
నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది
కలలో సాధారణంగా పాము అనగానే చాలామంది తీవ్ర భయానికి గురవుతారు. అయితే, సనాతన ధర్మం, స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నాగుపాము కనిపించడం అనేది ఒక అత్యంత శక్తివంతమైన సంకేతం. పాము కనిపించింది కదా అని అది ఎల్లప్పుడూ అశుభం అని అనుకోవడానికి లేదు. అది కనిపిస్తున్న తీరు, రంగు, దాని పరిస్థితిని బట్టి శుభ, అశుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అసలు నాగుపాము కలలు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయంలో నాగుపామును పవిత్రంగా భావిస్తారు. పెళ్లయిన దంపతులకు కలలో నాగుపాము కనిపిస్తే త్వరలోనే కొత్తగా సంతాన యోగం కలగబోతోందని నమ్ముతారు. అలాగే నాగుపాము పడగ విప్పి నిలబడినట్లు లేదా ఏదైనా నిధిపై కూర్చున్నట్లు కనిపిస్తే లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ లభిస్తాయని అర్థం. దీనివల్ల బిజినెస్లో ఊహించని ప్రాఫిట్స్, అనుకోకుండా ఆస్తి కలిసిరావడం లేదా ధనలాభం కలుగుతుంది. శివుని మెడలో నాగాభరణం ఉంటుంది కాబట్టి, నాగుపాము కల రావడం శివానుగ్రహానికి ప్రతీక. యోగ శాస్త్రం ప్రకారం వెన్నుపాము దిగువన ఉండే 'కుండలిని శక్తి'కి నాగుపాము ఒక సింబల్. ఈ కల రావడం వల్ల మీలో కాన్ఫిడెన్స్, ఇన్నర్ ఎనర్జీ పెరుగుతాయి. ఒకవేళ పామును మీరు చంపినట్లు లేదా అది మీ భయంతో పారిపోతున్నట్లు కనిపిస్తే, త్వరలోనే శత్రువులపై విజయం సాధిస్తారని అర్థం. కొన్ని సందర్భాల్లో నాగుపాము కలలు రాబోయే డేంజర్ లేదా ప్రెజర్ గురించి అలర్ట్ చేస్తాయి. నాగుపాము పదే పదే కలలోకి వస్తున్నా, లేదా మిమ్మల్ని బాగా వెంటాడుతున్నా జాతకంలో నాగదోషం లేదా కాళసర్ప దోషం ఉందనడానికి అది ఒక వార్నింగ్. కలలో పాము మిమ్మల్ని కరిచినట్లు అనిపిస్తే ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లెమ్స్ రావచ్చు లేదా తీవ్రమైన మెంటల్ స్ట్రెస్, గొడవలు ఎదురుకావచ్చు. అయితే కొన్ని వ్యాఖ్యానాల్లో పాము కాటు వేస్తే పాత రోగాలు నయమై దీర్ఘాయుష్షు లభిస్తుందని కూడా అంటారు. ఒకవేళ చనిపోయిన నాగుపాము కనిపిస్తే పెద్ద