
Swetha Reddy : మా అన్నయ్య సీరియల్ నటిశ్వేతారెడ్డి బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతారెడ్డి (Swetha Reddy) తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
© 2026 nimisham.in

మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతారెడ్డి (Swetha Reddy) తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో సీరియల్ నటి మహేశ్వరి (Maheshwari) సైతం తన కుటుంబం ఫోటోలను AIలో 80s స్పెషల్ ఫోటోలుగా మార్చి పోస్ట్ చేసింది.

సీరియల్ నటి కావ్యశ్రీ తాజాగా ఓ షో కోసం ఇలా అందంగా ముస్తాబయి మెరిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తాజాగా మొదలయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. బెంగాలీ మోడల్, నటి దేబ్జానీ మోదక్ బెంగాలీలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దేబ్జానీ మోదక్ సత్యభామ, ఎన్నెన్నో జన్మల బంధం.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

సాఫీగా సాగిపోతూ ముగింపుకు వచ్చింది అనుకున్న కార్తీక దీపం సీరియల్ లో ఇటీవలే మాలిని తన విలనిజం చూపించడం మొదలుపెట్టింది. మాలిని పాత్ర ఎంట్రీతో కార్తీక దీపం సీరియల్ అనేక మలుపులు తిరిగింది. దీంతో మాలిని పాత్ర చేసిన కన్నడ నటి తేజస్విని ప్రకాష్ ఫొటోలు వైరల్ గా మారాయి. అనేక కన్నడ సీరియల్స్ లో నటించిన తేజస్విని కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. తెలుగులో లక్ష్మి రావే మా ఇంటికి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ తో ఒక్కసారిగా తన విలనిజం బయటపెట్టి వైరల్ అయింది

బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన ప్రముఖ సీరియల్ నటి శిరీష రెండో పెళ్లికి సిద్ధమైనట్లు ఫిలింనగర్ వర్గాల్లో ఒక వార్త తీవ్రంగా ప్రచారం అవుతోంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన ప్రముఖ సీరియల్ నటి శిరీష రెండో పెళ్లికి సిద్ధమైనట్లు ఫిలింనగర్ వర్గాల్లో ఒక వార్త తీవ్రంగా ప్రచారం అవుతోంది. ఐకానిక్ సీరియల్ మొగలి రేకులు తో తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత రాములమ్మ, చెల్లెలి కాపురం, స్వాతి చినుకులు లాంటి పలు ప్రజాదరణ పొందిన ధారావాహికల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుకుంది. కెరీర్ అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే నవీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట, కొన్నేళ్ల క్రితం మనస్పర్థలు, వ్యక్తిగత విభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల తర్వాత తన కుమారుడితో కలిసి ఉంటున్న శిరీష, ప్రస్తుతం మళ్లీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు, ఆర్జే, యాంకర్ అయిన మహేంద్ర బొర్రాని ఆమె త్వరలోనే వివాహం చేసుకోనున్నారని సమాచారం. ఒక ఈవెంట్లో వీరిద్దరి మధ్య మొదలైన పరిచయం, ఆ తర్వాత కాలంలో స్నేహంగా మారినట్లు తెలుస్తోంది. క్రమంగా వీరిద్దరి మధ్య అనుబంధం బలపడి ప్రేమగా మారడంతో, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు నిర్ణయించుకున్నారట. ఈ వేడుకను ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్‌గా నిర్వహించాలని ఈ జంట ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక వరుడిగా మారనున్న మహేంద్ర బొర్రా విషయానికి వస్తే, ఆయన బుల్లితెరపై యాంకర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. కేవలం యాంకరింగ్‌కే పరిమితం కాకుండా, నటుడిగా ఇంటింటి రామాయణం, మగువ ఓ మగువ వంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి నటన పరంగా కూడా మంచి ప్రశంసలు అందుకున్నాడు. త్వరలోనే ఈ జంట తమ వివాహా విషయాన్ని అధికారికంగా

హిందీ టెలివిజన్ నటి, మోడల్ అంతరా బెనర్జీ (31) ఆరావళి ఎక్స్‌ప్రెస్ రైలులో అసభ్యంగా ప్రవర్తించి హల్చల్ చేసింది. అంబోలికి చెందిన ఈమె షూటింగ్ నిమిత్తం సూరత్ వెళ్లేందుకు స్లీపర్ క్లాస్ టికెట్‌తో రైలు ఎక్కింది. హిందీ టెలివిజన్ నటి, మోడల్ అంతరా బెనర్జీ (Antara Banerjee) (31) ఆరావళి ఎక్స్‌ప్రెస్ రైలులో అసభ్యంగా ప్రవర్తించి హల్చల్ చేసింది. అంబోలికి చెందిన ఈమె షూటింగ్ నిమిత్తం సూరత్ వెళ్లేందుకు స్లీపర్ క్లాస్ టికెట్‌తో రైలు ఎక్కింది. అయితే బోరివలి వద్ద రైలు ఎక్కిన వెంటనే ఆమె రిజర్వ్డ్ ఏసీ కోచ్‌లోకి వెళ్లి వేరొకరి సీటులో కూర్చుంది. ఆ సీటుకు చెందిన ప్రయాణికుడు ఖాళీ చేయాలని కోరగా, ఆమె నిరాకరించి గొడవకు దిగింది. దీంతో ప్రయాణికుడు టికెట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులను ఆశ్రయించాడు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ యామినిక్రాంత్ మిశ్రా, కాన్స్టేబుల్ రాజేష్ కుమార్లపై అంతరా బెనర్జీ తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. అధికారుల కథనం ప్రకారం.. గొడవ పెరిగి పెద్దదవడంతో ఆమె తన దుస్తులు తొలగించి, తన వద్ద ఉన్న రేజర్ బ్లేడ్‌తో ఆర్పీఎఫ్ అధికారి మిశ్రాపై దాడి చేసింది. ఈ దాడిలో అధికారికి తీవ్ర గాయాలు కాగా, ఆమె తనను తాను కూడా గాయపరచుకుంది. అంతేకాకుండా అధికారి యూనిఫాం, మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసి, ఏసీ కోచ్ అద్దాలను పగలగొట్టి పారిపోయేందుకు ప్రయత్నించింది. సుమారు గంటకు పైగా సాగిన ఈ తీవ్ర గందరగోళం మధ్య ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనంతరం డహాణు రోడ్ రైల్వే స్టేషన్లో ఆమెను దింపి, గవర్నమెంట్ రైల్వే పోలీస్ కి అప్పగించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, ప్రాణాపాయం కలిగించడం తదితర తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి నోటీసులు జారీ చేసి ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు. అంతరా
తెలుగు చలనచిత్ర రంగంతో పాటు టెలివిజన్ రంగంలో కూడా తన సహజసిద్ధమైన అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నటీమణులలో మీనాకుమారి ఒకరు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలలో జీవించి, పాత్ర ఏదైనా సరే అందులో పూర్తిగా లీనమై నటించడం ఆమె ప్రత్యేకత. చాలామంది మీనాకుమారిని తమిళ నటిగా భావిస్తూ ఉంటారు. అయితే ఆమె పక్కా తెలుగు అమ్మాయి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి. ఆ రోజుల్లో సినీ పరిశ్రమ మద్రాసు (చెన్నై) లో ఉండటంతో, ఆమె కుటుంబంతో సహా చెన్నైలోనే స్థిరపడాల్సి వచ్చింది. భాషతో సంబంధం లేకుండా తమిళం, మలయాళం మరియు తెలుగు భాషలలో ఆమె ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్‌లలో నటించి మెప్పించారు. మీనాకుమారి మూవీ కెరీర్ లో చెరగని ముద్ర వేసిన సినిమాలు 'హిట్లర్' - 'జయం మనదేరా'. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ సినిమాలో ఆయన ఐదుగురు చెల్లెళ్ళలో ఒకరిగా మీనాకుమారి అద్భుత నటనను కనబరిచారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సుమారు 50 నుండి 55 రోజుల పాటు చిత్రబృందంతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సమయంలో చిరంజీవి గారు చెల్లెళ్ళ పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండే వారని, పబ్లిక్ ఫంక్షన్లలో కూడా ఎంతో రక్షణగా చూసుకునే వారని ఆమె పేర్కొన్నారు. ఇక జయం మనదేరా విషయానికి వస్తే.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో చెల్లెలి పాత్రలో మీనాకుమారి చూపిన అభినయం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. చిన్న వయసులోనే తన వయస్సుకు మించిన ప్రాధాన్యత ఉన్న వైట్ హెయిర్ (అమ్మ/పిన్ని) పాత్రలను కూడా స్వీకరించి, గ్లామర్ కంటే నటనకే ఇంపార్టెన్స్ ఇచ్చిన గొప్ప నటి మీనాకుమారి. సెంటిమెంట్ సీన్స్ కు ఆమె పెట్టింది పేరు. కష్టాలు కన్నీళ్ల పాత్రలు అద్భుతంగా పండించేది మీనాకుమారి. సినిమాలతో పాటు బుల్లితెరపై (టెలివిజన్ సీరియల్స్) మీనాకుమారి సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆమె సుదీర్ఘ