
వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు
Silver: వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు.. ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Silver: వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు.. ఈ వార్తకు సంబంధించిన

అంతర్జాతీయ మార్కెట్లలో సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ భారత రత్నాభరణాల ఎగుమతులు వృద్ధి బాటలో కొనసాగుతున్నాయి. 2026 ఏప్రిల్-జూలై మధ్య కాలంలో దేశ జెమ్ అండ్ జ్యువెలరీ ఎగుమతులు డాలర్ పరంగా 2.44 శాతం పెరిగి 9.17 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విలువ ఆధారిత ఆభరణాల విభాగాల్లో బలమైన పనితీరు ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రూపాయి పరంగా చూస్తే మొత్తం ఎగుమతులు 13.58 శాతం పెరిగి రూ.87,078.01 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ వృద్ధి నమోదైంది.బంగారు ఆభరణాల ఎగుమతుల్లో భారీ వృద్ధిఎగుమతుల వృద్ధిలో స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీ కీలక పాత్ర పోషించింది. స్టడెడ్ గోల్డ్ ఆభరణాల ఎగుమతులు 21.09 శాతం పెరిగి 2.24 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ప్లెయిన్, స్టడెడ్ ఆభరణాలు కలిపిన మొత్తం బంగారు ఆభరణాల ఎగుమతులు 5.87 శాతం వృద్ధితో 4.03 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.వెండి ఆభరణాలకు భారీ డిమాండ్వెండి ఆభరణాల ఎగుమతుల్లో అత్యధిక వృద్ధి నమోదైంది. ఏప్రిల్-జూలై కాలంలో సిల్వర్ జ్యువెలరీ ఎగుమతులు ఏకంగా 72.19 శాతం పెరిగి 508.18 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ విలువ ఆధారిత వెండి ఆభరణాలకు పెరుగుతున్న డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేసినట్లు పరిశ్రమ గణాంకాలు సూచిస్తున్నాయి.ప్లాటినం, ల్యాబ్‌గ్రోన్ డైమండ్లకు కూడా డిమాండ్ప్లాటినం ఆభరణాల ఎగుమతులు కూడా 17.20 శాతం పెరిగి 77.82 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో పాలిష్డ్ ల్యాబ్‌గ్రోన్ డైమండ్ ఎగుమతులు 7.47 శాతం వృద్ధితో 408.50 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.మొత్తంగా చూస్తే విలువ ఆధారిత ఆభరణాల విభాగాల్లో నమోదైన వృద్ధి భారత జెమ్ అండ్ జ్యువెలరీ రంగానికి సానుకూల సంకేతంగా మారింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారతీయ ఆభరణాలకు డిమాండ్ కొనసాగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి

ఓ బ్యాంకు లాకర్లో దాచిన బంగారు, వెండి నగలు కనిపించకుండా పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. కొన్నేళ్ల కిందట బ్యాంకు ఖాతా తెరిచి రూ.50లక్షల విలువైన నగలను లాకర్లో దాచగా.. తాజాగా అవి అదృశ్యమయ్యాయి. కాన్పూర్: ఓ బ్యాంకు లాకర్లో దాచిన బంగారు, వెండి నగలు కనిపించకుండా పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. కొన్నేళ్ల కిందట బ్యాంకు ఖాతా తెరిచి రూ.50లక్షల విలువైన నగలను లాకర్లో దాచగా.. తాజాగా అవి అదృశ్యమయ్యాయి. లాకర్ తెరిచి చూసిన బాధితురాలికి తన ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్ తిన్నారు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించగా.. బ్యాంకు యాజమాన్యం, సిబ్బందిపై కేసు నమోదైంది. కాన్పూర్‌లోని స్వరూప్‌నగర్‌కు చెందిన రష్మి అరోరా తన భర్తతో కలిసి 2003 ఫిబ్రవరి 26న అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీటీ)లో ఖాతా తెరిచింది. అదే సమయంలో వారికి లాకర్ నంబర్ 23ని బ్యాంకు సిబ్బంది కేటాయించారు. అందులో సుమారు రూ.50లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను భార్యాభర్తలు భద్రపరిచారు. కొంతకాలం పాటు ఆ దంపతులు క్రమం తప్పకుండా బ్యాంకుకు వెళ్లి లాకర్‌ను పరిశీలించేవారు. రష్మి భర్త మరణించిన తర్వాత ఆమె.. లక్నోలోని కుమార్తె ఇంట్లో ఉంటోంది. దూరం కారణంగా బ్యాంకుకు వెళ్లడం తగ్గిపోయింది. అయితే లాకర్ భద్రంగానే ఉంటుందని భావించింది. ఇదిలా ఉండగా ఎస్బీటీ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) విలీనమైంది. సుమారు నాలుగు నెలల కిందట కుమార్తెతో కలిసి బ్యాంకుకు వెళ్లగా రష్మి పేరుతో లాకర్ లేదని సిబ్బంది చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీంతో పాత ఖాతా, లాకర్‌కు సంబంధించిన పత్రాలను తీసుకుని మరోసారి బ్యాంకుకు వెళ్లింది. అప్పుడు ఆమె ఖాతా నుంచి లాకర్ అద్దె ఆటోమేటిక్‌గా కట్ అవుతూ వచ్చిందని, దాంతో ఖాతాలోని నగదు మొత్తం ఖాళీ అయిందని బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఈ కారణంగానే ఖాతా ఇన్‌యాక్టివ్ అయ్యిందని పేర్కొన్నారు. జులై 21న రష్మి