
Ram Pothineni | అభిమాని పరిస్థితి చూసి చలించిపోయిన రామ్.. చికిత్స బాధ్యత తీసుకుని మానవత్వం చాటుకున్న హీరో
Ram Pothineni | అభిమాని పరిస్థితి చూసి చలించిపోయిన రామ్.. చికిత్స బాధ్యత తీసుకుని మానవత్వం చాటుకున్న హీరో
© 2026 nimisham.in

Ram Pothineni | అభిమాని పరిస్థితి చూసి చలించిపోయిన రామ్.. చికిత్స బాధ్యత తీసుకుని మానవత్వం చాటుకున్న హీరో
Samyuktha Menon: రామ్ పోతినేనికి జోడీగా సంయుక్త మీనన్.. ‘RaPo23’ మేకర్స్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’. లోకనాయకుడు కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్‌కు ధీటైన అల్లుడి పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ రోల్లో రామ్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ డాక్టర్ గా కనిపించబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను రాబోయే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టే షూటింగ్ ను జెట్ స్పీడ్ లో ఫినిష చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్. ఒకవేళ సంక్రాంతికి వస్తే ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే జనవరి 12న విడుదల, చిరు – బాబీ సినిమా, జార్జిక్రిష్ సినిమాలు రేస్ లో ఉన్నాయి. ఇప్పడు రజనీ సినిమా వస్తే పొంగల్ పోరు జోరుగా ఉంటుంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, రామ్ ఎనర్జీ కలగలిసి రానున్న ఈ మామా-అల్లుళ్ల ఈగో వార్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. త్వరలో ‘జైలర్ 2’ చిత్రంతో ఆయన ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆ వెంటనే ‘ధర్మన్’ రానుంది. కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘జైలర్’ (Jailer) మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన తలైవా, ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్-2’ (Jailer 2)లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తోన్న ఈ భారీ సీక్వెల్ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా... రజనీకాంత్ తన తదుపరి ప్రాజెక్ట్ అయిన ‘ధర్మన్’ను ‘డ్రాగన్’ ఫేమ్ అశ్విన్ మారిముత్తు దర్శకత్వంలో చేస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ‘ధర్మన్’ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. అదేంటంటే... ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడి పాత్రలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటించబోతున్నారట. తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయాలనే ప్లాన్‌తో మేకర్స్ రామ్‌ను ఈ పవర్ఫుల్ రోల్ కోసం సంప్రదించారని సమాచారం. ఇప్పటికే రామ్ పోతినేనికి డైరెక్టర్ కథ చెప్పడం, ఆయనకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం కూడా జరిగిపోయాయని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ రోల్ విషయంలో మరొక ఆసక్తికరమైన వార్త కూడా బయటకు వచ్చింది. రామ్ కంటే ముందు ‘ధర్మన్’ మూవీ టీమ్ ఈ పవర్ఫుల్ రోల్ కోసం వర్సటైల్ నటుడు విక్రమ్‌ను సంప్రదించిందట. కానీ కొన్ని కారణాల వల్ల విక్రమ్ ఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో, వెంటనే రామ్ పోతినేనిని ఖరారు చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమా మామా-అల్లుళ్ల మధ్య జరిగే కక్షలు
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని పట్ల గొప్ప మనసు చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఓ యువతికి భరోసా కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమెతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతేకాదు ఇది ఆమె ఆరోగ్యం మెరుగుపడటానికి అవసరమైన వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలంలోని దుప్పలపూడి గ్రామానికి చెందిన శశి భవ్యత(18) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. లఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే అరుదైన జన్యులోప వ్యాధితో ఇబ్బందులు పడుతోంది. తరచూ ఫిట్స్ రావడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. శశిభవ్యత మతిస్థిమితం సరిగా లేనప్పటికీ, హీరో రామ్ పోతినేని పేరు చెబితే చాలు ఎంతో ఉత్సాహంగా స్పందిస్తుంటుంది. దీంతో తల్లిదండ్రులు ఆమెకు అన్నం తినిపించాలన్నా, మందులు వేయాలన్నా రామ్ ఫోటోలు, వీడియోలు చూపిస్తుంటారు.రామ్ ఫోటోలు చూపించి శశి భవ్యత తల్లి అన్నం తినిపించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం రామ్ వరకూ చేయడంతో ఆయన స్పందించారు. బుధవారం శశిభవ్యతతో వీడియో కాల్లో మాట్లాడారు. ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. శశిభవ్యత మెడికల్ రిపోర్టులు తనకు అందాయన్నారు. ఇకపై ఆమె మందులు, ఇతర వైద్య అవసరాలకు అయ్యే ఖర్చులన్నీ తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఆమెను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని, మందులు సమయానికి అందించాలని తల్లిదండ్రులకు సూచించారు రామ్.రామ్ మాట్లాతుండగా.. ‘ఎప్పుడు వస్తావ్ సార్’ అని శశి భవ్యత ప్రేమగా అడిగింది. “వస్తాను. నేను రావాలంటే నువ్వు బాగా తిని, మందులు వేసుకొని బలంగా తయారవ్వాలి. ఇక నుంచి ఫుడ్, మందులు నేనే పంపిస్తాను. టైముకి తిని మందులు వేసుకుంటే నువ్వు బలంగా అవుతావు. అప్పుడు నువ్వు హైదరాబాద్ రావాలి. మనం కలవాలి. నాకు నిన్ను కలవాలని ఉంది” అని

అరుదైన జన్యులోప వ్యాధితో ఇబ్బంది పడుతున్న తన అభిమాని పట్ల సినీ హీరో రామ్ పోతినేని పెద్ద మనసు చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన శశిభవ్యత (18) నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. మతిస్థిమితం సరిగా లేకపోయినా రామ్ పేరు చెబితే ఆమె ఉత్సాహం చూపుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు రామ్ చిత్రాలు, వీడియోలు చూపించి, ఆమెకు అన్నం తినిపించి మందులు వేయిస్తున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న రామ్.. వెంటనే స్పందించి బాలికతో వీడియో కాల్లో మాట్లాడారు. శశిభవ్యతకు అవసరమైన మందులు ఇతర ఖర్చులు అన్నీ తానే భరిస్తానని తెలిపారు. ఈ వార్త చదివారా: ఈడీ విచారణకు హాజరైన నిధి అగర్వాల్

అరుదైన జన్యులోప వ్యాధితో బాధపడుతోన్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన 18 ఏళ్ల బాలిక శశి భవ్యత పట్ల సినీ నటుడు రామ్ పోతినేని మానవత్వం చాటారు. అరుదైన జన్యులోప వ్యాధితో బాధపడుతోన్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన 18 ఏళ్ల బాలిక శశి భవ్యత (Shashi Bhavyata) పట్ల సినీ నటుడు రామ్ పోతినేని (Ram Pothineni) మానవత్వం చాటారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో, ఏబిఎన్ న్యూస్ ఛానల్లో ఆమె పరిస్థితి గురించి తెలియజేసిన వీడియోలు వైరల్ కావడంతో హీరో రామ్ స్పందించి.. స్వయంగా ఆమెతో వీడియో కాల్లో మాట్లాడి భరోసానిచ్చారు. తమ అభిమాన హీరోతో కూతురు మాట్లాడటంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. అసలు విషయం ఏమిటంటే.. హీరో రామ్ పోతినేని అంటే శశి భవ్యతకు చాలా ఇష్టం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు. ఒకప్పుడు ఎంతో చురుగ్గా ఉంటూ చదువుల్లో ముందున్న ఆ అమ్మాయి.. నేడు ఓ అరుదైన జన్యు వ్యాధి ‘లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ’తో మంచానికే పరిమితమైంది. కనీసం మాట్లాడలేని, గుర్తు పట్టలేని స్థితిలోనూ.. తన అభిమాన హీరో పేరు వింటే మాత్రం ఆమె కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె అయిన శశి భవ్యత.. అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. చక్కటి ప్రతిభ కనబరుస్తూ కుటుంబానికి వెలుగుగా నిలుస్తుందనుకున్న ఆమె జీవితంలో 2022 నుంచి ఊహించని కష్టం మొదలైంది. దాదాపు మూడు తరాలుగా కుటుంబంలో జరుగుతున్న మేనరికపు వివాహాల కారణంగా శశి భవ్యత అరుదైన జన్యుపరమైన సమస్య బారిన పడింది. 2022లో మొదలైన ఫిట్స్ సమస్య క్రమంగా తీవ్రరూపం దాల్చి, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో మతిస్థిమితం కోల్పోయి పూర్తిగా మంచానికే పరిమితమైంది

సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్ కథానాయకుడిగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ధర్మన్’లో రామ్ పోతినేని ఒక కీలకపాత్రలో నటించనున్నారని సమాచారం.ఈ సినిమాలో రజనీకాంత్ అల్లుడి పాత్రలో రామ్ కనిపించనున్నారని తెలుస్తోంది. కేవలం అల్లుడిగానే కాకుండా మామతో నిత్యం విభేదించే శక్తిమంతమైన పాత్రలో ఆయన నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఈ వార్త నిజమైతే, తెలుగు ప్రేక్షకులకు ఇది పండగే అని చెప్పొచ్చు. ‘ధర్మన్’ సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం.వాస్తవానికి ఈ సినిమా అనేక అడ్డంకులను దాటుకుని సెట్స్ పైకి వెళ్లింది. తొలుత వేరే దర్శకులతో చర్చలు జరిపినా, చివరికి ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరిముత్తుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.భారీ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. రామ్ పోతినేని చేరికపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ వార్తపై

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RAPO23. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇటీవల పాండిచ్చేరిలో భారీ సెటప్‌లో టీమ్ 9 రోజుల పాటు షూటింగ్ చేశారు. వర్షాల కారణంగా షెడ్యూల్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ గట్టిగా శ్రమిస్తోంది. సినిమాలోని నెగెటివ్ రోల్ కోసం మేకర్స్ ముందుగా మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఈ కాంబినేషన్ కుదరలేదు. ఆ తర్వాత కోలీవుడ్ పాపులర్ విలన్ ఎస్జే సూర్యను అప్రోచ్ అయ్యారు. అయితే ఆయన ఈ పాత్ర కోసం దాదాపు రూ. 7 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ రేంజ్ రెమ్యునరేషన్ బడ్జెట్ పరిమితులకు మించడంతో మేకర్స్ ప్రత్యామ్నాయం వైపు చూశారు. చివరకు ఈ పవర్ ఫుల్ యాంటాగొనిస్ట్ రోల్ కోసం బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జెనీలియా భర్త అయిన రితీష్, రామ్ పోతినేనికి మంచి ఆత్మీయుడు, ప్రాణస్నేహితుడు. ఈ క్యారెక్టర్‌కి రితీష్ అయితే కొత్తదనంతో పాటు పాన్-ఇండియా అప్పీల్ వస్తుందని భావించి మేకర్స్ ఆయన వైపు మొగ్గు చూపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సామ్ సీయస్ సంగీతం అందిస్తున్నాడు

Dupalapudi: మానవత్వం చాటుకున్న నటుడు రామ్ పోతినేని! Dupalapudi: అరుదైన జన్యులోప వ్యాధితో మంచం పట్టిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన 18 ఏళ్ల బాలిక శశి భవ్యత పట్ల సినీ నటుడు రామ్ పోతినేని మానవత్వం చాటారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో, మీడియా ఛానలలో, పత్రికలలో ఆమె పరిస్థితి వైరల్ కావడంతో స్పందించిన రామ్, స్వయంగా ఆమెతో వీడియో కాల్లో మాట్లాడి భరోసానిచ్చారు. తమ అభిమాన హీరోతో కూతురు మాట్లాడటంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రామ్ పోతినేని, ఆమెకు అవసరమైన మందులు, తిండి, ఇతర ఖర్చులు పూర్తిగా తనే భరిస్తానని మాటిచ్చారు. అలాగే ప్రముఖ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా ఇస్తూ, బాలికను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని, సరైన సమయానికి మందులు వాడాలని తల్లిదండ్రులకు సూచించారు. శశి భవ్యత దీనస్థితిని వెలుగులోకి తెచ్చి తమ దృష్టికి తీసుకువచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అభిమానులు, పాత్రికేయులకు రామ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, 'లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన శశి భవ్యతకు, రామ్ అందించిన ఈ భరోసా ఆ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని .ఇచ్చింది

Ram Pothineni : రామ్ పోతినేని ఇటీవల దర్శకుడిగా మారి తనే హీరోగా నటిస్తూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది. హీరోగా తన కెరీర్ ని గాడిలో పెట్టుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు రామ్ పోతినేని. అయితే తాజాగా రామ్ విలన్ గా నటిస్తున్నాడని, అది కూడా రజినీకాంత్ సినిమాలో అని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రజినీకాంత్ హీరోగా ధర్మాన్ అనే సినిమా తెరకెక్కుతుంది. కమల్ హాసన్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సిమ్రాన్, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే తమిళ మీడియా తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్ నెగిటివ్ షేడ్స్ లో విలన్ గా నటిస్తున్నాడని, అది కూడా రజినీకాంత్ కి అల్లుడి పాత్రలో కనిపిస్తాడని, రామ్-రాశిఖన్నా జంటగా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో టాలీవుడ్ లో కూడా ఈ వార్త చర్చగా మారింది. అసలు హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటున్న రామ్ రజినీకాంత్ సినిమాలో విలన్ గా చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారు. ఒకవేళ చేసినా రజినీకాంత్ పవర్, స్టైల్, స్టామినా ముందు రామ్ సరిపోతాడా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొన్నాళ్ళు ఎదురుచూడాల్సిందే

స్వయం కృషితో స్టార్ డమ్ సంపాదించాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో తన 23 వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వరుస పరాజయాల తర్వాత ఈసారి ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద తన జెండా పాతాలనే లక్ష్యంతో తెరకెక్కిస్తుండటంతో అభిమానులతో పాటు టాలీవుడ్ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సినిమా మేకింగ్ విషయంలో రామ్ ఎలాంటి రాజీ పడటం లేదు. ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన షెడ్యూల్లో ఏకంగా 24 గంటల పాటు విరామం లేకుండా నాన్‌స్టాప్‌గా కీలక సన్నివేశాలను చిత్రీకరించి ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యపరిచాడు. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం చిత్రీకరణకు చిన్న విరామం లభించింది. అయితే ఈ గ్యాప్‌లోనే చిత్ర యూనిట్ సినిమాలోని అత్యంత కీలకమైన విలన్ పాత్ర ఎంపికపై దృష్టి సారించింది. హీరో పాత్రకు సరిసమానమైన పవర్ ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ రోల్ కోసం మొదట కోలీవుడ్ వర్సటైల్ నటుడు ఎస్జే సూర్య పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన అడిగిన భారీ రెమ్యునరేషన్ కారణంగా మేకర్స్ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత బాలీవుడ్ దిగ్గజం జాకీ ష్రాఫ్ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. అయితే చివరికి ఈ పవర్ఫుల్ పాత్రకు బాలీవుడ్ ప్రముఖ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను తుది ఎంపిక చేసినట్లు సమాచారం. రితేష్ దేశ్‌ముఖ్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కి జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ సర్ప్రైజింగ్ కాస్టింగ్ వెనుక ఒక ఆసక్తికరమైన స్నేహ బంధం ఉందనే వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ పోతినేని, కథానాయకి జెనీలియా డిసౌజా మధ్య 'రెడీ' సినిమా సమయం నుంచే మంచి స్నేహం ఉంది. జెనీలియా భర్త అయిన రితేష్ దేశ్ముఖ్తో కూడా రామ్‌కు మంచి ఆత్మీయ అనుబంధం ఉంది. ఆ ఆత్మీయత, ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ వల్లే రితేష్ ఈ టాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్

సినీ హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ప్రాణం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు. సినీ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) అంటే ఆమెకు ప్రాణం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు. ఒకప్పుడు ఎంతో చురుగ్గా ఉంటూ చదువుల్లో ముందున్న ఆ అమ్మాయిని.. నేడు ఓ అరుదైన జన్యు వ్యాధి మంచానికే పరిమితం చేసింది. కనీసం మాట్లాడలేని, గుర్తు పట్టలేని స్థితిలోనూ ఆ అభిమాన హీరో పేరు వింటే మాత్రం ఆమె కళ్లల్లో మెరుపు కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశి భవ్యత (Shashi Bhavyata). వయసు పద్దెనిమిదేళ్లు. అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. చక్కటి ప్రతిభ కనబరుస్తూ కుటుంబానికి వెలుగుగా నిలుస్తుందనుకున్న కూతురి జీవితంలో 2022 నుంచి ఊహించని కష్టం మొదలైంది. మూడు తరాలుగా కుటుంబంలో జరుగుతున్న మేనరికపు వివాహాల కారణంగా శశి భవ్యత అరుదైన జన్యుపరమైన సమస్య బారిన పడింది. 2022లో మొదలైన ఫిట్స్ సమస్య క్రమంగా తీవ్రరూపం దాల్చింది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో మతిస్థిమితం కోల్పోయి పూర్తిగా మంచానికే పరిమితమైంది. పెద్ద ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక, దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఆమెను రాజమహేంద్రవరం జీజీహెచ్ (Rajamahendravaram GGH) లో చేర్పించారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయినా, తన అభిమాన హీరో రామ్ పాటలు వింటూ ఆ బాధను తట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ యువతి. సరైన వైద్యం అందితే తమ బిడ్డ మళ్లీ మామూలు మనిషి అవుతుందన్న ఆశతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం, ప్రభుత్వం అందించే తోడ్పాటు కోసం ఎదురు చూస్తున్నారు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన సొంత దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రాపో23. గత కొన్నేళ్లుగా రామ్ కి సరైన హిట్ దక్కలేదు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) తన సొంత దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రాపో23. గత కొన్నేళ్లుగా రామ్ కి సరైన హిట్ దక్కలేదు. దీంతో వరుస పరాజయాల తర్వాత ఈసారి ఎలాగైనా సరే తిరుగులేని విజయాన్ని సాధించాలనే బలమైన సంకల్పంతో రామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ సరసన నివేథా పేతురాజ్ నటిస్తోంది. మొదటి సినిమా.. భారీ బడ్జెట్ ని వాడకుండా చాలా తక్కువ బడ్జెట్ లో రామ్ ఈ సినిమాను ఘాట్ చేస్తున్నాడు. అంతేకాకుండా చాలా కసితో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాడు. ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన షెడ్యూల్లో ఏకంగా 24 గంటల పాటు విరామం లేకుండా నాన్‌స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రామ్ మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో కనిపించనున్నాడు ఇక ఈ చిత్రంలో హీరోకి సరిసమానమైన ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం ముందుగా ఎస్జే సూర్యను తీసుకున్నారని టాక్ నడిచింది. కానీ, ఆయన భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్ల బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ ని తీసుకున్నారని కూడా పుకార్లు వచ్చాయి. ఇక ఇప్పుడు జాకీష్రాఫ్ ని కూడా మార్చినట్లు సమాచారం. వారిద్దరి స్థానంలో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది.ఇక రితేష్ పేరు రావడంతో ఈ కాంబినేషన్‌కు సరికొత్త లుక్ వచ్చింది. రామ్- జెనీలియా ఎంత మంచి స్నేహితులో అందరికీ తెల్సిందే. జెనీలియా భర్తనే రితేష్. వీరు ముగ్గురు కలిసి ఎన్నోసార్లు పార్టీలు చేసుకున్నారు. ఆ స్నేహంతో రితేష్ .. ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి చాలామంది స్టార్ హీరోలు టాలీవుడ్

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన తాజా చిత్రం 'రాపో 23' కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఆయన ఏకంగా 24 గంటల పాటు నిరంతరాయంగా షూటింగ్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో, సెట్లో ఆయన పర్యవేక్షణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా ప్రకటన రామ్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన విషయం తెలిసిందే. పొండిచ్చేరి శివార్లలో దాదాపు 9 రోజుల పాటు సాగే షెడ్యూల్లో భాగంగా భారీ సెట్టింగ్ వేశారు. ఇందులో రామ్ 'వీర' అనే కీలక పాత్రలో నటిస్తూనే, సినిమాను పూర్తిస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రామ్, ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తూ అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. అయితే, అనుకోకుండా కురిసిన భారీ వర్షాలు షూటింగ్‌కు ఆటంకం కలిగించాయి. దీంతో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేసి, చిత్ర బృందం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. వాతావరణం అనుకూలించాక, మళ్ళీ పొండిచ్చేరి చేరుకుని మిగిలిన సన్నివేశాలను అదే సెట్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా, రామ్ పోతినేని తీసుకున్న ఈ నిర్ణయాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ షెడ్యూల్లో బృందా కొరియోగ్రఫీలో ఒక ప్రత్యేక పాటను కూడా చిత్రీకరించనున్నారు. విక్రమ్ మోర్ మరియు పీటర్ హెయిన్ పర్యవేక్షణలో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో, 'రాపో 23' ఒక నియో-నోయిర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోందని సమాచారం. కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి థిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏ. ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, సినిమా ప్రపంచాన్ని వాస్తవికతకు దగ్గరగా తీర్చిదిద్దుతున్నారు. రామ్ పోతినేని నటన మరియు దర్శకత్వ ప్రతిభకు ఇది ఒక పరీక్షగా నిలుస్తోంది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘RaPo23’ కోసం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవల పుదుచ్చేరి శివార్లలో రామ్ ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా షూట్ చేశారు. విశేషం ఏమిటంటే రామ్ కేవలం డైరెక్టర్‌గా కెమెరా వెనుక ఉండటమే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నారు. పుదుచ్చేరిలో ఈ సినిమా కోసం భారీ సెటప్ వేశారు. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్లో రామ్ నటుడిగా తనపై ఉన్న బాధ్యతతో పాటు, దర్శకుడిగా సినిమా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘RaPo23’ ప్రస్తుతం అందరిలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అనూహ్యంగా కురిసిన వర్షాల కారణంగా పుదుచ్చేరి షెడ్యూల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడటంతో యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. మిగిలిన షూటింగ్‌ను అదే భారీ సెటప్‌లో పూర్తి చేసేందుకు త్వరలోనే టీమ్ మళ్లీ పుదుచ్చేరి వెళ్లనుంది. హీరోగా, దర్శకుడిగా ఒకేసారి రెండు బాధ్యతలు తీసుకున్న రామ్.. ఇంత కఠినమైన షూటింగ్ షెడ్యూల్స్‌లోనూ డెడికేషన్ తో పని చేస్తున్న తీరు ‘RaPo23’పై ఆసక్తిని మరింత పెంచుతోంది. కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. డార్క్, ఇంట్రెస్టింగ్ నియో-నోయిర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు (తిర్రు) కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్ పార్ట్‌ను విక్రమ్ మోర్, పీటర్ హెయిన్ కలిసి హ్యాండిల్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ సినిమా కథకు, భారీ స్కేల్‌కు తగ్గట్టుగా ప్రత్యేకమైన సెట్స్‌ను రూపొందిస్తున్నారు. సినిమా కాస్ట్, క్యారెక్టర్స్, తదుపరి షెడ్యూల్స్కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ రాబోయే రోజుల్లో వెల్లడించనున్నారు

హీరో అంటే కెమెరా ముందు.. డైరెక్టర్ అంటే కెమెరా వెనుక కానీ ఇప్పుడు ఆ రూల్‌నే మార్చేస్తున్నారు కొందరు హీరోలు, దర్శకులు. అసలు ఇది క్రియేటివ్ ప్యాషనా.. లేక తమ కెరీర్లో వచ్చిన ఫ్లాప్స్, ఇమేజ్ ప్రెజర్ నుంచి బయటపడేందుకు కొత్త రూట్ వెతుక్కోవడమా. హీరోగా హిట్ కొట్టలేకపోతే డైరెక్టర్‌గా మారడం, డైరెక్టర్‌గా గ్యాప్ వస్తే హీరోగా మారడం, ఇది ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. విక్రమ్, లియో, కూలీ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘DC’లో గ్యాంగ్‌స్టర్ గా కనిపించాడు. ఈ ఛేంజ్ ఓవర్, తన కెరీర్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో తెలియదు కానీ, మొదటి సినిమాతో హీరోగా సూపర్ హిట్ కొట్టాడు లోకేష్. ఇక విశాల్ ‘మకుటం’తో హీరోగానే కాదు, డైరెక్టర్‌గానూ మారాడు. సినిమాలో త్రీ రోల్స్ మధ్య వేరియేషన్ మెయింటైన్ చేస్తూనే, దర్శకుడిగా మారడం పెద్ద రిస్కే చేశాడు విశాల్.. ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఇప్పుడు డైరెక్షన్ వైపు ఫోకస్ పెట్టాడు. హీరోగా తనకు సరైన కథ దొరకడం లేదా? లేక తనే కథ చెప్పాలని అనుకుంటున్నాడో కానీ, డైరెక్టర్‌గా మారాడు..‘ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.. అందుకే తానే కథ రాసుకుని, తన డైరెక్షన్లోనే హీరోగా నటించడం సేఫ్ అని రామ్ భావించాడేమో.. అందుకే ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు కూడా.ఇక కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా మారుతున్నాడు. అలాగే తరుణ్ భాస్కర్... డైరెక్టర్‌గా ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ చేసిన తర్వాత హీరోగానూ నటిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అన్నీ మనమే చేద్దాం” అనే ఫేజ్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. హీరోగా ఉండటం ఒక జాబ్.. డైరెక్టర్‌గా ఉండటం మరో జాబ్. రెండింటినీ

టాలీవుడ్ హీరోలు కొందరు నిర్మాతలుగానూ అలరించే ప్రయత్నంలో ఉన్నారు. తామే నటిస్తూ కొన్ని- ఇతర హీరోలతో మరికొన్ని సినిమాలు నిర్మిస్తూ సాగుతున్నారు. మరి వీరిలో సక్సెస్ రూటులో పయనిస్తున్నవారు ఎందరు!? ఇప్పటి హీరోల్లో కొందరు నటనలో కొనసాగుతూనే నిర్మాతలుగానూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ రూటులో సాగినవారెందరో ఉన్నారు. నవతరం కథానాయకుల్లో రామ్ పోతినేని, మంచు మనోజ్ వంటివారు చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 'రాపో సినిమాటిక్స్' పతాకంపై తన సోదరుడు పోతినేని కృష్ణ నిర్మాతగా రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక మంచు మనోజ్ 'ఎమ్.ఎమ్.ఆర్ట్స్' పతాకంపై ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇతరులకు అవకాశాలు కల్పించే పనిలో ఉన్నారు. వీరిద్దరూ ప్రొడ్యూసర్స్ గా 'ఆన్ ద వే'లోనే ఉన్నారు. వీరి సినిమాలు జనం ముందుకు వచ్చాకే వారి అభిరుచి ఏ పాటిదో తెలుస్తుంది. ఇంతకు ముందు నితిన్, విజయ్ దేవరకొండ, అల్లరి నరేశ్, సుధీర్ బాబు వంటివారు కూడా నిర్మాతలుగా మారారు. అఖిల్ హీరోగా నితిన్ 'అఖిల్' సినిమా నిర్మించారు. 'మీకు మాత్రమేచెబుతా' అనే చిత్రంతో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారారు. ఈ ఇద్దరు హీరోలు ఇతరులతో చిత్రాలు నిర్మించేసి తరువాత నిర్మాణం వైపు చూడలేదు. అల్లరి నరేశ్ 'బందిపోటు', సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' సినిమాల్లో హీరోలుగా నటిస్తూనే నిర్మించారు. మళ్ళీ చిత్ర నిర్మాణంవైపు వీరు కూడా చూడకపోవడం గమనార్హం. కిరణ్ అబ్బవరం ఇతరులతో 'తిమ్మరాజు పల్లి టీవీ' నిర్మించారు. తాను హీరోగా నటిస్తూ- దర్శకత్వం వహిస్తూ కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం బహుముఖ ప్రజ్ఞ బయల్పడనుంది. అసలు పేరున్న హీరోలు సినిమాలు నిర్మించడమన్నది ఇప్పట్లోనే ఏదో మొదలయిందని ఈ తరం ప్రేక్షకులు భావించవచ్చు. కానీ, తెలుగు సినిమాలో తొలి స్టార్ హీరోగా నిలచిన మహానటుడు చిత్తూరు వి.నాగయ్యనే నిర్మాత, దర్శకునిగా సినిమాలు నిర్మించి ఆకట్టుకున్నారు. ఆయన