
Ranabaali Movie: అభిమానులకుక్రేజీ సర్ప్రైజ్.. విజయ్, రష్మిక మూవీ రణబాలి టీజర్ వచ్చేది అప్పుడే..
Ranabaali Movie: అభిమానులకు క్రేజీ సర్ ప్రైజ్.. విజయ్, రష్మిక మూవీ రణబాలి టీజర్ వచ్చేది అప్పుడే..
© 2026 nimisham.in

Ranabaali Movie: అభిమానులకు క్రేజీ సర్ ప్రైజ్.. విజయ్, రష్మిక మూవీ రణబాలి టీజర్ వచ్చేది అప్పుడే..

రష్మిక మందన్న గాయంతో ‘మైసా’, ‘రణబాలి’ షూటింగ్స్‌పై ప్రభావం పడింది. తాజాగా అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా షూటింగ్ కూడా దాదాపు 45 రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక్క క్షణం కూడా తీరిక లేని స్టార్ హీరోయిన్‌కి గాయమై విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఎంత నష్టం? ఒకటా? రెండా? ఎన్ని సినిమాల చిత్రీకరణలు ఆగిపోతాయి? రష్మిక (Rashmika Mandanna) పరిస్థితిని చూస్తున్న వారికి ఇప్పుడు ఈ విషయం చాలా బాగా అర్థమవుతోంది. ‘మైసా’ సినిమా కోసం పాట చిత్రీకరిస్తుండగా రష్మిక మందన్న కుడి వైపు తుంటి భాగానికి గాయమైంది. ఆరు వారాల రెస్ట్ ఎప్పుడు పూర్తవుతుందా... రష్మిక మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ‘మైసా’ (Mysaa) మేకర్స్ ఎదురు చూస్తున్నారు. అలాగే ‘రణబాలి’ (Ranabaali) సినిమా యూనిట్ కూడా రష్మిక మునుపటిలా తుళ్లుతూ సెట్‌కి వచ్చే రోజు కోసం వెయిటింగ్. ఇటు అల్లు అర్జున్ (Allu Arjun) ‘రాకా’ మూవీ మీద కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ఆ షూట్లో ఆలస్యం చోటు చేసుకోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ‘రాకా’ (Raaka) సెట్లో రష్మిక డబుల్ యాక్టివ్‌గా ఉండాలి. సెప్టెంబర్ ఆఖరునగానీ, అక్టోబర్ మొదటివారంలోగానీ ఆమె సెట్‌కి వచ్చే అవకాశాలుండటంతో, ఆ ప్రకారమే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట అట్లీ (Atlee)

టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్‌తో పాటు కమర్షియల్ సక్సెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ రూటే వేరు. టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్‌తో పాటు కమర్షియల్ సక్సెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రూటే వేరు. ‘శ్రీమంతుడు’తో జర్నీ స్టార్ట్ చేసిన ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్.. ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘ఉప్పెన’, పాన్ ఇండియా రేంజ్లో ‘పుష్ప’ ప్రాంచైజీలతో పాటు దాదాపు 25కు పైగా చిత్రాలతో ఇండస్ట్రీలోనే సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సత్తా చాటుతున్న మైత్రీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఒక భారీ ప్లాన్‌తో సరికొత్త లైనప్‌ను సిద్ధం చేసింది. సాధారణంగా ఒకే సంస్థ ప్రెజెంట్ ట్రెండ్‌ను బేస్ చేసుకుని సినిమాలు ప్లాన్ చేయడం చూస్తుంటాం. కానీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రాబోయే ప్రాజెక్టుల కోసం వేర్వేరు చారిత్రక కాలాలను ఎంచుకుంటోంది. కాలాన్ని రీక్రియేట్ చేస్తూ వెండితెరపై వింటేజ్ అనుభూతిని పంచే పీరియడ్ జోనర్పై పూర్తి దృష్టి పెట్టింది. ఒకే సమయంలో, వేర్వేరు టైమ్లైన్లలో నడిచే భారీ ప్రాజెక్టులను ఒకే బ్యానర్లో హ్యాండిల్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో రానున్న ‘రణబాలి’ (Ranabaali). ఈ కథ 19వ శతాబ్దపు రాయలసీమ నేలల్లోకి తీసుకెళ్లనుంది. ఆ నాటి జీవన విధానం, స్థానిక పోరాటాలు, ఆచారాలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించేందుకు డైరెక్టర్ ఏకంగా రెండున్నరేళ్లు లోతైన పరిశోధన చేశారు. నాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఒక పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ఇక పాన్

రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడడంతో ప్రస్తుతం కొన్ని వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ(vijay devarakonda) హీరోగా రాహుల్ సంకృత్యాన్(Rahul Sakrityan) దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి(Ranabaali) చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే రష్మిక గాయం కారణంగా ఆమె పాల్గొనాల్సిన సీన్స్ వాయిదా పడటంతో సినిమా రిలీజ్ షెడ్యూల్‌పై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. మొదట సెప్టెంబర్ రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్‌లో రిలీజయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రష్మిక కోలుకున్న వెంటనే రణబాలికి ప్రాధాన్యత ఇచ్చి తన డేట్స్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న రాకా(Raaka) సినిమా షూటింగ్ కూడా ఆమె అందుబాటులో లేకపోవడంతో మార్పులకు లోనైంది. ప్రస్తుతం రష్మిక అవసరం లేని సీన్స్ ను షూట్ చేస్తున్న యూనిట్, మిగిలిన షెడ్యూల్‌లను తిరిగి ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం. ముంబైలో జరుగుతున్న ప్రస్తుత షెడ్యూల్ తర్వాత రష్మిక నవంబర్‌లో తిరిగి సెట్స్‌లో చేరే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బాలీవుడ్లో తెరకెక్కుతున్న మైసా(Mysaa) సినిమా షూటింగ్ కూడా ఈ గాయం కారణంగా ఆలస్యమైంది. హై ఎనర్జీ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ టైమ్ లో ఆమెకు హిప్ టెండన్ డిటాచ్మెంట్ గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ ప్లాన్స్ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా రష్మిక గాయం ప్రస్తుతం మూడు ప్రధాన చిత్రాల షూటింగ్, షెడ్యూల్స్, రిలీజ్ డేట్స్ పై ప్రభావం చూపినట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఆమె త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్లలో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ‘రణబాళి’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కథానాయకుడు విజయ్ దేవరకొండ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భీకరమైన యోధుడి గెటప్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. రక్తం చిందిన గాయాలతో, జాతీయ జెండాను ధరించి ఆయన ఇస్తున్న లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. “మరపురాని మన చరిత్రలోని అత్యంత ధైర్యసాహసాల అధ్యాయం” అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమా కథాంశంపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామాను దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 1854 నుంచి 1878 కాలం నాటి రాయలసీమ నేపథ్యంలో బ్రిటిష్ వలస పాలనపై సాగిన పోరాటమే ఈ చిత్ర ప్రధాన కథాంశం. అప్పటి చారిత్రక సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో రాయలసీమ వీరుల త్యాగాలను ఈ సినిమా ద్వారా వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనుంది. ఇదిలా ఉండగా, హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (ది మమ్మీ ఫేమ్) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతర్జాతీయ స్థాయి నటుడు భాగస్వామ్యం కావడంతో రణబాళి చిత్రంపై సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చ మొదలైంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. దీంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన ఈ పోస్టర్ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. నెటిజన్లు విజయ్ దేవరకొండ మేకోవర్‌ను ప్రశంసిస్తూ కామెంట్లతో పోస్టర్‌ను షేర్ చేస్తున్నారు. ఫలితంగా రణబాళి చిత్రం గురించి సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పీరియాడిక్ డ్రామాలో వాస్తవ సంఘటనలను ప్రతిబింబించేలా విజువల్స్ ప్లాన్

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాలలో రణబాలి ఒకటి. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా పెళ్లి తరువాత వారిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాలలో రణబాలి (Ranabaali) ఒకటి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక మందన్నా (Rashmika Mandanna) పెళ్లి తరువాత వారిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంతేకాకుండా విజయ్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా విజయ్ కి ఒక మంచి హిట్ లేదు. రణబాలి.. కచ్చితంగా హిట్ అందుకుంటుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్నీ బావుండి ఉంటే.. ఈ పాటికి విజయ్ - రష్మిక రణబాలి ప్రమోషన్స్ లో ఉండేవారు. సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉండటంతో సినిమా విడుదలను వాయిదా వేసిన విషయం తెల్సిందే. అన్నయ్య ఎలాగో రావడం లేదు కదా ఆ డేట్ ని నేను వాడుకుంటాను అని తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన సినిమా ఎపిక్ ని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో రణబాలి కొత్త విడుదల తేదీ ఎప్పుడనే దానిపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, దానికి సమాధానం లభించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈసారి మాత్రం విజయ్ అస్సలు తగ్గేదెలే అంటున్నట్లు సమాచారం. ఇక రష్మిక కూడా భర్త కోసం రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక డ్యాన్స్ షూటింగ్లో రష్మిక తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. డాక్టర్లు ఆమెకు ఆరు వారాల విశ్రాంతిని

టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabali) ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabali) ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు దర్శకుడి ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన గత చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఈ జంట మరోసారి తెరపై కనిపించనుండటంతో అభిమానులు ‘రణబాలి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత ‘రణబాలి’ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే సినిమా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అని విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీపై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. అక్టోబర్ 30న ‘రణబాలి’ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ‘రణబాలి’ తొలుత అనుకున్న సెప్టెంబర్ 11 తేదీన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘EPIC’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అన్నదమ్ముల సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి