
కొత్త లుక్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ జిటి 650 వచ్చేసింది... ధర ఎంతో తెలుసా
రాయల్ ఎన్ఫీల్డ్ ఫేమస్ కేఫ్ రేసర్ బైక్ కాంటినెంటల్ జీటీ 650 ఇప్పుడు కొన్ని మార్పులతో మార్కెట్లోకి వచ్చింది. బైక్ లుక్తో పాటు, వాడుకలోనూ కొన్ని కొత్త ఫీచర్లను జోడించారు. ఈ కొత్త కాంటినెంటల్ జీటీ 650 లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, యూఎస్బీ టైప్-సి చార్జింగ్ పోర్ట్ వంటివి కొత్తగా చేర్చిన ముఖ్యమైన ఫీచర్లు. అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చుట్టూ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడంతో బైక్ లుక్ మునుపటి కంటే మరింత స్టైలిష్గా మారింది. రాకర్ రెడ్ కలర్ మోడల్లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. దీని ఇంజిన్, ఎగ్జాస్ట్ పైపులకు పూర్తిగా బ్లాక్ కలర్ కోటింగ్ ఇచ్చారు. దీనికి తోడు అలాయ్ వీల్స్ కూడా నలుపు రంగులోనే ఉన్నాయి. దీంతో ఈ మోడల్ మొత్తం బ్లాక్-అవుట్ లుక్తో చాలా స్పోర్టీగా కనిపిస్తోంది. అపెక్స్ గ్రే మోడల్లో కూడా దాదాపు ఇలాంటి బ్లాక్-అవుట్ లుక్ ఇప్పటికే అందుబాటులో ఉంది. మరోవైపు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, మిస్టర్ క్లీన్ కలర్ మోడళ్లలో మాత్రం పాత పాలిష్డ్ ఇంజిన్ లుక్, స్పోక్ వీల్స్నే కొనసాగిస్తున్నారు. కొత్త కాంటినెంటల్ జీటీ 650 ఇంజిన్లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. పాత మోడల్లో ఉన్న 648 సిసి, ట్విన్-సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్నే ఇందులోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్ 7,150 rpm వద్ద 47 హార్స్పవర్, 5,250 rpm వద్ద 52.3 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్బాక్స్ జత చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్, హారిస్ పెర్ఫార్మెన్స్ కలిసి డెవలప్ చేసిన స్టీల్ ఫ్రేమ్నే కొనసాగించారు. కాబట్టి కొత్త మోడల్లో ప్రధానంగా లుక్, ఫీచర్లలోనే మార్పులు జరిగాయి. సస్పెన్షన్ విషయానికొస్తే ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు గ్యాస్-ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. కాంటినెంటల్ జీటీ 650 ప్రత్యేకమైన ఫ్యూయల్ ట్యాంక్, లో-స్లంగ్ రైడింగ్ పొజిషన్, స్పోర్టీ కేఫ్ రేసర్ డిజైన్ వంటివి యథాతథంగా
