
ఏపీలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు
విశాఖపట్నంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మరో 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేశాడని యువతి ఆరోపించింది. రాహుల్ రెడ్డి.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు బావమరిది అని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి విషయంలో మోసం చేసిన అనంతరం తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని యువతి ఆరోపించింది. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారని, బలవంతంగా వీడియో స్టేట్మెంట్లు ఇప్పించారని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదుపై స్పందించిన విశాఖ పోలీసులు.. రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మరో 11 మందిపై బెదిరింపులు, సైబర్ వేధింపులు తదితర ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పసిడి ప్రియులకు షాక్: ఒక్కరోజే రూ. 3,000కి పైగా పెరిగిన బంగారం ధరలు! అదానీ గ్రూప్‌కు బిగ్ రిలీఫ్: $250M క్రిమినల్ కేసు రద్దు చేసిన అమెరికా న్యాయస్థానం!