
Botsa Satyanarayana | బొత్స సత్యనారాయణ మళ్లీ ఏడ్చారు.. మూడు రోజుల్లో రెండోసారి
Botsa Satyanarayana | బొత్స సత్యనారాయణ మళ్లీ ఏడ్చారు.. మూడు రోజుల్లో రెండోసారి
© 2026 nimisham.in

Botsa Satyanarayana | బొత్స సత్యనారాయణ మళ్లీ ఏడ్చారు.. మూడు రోజుల్లో రెండోసారి

పుస్తకం, పెన్ను పట్టుకుని ఉన్న క్యూట్ ఫోటోలను జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ (Satya Sri) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా.. ప్రేమలేఖ రాస్తున్నావా? ఏంటి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Botsa Satyanarayana | కంట తడిపెట్టిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం ఆందోళన బాటలో ఉన్నాయి. పీఆర్సీ, ఐఆర్, డీఏ.. ఇలా ఎటు చూసినా బకాయిలు, పెండింగ్ అంశాలే కనిపిస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం (AP Govt) వెనువెంటనే నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఇవన్నీ పెండింగ్ సమస్యలుగా మారిపోయాయి. వీటిపై ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించకుంటే.. వారిపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అలాగని ప్రశ్నిస్తే ప్రభుత్వం దృష్టిలో రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగితే జరిగిందని భావించి తాజాగా ఏపీ జేఏసీ అమరావతి నాయకులు మూడు దశల ఉద్యమాన్ని ప్రకటించారు. అన్నట్లుగానే నిరసనలు ప్రారంభించేశారు.జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు ఊహించని షాక్- ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా ప్రభుత్వం ఉద్యోగుల (employees) పట్ల చూపుతున్న నిర్లక్ష్యంపై గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటల వీడియోల్ని ప్రదర్శించడం వివాదాస్పదమైంది. దీంతో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళనలు, తాజాగా ఉద్యోగ సంఘాలు ప్రారంభించిన నిరసనల్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు.ఏపీ సర్కార్ కు ఉద్యోగుల షాక్..! మూడు దశల్లో ఉద్యమం- కార్యాచరణ ప్రకటన..!రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యోగ సంఘ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తనను కలిసిన ఉద్యోగ నేతలతో వెల్లడించారు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న రెవిన్యూ ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించి సమస్యలు పరిష్కరించాలని నేతలు మంత్రిని కోరారు. వీఆర్ఏ, విఆర్ఓ, సర్వేర్లు, రెవెన్యూ శాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే అనేకసార్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చిన విషయం మరోసారి గుర్తుచేశారు. దీనిపై మంత్రి అనగాని స్పందిస్తూ రెవిన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే ఉద్యోగులుకు ఇవ్వవలసిన పెండింగ్ డీఏలు, ఐఆర్, పీఆర్సీ కమిషన్ కు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలపై

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ నాయకత్వం కీలకమైన బాధ్యతలను అప్పగించింది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ (Seva Sankalp Abhiyan) కార్యక్రమానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా ఆయన నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని ఈ బృహత్తర కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలను సత్యకుమార్‌కు అప్పగించడం పార్టీలో ఆయన ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవలో (గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా) విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జన్మదినం కాగా, అక్టోబర్ 7 నాటికి ఆయన ప్రజా క్షేత్రంలో లీడర్‌గా పాతికేళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ ‘సేవా సంకల్ప్ అభియాన్’ ముఖ్య ఉద్దేశం.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వ హయాంలో జరిగిన అద్భుత దేశాభివృద్ధిని, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే. నెల రోజుల పాటు సాగే ఈ అభియాన్‌లో భాగంగా మొత్తం 13 రకాల ప్రత్యేక సేవా కార్యక్రమాలను రూపొందించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చేలా ‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవ’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా సేవా స్ఫూర్తిని చాటనున్నారు. దక్షిణాది రాష్ట్రాల బాధ్యుడిగా నియమితులైన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న సన్నాహక వర్క్‌షాప్‌లలో చురుగ్గా పాల్గొంటూ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ‘విక్షిత్ భారత్ 2047’ (Viksit Bharat) లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు మరియు దక్షిణాదిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు

అమరావతి: భాజపా జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జిగా సత్యకుమార్‌ను నియమించింది. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబరు 17 వరకు భాజపా, ఎన్డీయే ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమాలకు సత్యకుమార్ దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది

పోలవరం జిల్లాలోని గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణ మందుల (క్లోరోక్విన్) వికటన ఘటన తీవ్ర కలకలం రేపింది. సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో వేర్వేరుగా అత్యవసర సమీక్ష నిర్వహించారు. మందులు వికటించి ఒక బాలిక మృతి చెందిందనే సమాచారం అందుకోవడంతో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. బాధితులకు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎంతో పాటు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.గ్రామంలో మొత్తం 71 మందికి మలేరియా నివారణ మందులు పంపిణీ చేయగా, వాటి ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామంలో అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన వారిలో 47 మంది చిన్నారులతో సహా మొత్తం 52 మందికి తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మరో 24 మందికి స్థానిక లక్ష్మీపురం పీహెచ్సీలో వైద్య సేవలు అందిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న భద్రాచలం ఆసుపత్రికి చింతూరు ఐటీడీఏ పీవో, ఏఎస్పీ సహా ఇతర అధికారులు స్వయంగా వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. డయేరియా పంజా: ముగ్గురు మృతి, 76 మందికి అస్వస్థతఅసత్య ప్రచారాలు నమ్మొద్దు!భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 52 మందికి మలేరియా ఆర్డీటీ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి మలేరియా పాజిటివ్‌గా తేలిందని వైద్యులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ తగిన యాంటీ మలేరియా చికిత్సను ప్రారంభించినట్లు మంత్రి సత్యకుమార్‌కు అధికారులు నివేదించారు. ముందు జాగ్రత్త చర్యగానే బాధితులందరినీ మెరుగైన వైద్యం కోసం దగ్గర్లోని ఏరియా ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారంటూ వస్తున్న

Vizianagaram: సీతంలో ఇండోసోల్ పూల్ క్యాంపస్ డ్రైవ్ - అర్హతలు ఇవే! Vizianagaram: సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పూల్ క్యాంపస్ నియామక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎస్‌ఎస్‌వీ సొల్యూషన్స్ సహకారంతో సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటలకు సీతం కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. బీటెక్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్‌తో పాటు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చు. 2023 నుంచి 2026 వరకు బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులతో పాటు ఇప్పటికే కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఎంపికైన వారికి విద్యార్హతను బట్టి వార్షిక వేతన ప్యాకేజీ అందించనున్నారు. బీటెక్ అభ్యర్థులకు రూ.2.16 లక్షలు, డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు రూ.1.90 లక్షలు, ఐటీఐ అభ్యర్థులకు రూ.1.80 లక్షలు వేతనంగా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సోలార్ సంస్థలో ఉద్యోగం పొందేందుకు ఈ నియామక కార్యక్రమం మంచి అవకాశమని సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మూర్తి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’

తెలుగు సినిమా చరిత్రలో 90s టైమ్ అద్భుతమనే చెప్పాలి. అప్పుడే అదిరిపోయే సినిమాలెన్నో వచ్చాయి. ఎంటర్టైన్మెంగ్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ మూవీస్ సందడి చేశాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ‘హలో బ్రదర్’ కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ చిత్రం 1994 ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. నాగార్జున మాస్, క్లాస్ లుక్స్‌తో పాటు రమ్యకృష్ణ, సౌందర్యల గ్లామర్, రాజ్-కోటి సంగీతం ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. మిసెస్ అండ్ మిస్టర్ చక్రవర్తి (శరత్ బాబు, సంగీత) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. జన్మతః వీరిద్దరికీ ఒక విచిత్రమైన కనెక్షన్ (రిఫ్లెక్స్ యాక్షన్) ఉంటుంది. ఒకరికి నొప్పి కలిగితే మరొకరికి స్పందన రావడం, ఒకరు కదిలితే మరొకరు కూడా అదే పనిచేయడం వీరి ప్రత్యేకత. అయితే, విశ్వనాథ్ ఉద్యోగరీత్యా ఒక ప్రమాదకరమైన క్రిమినల్ మిట్రా (నెపోలియన్)ని అరెస్ట్ చేసే క్రమంలో, మిట్రా ఈ కవలలలో ఒకరిని ఎత్తుకెళ్లి ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఒక బాబు (దేవా) కూలిపనులు చేసుకునేవారికి దొరుకుతాడు. వారికి అప్పటికే ఓ ఆడపిల్ల కూడా ఉంటుంది. రోడ్డుపై రఫ్ అండ్ టఫ్ వాతావరణంలో దేవా (నాగార్జున) పెరిగి పెద్దవాడవుతాడు. మరో బాబు (రవి వర్మ) తన తల్లిదండ్రుల వద్దే పెరిగి విదేశాలలో చదువుకుని పెద్ద మ్యూజిషియన్‌గా ఇండియాకు తిరిగివస్తాడు. దేవా స్థానిక రౌడీలతో గొడవపడుతూ మాస్ క్యారెక్టర్‌గా మారితే, రవి వర్మ అత్యంత సాఫ్ట్ అండ్ క్లాస్ కుర్రాడిగా ఉంటాడు. దేవాను చక్రవర్తి ఫ్రెండ్ (గిరిబాబు) కూతురు మంగ (రమ్యకృష్ణ) ప్రేమిస్తుంది. రవి వర్మను తన ఈవెంట్ మేనేజర్ అక్కమాంబ( అన్నపూర్ణమ్మ) కూతురు ఊహ (సౌందర్య) ప్రేమిస్తుంది. విధి వశాత్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే నగరంలో కలుసుకున్నప్పుడు వారి రిఫ్లెక్స్ చర్యల వల్ల ఎలాంటి అలజడి సృష్టింపబడింది?

P Gannavaram: పేదలకు ఆర్థిక భరోసాయే లక్ష్యం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ! ఈ వార్తకు సంబంధించిన

Warangal: 22A భూములు అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సత్య శారద సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన

తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు వేడెక్కబోతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున ఈసారి అధ్యక్షుడిగా బండ్ల గణేశ్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సి. కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు నిర్మాతల మండలిలో ఎన్నికల శంఖారావం మ్రోగింది. గత కొంతకాలంగా ఈ అసోసియేషన్ ఎన్నికలు జరపాలని పలువురు నిర్మాతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరబోతోంది. సెప్టెంబర్ 6న ఎన్నికలను నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజేతలను ప్రకటిస్తారు. అయితే ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఆగస్ట్ 17 నుంచి నిర్మాతల మండలి ఎన్నికలకు నామినేషన్స్ ను స్వీకరిస్తున్నారు. ఇది 24వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజులు విత్ డ్రాస్ కోసం గడువు ఇచ్చి, 28న తుది జాబితాను ప్రకటిస్తారు. వీరందరికీ సెప్టెంబర్ 6న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎన్నికలు జరుగుతాయి. ఇదే రోజు సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తారు. తెలుగు నిర్మాతల మండలికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో పాటు చిన్న నిర్మాతలకు మధ్య హోరాహోరీ పోరు సాగుతూ ఉంటుంది. తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి ఈసారి అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సి. కళ్యాణ్ పోటీ పడుతున్నారు. సి. కళ్యాణ్ ప్యానల్ నుంచి కార్యదర్శులుగా తుమ్మలపల్లి ప్రసన్న కుమార్, వైవియస్ చౌదరి పోటీ చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీస్ గా అమ్మిరాజు, రామసత్యనారాయణ బరిలో నిలుస్తున్నారు. ట్రెజరర్‌గా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు పోటీ చేస్తున్నారు. కాగా... యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కు చెందిన బండ్ల గణేశ్ ప్యానల్ నుంచి ఏ పదవికి ఎవరెవరు పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా కలసి బండ్ల గణేశ్‌ను ఈసారి అధ్యక్ష పదవికి బరిలో దించడం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Jagtial Ministers Meeting: పేదలకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వం... వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఊహించని స్థాయిలో వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటన సందర్భంగా.. స్థానిక నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర దుమారానికి దారి తీసేలా చేస్తోంది.. మంత్రుల సభకు జనాన్ని సమీకరించేందుకు మున్సిపల్ యంత్రాంగం అనుసరించిన తీరు లబ్ధిదారులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో పాటు స్థానిక MLA డా. సంజయ్ కుమార్‌తో పాటు మేడిపల్లి సత్యంలు హాజరవుతున్న ఇందిరమ్మ లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమానికి రావాల్సిందిగా అధికారులు కాలనీవాసులను ఆహ్వానించారట.. అయితే, అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది ఒక్కో ఇంటికి ఒకే ఒక్క భోజన టోకెన్ ఇస్తూ.. వివిధ షరతులు విధించడంతో స్థానికులను ఆశ్చర్యానికి గురయ్యారట.. ఇంట్లో నలుగురైదుగురం ఉంటే.. ఒక్కరికే తిండి పెడతారా? మిగతా కుటుంబ సభ్యులు ఏం కావాలి?.. అంటూ నిరుపేద మహిళలు అధికారులను నిలదీసే ప్రయత్నం కూడా చేశారట.. కడుపు నింపే తిండి వద్ద కూడా ఇలాంటి లెక్కలు వేయడం పేదలను తీవ్రంగా అవమానించడమేనని.. స్థానికులు మండిపడుతున్నారు. సభ ప్రాంగణానికి తరలిరావాలని ఒత్తిడి చేసిన అధికారులు.. కాలనీ నుంచి అక్కడికి చేరుకోవడానికి కనీస రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.. నూకపల్లి కాలనీ నుంచి ప్రధాన పట్టణానికి చేరుకోవడానికి ఆటోలతో పాటు బస్సు సౌకర్యాలు లేక వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు కూడా

Bhupalpally: బాధితుడికి రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే! Bhupalpally: భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన అల్లపు రమేష్‌కు అనారోగ్య చికిత్స కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.2.50 లక్షల ఎల్.ఓ.సి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆరోగ్యశ్రీలో కవర్ కాని వ్యాధుల చికిత్సకు ప్రభుత్వం ఎల్.ఓ.సి ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, గణపురం పీఏసీఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

సాక్షి, విజయవాడ: గత నాలుగు రోజులుగా డీఎస్సీపై ప్రభుత్వం చర్చకు రాలేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. డీఎస్సీలో అవకతవకలున్నాయనే మేం విచారణ జరిపించాలని కోరాం. మార్కెట్లో వస్తువుల్లా ఉద్యోగాలు అమ్ముకున్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగింది వాస్తవం.. అందుకే ప్రభుత్వం తోకముడిచింది’’ అని బొత్స పేర్కొన్నారు. ‘‘డీఎస్సీతో పాటు గ్రూప్-1 పైన కూడా సీబీఐ విచారణ జరిపించండి. 1998 డీఎస్సీలో 5887 మందికి ఉద్యోగాలిచ్చింది మేమే. 2008 డీఎస్సీలో 2193 మందికి ఉద్యోగాలిచ్చింది కూడా మేమే. 2019లో స్పెషల్ డీఎస్సీ నిర్వహించి 521 మందికి ఉద్యోగాలిచ్చాం. 1250 మంది కేజీబీవీ టీచర్లకు ఉద్యోగాలు కల్పించాం. మార్కెట్లో ఉద్యోగాలు అమ్ముకుని అండపిండ బ్రహ్మాండం బద్దలైపోయినట్లు డాంబికం ఎందుకు?. ఈ ప్రభుత్వం పనైపోయింది. రెండేళ్లలోనే ప్రభుత్వం మోసం తెలిసిపోయింది ..మాట్లాడితే సవాళ్లు విసురుతారు.. చర్చకు రమ్మంటే రారు. ప్రజల సమస్యల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే సభలో చర్చించాలని కోరాం. మీలా ప్రతిదీ రాజకీయ కోణంలో మేం చూడలేం. మా ఇంటికొస్తే మీరు ఏం తెస్తారు.. మీ ఇంటికొస్తే మాకేమిస్తారు అనేలా ఉంది ప్రభుత్వం తీరు. రెండేళ్లలోనే లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు?. విద్యావ్యవస్థలో లోపం ఉంది కాబట్టే ప్రైవేట్‌కు తరలిపోయారు. ..విద్యావ్యవస్థను బలోపేతం చేసింది వైఎస్ జగన్. నాడు నేడు పెట్టి స్కూల్స్ రూపురేఖలు మార్చింది వైఎస్ జగన్. ఐబీ వంటి సిలబస్‌లు పెట్టి విద్యా ప్రమాణాలు పెంచింది వైఎస్ జగన్. జగన్ గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించాం. వైఎస్ జగన్ అమ్మ ఒడిని సక్రమంగా అమలు చేశారు’’ అని బొత్స వివరించారు. విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) 'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు) మరమనుషుల కేరింతలు.. అబ్బురపరుస్తున్న వింత రోబోలు! (ఫొటోలు) బేబీ

వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా `కొరియన్ కనకరాజు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. దీన్ని కామెడీ హర్రర్, థ్రిల్లర్‌గా ఆయన రూపొందించారు. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్, టెంపర్ వంశీ ముఖ్య పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్ట్ 7న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా 13రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. 13వ రోజు ఎంత కలెక్షన్లని రాబట్టింది, ఇప్పటి వరకు టోటల్‌గా ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కేవలం రూ.12కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కాకపోతే పెద్ద స్థాయిలో సినిమా వసూళ్లని కలెక్ట్ చేస్తుందని భావించారు. కానీ ఆ స్థాయిలో చేయలేకపోయింది. వంద కోట్ల వరకు వెళ్లలేకపోయింది. ఈ మూవీ 13 రోజుల్లో మొత్తంగా రూ.31.75కోట్లు రాబట్టింది. బుధవారం దీనికి రూ.25లక్షలు మాత్రమే వచ్చాయి. మంగళవారంతో పోల్చితే మూడు లక్షలు తగ్గాయి. ఇది సినిమా థియేట్రికల్ గా క్లోజ్ అవుతుందనేదానికి సంకేతంగా చెప్పొచ్చు. మహా అయితే ఈ వారాంతం వరకు ఆడుతుంది. ఆ తర్వాత ఎత్తేయాల్సి వస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా 10 రోజులకే రూ.50కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ లెక్కన ఇప్పటి వరకు మరో కోటి, రెండు కోట్లు యాడ్ చేసి ఉంటారు. చిత్ర బృందం అధికారిక లెక్కల ప్రకారం ఇది దాదాపు రూ.52కోట్ల వరకు వసూలు చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లో వెళ్తుంది. ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం దీనికి నాలుగైదు కోట్ల లాభాలు వచ్చి ఉంటాయి. అదే టీమ్ లెక్కల ప్రకారం పది కోట్లకుపైగానే లాభాలను రాబట్టిందని చెప్పొచ్చు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ప్రక్రియను బహిష్కరిస్తూ అధికార కూటమి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.మండలి ఛైర్మన్ మోషేనురాజు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టగానే, టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో వైసీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే మిగిలారు. వైసీపీ తరఫున మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఛైర్మన్ ప్రకటించారు.అనంతరం పలువురు సభ్యులు 'జై జగన్' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడిపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం వివాదాస్పదమైంది. అయితే, ఆ తర్వాత ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్‌ను కోరారు.కూటమి సభ్యుల వాకౌట్‌పై బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని, రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. రాజకీయాల్లో కక్షలు ఉండకూడదని, సభా గౌరవాన్ని కాపాడాలని హితవు పలికారు. ఎన్నిక ముగిసిన అనంతరం, నూతన డిప్యూటీ ఛైర్మన్ మాధవరావు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు
అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిపై అనుచిత వ్యాఖ్యలుచేశారు. సభలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అవహేళన చేసేలా మాట్లాడారని మండిపడుతూ.. అచ్చెన్నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతులకు సమయానికి యూరియా కూడా ఇప్పించలేకపోతున్నారని, శాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ వార్తకు సంబంధించిన

బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ మృతికి తెలుగు దేశం నాయకులు సంతాపం తెలిపారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన నిర్మాత చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ (74) అనారోగ్యంతో ఆగస్ట్ 17న కన్నుమూశారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన 'రాముడు - భీముడు' 1988లో విడుదలై చక్కని విజయాన్ని అందుకుంది. ఇందులో సుహాసిని, రాధ హీరోయిన్లుగా నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ సినిమాకు కె. మురళీమోహనరావు దర్శకత్వం వహించారు. తెలుగు దేశం పార్టీలోనూ చురుకైన కార్యకర్తగా పేరు తెచ్చుకున్న సత్యనారాయణ ఆ పార్టీ అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారు. ఆయనకు భార్య గిరిజా కుమారి, కుమారులు వెంకటేశ్వరరావు (నాని), విజయ్ కుమార్ ఉన్నారు. చిట్టూరి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు నిడదవోలు లయన్స్ నేత్రాలయానికి దానం చేశారు. చిట్టూరి మృతికి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పలువురు గ్రామ పెద్దలు నివాళులు అర్పించారు. తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా

Tanuku: తణుకు కరాటే చిచ్చరపిడుగు శ్రేయాన్స్‌కు ఘన సన్మానం! Tanuku: ఆంధ్ర రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి తణుకు పట్టణానికి చెందిన చింతపల్లి శ్రేయాన్స్ సిల్వర్ పతకం సాధించాడు.సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16న విజయవాడలో 23 ఆంధ్ర రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థి శ్రేయాన్స్ ను శెట్టిబలిజ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు సన్మానించి ఉపకార వేతనం అందజేశారు. విద్యార్థి ప్రతిభను గుర్తించి సహకరించిన శెట్టిబలిజ సంఘం సీనియర్ నాయకులు చోడే రామోహన్ రావు, కవురు శ్రీనివాసరావులకు కృతజ్ఞతలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భాగస్వాములతో కలిసే బరిలోకి దిగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల కీలక సమావేశంలో మాట్లాడిన ఆయన, స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే వార్డు స్థాయి నుంచి ప్రతి గ్రామంలోనూ కమలం జెండా ఎగిరేలా, స్థానిక పదవులను దక్కించుకునేలా ప్రణాళికలతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి ఫలాలను, మన్ కీ బాత్ వేదికగా వ్యక్తమయ్యే సందేశాలను ప్రతి ఇంటా ప్రచారం చేయాలని సూచించారు. అలాగే విశాఖ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ... దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధనతో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నామని, ప్రస్తుతం అది లాభాల దిశగా ప్రయాణిస్తోందని పేర్కొన్నారు. పోలవరం నీటిని విశాఖ ప్రాంతానికి అందించే పనులు కూడా వేగవంతమయ్యాయని వివరించారు

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఓటిటిలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్, సెప్టెంబర్ 10 లేదా 11 తేదీలలో ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. దర్శకుడు మెర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రం, వరుణ్ తేజ్ కెరీర్లో ఒక బలమైన హిట్‌గా నిలిచింది. వరుస పరాజయాల తర్వాత ఈ సినిమాతో వరుణ్ తేజ్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం ₹50 కోట్ల వసూళ్లను దాటేసి రికార్డు సృష్టించింది. ఒక ప్రాంతీయ చిత్రానికి ఇది భారీ విజయం అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది. దాదాపు ₹26 కోట్ల భారీ మొత్తానికి ఈ హక్కులు అమ్ముడైనట్లు సమాచారం. థియేటర్లలో భారీ సక్సెస్ సాధించడంతో, ఓటిటి విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితంగా, సెప్టెంబర్ రెండో వారంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంటి వద్దే కూర్చుని కొరియన్ కనకరాజు కామెడీని ఆస్వాదించేందుకు నెటిజన్లు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా, కొరియన్ కనకరాజు తన అద్భుతమైన కథాంశంతో థియేటర్ల తర్వాత డిజిటల్ తెరపై కూడా సందడి చేయనుంది. కామెడీ మరియు హారర్ కలబోతగా

మన చిన్నతనంలో వీధుల్లోకి ఎలుగుబంటిని తీసుకువచ్చి, డప్పులు వాయిస్తుంటే అది కాళ్లు గాలిలోకి లేపి ఊగుతుంటే చూసి సంబరపడని వారుండరు. కానీ, ఆ అమాయక ప్రాణి చేసినది నాట్యం కాదు.. తట్టుకోలేని నరకయాతనతో పెట్టిన కేకలని మనలో ఎంతమందికి తెలుసు? మొఘలుల కాలం నుంచి అంటే దాదాపు 400 ఏళ్లుగా కలందర్ అనే సంచార తెగవారు ఈ ఎలుగుబంట్లను ఆడించడాన్నే తమ ప్రధాన జీవనోపాధిగా మలుచుకున్నారు. అయితే ఆ వినోదం వెనుక ఎంతటి ఘోరమైన క్రూరత్వం దాగుందో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది.ముక్కుకు సూది గుచ్చి.. గుండెను పిండేసిన బాధ!ఈ ఆట కోసం కలందర్లు అడవుల్లోకి వెళ్లి తల్లి ఎలుగుబంటిని దారుణంగా చంపేసేవారు. తల్లిని కోల్పోయిన పసి ఎలుగుబంటి పిల్లలను తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేవారు. ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండానే.. ఎలుగుబంటి ముక్కు భాగాన్ని దళసరి సూదితో గట్టిగా పొడిచి, దానికి గొలుసు లేదా తాడు కట్టేవారు. ఎద్దులకు ముక్కుతాడు వేసినట్లుగా ఆ తాడును గట్టిగా పైకి గుంజినప్పుడల్లా.. ఆ దారుణమైన నొప్పిని తట్టుకోలేక ఎలుగుబంటి గాలిలోకి ఎగిరేది. లోపల ప్రాణం పోయేంత నొప్పి ఉంటే, బయట జనం మాత్రం అది డాన్స్ చేస్తోందని భావించి చప్పట్లు కొట్టేసేవారు. పంటి గాయాలు చేయకుండా ఉండటానికి వాటి కోరపళ్లను సుత్తితో విరగ్గొట్టేవారు.అడవి ప్రాణుల కోసం కదిలిన ఇద్దరు మనుషులు!తరతరాలుగా సాగుతున్న ఈ దారుణాన్ని గమనించిన కార్తీక్ సత్యనారాయణ్, శేషమ్మ అనే ఇద్దరు వ్యక్తులు చలించిపోయారు. ఈ క్రూరత్వానికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని నిశ్చయించుకుని 1995లో వైల్డ్ లైఫ్ SOS (Wildlife SOS) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. వాస్తవానికి మన దేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972, 1998లో వచ్చిన చట్ట సవరణల ద్వారా ఎలుగుబంట్లను బంధించడం, ప్రదర్శించడం చట్టవిరుద్ధం చేశారు.శృంగారంలో పాల్గొంటే ట్యాక్స్, ఇన్సూరెన్స్, పెన్షన్.. వ్యభిచారానికి చట్టబద్ధతకానీ ఈ చట్టాలు వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో ఎలుగుబంట్ల డాన్స్

ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డీఎస్సీపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. అమరావతి, ఆగస్టు 18: ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డీఎస్సీపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి బల్లలు చరుస్తూ ఆందోళనకు దిగారు. నిరసనల మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. డీఎస్సీపై శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. DSCపై మండలిలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అనే నిర్ణయాన్ని ప్రజలు తమకు అప్పజెప్పారన్నారు. ‘మీరు కోరుకున్నట్టు ప్రభుత్వం నడవదు. నిన్న BAC లోనే మేము క్లియర్‌గా చెప్పాం. DSCపై చర్చకు సిద్ధమని నిన్న బీఏసీలోనే చెప్పాం. చైర్మన్ పోడియం ఎక్కడం మంచిది కాదు’ అని మంత్రి చెప్పారు. ప్రశ్నోత్తరాల అనంతరం బీఏసీకి పిలుస్తామని వైసీపీ సభ్యులతో చైర్మన్ అన్నారు. అయితే ఇప్పుడే డీఎస్సీకి పిలవాలని ప్రతిపక్ష నేత బొత్స పట్టుపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత పిలుస్తానమని చైర్మన్ చెప్పినప్పటికీ.. వైసీపీ సభ్యుల నినాదాలు ఆగని పరిస్థితి నెలకొంది. దీంతో సభను చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు. రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు మత్స్యకారుల గల్లంతు ఘటన.. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (Andhra Pradesh Legislative Council) వర్షాకాల సమావేశాల్లో డీఎస్సీ (DSC) అంశం రాజకీయ వేడిని పెంచింది. ఉపాధ్యాయ నియామక పరీక్షపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టగా, అధికార పక్షం గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నిర్వహణపై ప్రశ్నలు సంధించింది. ఈ క్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu), మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsа Satyanarayana) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు ‘మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ’ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగులు, ఉద్యోగార్థులకు సంబంధించిన అంశం కావడంతో డీఎస్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, ఇప్పుడు ఆ అంశంపై ప్రశ్నించే నైతిక హక్కు ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. విమర్శల సమయంలో మంత్రి ఉపయోగించిన కొన్ని పదాలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బొత్సను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు సభలో చర్చకు దారితీశాయి. ప్రతిపక్ష నేత కూడా వెనక్కి తగ్గకుండా మంత్రిపై తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం సరికాదని, రాజకీయ చర్చను విధానాలు, ప్రజా సమస్యలకే పరిమితం చేయాలని పరోక్షంగా సూచించారు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగడంతో సభలో గందరగోళం పెరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సభను కొంతసేపు వాయిదా వేశారు. అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభమైనా వాతావరణం పూర్తిగా చల్లబడలేదు. మంత్రి తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ గతంలో డీఎస్సీ నిర్వహణలో జరిగిన అంశాలపై ఆధారాలు ఉన్నాయని, వాటిని సభ ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదనే

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా, మంత్రుల మధ్య చోటుచేసుకున్న ఓ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన పార్టీ కండువా వేసుకుని శాసనసభలోకి రాగా, దానిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో చమత్కరించారు. "సత్యగారూ.. మీకెందుకండి ప్రత్యేకంగా పార్టీ కండువా? మీరు బీజేపీ అని లోకమంతా తెలుసు కదా" అని లోకేశ్ సరదాగా అనడంతో, సీనియర్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా జతకలిశారు. "అవును సర్.. జాతీయ స్థాయిలో ప్రముఖ నేతల్లో సత్యగారు కూడా ఒకరు" అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడంతో అక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. ఆ తర్వాత లోకేశ్ మరో అడుగు ముందుకేసి.. "మా పార్టీ వారికి కూడా కొంచెం క్రమశిక్షణ గురించి నేర్పించండి" అని నవ్వుతూ సత్యకుమార్‌ను కోరారు. దీనిపై పక్కనే ఉన్న ఓ టీడీపీ ఎమ్మెల్యే "పార్టీ ఫస్ట్, సర్!" అని స్పందించగా.. వెంటనే సత్యకుమార్ యాదవ్ చిరునవ్వుతో "నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్!" అంటూ ఇచ్చిన రిప్లై మంత్రులు, ఎమ్మెల్యేలను ఎంతగానో ఆకట్టుకుంది. విధానపరమైన చర్చలతో సీరియస్‌గా సాగే అసెంబ్లీలో ఈ సరదా సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల `కొరియన్ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ని పలకరించారు. ఆయన మొదటి సారి హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ తో `కొరియన్ కనకరాజు` మూవీ చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రితిక నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రమిది. దీనికి ముందు అటు వరుణ్ తేజ్, ఇటు మేర్లపాక గాంధీకి హిట్లు లేవు. దీంతో వీరిద్దరు ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఈ మూవీని చేశారు. చాలా కసితో చేశారని చెప్పొచ్చు. ఆ కసి సినిమాలో కనిపిస్తుంది. ఆగస్ట్ 7న `కొరియన్ కనకరాజు` మూవీ విడుదలైంది. కామెడీ అంశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. దీంతో సినిమా జనాలకు కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా సత్య కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే సినిమాకి నిజమైన హీరో అయనే అని చెప్పొచ్చు. అంతగా సినిమాని నడిపించాడు. వరుణ్ కి హిట్ రావడానికి కారకుడయ్యాడు. అలాగే మేర్లపాక గాంధీ టేకింగ్, రైటింగ్, మ్యూజిక్ వంటివన్నీ సినిమాకి ప్లస్ అయ్యాయి. మొత్తంగా వరుణ్ తేజ్ హిట్ కొట్టారు. బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక ఈ మూవీ విడుదలై పది రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయి. ఎంత లాభాలు సాధించిందనేది చూస్తే. `కొరియన్ కనకరాజు` మూవీకి అయిన బడ్జెట్ రూ.38కోట్లు, థియేట్రికల్ బిజినెస్ రూ.12కోట్లు అని సమాచారం. నాన్ థియేట్రికల్‌గానే దీనికి రూ.26కోట్ల వరకు వచ్చిందట. దీంతో పన్నెండు కోట్లని థియేట్రికల్‌గా నిర్ణయించారు. ఈ లెక్కన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇప్పుడు లాభాల దిశగా వెళ్తోంది. ఈ సినిమాకి పదిరోజుల్లో రూ.31.15కోట్లు వచ్చాయి. అంటే రూ.16కోట్ల షేర్ వచ్చింది. నాలుగు కోట్లకుపైగానే లాభాలు పొందింది. ఈ

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుత పాలనా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలనలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని, కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ‘మనవాడా.. కాదా’ అని చూసి సంక్షేమ పథకాలను అందించే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులపై కేసులు పెడుతున్న తీరు మళ్లీ బ్రిటీష్ పాలనను తలపిస్తోందని, మన పూర్వికులు ప్రాణాలర్పించి తెచ్చిన స్వాతంత్ర్య స్ఫూర్తి ఇదేనా అని నిలదీశారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల వైపు కాకుండా ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. ఓటు వేసినా, వేయకపోయినా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే నిజమైన పరిపాలన అని బొత్స స్పష్టం చేశారు. జగన్ హయాంలో విద్య, వైద్యం, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేదరికం లేని సమాజ స్థాపన కోసం పాలన సాగిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే అని భావిస్తోందని... పేదలకు విద్య, వైద్యం అందించడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు

ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా అంతటా జాతీయ జెండా రెపరెపలాడింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరావతి, ఆగస్టు 15: ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా అంతటా జాతీయ జెండా రెపరెపలాడింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈఏడాది తొలిసారిగా రాష్ట్ర రాజధాని అమరావతిలో జాతీయ జెండా వేడుకలను నిర్వహించారు. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్లో సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. ఏపీ అసెంబ్లీలో 80వ స్వాతంత్ర్య వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ఎమ్మెల్యే యార్లగడ్డ, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయోద్యమ నాయకులు, రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులకు స్పీకర్ ఘన నివాళులర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఏపీ శాసనసభ ఐదు కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో పార్లమెంట్ సభ్యులు దగ్గు మల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు చిత్తూరు గురుజాల జగన్మోహన్, పూతలపట్టు మురళీమోహన్, చూడ చైర్మన్ కటారి హేమలత, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డుడి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పాల్గొన్నారు. కడప జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన స్వాతంత్ర్య

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్-2047కు అనుగుణంగా యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధికి ఆలయ ధర్మకర్తల మండలి(ట్రస్టు బోర్డు) కీలక నిర్ణయాలు తీసుకుంది. సొంత నిధులు ఇస్తానన్న బోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి ఆ డబ్బుతో దీక్షాపరుల మండపం, నిత్యకల్యాణ మండపం,వరంగల్-హైదరాబాద్ హైవేపై స్వాగత తోరణాల నిర్మాణం కొండపై శంఖు, చక్ర, నామాలతో విద్యుత్ బోర్డు ఏర్పాటుకు రూ.85లక్షలు ఇస్తానన్న కొణిదెల సురేఖ ఆలయ అభివృద్ధికి ట్రస్టు బోర్డు పలు కీలక నిర్ణయాలు యాదాద్రి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్-2047కు అనుగుణంగా యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధికి ఆలయ ధర్మకర్తల మండలి(ట్రస్టు బోర్డు) కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన ట్రస్టు బోర్డు సమావేశమైంది. ఇందులో పలు తీర్మానాలను ఆమోదించారు. ఆ వివరాలను సత్యనారాయణరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండల దీక్షలు చేపట్టే భక్తుల కోసం కొండపై విష్ణుపుష్కరిణి వద్ద దీక్షాపరుల మండపం, స్వామివారి నిత్యకల్యాణ మండపం, హైదరాబాద్-వరంగల్ హైవేపై రాయిగిరి వద్ద స్వాగత తోరణ నిర్మాణాలను రూ.55.95కోట్లతో చేపట్టడానికి ట్రస్ట్ బోర్టు ఆమోదించింది. ఈ మూడు నిర్మాణాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి తన సొంత నిధులను అందిస్తున్నట్లుగా ప్రకటించారు. కొండపై శంఖు, చక్ర, నామాల విద్యుత్ బల్బుల బోర్డును పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీనికోసం రూ.85లక్షలను సమకూర్చడానికి ధర్మకర్త కొణిదెల సురేఖ ముందుకు వచ్చారు. మరోవైపు, పెద్దగుట్ట టెంపుల్ సిటీపై వేదపాఠశాల, విశ్వవిద్యాలయంతో పాటు 40ఎకరాల్లో మోడల్ గోశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. స్వామివారి భక్తులకు ప్రస్తుతం అందిస్తున్న అన్నప్రసాదాన్ని 2వేల మందికి పెంచారు. తిరుమల తరహాలో టీసీఎస్ సహకారలంతో ఆన్లైన్ సేవలు, టికెట్ వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించారు. ఇక ఆలయ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం కోసం ఐఎస్బీఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) సంస్థను కన్సల్టెంట్‌గా నియమించడానికి ట్రస్టు బోర్డు ఆమోదం తెలియజేసింది. దేవస్థాన విద్యుత్ వినియోగ వ్యయభారం తగ్గింపు కోసం 4 మెగావాట్ల సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు చెబుతుంటారు. అయితే రియల్ లైఫ్ లో డాక్టర్ గా చేసి యాక్టర్ గా వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల . కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈమె.. ఇప్పుడిప్పుడే లీడ్ రోల్స్ తో బిజీగా మారుతున్నారు. కంటెంట్ ఓరియెంట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కామా.. ఇప్పుడు ‘అగధ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ‘అగధ’ విశేషాలతో పాటుగా పలు ఆసక్తికరమైన సంగతులను పంచుకున్నారు.ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో ‘అగధ’ సినిమా తెరకెక్కింది. తాను నటించిన ‘పొలిమేర’ సినిమా చూసి, ఎంఎస్ రాజు తనకు ఈ చిత్రం కోసం ఫోన్ చేసినట్లు కామాక్షి భాస్కర్ల తెలిపారు. ''ఎంఎస్ రాజు నన్ను పిలిచారంటే కచ్చితంగా ఏదో ఒక కొత్త పాయింట్, ముఖ్యమైన పాత్రే అయి ఉంటుందని అర్థమైంది. పైగా డైరెక్టర్ ఆయనే కావడంతో, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వస్తుందని ఈ మూవీకి వెంటనే ఓకే చెప్పా. ‘అగధ’ కథ, నా పాత్ర చెప్పిన తర్వాత మరింతగా నచ్చేసింది. నేనెప్పుడూ కూడా హిట్స్ ప్లాప్స్ గురించి పట్టించుకోను. ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తాను'' అని కామాక్షి అన్నారు.''అగధ’లో నేను మహాదేవి పాత్ర పోషించాను. ఆ పాత్ర కోసం మారేందుకు నాకు టైం పట్టింది. కామాక్షిగా నన్ను నేను పక్కనపెట్టి, నా ప్రిన్సిపల్స్ పక్కన పెట్టి, ఆ పాత్ర కోసం మారడానికి ఇబ్బంది అనిపించింది. దేవుడి అనుగ్రహంతో పుట్టే పాత్ర అది. బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను. ప్రతీ ముద్ర గురించి, ఆ పాత్ర నడవడిక గురించి అర్థం చేసుకుని నటించాను. సినిమాలో ఎక్కడా కూడా కామాక్షి కనిపించకూడదని జాగ్రత్తలు తీసుకున్నాను. సినిమాలో మరీ ఎక్కువ హారర్ మూమెంట్స్ ఉండవు. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. డివైన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. చివరికు అందరికీ ఓ డివైన్

నేరాలు చేసేవారిని పరామర్శించేందుకే జగన్ (Jagan) యాత్రలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ( Satya Kumar Yadav) విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ (Assembly)రావాలని సవాల్ విసిరారు. జగన్ అసెంబ్లీకి రారు, వాళ్ల ఎమ్మెల్యేలను కూడా పంపట్లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ విధానంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల (multi-specialty hospitals) నిర్మాణానికి ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు

విజయనగరం: నేరాలు చేసేవారిని పరామర్శించేందుకే జగన్ యాత్రలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. జగన్ అసెంబ్లీకి రారు.. వాళ్ల ఎమ్మెల్యేలను కూడా పంపట్లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ విధానంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ఆలోచన చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా, సత్య, సునీల్, మురళీధర్ గౌడ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన మూవీ `కొరియన్ కనకరాజు`. సత్య కామెడీ హైలైట్‌గా సాగిన ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కింది. కామెడీ, హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఈ నెల 7న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. `కొరియన్ కనకరాజు` మూవీ ఆరు రోజులు పూర్తి చేసుకుంది. ఆరో రోజు దీనికి రూ.1.70కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఐదో రోజుతో పోల్చితే 17శాతం డ్రాప్ కనిపిస్తుంది. అయినా వసూళ్లు స్టడీగా ఉన్నాయని చెప్పొచ్చు. వీక్ డేస్‌లో ఈ మూవీకి ఈ స్థాయిలో ఉండటం విశేషమనే చెప్పాలి. అయితే వరుణ్ తేజ్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మంచి రివ్యూస్ వచ్చాయి. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. కానీ మొదటి వారంలోనే ఇంతటి భారీగా డ్రాప్ కనిపించడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా వంద కోట్ల దిశగా వెళ్తుందని భావించారు. కానీ చూడబోతుంటే, యాభై కోట్ల వద్దే ఆగిపోయేలా ఉంది. ఇక `కొరియన్ కనకరాజు`కి ఇప్పటి వరకు ఎంత వచ్చాయనేది చూస్తే, సాక్నిల్క్ లెక్కల ప్రకారం రూ.25.54కోట్ల గ్రాస్ సాధించింది. ఇందులో ఇండియాలో రూ.21కోట్ల గ్రాస్, రూ.18.22కోట్ల నెట్ వచ్చాయి. ఓవర్సీస్లో రూ.4.60కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ ముప్పై కోట్లు కూడా దాటలేదు. ఇతర ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం మరో మూడు కోట్లు అదనంగా చూపిస్తున్నాయి. అంటే రూ.28కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి అయిన బడ్జెట్ రూ.38కోట్లు, ఇప్పటి వరకు నాన్ థియేట్రికల్ గా రూ.26కోట్లు వచ్చాయి. దీంతో రూ.12కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీకి ఇప్పటికే సుమారు రూ.14కోట్ల షేర్ వచ్చింది

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తి, కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలో సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం సమావేశంలో చర్చించిన కీలక అంశాలను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. డీఎస్సీ నియామకాల స్పోర్ట్స్ కోటాలో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆధారాలున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బొత్స ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని, ఈ అంశంపై శాసనమండలిలో పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా సీఎం చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ నేతలకే పరిమితమైందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు, ప్రజా సమస్యలన్నింటినీ అసెంబ్లీ వేదికగా లేవనెత్తుతామన్నారు. 40 శాతం ఓటు షేర్ సాధించిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని మండిపడ్డారు. చట్టసభల్లో నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో ఆధారాలతో సహా ఎండగడతామని హెచ్చరించారు
.webp)
రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 352తో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్) నిరోధక చట్టంలోని 3(1)(r), 3(1)(s) సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 1071/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్సూరాబాద్‌లోని మధురానగర్ కాలనీకి చెందిన బుద్ధ సత్యనారా యణ (52) గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు తెలి పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసిన తాను ప్రస్తుతం హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులతో తనకు సన్నిహిత రాజకీయ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాజకీయ కార్య కలాపాల్లో భాగంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్య క్షుడు జక్కిడి శివాచరణ్ రెడ్డి, ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్‌రెడ్డితో కలిసి పని చేసినట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. అయితే అనంతరం రాజకీయ విభేదాలు ఏర్పడటంతో ప్రభాకర్‌రెడ్డి తనపై కక్ష పెంచుకున్నారని ఆరో పించారు. తాను ఎరుకల సామాజిక వర్గానికి చెందిన ఎస్టీ వ్యక్తిననే విషయం తెలిసినప్పటికీ, తనను కులం పేరుతో దూషించి అవమానించారని సత్య నారాయణ ఫిర్యాదులో ఆరోపించారు. ఫోన్లోనూ, ప్రత్యక్షంగానూ తనను, తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. కొన్ని వ్యాఖ్యలను సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసినట్లు ఆరోపించారు. తన కులం, కుటుంబ నేపథ్యం, వృత్తి, సామాజిక స్థితిగతులను ప్రస్తావిస్తూ అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించారని పేర్కొన్నారు. కులం పేరుతో తనను సామాజికంగా, రాజకీయంగా కించపరచడంతో పాటు ప్రజా, రాజకీయ జీవితంలో తన ఎదుగుదలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నానని ఫిర్యా దులో తెలిపారు. ఈ వ్యవహారం కారణంగా తాను, తన భార్య, పిల్లలు, ఇతర కుటుంబ

అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీలో వైసీపీకి తగిన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆ పార్టీ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. అసెంబ్లీలో ప్రస్తుతం రెండు పక్షాలే ఉన్నాయని, మూడో పక్షం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టార్చ్‌లైట్లతో బెదిరించబోతే జనంపైకి దూసుకొచ్చిన ఏనుగు.. వీడియో వైరల్ తెలంగాణలో ఈ జలపాతం అందాలు చూస్తే మైమరచిపోవాల్సిందే.!

వరుణ్ తేజ్‌కి హిట్ లేక చాలా కాలం అవుతుంది. `తొలి ప్రేమ` తర్వాత ఒక్క సినిమా కూడా ఆడలేదు. వరుసగా పరాజయాలు చవి చూశారు. ఇన్నాళ్లపాటు ఆయన స్ట్రగుల్ అయ్యాడు. కానీ ఇన్నాళ్ల కష్టం, స్ట్రగుల్స్ అన్నీ పోయాయి. `కొరియన్ కనకరాజు`తో ఆయన ఎట్టకేలకు హిట్ కొట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. రితిక నాయక్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సత్య, సునీల్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. యూవీక్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైన విషయం తెలిసిందే. కామెడీ ప్రధానంగా సాగిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కొంత థ్రిల్లర్ ఎలిమెంట్లు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సత్య కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మొత్తంగా వరుణ్ తేజ్‌కి హిట్‌ని అందించింది. ఈ మూవీ థియేటర్లో విజయవంతంగా రన్ అవుతుంది. అయితే తొలి వీకెండ్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. రూ.38కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి నాన్ థియేట్రికల్‌గా రూ.26కోట్లు వచ్చాయట. ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో మంచిగానే వచ్చాయి. ఇక థియేట్రికల్‌గా దీనికి రూ.12కోట్ల బిజినెస్ అయ్యింది. మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ దాటింది. ఇప్పుడు లాభాల్లో వెళ్తుంది. సినిమా విడుదలై ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు దీనికి నలభై కోట్లు దాటినట్టు చిత్ర బృందం చెప్పింది. కానీ సాక్నిల్క్ వంటి ట్రేడ్ సైట్ల ప్రకారం ఐదు రోజుల్లో దీనికి రూ.24కోట్లు వచ్చినట్టు సమాచారం. మంగళవారం దీనికి కోటిన్నర మాత్రమే వచ్చాయి. సోమవారంతో పోల్చితే సగమే వచ్చాయి. అంటే 50శాతం కలెక్షన్లు పడిపోయాయి. `కొరియన్ కనకరాజు` మూవీకి ఇండియాలో రూ.19.25కోట్ల గ్రాస్, రూ.16.74కోట్ల నెట్ వచ్చాయి. ఓవర్సీస్లో నాలుగున్నర కోట్లు వచ్చాయి. ఇలా ఈ మూవీకి రూ.13కోట్ల వరకు షేర్

మంచి కంటెంట్ మరియు హెల్దీ ఎంటర్టైన్మెంట్ అందిస్తే ప్రేక్షకులు కుటుంబసమేతంగా థియేటర్లకు ఖచ్చితంగా వస్తారని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు ఇంజనీర్ అయితే హీరో వరుణ్ తేజ్ ఐరన్ పిల్లర్ లాంటివాడని చిరంజీవి కొనియాడారు. కమెడియన్ సత్య నటన కాంక్రీట్ లాంటి ఉనికి అని వ్యాఖ్యానించారు. సత్య నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని, కేవలం అతని కోసమే ఈ సినిమాను మళ్లీ చూడాలనిపిస్తుందని తెలిపారు. కథానాయిక రితికా నాయక్ గ్లామర్ మరియు మురళీధర్ గౌడ్ సహజ నటన సినిమాకు అదనపు బలంగా నిలిచాయని పేర్కొన్నారు. చిన్న మరియు మధ్యతరహా సినిమాలు థియేటర్లలో ఆడటం లేదనే వాదనలను చిరంజీవి పూర్తిగా తోసిపుచ్చారు. ఇటీవల కాలంలో చెన్నై లవ్ స్టోరీ, మా ఇంటి బంగారం, లేనిన్ మరియు కొరియన్ కనకరాజు సినిమాలు వరుసగా విజయాలు సాధించాయని గుర్తు చేశారు. కొత్తతనంతో కూడిన కథలను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారని ఈ విజయాలు నిరూపించాయని చెప్పారు. దీంతో చిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా దర్శకులకు ఒక కీలకమైన సలహా ఇచ్చారు. నిర్మాతలు వెచ్చించే ప్రతి రూపాయికి విలువ ఇస్తూ పరిమిత బడ్జెట్లోనే సినిమాలు తీయాలని సూచించారు. కథ బలంగా ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని స్పష్టం చేశారు. ఫలితంగా సినిమా విజయం సాధించి అనేక మంది సినీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. ఆగస్టు 7న విడుదలైన కొరియన్ కనకరాజు చిత్రం అనంతపురం నేపథ్యంతో కొరియన్ మూలాలు కలిసిన హారర్ కామెడీగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ విభిన్నమైన

నోవై: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) మిషిగన్ ఆధ్వర్యంలో బోనాలు జాతర 2026 కార్యక్రమం నోవైలోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ & కల్చరల్ సెంటర్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మిషిగన్‌లోని తెలుగు కుటుంబాలు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాల పండుగ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఘనమైన బోనాల ఊరేగింపు, మహాకాళీ మాతకు బోనం సమర్పణ, కుంకుమ పూజలు కన్నుల పండువగా సాగాయి. వీటితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించగా, మహారాష్ట్ర మండల్ డెట్రాయిట్ (MMD)కు చెందిన షిలేదార్ ఢోల్ తాషా పథక్ ప్రదర్శించిన ప్రత్యేక డోలు ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సభ్యుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ఈ వేడుక ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ వేడుకను మాటా మిషిగన్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ బాతిని, రీజినల్ కోఆర్డినేటర్ సత్య మైనంపాటి, ఉమెన్స్ కో-చైర్ అమూల్య రామన్నగారి నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించారు. వీరితో పాటు ప్రియ, అక్షర, మల్లేశం అనేక మంది మాటా మిషిగన్ కమ్యూనిటీ వాలంటీర్లు అందించిన అంకితభావంతో కూడిన సహకారం కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించింది. బోనాల సంప్రదాయాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడుతూ భావితరాలకు అందించేందుకు తమ కుటుంబాలతో కలిసి హాజరైన ప్రతి ఒక్కరికీ, వాలంటీర్లకు, కళాకారులకు, ఆలయ ప్రతినిధులకు , కమ్యూనిటీ సభ్యులందరికీ MATA మిషిగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ వేడుక విజయవంతం కావడానికి విశేషంగా సహకరించిన స్పాన్సర్ కళ్యాణ్ తిరుమల గారికి, శ్రీ వెంకటేశ్వర టెంపుల్ & కల్చరల్ సెంటర్‌కు, పాల్గొన్న అన్ని సంస్థలు , ప్రదర్శన బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు కమ్యూనిటీని ఒక్కతాటిపైకి తీసుకురావడం , మన గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడం పట్ల తమ నిబద్ధతను మాటా మిషిగన్ మరోసారి చాటుకుంది

మహిళలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించే దిశగా చర్యలు చేపడుతున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ సమర్థంగా పనిచేస్తున్నారని.. డ్రైవింగ్ కూడా వారికి సాధ్యమేనని చెప్పారు. 102 వాహనాల నిర్వహణ సంస్థ.. కన్సార్టియం ఆఫ్ విద్యా వేదా ఫౌండేషన్ అండ్ శ్రీనివాసా టూర్స్ అండ్ ట్రావెల్స్ మహిళా డ్రైవర్ల నియామకానికి ప్రతిపాదన చేసిందని.. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా ఉందన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట లోని ఏరియా ఆసుపత్రి వద్ద మంగళవారం 102 ఆధునిక అంబులెన్స్ ల సేవలను ప్రారంభించి, మంత్రి మాట్లాడారు.102.. 104.. 108.. ఒకే లక్ష్యంగర్భధారణ నుంచి ప్రసవం వరకు 102, అత్యవసర పరిస్థితుల్లో 108, గ్రామస్థాయిలో పరీక్షలు, చికిత్సలకు 104 సేవలను అనుసంధానిస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం తగ్గించి.. అవసరమైన సేవలను వీలైనంత వరకు వారి వద్దకే తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.తల్లీబిడ్డలకు మరింత భరోసా102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రసవం అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చడానికే పరిమితం చేయకుండా గర్భధారణ దశ నుంచే విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. యాంటీనాటల్ చెకప్‌లకు వెళ్లే గర్భిణులు 102 సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను ఆసుపత్రికి తరలించడంతోపాటు రక్తహీనతతో బాధపడే గర్భిణులకు అవసరమైన చికిత్స అందేలా సేవలను విస్తరిస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 500 కొత్త 102 వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని.. తొలి విడతలో 300, మరో రెండు నెలల్లో 200 వాహనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వాహనాల్లో ఏసీ, ఆరు ఎయిర్‌బ్యాగులు, ఫుట్‌రెస్ట్, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర ఎస్వీఎస్ బటన్ వంటి సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నరసరావుపేటలో 50 వాహనాలు ప్రారంభించారు. దీనికి అనుగుణంగా ప్రతి జిల్లాల్లోనూ 300

సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, భోజ్ పురి భాషల్లో వందకు పైగా చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ (72) అనారోగ్య కారణంగా ఆగస్ట్ 10వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. అర్జున్ అసలు పేరు యు. మల్లికార్జున శర్మ. కడపలో 1954 జూలై 11న ఆయన జన్మించారు. యుక్త వయసులోనే సంగీతం మీద మక్కువతో చెన్నై చేరి జి.కె. వెంకటేశ్, చక్రవర్తి తదితర ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. ఆ తర్వాత చెన్నయ్ లో దాదాపు ఆరువందల మ్యూజిక్ ఆల్బమ్స్ కు స్వరాలు సమకూర్చారు. 2004లో హైదరాబాద్ వచ్చిన మల్లికార్జున శర్మ... అర్జున్ పేరుతో సినీ సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. తెలుగు, కన్నడ, భోజ్ పురి, తమిళ భాషల్లో వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. అర్జున్ శర్మ కుటుంబ సభ్యులంతా సంగీతానికే అంకితమయ్యారు. ఆయన భార్య రాణి పులోమజా దేవి గీత రచయిత్రగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్ స్వరపర్చిన అనేక చిత్రాలకు ఆమె పాటలు రాశారు. తెలుగు సినిమాలలో అత్యధిక పాటలు రాసిన గీత రచయిత్రిగా ఆమె గుర్తింపు పొందారు. పదకొండేళ్ళ క్రితం, 2015లో రాణి పులోమజా దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు. అందులో ఒకరు జానకిరామ్, కాగా మరొకరు ప్రద్యోతన్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రామ సత్యనారాయణ నిర్మించిన 'ఐస్ క్రీమ్' సినిమాతో ప్రద్యోతన్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత బెంగళూరుకు మకాం మార్చిన ప్రద్యోతన్ ఇంతవరకూ 18 కన్నడ చిత్రాలకు సంగీతం అందించారు. మరో ఐదు చిత్రాలకు సంగీతం సమకూర్చుతున్నారు. తెలుగులో లో-బడ్జెట్ సినిమాలు నిర్మించే వారందరికీ సంగీత దర్శకుడు అర్జున్ దన్నుగా నిలిచేవారు. పరిమితమైన బడ్జెట్ లో వారి చిత్రాలకు అర్జున్ సంగీతాన్ని సమకూర్చేవారు. పోసాని 'జెంటిల్ మేన్', 'బుల్లబ్బాయ్, సర్కార్, పరంపర

ఏపీలో మాతాశిశు సంరక్షణ కోసం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు సిద్ధమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న ఈ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102 వాహనాలు) సేవలను మంగళవారం ప్రారంభిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతి, నరసరావుపేట (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ కోసం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు సిద్ధమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న ఈ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102 వాహనాలు) సేవలను మంగళవారం ప్రారంభిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం తెలిపారు. ప్రసవానంతరం తల్లీబిడ్డ సంరక్షణను మెరుగుపర్చడం, ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తల్లి, శిశువుకు ఎదురయ్యే రవాణా సమస్యలను తొలగించడం, అత్యవసర సమయాల్లో, హైరిస్క్ గర్భిణులను ఆస్పత్రికి తరలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ సేవలు పూర్తిగా ఉచితం. అవసరమైన వారు 102 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఈ సేవలు పొందవచ్చు. ఈ పథకం కోసం రాష్ట్రంలో నూతనంగా 500 వాహనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా 300 వాహనాలను మంగళవారం ప్రారంభించనుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ వాహనాలను మంత్రి సత్యకుమార్ ప్రారంభిస్తారు. వీటిని నరసరావుపేటలోని పోలీసు మైదానానికి తరలించారు. ఈ వాహనాల ద్వారా ఏటా 2.75 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఈ వాహనంలో ఏసీతోపాటు పూర్తిస్థాయి రక్షణ, భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగ్‌లు, వంటివి అమర్చారు. ప్రసవానంతరం తల్లీబిడ్డతోపాటు వారి సహాయకులను ఈ వాహనం ద్వారా వారి ఇళ్లకు చేరుస్తారు. నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజుల ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ప్రకటించిన వసూళ్లకు, స్వతంత్ర బాక్సాఫీస్ ట్రాకర్ల అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. నిర్మాతలు శనివారం నాటికి రూ.37.4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పోస్టర్ విడుదల చేయగా, ట్రేడ్ వర్గాలు మాత్రం భిన్నమైన గణాంకాలను వెల్లడిస్తున్నాయి. ఈ సినిమాను మెర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. రితికా నాయక్ కథానాయికగా నటించగా, నటుడు సత్య కీలక పాత్రలో కనిపించారు. థమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. రాయలసీమ నేపథ్యానికి కొరియన్ ఆత్మ ప్రవేశించే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ హారర్ కామెడీ రూపుదిద్దుకుంది. వరుణ్ తేజ్ గత చిత్రాలు నిరాశపరిచినప్పటికీ, ఈ సినిమాకు తొలి రోజు నుంచే ప్రేక్షకులలో మంచి ఆదరణ లభిస్తోంది. కలెక్షన్ల విషయానికి వస్తే నిర్మాతలు మూడు రోజుల్లో రూ.37.4 కోట్ల గ్రాస్ సాధించామని, అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించామని తెలిపారు. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ట్రాకింగ్ సంస్థల డేటా వేరేలా ఉంది. సాక్నిల్క్ సమాచారం ప్రకారం భారతదేశంలో మూడు రోజుల నెట్ రూ.13.20 కోట్లు కాగా, గ్రాస్ రూ.15.18 కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా విదేశీ మార్కెట్ నుంచి రూ.4 కోట్లు రావడంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.19.18 కోట్లుగా లెక్క తేలింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.8 కోట్ల వరకు షేర్ సాధించిందని ఎగ్జిబిటర్లు స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా థియేట్రికల్ బిజినెస్ రూ.12 కోట్లలో మెజారిటీ భాగం రికవరీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రూ.36 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల ద్వారా రూ.24 కోట్ల

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ఎట్టకేలకు హిట్ పడింది. ఆయన తాజాగా `కొరియన్ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత శుక్రవారం(ఆగస్ట్ 7)న ఈ చిత్రం విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రమిది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ని తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. వరుణ్ తేజ్‌కి హిట్ లేక చాలా రోజులవుతుంది. దీంతో ఆ లోటుని ఇప్పుడు `కొరియన్ కనకరాజు` తీర్చింది. ఎట్టకేలకు వరుణ్ తేజ్‌కి హిట్ పడింది. ఈ సినిమా మూడు రోజుల్లో మంచి వసూళ్లని రాబట్టింది. మొత్తంగా ఇది రూ.35కోట్లు రాబట్టినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల్లోనే దీనికి రూ.23.6కోట్లు రాగా, మూడో రోజు దాదాపు రూ.13కోట్లు వసూలు చేయడం విశేషం. గత రెండు రోజులతో పోల్చితే ఆదివారం దీనికి కలెక్షన్లు పెరిగాయి. సండే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్ ఆడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మూడు రోజుల్లో సుమారు ఇరవై కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ సైట్లు వెల్లడించడం గమనార్హం. ఇక `కొరియన్ కనకరాజు` చిత్రానికి సుమారు రూ.40కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇప్పటి వరకు రూ.35కోట్లు రావడంతో ఇప్పటికే ఇది బ్రేక్ ఈవెన్ అయినట్టు టీమ్ వెల్లడించింది. మొదటి వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ కావడం విశేషమనే చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఇలా తొలి వారాంతంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. అంతేకాదు సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాలిడ్గానే ఉన్నట్టు టీమ్ చెప్పింది. ఇది సినిమా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందనే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తంగా కొరియన్ కనకరాజు

థియేటర్స్‌లో ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్స్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.. ఏళ్లు గడుతున్నా కొన్ని సినిమాలు టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా చాలా స్పెషల్.. ప్రస్తుతం చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. కథలో బలం ఉంటే పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టొచ్చని చాలా సినిమాలు నిరూపించాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా కలెక్షన్స్ లో కుమ్మేస్తున్నాయి. అయితే మాములుగా సినిమా అంటే ఆరు ఫైట్స్, నాలుగు అదిరిపోయే సాంగ్స్, ముఖ్యంగా స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే.. కానీ అలాంటివి ఏమీ లేకుండా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అంతే కాదు భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా మరేదో కాదు.. అదే మెయియజగన్. ఈ సినిమాను తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ చేశారు. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీ, అరవింద సామి కీలకపాత్రలు పోషించారు. సైలెంట్‌గా వచ్చి, ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న ఒక ఎమోషనల్ డ్రామా.. ఏకంగా 8.4 IMDb రేటింగ్‌తో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాలో ఇందులో కార్తీ, అరవింద సామి యాక్టింగ్ జనాలను కట్టిపడేసింది. సింపుల్ కథ.. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అందరిని ఏడిపించింది. 2024లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అటు బాక్సాఫీస్, ఇటు ఓటీటీలో ఈ సినిమా ట్రెండింగ్ అయ్యింది. ఈ సినిమాకు ‘96’ లాంటి ఎమోషనల్ హిట్‌ను అందించిన సి.ప్రేమ్ కుమార్

Korean Kanakaraju Day 1 Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వసూళ్లకు సంబంధించిన ఓపెనింగ్ గణాంకాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ‘కొరియన్ కనకరాజు’ ప్రీమియర్స్‌తో పాటు డే 1 కలెక్షన్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.10.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో వరుణ్ తేజ్ కెరీర్లో ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచినట్లు చిత్రబృందం పేర్కొంది. విడుదలకు ముందు నుంచే ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్‌తో పాటు వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ చేసిన వరుస ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ రూపంలో మంచి స్పందన దక్కింది. ఇక సినిమా కథ విషయానికొస్తే.. అనంతపురం జిల్లా పెనుగొండలో చెక్కభజన బృందాన్ని నడిపించే కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. తన స్నేహితుడు కిష్టప్ప (సత్య)తో కలిసి సరదాగా జీవితాన్ని గడిపే కనకరాజు.. చైత్ర (రితిక నాయక్)ను చూసి ప్రేమలో పడతాడు. ఎప్పటికైనా కొరియా వెళ్లి అక్కడ స్థిరపడాలనేది చైత్ర కల. అయితే అనూహ్యంగా కనకరాజులోకి ఓ కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? ఆ ఆత్మ కారణంగా కనకరాజు కొరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఆ ఆత్మ అతడిని వదిలి వెళ్లిందా? అనే ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది. బాక్సాఫీస్ వద్ద తొలి రోజే మంచి