను దేశంలో అత్యంత సున్నితమైన, భౌగోళిక వ్యూహాత్మక ప్రతిపత్తి కలిగిన ప్రాంతమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు దీనికి తగిన ప్రాధాన్యత దక్కలేదని పేర్కొన్నారు.దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భూభాగంతో అనుసంధానించే ఈ చికెన్స్ నెక్ ప్రాంత భద్రత దేశ సార్వభౌమాధికారానికి ఎంతో కీలకమని అమిత్ షా అన్నారు. ఇక్కడ కొత్తగా నిర్మించనున్న భారీ ఎస్ఎస్బీ పరిపాలనా భవనం సరిహద్దు రక్షణ చర్యలను నిరంతరం పర్యవేక్షించడానికి, పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేయడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. జాతీయ భద్రత విషయంలో కేంద్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.వరలక్ష్మీ వ్రతం వేళ.. బంగారం ప్రియులకు బిగ్ షాక్దేశంలో శాంతిభద్రతలు వర్ధిల్లాలన్నా, పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశమంతటా సురక్షిత వాతావరణం నెలకొనాలన్నా సరిహద్దు వెంబడి శత్రువుల కదలికలను పూర్తిగా అరికట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా భద్రతా బలగాలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి చొరబాట్లను నిరోధించేందుకు కంచె వేయాలని కేంద్రం భావించినప్పటికీ.. దీనికి కావలసిన భూమిని కేటాయించడంలో గత మమత బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. సరిహద్దుల

రేవంత్‌పై అత్యధికంగా 89, సువేందుపై 29.. చంద్రబాబు, డీకే శివకుమార్‌పై 19 చొప్పున కేసులు లోక్‌సభలో 251, రాజ్యసభలో 75 మంది పైనా.. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,192 కేసులు పెండింగ్ సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ హన్సారియా నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మందిపై తీవ్ర ఆరోపణలతో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్, సువేందు అధికారి కూడా ఉన్నారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. 29 కేసులతో సువేందు రెండో స్థానంలో ఉన్నారు. చంద్రబాబు, డీకేలపై చెరో 19 కేసులు, కేరళ సీఎం వీడీ సతీశన్‌పై 18 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో నివేదిక సమర్పించారు. బీజేపీ నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణకు హన్సారియా సహకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తన అఫిడివిట్లో తెలిపారు. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయడానికి తక్షణమే ప్రత్యేక కోర్టులు నెలకొల్పాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ ట్రయల్స్‌ను క్రియాశీలంగా పర్యవేక్షించాలని సంబంధిత హైకోర్టులను కూడా ఆదేశించాలని కోరారు. ‘543 మంది ఎంపీల లోక్‌సభలో 251 మంది, వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో 519 కేసులు పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి. 700 కేసుల్లో పోలీసులు అసలు దర్యాప్తే ప్రారంభించలేదు. చార్జిషీటు కూడా దాఖలు కాకుండా 360 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేరళకు చెందిన 95ు మంది ఎంపీలు తీవ్ర క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో 82ు మంది ఎంపీలపై.. ఒడిసాలో 76ు మంది పార్లమెంటు సభ్యులపై కేసులు

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రదానం చేసిన రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం 'బంగ విభూషణ్'ను ఉపసంహరించి, రద్దు చేసింది. ఈ నిర్ణయం గురువారం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది (Ananta Maharaj Banga Bibhushan). అనంత మహారాజ్ ఇటీవల నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను 'యుద్ధ నేరస్థుడు'గా అభివర్ణించి వివాదానికి తెర తీశారు. స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ నాయకత్వం, ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్రపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో పశ్చిమ బెంగాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అత్యంత గౌరవనీయ నాయకుడైన నేతాజీపై అవమానకర వ్యాఖ్యలను సహించబోమని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు అనే తేడా ఉండదని కూడా ఆయన పేర్కొన్నారు (Netaji Controversy). కాగా, నాగేంద్ర రాయ్‌కు 2026 ఫిబ్రవరి 21న 'బంగ విభూషణ్' పురస్కారం లభించింది (Bengal Politics). అప్పట్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రానికి, ప్రజలకు విశిష్టమైన సేవలు చేశారనే కారణంతో నాగేంద్రరాయ్కు మమత సర్కారు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనకు ఇచ్చిన పురస్కారాన్ని ఉపసంహరించుకుని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. నేతాజీ వారసత్వాన్ని అవమానించే వ్యాఖ్యలు పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించవచ్చని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు.. మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

పశ్చిమ బెంగాల్లో ‘లోక్తంత్ర సేనానీ’లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారికి నెల నెలా రూ.10,000 భత్యం, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సాయం అందిస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. ఆదివారం రాష్ట్ర సచివాలయం ‘నబన్న’లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.1975-77 మధ్య దేశంలో విధించిన అంతర్గత ఎమర్జెన్సీ సమయంలో ‘ఎంఐఎస్ఏ’, ‘డీఐఆర్’ వంటి చట్టాల కింద జైలుకు వెళ్లిన వారిని ‘లోక్తంత్ర సేనానీ’లుగా గుర్తిస్తున్నారు. ఈ సందర్భంగా 325 మంది సేనానీలను సీఎం సువేందు అధికారి ఘనంగా సత్కరించారు. ప్రతి ఒక్కరికి రాగి పతకాన్ని బహూకరించారు. ఒకవేళ సన్మానం అందుకున్న వ్యక్తి జీవించి లేకపోతే, వారి భర్త లేదా భార్య ఈ ప్రయోజనాలను పొందుతారని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం సువేందు అధికారి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ నాటి క్లిష్ట పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. "ఆ సమయంలో దేశవ్యాప్తంగా లక్ష మందిని జైళ్లలో పెట్టారు. వారిలో కనీసం 5,000 మంది బెంగాల్లోనే ఉన్నారు. అప్పుడు జైలు చీకటిలో జీవితాలు గడిపిన వారి త్యాగాల వల్లే ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, ఓటు హక్కు కాపాడబడ్డాయి" అని ఆయన అన్నారు.అలాగే, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ సేవలను సీఎం స్మరించుకున్నారు. గతాన్ని ఉద్దేశిస్తూ, జాతీయవాదం, దేశభక్తి, సంప్రదాయ సంస్కృతిని చెరిపేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ముఖర్జీ సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఆగస్టు 13న శ్యామ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి