
Post Office: కేవలం ఏడాదికి రూ.555 చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
Post Office: కేవలం ఏడాదికి రూ.555 చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
© 2026 nimisham.in

Post Office: కేవలం ఏడాదికి రూ.555 చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!

మన దేశంలో 'పోస్టాఫీసు' అనగానే మైండ్ లోకి ఒక పాత భవనం, ఎర్రటి పోస్ట్‌బాక్స్, లేఖలను సార్ట్ చేసే ఉద్యోగులు గుర్తుకొస్తారు. కానీ, చుట్టూ నీళ్ళు, వెనక మంచు కొండల నడుమ హౌస్‌బోట్‌లో నీటిపై తేలియాడే పోస్టాఫీసును ఎప్పుడైనా చూశారా? ఇది ఏదో సినిమా దృశ్యం లేదా ఊహాజనిత కథ కాదు! జమ్మూకశ్మీర్‌లోని ప్రసిద్ధ శ్రీనగర్ డల్ లేక్‌పై నిజంగానే ఒక 'ఫ్లోటింగ్ పోస్టాఫీస్' (Floating Post Office) అందుబాటులో ఉంది. ఇప్పటికీ సజావుగా పనిచేస్తూ పర్యాటకులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పోస్టాఫీసు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటో చూద్దాం: శ్రీనగర్‌లోని ప్రసిద్ధ డల్ లేక్, నెహ్రూ పార్క్ సమీపంలో ఈ వినూత్న పోస్టాఫీస్ ఉంది. బయటి నుంచి చూస్తే ఇది కాశ్మీర్లో కనిపించే ఒక సాధారణ సంప్రదాయ హౌస్బోట్లాగే కనిపిస్తుంది. కానీ, కాస్త దగ్గరగా వెళితే మన 'ఇండియా పోస్ట్' (India Post) పేరు, లోగోలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కేవలం పర్యాటకులు వచ్చి ఫొటోలు దిగడానికి పెట్టిన షోపీస్ అనుకుంటే పొరపాటే. సాధారణ పోస్టాఫీసులాగే ఇక్కడ కూడా ఉత్తరాలు, పార్సిళ్లు, పోస్టుకార్డులు పంపవచ్చు. డల్ లేక్ చుట్టూ ఉండే బోట్ నిర్వాహకులు, వ్యాపారులు, స్థానికులు, పర్యాటకులు రోజూ ఈ సేవలను వాడుకుంటారు. ప్రత్యేక ముద్ర (Special Stamp): ఇక్కడి నుండి పంపే ప్రతీ పోస్టుకార్డుపై డల్ లేక్ ,షికారా పడవ చిత్రం ఉన్న ప్రత్యేకమైన పోస్టల్ క్యాన్సిలేషన్ స్టాంప్ వేస్తారు. అందుకే పర్యాటకులు కాశ్మీర్ జ్ఞాపకార్థం తమ ప్రియమైన వారికి ఇక్కడి నుంచే ఉత్తరాలు రాస్తుంటారు. ఈ పోస్టాఫీసు సిబ్బంది ప్రతిరోజూ సేకరణ చేసిన పోస్టులను సేకరించి శ్రీనగర్‌లోని ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు. అక్కడ నుంచి అవి ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. అవసరమైతే ఇండియా పోస్ట్ సిబ్బంది స్వయంగా 'షికారా' పడవల్లో వెళ్ళి నీటిపై ఉండే హౌస్బోట్లలోని వారికి ఉత్తరాలను డెలివరీ చేస్తారు. చాలామంది ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ 2011లోనే

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. గోల్కొండ క్రాస్‌రోడ్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, తాళ్లబస్తీ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పోస్టాఫీస్ పరిధిలో మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఏడీఈలు కోరారు. కేపీహెచ్‌బీ కాలనీ: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో జలమండలి పనుల నేపథ్యంలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కేపీహెచ్‌బీ లోధా అపార్ట్మెంట్స్, ఇందూ అపార్ట్మెంట్స్, బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్, ఫిష్ మార్కెట్, ఎన్ఎస్ఎల్ మాల్, డీమార్ట్ ఏరియా, ఐదోఫేజ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు

Post Office: సురక్షితమైన పెట్టుబడి, అద్భుతమైన రాబడుల విషయానికి వస్తే పోస్ట్ ఆఫీస్ ద్వారా నిర్వహించే ప్రభుత్వ పథకాలు ప్రజలలో ఎల్లప్పుడూ చాలా ప్రజాదరణ పొందాయి. ఈ చిన్న పొదుపు పథకాలలో ప్రతిరోజూ చిన్న మొత్తాలను ఆదా చేయడం ద్వారా పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు. అటువంటి పోస్ట్ ఆఫీస్ పథకాలలో ఒకటి 'పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్' (పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్). దీనిలో మీరు ప్రతిరోజూ కేవలం రూ.195 ఆదా చేయడం ద్వారా రూ.10 లక్షల భారీ మొత్తాన్ని జమ చేయవచ్చు. జీరో రిస్క్ సురక్షిత ప్రభుత్వ పథకం: పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల అతిపెద్ద లక్షణం ఏమిటంటే అవి పూర్తిగా రిస్క్-రహితమైనవి. ఈ పథకాలలో మీ పెట్టుబడికి భారత ప్రభుత్వమే 100% భద్రతకు హామీ ఇస్తుంది. అంటే పెట్టుబడిదారుడు ఎలాంటి ఆందోళన లేకుండా వాటిలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కాకుండా ఈ పథకాలు అనేక బ్యాంకుల FDల కంటే ఎక్కువ ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తాయి. చిన్న పొదుపు, పెద్ద ప్రయోజనాలు: పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో మీరు ఒకేసారి పెద్ద మొత్తాన్ని జమ చేయనవసరం లేదు. కానీ ప్రతి నెలా చిన్న మొత్తాన్ని జమ చేయడం ద్వారా పెద్ద లాభాలను పొందవచ్చు. ఈ పథకం మ్యూచువల్ ఫండ్ SIP లాగే పనిచేస్తుంది. కేవలం రూ.100తో ఖాతా తెరిచి మీరు ఇందులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. RD పథకంపై ఇస్తున్న వడ్డీ ఇది: ప్రభుత్వం ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంపై 6.7% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకంలో కనీసం రూ.100తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అయితే గరిష్ట పెట్టుబడికి ఎటువంటి ఎగువ పరిమితి లేదు. ఖాతా తెరిచేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి: పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో, వ్యక్తిగత ఖాతాతో పాటు భార్యాభర్తలతో ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. కానీ

పోస్టాఫీస్ అనేక పొదుపు పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని పథకాలు ఉండగా.. కొత్తగా మరికొన్ని స్కీమ్స్ కూడా తీసుకొస్తుంది. వీటి ద్వారా అధిక వడ్డీతో పాటు ప్రతీ నెలా ఇన్కమ్ పొందవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రతీ నెలా మీ అవసరాల కోసం డబ్బులు పొందవచ్చు. అందులో పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి. ఈ స్కీములో ఒకసారి పెట్టుబడి పెడితే.. ప్రతీ నెలా మీ అకౌంట్లో వడ్డీ జమ అవుతుంది. మీరు ప్రతీ నెలా డబ్బులు జమ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి జమ చేస్తే.. వాటిపై ప్రతీ నెలా వడ్డీ అనేది అందుతుంది. ఒక్కసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే హాయిగా ప్రతీ నెలా మీ అకౌంట్లోకి డబ్బులు పొందవచ్చు. ప్రతీ నెలా ఆదాయం కావాలని కోరుకునేవారికి ఈ స్కీమ్ ఉపయోగకరంగా ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు గృహిణులు, స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుందనేది చెప్పవచ్చు. అందుకే ఈ స్కీములో ఎక్కువమంది చేరుతున్నారు. కేవలం రూ.వెయ్యితో పెట్టుబడి మొదలుపెట్టవచ్చు. సింగిల్ అకౌంట్లో గరిష్టంగా రూ.9 లక్షలు జమ చేసే అవకాశముండగా.. జాయింట్ అకౌంట్లో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్లో ముగ్గురు సభ్యులు చేరవచ్చు. ముగ్గురు కలిసి ఖాతాను నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. మీరు రూ.9 లక్షలు ఒకేసారి జమ చేస్తే.. ప్రతీ నెలా రూ.5,550 అందుతుంది. ఇక ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడితో పాటు వడ్డీ మొత్తం కలిపి ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరాలంటే పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి

పోస్టాఫీస్ అనేక పొదుపు పథకాలను తీసుకొచ్చింది. వాటిల్లో ఒకటి కిసాన్ వికాస్ పత్ర ఒకటి. దీనిని పోస్టాఫీస్ కేవీపీగా పిలుస్తారు. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బులు సురక్షితంగా ఉండటంతో పాటు మీ నగదుకు కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. దీంతో మీ డబ్బులు పూర్తి భద్రంగా ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాకుండా మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకంలో పొందవచ్చు. ఈ పథకంలో కేవలం రూ.వెయ్యి నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతవరకు అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితిపై ఎలాంటి నిబంధనలు లేవు. ఈ పథకంలో చేరాలంటే వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. మీ సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.5 శాతం ఉంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఈ పథకం ఎక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు. 2 సంవత్సరాల 6 నెలల తర్వాత మీకు అవసరమైతే నిధులును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడిన పెడితే 9 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. మీరు ఉదాహరణకు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 115 నెలల్లో రూ.10 లక్షలు అవుతుంది. ఇక రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే అది రూ.20 లక్షలు అవుతుంది. ఇది స్టాక్ మార్కెట్‌తో లింక్ అయి ఉండడు. అసలు స్టాక్ మార్కెట్ల అంచనాలతో ప్రభావితం అవ్వదు. దీంతో మీరు ఎలాంటి రిస్క్ లేకుండా మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడనివారికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు. పోస్టాఫీసులో బాగా పాపులర్ అయిన పథకాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు. దీంతో చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉండటంతో డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి మార్గంగా చెప్పవచ్చు. ఆధార్, పాన్ సమర్పించి ఈ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది
చిన్నారుల్లో చాలా మందికి వివిధ రకాల అభిరుచులు ఉంటాయి. కొంతమందికి క్రికెట్ ఆడటం ఇష్టమైతే.. మరికొందరికి పాటల పాడటంపై ఆసక్తి ఉంటుంది. ఇంకొందరికి డిఫరెంట్ కలెక్షన్స్ సేకరించడం అంటే ఆసక్తి ఉండొచ్చు. ఉదాహరణకు కరెన్సీ నోట్లు, నాణేలు.. అలాగే పోస్టల్ స్టాంపులు. అయితే అలాంటి అభిరుచే ఇప్పుడు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుకునే అవకాశం కల్పిస్తోంది. పోస్టల్ స్టాంపులు (తపాలా బిళ్లలు) వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు తపాలా శాఖ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే దీన్ దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించే పోటీ నిర్వహిస్తున్నారు.అర్హతలు ఇవే.. 2026 -27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచి 9 వ తరగతి మధ్యన చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులు. అలాగే గత విద్యా సంవత్సరంలో 60 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇందులో నుంచి 5 శాతం మినహాయింపు ఉంటుంది. విద్యార్థులు చదువుతున్న స్కూలులో ఫిలాటెలి క్లబ్ ఉంటే అందులో సభ్యత్వం ఉండాలి. ఒకవేళ లేకపోతే పోస్టాఫీసులో అకౌంట్ తెరవాల్సి ఉంటుంది.విద్యార్థులు సేకరించిన వివిధ రకాల పోస్టల్ స్టాంపులను ఒక లేఖకు జత చేసి, దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన వారికి సెప్టెంబర్ 30వ తేదీన రాత పరీక్ష, క్విజ్ నిర్వహిస్తారు. మరోవైపు ప్రతీ పోస్టాఫీస్ పరిధిలో 40 మంది విద్యార్థులను స్కాలర్ షిప్ కోసం ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తారు. ఇక జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన వారికి రూ.50 వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు, ముూడో స్థానం సాధించిన వారికి రూ.10 వేలు అందిస్తారు. అలాగే సర్కిల్ స్థాయిలోనూ విజేతలను ఎంపిక చేసి పారితోషకం అందిస్తారు.గడువు ఎప్పటి

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత ప్రతి నెలా వడ్డీ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మళ్లీ మళ్లీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు, స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకంలో కనీసం రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. ఒక వ్యక్తి పేరుతో తెరిచే సింగిల్ అకౌంట్లో గరిష్ఠంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్లో గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. జాయింట్ అకౌంట్లో ముగ్గురు వరకు సభ్యులుగా ఉండొచ్చు. ఒకవేళ మీరు రూ.9 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే, ప్రస్తుతం ఉన్న 7.4 శాతం వార్షిక వడ్డీ ప్రకారం ప్రతి నెలా రూ.5,550 వడ్డీగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ ఆదాయాన్ని మీ అవసరాలకు వినియోగించుకోవచ్చు లేదా అలాగే ఖాతాలో ఉంచుకోవచ్చు. MIS పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ కాలం పూర్తయ్యాక మీరు పెట్టిన అసలు పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందుతారు. అంటే ఐదేళ్ల పాటు ప్రతి నెలా వడ్డీ పొందడంతో పాటు, మెచ్యూరిటీ సమయంలో పూర్తి పెట్టుబడి కూడా సురక్షితంగా తిరిగి వస్తుంది. అయితే ఈ పథకంలో చేరాలంటే ముందుగా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి
SSY Calculator: ఆడ పిల్లల భవిష్యత్తు, ఉన్నత చదువులు, వివాహ ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యతం ప్రజాదరణ పొందిన పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana). ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోలిస్తే ఇందులో ప్రభుత్వం అత్యధికంగా 8.20 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ పని చేస్తుంది. అంటే వడ్డీపైన వడ్డీ జనరేట్ అవుతూ పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇందులో నెలకు రూ.500, రూ.1000 చొప్పున పెట్టుబడి పెడితే ఎంతొస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం.సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల పాటు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. అది నెల నెలా, ఆరు నెలలు, ఏడాది చొప్పున మనకు నచ్చినట్లుగా జమ చేయవచ్చు. కనీసం ఏడాదికి ఒకసారి రూ.250 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తర్వాత మొత్తం నిధి మెచ్యూరిటీకి వస్తుంది. 10 సంవత్సరాల లోపు ఆడ పిల్లల పేరుపై ఈ ఖాతా తెరవవచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో అకౌంట్ తీసుకోవచ్చు.నెలకు రూ.500 జమ చేస్తే ఎంతొస్తుంది?5 ఏళ్ల వయసు ఉన్న మీ పాప పేరుపై మీరు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచారు అనుకుందాం. అంటే ఆమెకు 26 ఏళ్ల వయసు వచ్చాక అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. అయితే, 18 ఏళ్ల తర్వాత ఉన్నత చదువులకు, 21 ఏళ్ల తర్వాత పెళ్లి కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ.500 చొప్పున డిపాజిట్ చేశారు అనుకుందాం. వార్షిక పెట్టుబడి రూ.6000 అవుతుంది. 15 సంవత్సరాల్లో మీరు మొత్తం రూ.90 వేలు పెట్టుబడి పెడతారు. దీనిపై ప్రస్తుతం ఇస్తోన్న 8.20 శాతం వడ్డీ ప్రకారం రూ.1,87,103 వరకు వడ్డీ వస్తుంది. అంటే 21 ఏళ్ల తర్వాత చేతికి రూ.2,77,103 వరకు వస్తాయి.నెలకు రూ.1000
PPF Interest Rate : లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్ల గురించి ఆలోచిస్తుంటారు. ఇది మంచిదే. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఆశించొచ్చు. అయితే ఇక్కడ రిస్క్ ఉంటుంది. అదే రిస్క్ లేకుండా దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసం మనం చాలానే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వీటిల్లో పీపీఎఫ్ అనే పోస్టాఫీస్ స్కీమ్‌కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. 1986లో దీనిని ప్రారంభించగా వడ్డీ రేట్లు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ మెచ్యూరిటీకి మాత్రం సంపద పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది. ఇక్కడ కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల అద్భుత రిటర్న్స్ వస్తుంటాయి. చాలా చిన్న మొత్తాల్లోనే ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు. ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. ఇంకా ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే పెట్టుబడి సహా వడ్డీ, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు.ఇందులో మెచ్యూరిటీకి వచ్చే డబ్బును పెళ్లి కోసమో, పిల్లల పైచదువుల కోసమో, ఇల్లు కొనుగోలు చేయడం వంటి కలల్ని సాకారం చేసుకోవడం లేదా రిటైర్మెంట్ ప్లానింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ అకౌంట్ ఈజీగా తెరవొచ్చు. ఒక అప్లికేషన్ ఫారం నింపి, ఫొటో ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైన కేవైసీ డాక్యుమెంట్స్ కూడా ఇస్తే సరిపోతుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియెన్స్ ఖాతా ఓపెన్ చేయొచ్చు.ప్రస్తుతం వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 7.10 శాతంగా ఉంది. వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. అయితే చాలా కాలంగా వడ్డీ రేట్లను మార్చట్లేదు. ఈ స్కీంలో కనీసం వార్షికంగా రూ. 500 నుంచే పెట్టుబడులు ప్రారంభించొచ్చు. గరిష్ఠంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. దీనిని ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా గరిష్ఠంగా 12 ఇన్స్టాల్మెంట్లలో చెల్లించొచ్చు. ఇక వరుసగా కనీసం 15 ఏళ్లు ఇందులో డబ్బుల్ని డిపాజిట్