
Nagarjuna - DSP: హ్యాట్రిక్ ఇచ్చిన డిసెంబర్ మాసం...
Nagarjuna - DSP: హ్యాట్రిక్ ఇచ్చిన డిసెంబర్ మాసం...
© 2026 nimisham.in

Nagarjuna - DSP: హ్యాట్రిక్ ఇచ్చిన డిసెంబర్ మాసం...

Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?

మీరు కూడా బిగ్ బాస్ డే 1 ప్రోమో చూసేయండి.. (Bigg Boss Telugu 10 Day 1 Promo)

ఇటీవల థియేటర్లకు వచ్చిన అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన ప్రముఖ బ్యానర్ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ (Palla Burusu) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రల్లో నటించగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో స్థిరపడి తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి, తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తూ సాగే ఈ కథలో భావోద్వేగాలు అశించినంతగా బలంగా ఉండవు. కానీ శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అమెజాన్

తెలుగు సినిమా చరిత్రలో 90s టైమ్ అద్భుతమనే చెప్పాలి. అప్పుడే అదిరిపోయే సినిమాలెన్నో వచ్చాయి. ఎంటర్టైన్మెంగ్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ మూవీస్ సందడి చేశాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ‘హలో బ్రదర్’ కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ చిత్రం 1994 ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. నాగార్జున మాస్, క్లాస్ లుక్స్‌తో పాటు రమ్యకృష్ణ, సౌందర్యల గ్లామర్, రాజ్-కోటి సంగీతం ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. మిసెస్ అండ్ మిస్టర్ చక్రవర్తి (శరత్ బాబు, సంగీత) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. జన్మతః వీరిద్దరికీ ఒక విచిత్రమైన కనెక్షన్ (రిఫ్లెక్స్ యాక్షన్) ఉంటుంది. ఒకరికి నొప్పి కలిగితే మరొకరికి స్పందన రావడం, ఒకరు కదిలితే మరొకరు కూడా అదే పనిచేయడం వీరి ప్రత్యేకత. అయితే, విశ్వనాథ్ ఉద్యోగరీత్యా ఒక ప్రమాదకరమైన క్రిమినల్ మిట్రా (నెపోలియన్)ని అరెస్ట్ చేసే క్రమంలో, మిట్రా ఈ కవలలలో ఒకరిని ఎత్తుకెళ్లి ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఒక బాబు (దేవా) కూలిపనులు చేసుకునేవారికి దొరుకుతాడు. వారికి అప్పటికే ఓ ఆడపిల్ల కూడా ఉంటుంది. రోడ్డుపై రఫ్ అండ్ టఫ్ వాతావరణంలో దేవా (నాగార్జున) పెరిగి పెద్దవాడవుతాడు. మరో బాబు (రవి వర్మ) తన తల్లిదండ్రుల వద్దే పెరిగి విదేశాలలో చదువుకుని పెద్ద మ్యూజిషియన్‌గా ఇండియాకు తిరిగివస్తాడు. దేవా స్థానిక రౌడీలతో గొడవపడుతూ మాస్ క్యారెక్టర్‌గా మారితే, రవి వర్మ అత్యంత సాఫ్ట్ అండ్ క్లాస్ కుర్రాడిగా ఉంటాడు. దేవాను చక్రవర్తి ఫ్రెండ్ (గిరిబాబు) కూతురు మంగ (రమ్యకృష్ణ) ప్రేమిస్తుంది. రవి వర్మను తన ఈవెంట్ మేనేజర్ అక్కమాంబ( అన్నపూర్ణమ్మ) కూతురు ఊహ (సౌందర్య) ప్రేమిస్తుంది. విధి వశాత్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే నగరంలో కలుసుకున్నప్పుడు వారి రిఫ్లెక్స్ చర్యల వల్ల ఎలాంటి అలజడి సృష్టింపబడింది?

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరో నాలుగు రోజుల్లో మొదలు కాబోతుంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే స్టార్స్ ఎవరు అని చర్చ జరుగుతుంది. ఇప్పటికే అగ్నిపరీక్షతో నాలుగు సామాన్యులను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక సెలబ్రిటీలలో సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ వెళ్తారని టాక్ నడుస్తుంది. తాజాగా మరో పేరు కూడా వినిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఫేమ్ తెచ్చుకున్న టెంపర్ వంశీ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి వెళ్తాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వంశీ అసలు పేరు అజయ్ అని సమాచారం. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు వంశీ. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో నెగిటివ్ రోల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా విలన్ గా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వంశీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. మరి బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఎదురు చూడాల్సిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వనుంది. మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ మొదలు అవ్వనుంది

కింగ్ నాగార్జున ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. నాగ్ మరోసారి ఒక స్పెషల్ రోల్ లో మెరవనున్నాడానే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కుబేర, కూలీ సినిమాలలో నాగ్ ప్రత్యేక పాత్రల్లో మెరిశాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలకు నాగార్జుననే ప్రధాన ఆకర్షణ. కానీ, నాగ్ కి మాత్రం ఈ సినిమాలు కలిసి రాలేదు. ముఖ్యంగా కూలీలో విలన్ గా ఆయన నటన బాగున్నా కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో నాగ్.. స్పెషల్ రోల్స్ కి దూరంగా ఉండడమే బెటర్ అని అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. రెండుసార్లు స్పెషల్ రోల్ చేసి దెబ్బ తిన్నా కూడా నాగ్.. మరోసారి అదే పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారట. ఆ పాత్రకు నాగ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి వినోత్.. కథ కూడా చెప్పాడట. తన పాత్రలోని ప్రాధాన్యత నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రత్యేక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక నాగార్జున ఎంట్రీతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. గతంలో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించిన నాగార్జున, ఇప్పుడు సూర్య నటించబోయే రాబోయే ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక పవర్ఫుల్ స్పెషల్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రంలో సూర్య, నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా, మాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారమే (సెప్టెంబర్ 06) బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్వహించిన ' అగ్ని పరీక్ష సీజన్ 2' కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ కాంటెస్ట్ లో సత్తా చాటిన పలువురు సామాన్యులు ఇప్పుడు నేరుగా బిగ్ బాస్ హౌస్ లోనే అదృష్టం పరీక్షించుకున్నారు. ఇక వీరిని ఎదుర్కొనేందుకు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా రెడీ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సోషల్ మీడియాలో అయితే చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ జబర్దస్త్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ ఇలా చాలా మంది పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ఒక లేడీ సెలబ్రిటీని హౌస్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ తెలుగు 10 టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందట. మరోవైపు ఆమె మాత్రం బిగ్ బాస్ లోకి వచ్చేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆమె ఎంత అడిగినా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ భార్య సతీమణి, ప్రముఖ సీరియల్ నటి తేజస్విని గౌడ. ప్రస్తుతం తేజస్విని గౌడ సీరియల్స్ , టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆమె తమిళంలో నటిస్తోన్న ‘ఆయాలి’ అనే సీరియల్ టీఆర్పీ

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో ‘బిగ్‌బాస్ తెలుగు’ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు టైటిల్ గెలిచిన విజేతలు ఎవరు? బిగ్‌బాస్ హౌస్‌లో 100 రోజులు గడిపిన తర్వాత వారి జీవితాలు, కెరీర్లు ఎలా మారాయి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఓసారి చూద్దాం. శివ బాలాజీ ‘బిగ్‌బాస్ తెలుగు’ తొలి సీజన్ విజేత శివ బాలాజీ. షోకు ముందు నుంచే సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. టైటిల్ గెలిచిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు. ‘సింధూరం’, ‘కాలింగ్ సహస్ర’ వంటి చిత్రాల్లో నటించిన శివ బాలాజీ.. ఇటీవల ‘కన్నప్ప’లోనూ కీలక పాత్రలో కనిపించారు. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ నటించిన ఆయన.. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. కౌశల్ మండా రెండో సీజన్ విజేత కౌశల్ మండా. బిగ్‌బాస్ హౌస్‌లో తన ఆటతీరుతో భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన సందడి కనిపించింది. అయితే టైటిల్ గెలిచిన తర్వాత ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదని కౌశల్ స్వయంగా వెల్లడించారు. సినిమాలు, టెలివిజన్‌లో కొనసాగుతూనే వ్యక్తిగత జీవితం, కుటుంబంపై కూడా దృష్టి సారించారు. ఇదీ చదవండి: ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్‌బాస్’.. ఎవరు ఎక్కడ హోస్ట్! రాహుల్ సిప్లిగంజ్: మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్. బిగ్‌బాస్ టైటిల్ తర్వాత ఆయన కెరీర్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటను పాడిన గాయకుల్లో రాహుల్ కూడా ఉన్నారు. ఈ పాటకు ఆస్కార్ రావడంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాగా ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో తనపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వార్తలు వచ్చిన సమయంలో రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ తన వాదనను వెల్లడించారు

ప్రముఖ సినీ నటి భానుప్రియ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై, తోటి నటులతో తన అనుబంధంపై, అలాగే తన సోదరి శాంతిప్రియ జీవితంలోని వ్యక్తిగత సంఘటనలపై గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో సుమన్, బాలకృష్ణ, దర్శకుడు వంశీలను ప్రస్తావించారు. హీరో సుమన్‌తో 14-15 సినిమాలు, బాలకృష్ణతో దాదాపు 8-10 సినిమాలలో కలిసి నటించినట్లు తెలిపారు. సుమన్‌ను నిశ్శబ్దంగా, అత్యంత మర్యాదగా ఉండే వ్యక్తిగా అభివర్ణించగా, బాలకృష్ణను చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉండే వ్యక్తిగా పేర్కొన్నారు. బాలకృష్ణతో ఎయిర్‌పోర్ట్‌లో అనుకోకుండా జరిగిన భేటీని గుర్తుచేసుకుంటూ, ఆయన ప్రేమగా పలకరించారని, ఇంటికి రావాలని ఫోన్ నంబర్ ఇచ్చారని చెప్పారు. సుమన్‌తో చివరిగా దమ్ము సినిమాలో నటించినట్లు పేర్కొన్నారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. దర్శకుడు వంశీ, తనకు సీతార, అన్వేషణ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చినట్లు భానుప్రియ తెలిపారు. వంశీతో తన పెళ్లి గురించి ఒకప్పుడు వదంతులు వచ్చాయని, అయితే అప్పటికే ఆయనకు వివాహం కావడంతో తన తల్లి ఆ సంబంధానికి అంగీకరించలేదని భానుప్రియ స్పష్టం చేశారు. అలాగే, నటుడు అక్కినేని నాగార్జునతో జతకట్టే అవకాశం తనకు రాలేదని భానుప్రియ తెలిపారు. అన్నమయ్య వంటి చిత్రాలలో ఇతర నటీనటులు నటించినప్పటికీ, తనకు ఆ అవకాశం దొరకలేదని, తన పెళ్లి చేసుకునే వయస్సుకి వచ్చే సమయానికి ఆ అవకాశం రాలేదని చెప్పారు. అయితే, తన సోదరి శాంతిప్రియ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్ని సినిమాలో నటించినట్లు గుర్తు చేసుకున్నారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ భానుప్రియ తన సోదరి శాంతిప్రియ గురించి కూడా వివరించారు. శాంతిప్రియ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారని, అక్కడే స్థిరపడ్డారని తెలిపారు. సహారా వన్ ఛానెల్లో ప్రసారమైన మాతా కీ చౌకీ అనే

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లలో కొందరు ఆటతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు తమ వ్యక్తిత్వం, గ్లామర్, సోషల్ మీడియా క్రేజ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌కు సంబంధించి వినిపిస్తున్న పేర్లలో వర్షిణి సౌందరరాజన్ పేరు మాత్రం ప్రత్యేకంగా వినిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ఎవరు హౌస్‌లోకి వెళ్లబోతున్నారనే ఆతృత ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. బిగ్‌బాస్ 10 తెలుగు సీజన్లో సినీ రంగానికి చెందినవారితో పాటు టెలివిజన్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కలగలిపిన కంటెస్టెంట్ల జాబితా ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పురుష కంటెస్టెంట్లలో కొంతమంది పేర్లు ప్రేక్షకులకు ముందే పరిచయం ఉన్నప్పటికీ, మహిళా కంటెస్టెంట్లలో వర్షిణి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రతి బిగ్‌బాస్ తెలుగు సీజన్లోనూ ప్రేక్షకుల కంట్లో ఎవరో ఒకరు పాపులర్ అవుతుంటారు. వారి ఆటతీరు మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, మాట్లాడే విధానం, స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ కూడా హౌస్‌లో వారి గుర్తింపును పెంచుతాయి. ఈసారి ఆ స్థానం వర్షిణికి దక్కవచ్చనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫేమ్ కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వర్షిణి సౌందరరాజన్ ఇప్పటికే సినీ, టెలివిజన్ రంగాల్లో ప్రేక్షకులకు పరిచయమైన ముఖమే. పలువురు ప్రముఖ హీరోలతో కలిసి సినిమాల్లో నటించిన ఆమెకు వెండితెర అనుభవం ఉంది. అయితే ఆమెకు మంచి గుర్తింపు తీసుకురావడంలో టెలివిజన్, సోషల్ మీడియా మరింత కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణిని దాదాపు 20 లక్షల మంది ఫాలో అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తన గ్లామరస్ సోషల్ మీడియా పోస్టులతో ఆమె డిజిటల్ ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆమె ప్రవేశిస్తే

తెలుగు బుల్లితెరపై అత్యంత జనాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ ఎడిషన్ సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు స్టార్ మా మరియు జియోహాట్‌స్టార్‌లో ప్రారంభం కానుంది. ఈసారి దశావతారం థీమ్‌తో షోను రూపొందించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలోనే తొలి వారంలో 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే హౌస్‌లోకి అడుగుపెడతారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ సీజన్ 10 ప్రత్యేకతల గురించి నాగార్జున విడుదల చేసిన ప్రోమోలో ఆటలో సవాలు కాదు ఆటే సవాలు అంటూ 10X సర్ప్రైజెస్ ఉంటాయని స్పష్టం చేశారు. సీజన్ 3 నుంచి విజయవంతంగా హోస్టింగ్ చేస్తున్న నాగార్జున, ఈసారి మరింత కొత్తదనంతో అలరించబోతున్నారు. రోజువారీ ఎపిసోడ్లు ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కానున్నాయని మీడియా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రచార చిత్రాలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో 10 మంది రూమర్డ్ కంటెస్టెంట్ల పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. టీవీ నటి చైత్ర రాయ్, యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, సినీ నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీతో పాటు జబర్దస్త్ నటులు నరేష్, ఆటో రామ్‌ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు అదిత్ అరుణ్, దేబ్జానీ మోదక్, యూట్యూబర్ సుధీర్ రెడ్డి హౌస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అయితే ఈ జాబితాపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలలో రామ్‌ప్రసాద్, నరేష్ కనిపించకపోవడంతో వీరు షోలోకి వెళ్లడం ఖాయమనే ఊహాగానాలు పెరిగాయి. ఫలితంగా నటి దేబ్జానీ మోదక్‌కు వారానికి 4 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు జియోహాట్‌స్టార్‌లో సామాన్యుల ఎంపిక కోసం అగ్నిపరీక్ష సీజన్

దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య తన కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘నేనున్నాను’ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, అంతగా తెలియని విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జున గారు సినిమా ఫస్ట్ హాఫ్ చూసి ‘డిసప్పాయింట్’ అయ్యారనే అపోహలను ఆయన ఈ సందర్భంగా తొలగించారు. వీ.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. నాగార్జున గారు ఎడిటింగ్ రూమ్‌లో ‘నేనున్నాను’ తొలి సగభాగాన్ని చూసి అసంతృప్తి చెందారనేది కేవలం ఒక రూమర్ మాత్రమే. నిజానికి, అప్పట్లో ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు, ‘ఏ శ్వాసలో’ పాటలో వాడటానికి కొన్ని క్లాసికల్ కీర్తనల పల్లవులను తాత్కాలికంగా పెట్టారట. అన్నపూర్ణ స్టూడియోస్ లో డబ్బింగ్ థియేటర్ బయట నుంచున్న నాగార్జున గారు, ప్రతిసారీ ఈ క్లాసికల్ పాటలే వినబడుతుండటంతో, "ఏంటోయ్ అండి, మనం ఏదో అల్లరి అల్లుడు లాంటి సినిమా అనుకుంటే శంకరాభరణం చేస్తున్నాడేంటి మీ డైరెక్టర్?" అని సరదాగా అడిగారట. ఇది కేవలం ఒక జోక్ మాత్రమే తప్ప, ఆయన నిరాశ చెందలేదని ఆదిత్య స్పష్టం చేశారు. నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ ‘నేనున్నాను’ చిత్రానికి ప్రాణమైన ‘ఏ శ్వాసలో పాట రూపకల్పనలో వీ.ఎన్.ఆదిత్య వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. తాను ఈ ఒక్క పాటకైనా డాన్స్ మాస్టర్‌ను లేకుండా తీస్తానని పట్టుబడ్డానని, నాగార్జున గారు డాన్స్ మాస్టర్‌ను పెట్టుకోవాలని ఒత్తిడి చేసినా, తాను తన నిర్ణయం మార్చుకోలేదని తెలిపారు. ఈ పాటను చూసిన నాగార్జున గారి బంధువు ఓ అబ్బాయి కన్నీళ్లు పెట్టుకుని, రాఘవేంద్రరావు గారు తీసినట్టుగా ఉందని ప్రశంసించారట. అది తనకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని ఆదిత్య గుర్తుచేసుకున్నారు. అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది సినిమా విడుదలైనప్పుడు ఎదురైన ప్రతికూల పరిస్థితులను వీ.ఎన్.ఆదిత్య వివరించారు. ‘నేనున్నాను’ తొలి రోజుల్లో విజయవాడ, హైదరాబాద్ వంటి చోట్ల

స్టార్ హీరోలు నటించే సినిమాలలో అభిమానులు అన్ని విషయాలు గమనిస్తుంటారు. హీరో లుక్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అభిమానులకు ఉంటుంది. వాళ్ళ అంచనాలకు తగ్గకుండా హీరో లుక్ ఉంటే అక్కడి నుంచే సినిమాపై క్రేజ్ మొదలవుతుంది. ఆ విధంగా హీరోల లుక్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ హీరోల లుక్స్ బావున్నప్పటికీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలూ ఉన్నాయి. పవన్, మహేష్, ఎన్టీఆర్, నాగార్జున లాంటి హీరోల లుక్స్ కి మంచి క్రేజ్ వచ్చింది కానీ ఆ సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ లుక్స్ లో పంజా మూవీ ముందు వరుసలో ఉంటుంది. అప్పటికి సరైన హిట్ లేక పవన్ అభిమానులు ఆకలి మీద ఉన్నారు. పంజాలో బియర్డ్ లుక్ బయటకి రాగానే ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అని అంతా భావించారు. కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా రిలీజ్ అభిమానుల ఆశలు ఆవిరి చేసింది. మహేష్ బాబు అందంగా కనిపించని సినిమా అంటూ ఉండదు. అయినప్పటికీ కొన్ని బెస్ట్ లుక్స్ ఉండే సినిమాలు ఉంటాయి. సర్కారు వారి పాట మూవీలో ఉబెర్ కూల్ లుక్ లో మహేష్ కనిపించారు. సినిమా నిరాశ పరిచింది. ఖలేజా కూడా అంతే. ఆ మూవీలో మహేష్ చాలా స్టైలిష్ గా ఉంటారు. కానీ సంబంధం లేని కామెడీ కారణంగా ఆ చిత్రం ఫ్లాప్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ని చాలా యంగ్ గా, స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సక్సెస్ అయ్యారు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. రామయ్య వస్తావయ్యాలో తారక్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో బన్నీ స్టైలిష్ లుక్స్ మైంటైన్

బుల్లితెర ఆడియెన్స్ ఎదురు చూస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. ఈసారి కూడా సెలబ్రిటీలకు కామన్ పీపుల్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ను నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్ కు సంబంధించిన వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ ఫైనలైజ్ చేస్తున్నారని సమాచారం. వీరిలో ఇప్పటికే కొందరు పేర్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్ల జాబితాలో టాలీవుడ్ కు చెందిన ఫేమస్ విలన్ కూడా ఉన్నారని సమచారం. అతను మరెవరో కాదు టెంపర్ వంశీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'టెంపర్'లో ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో కరుడుగట్టిన విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ. 'టెంపర్' తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడీ యాక్టర్. 'అత్తారింటికి దారేది', 'భరత్ అనే నేను', 'సాహో', 'భీష్మ', 'వకీల్ సాబ్', 'హిట్ 2', 'దేవర'.. ఇలా పలు హిట్ సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు వంశీ. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', రీసెంట్ గా వరుణ్ తేజ్ సినిమా 'కొరియన్ కనకరాజు'లోనూ వంశీ నటించాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వంశీ కన్ఫర్మ్ అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి సిల్వర్ స్క్రీన్ పై విలన్ గా చేసిన వ్యక్తి రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు? బిగ్ బాస్ లో ఎలా ఎంటర్ టైన్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇటీవల వరుసగా సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తోన్న లేటెస్ట్ సెన్సేషన్ ఛర్మిల కూడా బిగ్ బాస్ 10లోకి వస్తుందని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను యాంకరమ్మ ఖండించింది. కాగా

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 48ఏళ్లుగా హీరోగా రాణిస్తున్నారు. ఆయన `పునాది రాళ్లు` చిత్రంతో వెండితెరకు పరిచయమై `ఖైదీ`తో బ్లాక్ బస్టర్ అందుకొని వెనక్కి తిరిగి చూడకుండా స్టార్‌గా రాణించారు. మెగాస్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌ని శాసిస్తున్నారు. యంగ్ హీరోలు పాన్ ఇండియా వేటలో, గ్లోబల్ సినిమా వేటలో రికార్డులు క్రియేట్ చేస్తున్నా, మెగాస్టార్ స్థానం మాత్రం చిరంజీవిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఆయన సినిమాలు చేస్తున్నారు. విజయాలు అందుకుంటున్నారు. ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి నేడు శనివారం(ఆగస్ట్ 22) 71వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు, ఎవరికీ తెలియని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఆయన గురించి కామెంట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గీతా కృష్ణ షాకింగ్ విషయాలు వెల్లడించారు. చిరంజీవి హవా గురించి చెబుతూ, నాగార్జున, వెంకటేష్ హీరోలు అయిన పరిస్థితిని వివరించారు. చిరంజీవి డేట్స్ ఇవ్వలేకపోవడంతో వెంకటేష్, నాగార్జున హీరోలు అయ్యారని తెలిపారు. 1983లో చిరంజీవికి `ఖైదీ` పడింది. దీంతో నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యారు. సినిమాలు తగ్గించారు. ఫామ్ లో ఉన్న చిరంజీవి అందరికి డేట్స్ ఇవ్వలేకపోతున్నారట. ఆ టైమ్‌లో కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్నార్ కొంత వరకు నటిస్తున్నారు. కానీ వారి సినిమాలు కమర్షియల్‌గా వాహ్ అనేలా లేదు. ఈ క్రమంలో అందరి చూపు చిరంజీవిపైనే పడింది. అయితే ఆయన డేట్స్ కోసం ఏఎన్నార్ చాలా రోజులు తిరిగారట. ఏకంగా మూడేళ్లు చిరంజీవి వెంటపడ్డారట. కానీ తమ అన్నపూర్ణ

అక్కినేని వారసులుగా నాగ చైతన్య, అఖిల్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నాగార్జున టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో. రీసెంట్ గా వీరు ముగ్గురూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ కెరీర్, ఫ్యామిలీలో ఉన్న అనుబంధం ఇతర విశేషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, అఖిల్ ఇంత వరకు కలసి ఫుల్ లెన్త్ మూవీ చేయలేదు. మనం మూవీలో అఖిల్ కొన్ని నిమిషాల పాటు తళుక్కున మెరుస్తాడు అంతే. ఆ మూవీలో నాగార్జున, చైతు పూర్తి స్థాయిలో నటించారు. అక్కినేని అన్నదమ్ముల కాంబోలో ఫుల్ లెన్త్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో అఖిల్, చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ తండ్రి సినిమాల్లో దేనిని రీమేక్ చేయడనికి ఇష్టపడతారు అని ప్రశ్నించగా.. అఖిల్, చైతూ ఇద్దరూ ఒకే సినిమా పేరు చెప్పారు. ఆ సినిమా ఏంటంటే.. హలో బ్రదర్. నాగార్జున డ్యూయెల్ రోల్ లో నటించిన హలొ బ్రదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 90వ దశకంలో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. రమ్యకృష్ణ, సొందర్య హీరోయిన్లుగా నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చైతూ, అఖిల్ ఇద్దరూ చెప్పారు. అయితే అఖిల్, చైతూ హలో బ్రదర్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే లెక్కలు అప్పుడే అభిమానుల్లో మొదలయ్యాయి. అది 32 ఏళ్ళ నాటి సినిమా. ఆ తరహా ఎంటర్టైన్మెంట్ కి, కథలకు ఎప్పుడో కాలం చెల్లింది. అలాంటి కథలతో ఇప్పుడు సినిమాలు చేస్తే వర్కౌట్ కావు సరికదా.. హలో బ్రదర్ లాంటి క్లాసిక్ మూవీ పరువు తీసినట్లు అవుతుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటి ట్రెండ్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Uppal Balu Akkineni Nagarjuna: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్' త్వరలోనే సీజన్ 10తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, సామాన్యులకు హౌస్‌లోకి వెళ్లే సువర్ణావకాశాన్ని కల్పించేందుకు నిర్వాహకులు 'అగ్నిపరీక్ష 2' ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఆడిషన్స్ నుంచి ఎలిమినేట్ అయిన సోషల్ మీడియా ఫేమ్ ఉప్పల్ బాలు వ్యవహారం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. జడ్జిలపై సంచలన ఆరోపణలు.. ఇటీవల బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఆడిషన్స్‌కు వెళ్లిన ఉప్పల్ బాలు అక్కడ ఎలిమినేట్ అయ్యారు. అనంతరం ఆయన షో జడ్జిలైన నవదీప్, బిందు మాధవి, అభిజిత్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జడ్జి నవదీప్ తన వీడియోలు చాలా వల్గర్ (అసభ్యంగా) ఉంటాయని అంటూ తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో జడ్జి బిందు మాధవి తనను 'ట్రాన్స్'వా అని ప్రశ్నించిందని బాలు పేర్కొన్నారు. కేవలం బాలు మాత్రమే కాకుండా, ఎలిమినేట్ అయిన ఇతర కంటెస్టెంట్స్ కూడా నిర్వాహకులు, జడ్జిలపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ట్విస్ట్ ఇచ్చిన ఉప్పల్ బాలు.. అయితే, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పల్ బాలు పోస్ట్ చేసిన మరో వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. జడ్జిలపై విమర్శలను పక్కన పెట్టి, ఈసారి ఆయన బిగ్‌బాస్ నిర్వాహకులకు, హోస్ట్ నాగార్జునకు నేరుగా ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. "ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి.. దయచేసి నన్ను తీసుకోండి" అంటూ ఆయన చేతులు జోడించి వేడుకున్నారు. కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానైనా

కింగ్ నాగార్జున తన సినీ ప్రయాణంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రస్తుత తరం హీరోలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కింగ్ నాగార్జున (Nagarjuna) తన సినీ ప్రయాణంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రస్తుత తరం హీరోలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన ఇద్దరు కుమారులు నాగచైతన్య (Naga Chaitanya), అఖిల్‌తో (Akhil) కలిసి ‘వెరైటీ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 90వ దశకానికి, ఇప్పటి సినీ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి మాట్లాడారు. "నా సినీ ప్రయాణంలో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు నా కెరీర్‌ను పూర్తిగా మార్చేశాయి. అలాంటి నిర్ణయాల్లో ‘గీతాంజలి’ (Geethanjali) సినిమా ఒకటి. 90వ దశకంలో ఇతర హీరోలు పెద్దగా ముందుకు రాని సమయంలో దర్శకుడు మణిరత్నంతో కలిసి ‘గీతాంజలి’ సినిమా చేయడం నేను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయమే నా కెరీర్‌కు ఒక కొత్త దిశను చూపించింది. ఒక హీరోగా నేను ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి కథలను ఎంచుకోవాలి అనే విషయంలో ‘గీతాంజలి’ నాకు ఎంతో నేర్పింది. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు నా కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. కెరీర్లో ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండకుండా.. కొత్త కథలు, విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నించాలి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సినిమాలు చేయాలనే తపన ఉండాలి. అయితే 90లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో ప్రయోగాత్మక సినిమాలు చేయడం కొంత సులభంగా ఉండేది. సినిమా ఫలితం ఆశించిన విధంగా రాకపోయినా మరో సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండేది. ఆ రోజుల్లో వరుసగా ఏడు సినిమాలు ప్లాప్ అయినా హీరోలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒక్క పరాజయం ఎదురైనా ప్రేక్షకులు
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయన సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, స్పెషల్ స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు, సినిమా రివ్యూలు రాశారు. క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.... ఇంకా చదవండి

కింగ్ నాగార్జున ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటైన ‘గీతాంజలి’ చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రాబోతోంది. కింగ్ నాగార్జున (King Nagarjuna) ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటైన ‘గీతాంజలి’ (Geethanjali 4K) చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రాబోతోంది. ఆగస్టు 29న నాగార్జున బర్త్‌డే (Nagarjuna Birthday Special) సందర్భంగా.. ఒక రోజు ముందుగానే అంటే ఆగస్ట్ 28న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో 4K ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. అదే రోజు రక్షాబంధన్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్‌కు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రీ రిలీజ్ స్పెషల్ ఏంటంటే.. ఇప్పటి వరకు తెలుగు హీరోల సినిమాలు రీ రిలీజ్ విషయంలో ఒక్క భాషకే పరిమితమవగా.. ‘గీతాంజలి’ మాత్రం తెలుగు, తమిళ రెండు భాషల్లో రిలీజ్ అవుతూ సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్‌ను లేటెస్ట్ 4K టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘గీతాంజలి’ అంటే.. ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు మరో బలంగా నిలిచి ఈ సినిమాను క్లాసిక్‌గా మార్చింది. నాగార్జున సరసన గిరిజ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మణిరత్నం తనదైన స్టోరీటెల్లింగ్‌తో ఒక అందమైన కవితలా తెరకెక్కించారు. కింగ్ నాగార్జునను ఎంతో చార్మింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించిన ఈ సినిమా ఆయన కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిందంటే అతిశయోక్తి కానే కాదు. ఈసారి 4K ఫార్మాట్లో ఈ సినిమాను చూడటం ఈ రీ-రిలీజ్లో ప్రధాన ఆకర్షణ కానుంది. ఇటీవల వచ్చిన

నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. విలాసాలకు అలవాటు పడిన ఇద్దరు మైనర్ విద్యార్థులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల్లో ఒకరు ఆమెను ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 11న కొండమల్లేపల్లిలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేసేందుకు ఇద్దరు విద్యార్థులు పథకం రచించారు. అందులో ఒకరు మాస్క్ ధరించి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే, ప్రమాదవశాత్తు మాస్క్ జారిపోవడంతో రూపారెడ్డి అతడిని గుర్తుపట్టారు. దీంతో భయాందోళనకు గురైన నిందితుడు, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. 27 సార్లు పొడిచి చంపిన అనంతరం, ఆమె ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సుమారు 70 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఎస్పీ తెలిపారు. పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత గైర్హాజరైన వారిలో ఇద్దరు విద్యార్థులు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.గతంలో హాస్టల్లో ఉన్న సమయంలో నిందితుడి వద్ద నగదు, సెల్‌ఫోన్ దొరకడంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి అతడిని మందలించారు. అప్పటి నుంచి ఆమెపై కక్ష పెంచుకున్న నిందితుడు, ప్రధానంగా

సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ చూసిన పలువురు హీరోలు మళ్ళీ పొంగల్ బరిపైనే గురి పెట్టారు.. వారిలో టాప్ స్టార్స్, మీడియం స్టార్స్, యంగ్ హీరోస్ ఉన్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఆ ముచ్చటేంటో చూద్దాం. టాలీవుడ్లో సంక్రాంతి (Pongal Movies) సీజన్‌కు ఉన్న క్రేజ్ మరో పండుగకు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పొంగల్ తరువాత సమ్మర్, దసరా, క్రిస్మస్ సీజన్స్ కు సినిమాలు వచ్చి అలరించేవి. కానీ, ఇప్పుడు అనేకమంది తెలుగు స్టార్స్ సంక్రాంతి బరిపైనే గురి పెడుతున్నారు. అలా ఈ సారి పలువురు స్టార్స్ ముగ్గుల పండుగకు మురిపించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఆసక్తిని కలిగిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)- బాబీ కాంబోలో రెండో సినిమా ముందు నుంచీ పొంగల్ కే వస్తుందని వినిపిస్తోంది. ఈ మూవీకి 'కదిరి నరసింహుడు', 'కాకాజీ' అన్న టైటిల్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి పలుమార్లు సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ సాధించారు. పాలిటిక్స్ వీడి మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన తరువాత చిరంజీవికి బంపర్ హిట్స్ చూపించిన "ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు" చిత్రాలు పొంగల్ కే ప్రేక్షకులను పలకరించడం గమనార్హం. అందువల్ల తన కొత్త సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేసే దిశగా చిరంజీవి అడుగులు వేస్తున్నారు. మరో స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) కూడా పలుమార్లు సంక్రాంతి బరిలో గ్రాండ్ సక్సెస్ చూశారు. వెంకీ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' 2025 బ్లాక్ బస్టర్ గా నిలచింది... అలాగే ఆయన కేమియో రోల్ పోషించిన సమన శంకరవరప్రసాద్ గారు' కూడా బంపర్ హిట్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తోన్న సినిమాను కూడా పొంగల్ లోనే రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మేకర్. ఈ చిత్రానికి 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు

నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి, ఆమె పనిచేస్తున్న పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. టీసీ ఇచ్చిందన్న కక్ష, డబ్బు అవసరం రెండూ ఈ హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ అయిన రూపారెడ్డి (42) గత వారం జేబీ కాలనీలోని తన నివాసంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆగస్టు 11-12 తేదీల మధ్య జరిగిన ఈ ఘటనలో ఆమె శరీరంపై దుండగులు పదునైన ఆయుధంతో దాదాపు 27 సార్లు పొడిచినట్లు గుర్తించారు. భర్త పని నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఈ హత్య జరిగింది. ఆమె ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో, అనుమానంతో బంధువులు, సహోద్యోగులు చూడగా విషయం బయటపడింది.ఘటనా స్థలంలో తొలుత ఎలాంటి విలువైన వస్తువులు చోరీకి గురికాకపోవడంతో ఆమెకు తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో అనుమానితులను విచారించారు. చివరకు ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఓ బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపించడంతో కేసులో పురోగతి లభించింది.ఫుటేజీ ఆధారంగా కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఓ విద్యార్థి నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ప్రిన్సిపాల్ తనకు టీసీ ఇవ్వడంతో ఆమెపై కక్ష పెంచుకున్నానని, అదే సమయంలో డబ్బు కూడా అవసరం కావడంతో ఈ హత్యకు పాల్పడినట్లు నిందితుడు చెప్పినట్లు

నల్గొండ జిల్లాలో ఒక స్కూల్ ప్రిన్సిపల్ హత్యతో దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం జేపీ కాలనీలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ స్కూల్ ప్రిన్సిపల్ కే రూప రెడ్డి ఆగస్టు 11వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆగస్టు 11న ఆమె తన ఇంట్లోనే కత్తిపోట్లతో మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ అయితే ఈ కేసులో షాకయ్యే విషయం ఏమిటంటే వీరంతా రూపారెడ్డి ప్రిన్సిపాల్ గా ఉన్న నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులే కావటం.ఆగస్టు 11వ తేదీ రాత్రి రూపా రెడ్డి భర్త హైదరాబాద్ వెళ్లిన సమయంలో ముగ్గురు వ్యక్తులు పదునైన కత్తులతో ఆమె శరీరం పైన 27 చోట్ల పొడిచి చంపారు.ఆమె స్కూల్ లో చదివిన విద్యార్థులే హంతకులు జల్సాల కోసం అలవాటుపడిన ముగ్గురు మైనర్లు, అది కూడా రూపా రెడ్డి ప్రిన్సిపల్ గా ఉన్న నాగార్జున పబ్లిక్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులే రూప రెడ్డి ని అత్యంత దారుణంగా హతమార్చారు. పోలీసులు సీసీటీవీ పేజీల ద్వారా నిందితులను గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసిన పోలీసులు ఈ కేసులో నిందితులను పట్టుకున్నారు.దర్యాప్తుకు మూడు ప్రత్యేక బృందాలు మంగళవారం ఇబ్రహీంపట్నం సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. హత్య సమయంలో నిందితులు గ్లౌజులు ధరించినట్లు అనుమానం ఉండటంతో ఘటనా స్థలంలో ఆధారాలు తక్కువగా లభించాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేయగా దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. సుమారు 80 మందిని విచారించి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి కీలక సమాచారం సేకరించారు.గీత, చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటనప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యవెనుక మరేదైనా కారణం ఉందా?రూపారెడ్డి ఇంటి నుంచి సుమారు రూ.4 లక్షల నగదు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Principal Murder: నల్గొండ జిల్లా, కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. రూపారెడ్డి దారుణ హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యలో ఒక 10వ తరగతి విద్యార్థి, ముగ్గురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నెల 11వ తేదీన కొండమల్లెపల్లిలోని జేబీ కాలనీలో గల తన ఇంట్లో ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణమైన కత్తిపోట్లతో శవమై కనిపించారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమెను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. వేలిముద్రలు పడకుండా ఉండేందుకు నిందితులు ముందు జాగ్రత్తగా గ్లౌజులు ధరించడంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ కేసును సవాలుగా స్వీకరించిన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, ఈ ఘోరానికి పాల్పడిన వారిలో 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువకులు ఉన్నారని పోలీసులు మొదట అనుమానించారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు కొండమల్లెపల్లి ప్రాంతమంతటా గాలించాయి. పాఠశాల సిబ్బంది, కుటుంబ సభ్యులు, కాలనీ నివాసితులతో సహా దాదాపు 80 మందిని క్షుణ్ణంగా విచారించారు. నిఘా సంస్థలు కూడా రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు నిర్వహించాయి. క్షణాల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, కొండమల్లెపల్లి మండలంలోని రెండు గ్యాంగ్‌లకు చెందిన కొందరు యువకుల కార్యకలాపాలు అనుమానాస్పదంగా కనిపించాయి. వారిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, క్రమంగా ఆధారాలు సేకరించడం ప్రారంభించారు. హత్య వెనుక ఉన్న అసలు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బలగాలు కొండమల్లెపల్లి ప్రాంతమంతటా గాలించాయి
తెలుగు సినీ పరిశ్రమలో ‘ గీతాంజలి ’ ఒక ట్రెండ్ సెట్టర్. ప్రేమకథా చిత్రాల చరిత్రను ‘గీతాంజలి’కి ముందు, తర్వాత అని విభజించవచ్చంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రెండు జీవితాల భావోద్వేగాల ప్రయాణాన్ని వెండితెరపై ఒక దృశ్య కావ్యంగా మలిచి, ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత ముద్ర వేసిన ఈ అద్భుత ప్రేమకావ్యం సరికొత్త హంగులతో మరోసారి వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. అక్కినేని నాగార్జున పుట్టినరోజు(ఆగస్టు 29) కానుకగా ఈ అపురూప చిత్రాన్ని 4K అల్ట్రా హెచ్డీ డిజిటల్ టెక్నాలజీతో ఆగస్టు 28న తెలుగు, తమిళ భాషల్లో రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.* తిరుమలలో నయనతార గుండు కొట్టించుకుందా?లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రంగా ‘గీతాంజలి’ చరిత్రలో నిలిచిపోయింది. 1989లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అప్పటి ట్రెండ్‌ను పూర్తిగా మార్చివేసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న ఇద్దరు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో పరిచయమై, మిగిలి ఉన్న క్షణాలను ఎంతో ఆనందంగా, స్వచ్ఛమైన ప్రేమతో ఎలా గడిపారనేది ఈ కథలోని అసలు జీవం. విషాద నేపథ్యమున్నా, ఎక్కడా కన్నీళ్లతో కుంగిపోకుండా జీవితాన్ని ఉల్లాసంగా ఎలా ఆస్వాదించాలో చూపించిన విధానం సినీ ప్రేమికులను ఇప్పటికీ కట్టిపడేస్తుంది.ప్రకాష్ అనే సున్నితమైన యువకుడి పాత్రలో నాగార్జున ఒదిగిపోయిన తీరు ఆయన కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది. చలాకీతనంతో పాటు లోతైన భావాలను పలికించిన గీతాంజలి పాత్రలో గిరిజ శెట్టర్ నటన అనితరసాధ్యం. వీరిద్దరి మధ్య సాగే చిలిపి సంభాషణలు, కెమిస్ట్రీ సినిమాను అజరామరంగా మార్చేశాయి. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక బృందం భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఇళయరాజా ఆయన స్వరపరిచిన ప్రతి పాట, అందించిన నేపథ్య సంగీతం శ్రోతల మనస్సులలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పొగమంచు దుప్పట్లు కప్పుకున్న ఊటీ అందాలను, కథలోని మూడ్‌ను పీసీ శ్రీరామ్ తన కెమెరా ఫ్రేమ్‌లలో బంధించి ప్రతి దృశ్యాన్ని

Principal Murder: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.రూపారెడ్డి దారుణ హత్య కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థితో పాటు పూర్వ విద్యార్థులు ముగ్గురు కలిసి ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ నెల 11న కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీలో ఉన్న తన నివాసంలో ప్రిన్సిపల్ రూపారెడ్డి తీవ్ర కత్తిపోట్లతో శవమై కనిపించారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమెను దారుణంగా పొడిచి చంపేశారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు పడకుండా నిందితులు ముందస్తు జాగ్రత్తగా గ్లౌజులు ధరించడంతో పోలీసులకు ఎలాంటి క్లూస్ దొరకలేదు. కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తొలుత 20 నుంచి 25 ఏళ్ల యువకులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావించారు. హత్య వెనుక ఉన్న అసలు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు కొండమల్లేపల్లి వ్యాప్తంగా జల్లెడ పట్టాయి. స్కూల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు సహా దాదాపు 80 మందిని సమగ్రంగా విచారించారు. నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేపట్టాయి. సీసీటీవీ దృశ్యాలను సెకన్ల వ్యవధిలో క్షుణ్ణంగా పరిశీలించగా కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన కొంతమంది కుర్రాళ్ల కదలికలు అనుమానాస్పదంగా అనిపించాయి. వారిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు నెమ్మదిగా ఆధారాలు సేకరించడం ప్రారంభించారు. ఈ దారుణ హత్య వెనుక ప్రధానంగా నగదు దోపిడీ కోణమే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూపారెడ్డిని చంపేసిన అనంతరం ఇంటి నుంచి సుమారు రూ.4 లక్షల నగదును నిందితులు అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది. కేవలం డబ్బు కోసమే గురువు స్థానంలో ఉన్న ప్రిన్సిపల్‌ను బలి తీసుకున్నారా లేక వారి మధ్య మరేదైనా పగ ఉందా అనే కోణంలో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈసారి కూడా సెలబ్రిటీలకు కామన్ పీపుల్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అగ్నిపరీక్ష సీజన్ 2కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. రాజకుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మిథిలేష్, శ్రష్ఠి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగీ తుళ్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియా, సింగర్ ఝాన్సీ, గాయత్రి, మిస్ అపూర్వ.. ఇలా చాలా మంది అగ్ని పరీక్ష సీజన్ 2 లో అదృష్టం పరీక్షించుకున్నారు. మరి వీరిలో ఎవరెవరు హౌస్ లోకి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రియాలిటీ షో గురించి అలాగే అగ్ని పరీక్ష సీజన్ 2 పైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడు ఆది రెడ్డి. ఈసారి మొత్తం 10 మంది సెలబ్రిటీలు, 10 మంది కామనర్స్ హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉందంటున్నాడు ఆది రెడ్డి. ఇక బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్లపైనా వరుసగా హింట్స్ ఇస్తున్నాడు ఆది రెడ్డి. పల్లవి గౌడ ఈసారి హౌస్ లోకి కచ్చితంగా అవకాశం ఉందని ఆది రెడ్డి అంచనా వేశాడు. అలాగే జబర్దస్త్ ఫేమ్ హరి, రాకింగ్ రాకేష్, నూకరాజుల్లో కచ్చితంగా ఒకరు బిగ్ బాస్ 10లోకి వచ్చే అవకాశం ఉందంటున్నాడీ మాజీ కంటెస్టెంట్. వీరిలో నూకరాజుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, ఇతనిని చూస్తుంటే ఇమ్మాన్యుయేల్ గుర్తుకు వస్తున్నాడని ఆది రెడ్డి అంటున్నాడు. అలాగే మరో జబర్దస్త్ నటుడు, స్క్రిప్ట్ రైటర్ హరి కూడా హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నాడు ఆది రెడ్డి. అలాగే రాయల్ ఎంసీ రమణ కూడా కంటెస్టెంట్స్ గా వచ్చే అవకాశం ఉందంటున్నాడీ మాజీ కంటెస్టెంట్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈసారి కూడా నాగార్జనే

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ తారలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు) విజయవాడ : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు) విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు) హైదరాబాద్ ఉప్పల్‌లో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు) చేతకాని వాడి చేతిలో విద్యాశాఖ పెడితే ఇలానే ఉంటుంది నువొక డమ్మీ హోమ్ మంత్రివి.. నీకు చంద్రబాబు పదవి ఇచ్చింది..! తిరుమల అలిపిరి మెట్లపై సిగరెట్ తాగుతూ వ్యక్తి హల్చల్

నటసింహం నందమూరి బాలకృష్ణ.. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ హిట్ తర్వాత ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ‘NBK112’ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. అయితే, అనుకోకుండా ‘NBK111’ షూటింగ్ సమయంలో బాలయ్యకు గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో డాక్టర్లు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. సినిమా పరిశ్రమలో ఒక స్టార్ హీరో లేదా అగ్ర దర్శకుడి షెడ్యూల్ మారితే, దాని ఎఫెక్ట్ వరుసగా మిగతా ప్రాజెక్టులపై పడుతుంది. ప్రస్తుతం బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఆగస్టులోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, బాలయ్య గాయం వల్ల ఈ సినిమా షూటింగ్ వచ్చే సమ్మర్‌కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొరటాల శివ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, బాలయ్య తర్వాత చేయాల్సిన మరికొన్ని సినిమాల షెడ్యూల్స్ కూడా రీ-షెడ్యూల్ కాక తప్పడం లేదట. ఈ లైనప్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే... కొరటాల శివ సినిమా పూర్తయిన వెంటనే, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉందట. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలియంది కాదు. అయితే, బాలయ్య-కొరటాల సినిమా ఆలస్యం కానుండటంతో అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ ప్లానింగ్‌ను మార్చుకోవాలని చూస్తున్నట్లు ఫిలిం నగర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్‌గా పనిచేసి దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కెవిన్ కుంటా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పర్సనల్ బాడీగార్డ్‌గా పనిచేసి దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కెవిన్ కుంటా (Kevin Kunta) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ సినిమా ప్రమోషన్స్, పబ్లిక్ ఈవెంట్లలో ఆయన వెంటే ఉంటూ, తన భారీ కటౌట్, స్టైలిష్ లుక్స్‌తో కెవిన్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు. అయితే తాజాగా సినీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం, కెవిన్ కుంటా ఇకపై రామ్ చరణ్ వ్యక్తిగత భద్రతా బృందంలో పనిచేయడం లేదని, ఆయన కింగ్ అక్కినేని నాగార్జున వద్ద బాడీగార్డ్‌గా చేరినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గాంబియా దేశానికి చెందిన ప్రొఫెషనల్ ఎమ్ఎమ్ఏ (MMA) ఫైటర్ అయిన కెవిన్ కుంటా, గత నాలుగేళ్లుగా రామ్ చరణ్ కుటుంబానికి నమ్మకమైన సెక్యూరిటీగా సేవలందించారు. చరణ్ ఎక్కడికి వెళ్లినా అన్నీ తానై చూసుకునే కెవిన్, ఫ్యాన్స్ దూసుకొచ్చినప్పుడు వాళ్లను ఒంటిచేత్తో ఎత్తి పక్కకు నెట్టేసే వీడియోలు గతంలో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ సైతం పలు ఇంటర్వ్యూలలో తన బాడీగార్డ్ పాపులారిటీపై సరదా కామెంట్లు చేస్తూ అతడిని ప్రశంసించారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న కెవిన్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ టీమ్ నుంచి తప్పుకుని అక్కినేని కాంపౌండ్‌లోకి అడుగుపెట్టడం సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) తన భద్రతా బాధ్యతలను కెవిన్ కుంటాకు అప్పగించారని సమాచారం. భారీ పర్సనాలిటీ, అంతర్జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం కలిగిన కెవిన్ రాకతో నాగార్జున పబ్లిక్ అప్పియరెన్సెస్లో సెక్యూరిటీ మరింత పటిష్టం కానుందని

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్' సరికొత్త హంగులతో పదో సీజన్‌తో సందడి చేసేందుకు సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి షో మునుపటి కంటే భిన్నంగా, మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోందని నిర్వాహకులు చెబుతున్నారు.ఈ సీజన్ గురించి నాగార్జున మాట్లాడుతూ, ఇది నెక్స్ట్ లెవల్లో ఉంటుందని, వెరైటీ, సర్ప్రైజ్లు, డ్రామా, సవాళ్లు పదింతలు అధికంగా ఉంటాయని తెలిపారు. ఈ సీజన్‌ను 'దశావతారం'గా అభివర్ణించిన ఆయన, ప్రతి వారం బిగ్‌బాస్ ఒక కొత్త అవతారం ఎత్తుతాడని, ఇది కంటెస్టెంట్లకు ఊహించని మలుపులను ఇస్తుందని అన్నారు. దీనికి తగ్గట్టుగానే “ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్” అనే కొత్త ట్యాగ్‌లైన్‌ను విడుదల చేశారు. ఈ ట్యాగ్‌లైన్ షో స్వరూపాన్నే మార్చేలా ఉందనిపిస్తోంది.ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కొంతమంది సినీ, టీవీ నటీనటులను నేరుగా ఎంపిక చేయగా, సామాన్య ప్రజల కోసం 'అగ్నిపరీక్ష' పేరుతో ప్రత్యేక ఆడిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ అగ్నిపరీక్షకు న్యాయనిర్ణేతలుగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు అయిన నవదీప్, బిందు మాధవి, అభిజీత్‌లు వ్యవహరిస్తున్నారు. వీరి పర్యవేక్షణలో సామాన్యుల నుంచి తుది జాబితాను ఖరారు చేయనున్నారు.అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. సరికొత్త థీమ్, ఆసక్తికరమైన కంటెస్టెంట్లతో ఈ పదో సీజన్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి

రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే లైన్.. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు.. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, హైస్పీడ్ రైల్వే లైన్ ప్రాథమిక అలైన్మెంట్లపై స్పష్టత రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్న హైస్పీడ్ ట్రైన్ శంషాబాద్, ఫ్యూచర్‌సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్, వాడపల్లి వద్ద స్టేషన్లు రాష్ట్ర పరిధిలో 2 జిల్లాలు 40 గ్రామాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పొడవు 297 కిలోమీటర్లు.. అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలో హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే లైన్.. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలు పక్కపక్కనే వెళ్లనున్నాయి. ఈ రెండింటిలో రోడ్డు ఎడమవైపు.. రైలు మార్గం కుడివైపు ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎడమవైపు అంటే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న ప్రస్తుత రహదారికి ఎడమవైపు.. ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది. కుడివైపు రైలు మార్గం ఉండనుంది. వీటికి సంబంధించిన అలైన్మెంట్ల విషయంలోనూ ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. హైదరాబాద్-అమరావతి- చెన్నై కారిడార్‌లో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్ (హాలియా), వాడపల్లి దగ్గర స్టేషన్లు రానున్నాయి. ఈ లైన్ శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ రావిర్యాల ఎగ్జిట్ దగ్గర నిర్మించనున్న 21 కిలోమీటర్ల కొత్త రేడియల్ రోడ్డుకు దగ్గర్లో ప్రారంభమయ్యే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే వద్ద కలుస్తుంది. ఈ రైల్వే లైన్ పొడవు మొత్తం 760 కిలోమీటర్లు కాగా.. రాష్ట్రపరిధిలో 180 కిలోమీటర్లు ఉండనుంది. దీనికి సంబంధించి ఆ మార్గంలో పలుచోట్ల మార్కింగ్‌లు కూడా

నాగార్జున.. టాలీవుడ్లో కింగ్‌గా, మన్మథుడుగా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. సీనియర్లలో అత్యంత ప్రయోగాత్మక చిత్రాలు చేసిన హీరోగా నిలిచారు. గీతాంజలి, శివ, అన్నమయ్య వంటి డిఫరెంట్ చిత్రాలు చేశారు. మల్టీస్టారర్స్ చేశారు. ఇటీవల విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. రజనీకాంత్ `కూలీ`లో ఆయన విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు తన రూట్ మారుస్తూ మెప్పిస్తున్నారు. యంగ్ జనరేషన్ కి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన కింగ్ 100లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున ఒకప్పుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాను కరప్ట్ అయినట్టు చెప్పారు. మీలో మీకు నచ్చని క్వాలిటీ ఏంటి అని ప్రశ్నించినప్పుడు నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. మంచు లక్ష్మి షోలో పాల్గొన్న ఆయన తన జర్నీ గురించి వెల్లడించారు. పిల్లల కెరీర్ గురించి స్పందించారు. చైతన్యకి స్వతంత్ర్య భావాలు ఎక్కువ అని, పెద్ద స్థాయికి వెళ్తాడని చెప్పారు నాగార్జున. అన్ని రకాల పనులను మ్యానేజ్ చేయడంపై ఆయన రియాక్ట్ అవుతూ, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తానని, ఒకదాంట్లో మరోటి కలుపను అని చెప్పారు. సినిమాలు, పర్సనల్ లైఫ్‌ని మిక్స్ చేయను అని వెల్లడించారు. తనకు కూడా కోపం వస్తుందని, అందరిపై అరుస్తానని చెప్పారు. అయితే ముందు తిట్టేసి తర్వాత సారీ చెబుతానని, ఏదో కోపంలో అన్నాను అని చెప్పి సారీ చెబుతానని వెల్లడించారు. సారీ చెబితే చాలా సమస్యలు క్లీయర్ అవుతాయని, సారీ చెప్పడంలో ఈగో ప్రాబ్లమ్ ఏం లేదన్నారు. ఇప్పుటి తరం కుర్రాళ్లు ప్రయోగాలు చేయడం లేదని, రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్నారని వెల్లడించారు. డిఫరెంట్ గా చేస్తేనే మంచి సినిమాలు వస్తాయన్నారు. చైతూకి కూడా అదే చెబుతుంటానని వెల్లడించారు. ఈ క్రమంలో మీలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటని మంచు లక్ష్మి అడగ్గా, ఆయన చెప్పలేదు. నచ్చని క్వాలిటీ గురించి అడగ్గా, ఆలోచించి.. `నేను కరప్ట్ అయ్యాను, అదే

మంచి కథలతో వచ్చే రచయితలను, దర్శకులను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే! మంచి కథ అనిపిస్తే.. బడ్జెట్ లో సినిమా తీసి విడుదల చేయడం వంటివి కొంతకాలంగా చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రం ‘పళ్ళ బురుసు’. సినిమా రివ్యూ: ‘పళ్ల బురుసు’ (Palla Burusu Review) మంచి కథలతో వచ్చే రచయితలను, దర్శకులను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే! మంచి కథ అనిపిస్తే.. బడ్జెట్ లో సినిమా తీసి విడుదల చేయడం వంటివి కొంతకాలంగా చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రం ‘పళ్ళ బురుసు’. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సూజాత కీలక పాత్రధారులు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ పల్లె కథను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో చూద్దాం. కథ: తెలంగాణలోని పల్లెలో శంభ (సుధాకర్‌రెడ్డి) అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో సెటిల్ అయి ఆయన బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేపపుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం

Pallaburusu Review : సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘పళ్ళ బురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్స్ నిర్మాణంలో ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పళ్ళ బురుసు సినిమా నేడు ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అయింది. ముసలాయన శంభు(సుధాకర్ రెడ్డి)ఒంటరిగా ఓ గ్రామంలో నివసిస్తుంటారు. దగ్గర్లోనే వేరే గ్రామంలో అతని కొడుకు తిరుపతి(మురళీధర్ గౌడ్) తన ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. శంభుకు పన్ను సమస్య రావడంతో హాస్పిటల్ కి వెళ్తే వేపపుల్ల వాడకుండా బ్రష్(పళ్ళ బురుసు)తో పళ్ళు తోమమని చెప్తారు. దాంతో పళ్ళ బురుసు, మెడిసిన్స్ తీసుకురమ్మని తన కొడుక్కి చెప్తాడు శంభు. కానీ తిరుపతి తీసుకురాడు. అంతే కాక తిరుపతి తన కూతురు పెళ్లి ఫిక్స్ అయినా, నిశ్చితార్థం అయినా, పెళ్ళికి కూడా తన తండ్రికి చెప్పడు, పిలవడు. అయినా మనవరాలి పెళ్లి అని శంభు పెళ్ళికి వెళ్తే ఎవరూ పట్టించుకోరు. ఒంటరితనంతో బాధపడుతూ ఉంటాడు. దీంతో తన కొడుకు తనకు పళ్ళ బురుసు కొనివ్వలేదని, మనవరాలి పెళ్ళికి పిలవలేదని, అసలు తనను పట్టించుకోవట్లేదని కోర్టులో కేసు వేస్తాడు శంభు. అదే సమయంలో కూతురు పెళ్లి చేసి అప్పుల పాలవుతాడు తిరుపతి. మరి ఈ కేసుకి తిరుపతి ఎలా స్పందిస్తాడు? తన తండ్రిని తిరుపతి అర్ధం చేసుకుంటాడా? ఒంటరితనంతో శంభు ఏం చేస్తాడు? ఈ మధ్యలో రవి- శ్వేత ప్రేమాయణం సంగతి ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.. Also See : Anna Konidela : మొదటిసారి పిఠాపురానికి పవన్ కళ్యాణ్ భార్య.. ట్రైన్లో వెళ్లి పూజలు చేసి.. అన్నా కొణిదెల ఫొటోలు వైరల్.. బ్రష్ కొనివ్వలేదు అని కొడుకుపై కేసు వేసాడంటూ ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో ఆసక్తి నెలకొల్పింది. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్, పేరెంట్స్ ఎమోషన్ కథ

సురక్ష కా తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు (శుక్రవారం) నిర్వహించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సురక్ష కా తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు (శుక్రవారం) నిర్వహించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా SPARK క్లబ్ విద్యార్థుల ప్రతినిధులు హాజరయ్యారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించింది. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అధికారులు తెలిపారు. బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరసత్వంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘Stay Alert , Stay Aware, Stay Safe & Secure’ నినాదంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

‘లెనిన్’ సక్సెస్, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదలవుతోన్న ‘పళ్ళబురుసు’ వంటి సినిమా ఈవెంట్స్‌తో పాటు.. ఇప్పుడో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. కింగ్ నాగ్ వార్తలలో హైలెట్ అవుతున్నారు. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా కింగ్ నాగార్జున (King Nagarjuna) పేరే వినిపిస్తోంది. ‘లెనిన్’ సక్సెస్, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదలవుతోన్న ‘పళ్ళబురుసు’ వంటి సినిమా ఈవెంట్స్‌తో పాటు.. ఇప్పుడో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. కింగ్ నాగ్ వార్తలలో హైలెట్ అవుతున్నారు. సినిమా ఈవెంట్స్‌తో, ‘కింగ్ 100’ షూట్‌తో బిజీగా ఉన్న నాగార్జున.. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన బ్రాండ్ ఏమిటో తెలుసా? ‘కాప్స్టన్’ హోమ్ సర్వీసెస్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా కింగ్ నాగార్జున ఎన్నికయ్యారు. గత రెండు దశాబ్దాలుగా B2B సేవల రంగంలో నమ్మకమైన మానవ వనరుల పరిష్కారాలను అందిస్తున్న ప్రముఖ ‘కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్’, తన అనుబంధ సంస్థ ద్వారా హైదరాబాద్‌లో ‘కాప్స్టన్ హోమ్ సర్వీసెస్’ యాప్‌ను ప్రారంభించి అధికారికంగా ఆన్లైన్ హోమ్ సర్వీసెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ గ్రాండ్ యాప్ లాంచ్ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై, యాప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాప్స్టన్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ సీ.ఆర్. నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కోడాలి, సీనియర్ నాయకత్వ బృందం, ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. “ఒక కస్టమర్ ఇంట్లోకి వచ్చే ప్రతి సేవ కూడా నమ్మకంపై ఆధారపడి ఉండాలి. గత రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు మానవ వనరుల పరిష్కారాలను అందిస్తూ కాప్స్టన్ ఆ నమ్మకాన్ని సంపాదించుకుంది. అదే ప్రొఫెషనలిజం, పారదర్శకత, నాణ్యతను ప్రతి ఇంటికీ అందించాలనే వారి దృక్పథం నన్ను ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యం కావడానికి ప్రేరేపించింది. కాప్స్టన్ ప్రయాణంలో భాగస్వామి కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని అన్నారు. భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన హోమ్ సర్వీసెస్ బ్రాండ్లలో ఒకటిగా ఎదగడమే మా లక్ష్యమని తెలిపారు

అక్కినేని నాగార్జున(Nagarjuna), గిరిజ శెట్టర్ జంటగా నటించిన క్లాసిక్ చిత్రం ‘గీతాంజలి’ (Geethanjali) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్కినేని నాగార్జున(Nagarjuna), గిరిజ శెట్టర్ జంటగా నటించిన క్లాసిక్ చిత్రం ‘గీతాంజలి’ (Geethanjali) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ ఎవర్గ్రీన్ ప్రేమకథను ఆగస్టు 28న 4Kలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. (Geethanjali Re Release) ‘గీతాంజలి’ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రేమకథా చిత్రం. ప్రేమ, భావోద్వేగాలు, అనుబంధాలను మణిరత్నం తనదైన శైలిలో తెరకెక్కించారు. నాగార్జున, గిరిజ శెట్టర్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం మరో ప్రత్యేకత. సినిమాలోని పాటలు అప్పట్లో ఎంతగా హిట్ అయ్యాయో.. ఇప్పటికీ అంతే ఆదరణ పొందుతున్నాయి. ప్రేమకథకు ఇళయరాజా సంగీతం మరింత అందాన్ని తీసుకొచ్చింది. పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేకమైన విజువల్ ఫీల్‌ను తీసుకొచ్చింది. బి. లెనిన్, వి.టి. విజయన్ ఎడిటింగ్, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ సినిమాను మరింత అందంగా తీర్చిదిద్దాయి. ఇప్పుడు ఈ క్లాసిక్ చిత్రం 4K క్వాలిటీతో మరోసారి థియేటర్లలోకి వస్తుండటంతో నాగార్జున అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అప్పట్లో థియేటర్లలో ‘గీతాంజలి’ని చూసిన వారికి ఇది పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేయనుంది. అదే సమయంలో కొత్త తరం ప్రేక్షకులకు ఈ క్లాసిక్ ప్రేమకథను పెద్ద తెరపై ఆస్వాదించే అవకాశం లభించనుంది. ఆగస్టు 28న ‘గీతాంజలి’ 4Kలో రీ-రిలీజ్ కానుండటంతో కింగ్ నాగార్జున అభిమానులు, మణిరత్నం సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి ప్రేమకథలకు కాలంతో సంబంధం లేదని మరోసారి నిరూపించేందుకు ‘గీతాంజలి’ సిద్ధమవుతోంది. స్పా సెంటర్ లో నటికి ఏం జరిగిందంటే.. Raviteja

లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు టాలీవుడ్ లో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు. అక్కినేని కుటుంబ సభ్యులు సినిమాల్లో, సినిమా బిజినెస్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. కింగ్ నాగార్జున టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరు. ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ అంటే ఎక్కువగా కనిపించేది వీళ్ళే. కానీ ఏఎన్నార్ కుటుంబ సభ్యులు తెర వెనుక ఇంకా చాలా మంది ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జునకి మనవరాలు అయ్యే ఓ అమ్మాయి అన్నపూర్ణ స్టూడియోస్ ని శాసిస్తోంది అని తెలుసా ? అవును ఇది నిజం. ఆమె ఎవరో కాదు నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ కుమార్తె. సుప్రియ తన కుమార్తెని మీడియాకి దూరంగా ఉంచుతూ పెంచారు. అందుకే ఆమె గురించి పూర్తిగా వివరాలు బయటకి రాలేదు. కానీ సుప్రియ కూతురు అన్నపూర్ణ స్టూడియోస్ లో కీలక బాధ్యతల్లో విధులు నిర్వహిస్తున్నట్లు మాత్రం తెలుసు. ఆమె విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వివిధ ఎంఎన్ సీ లలో వర్క్ చేశారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేస్తున్నారు. సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె కూతురు కూడా మంచి పొజిషన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఫ్యామిలీలో కొన్ని విషాదకర సంఘటనలు ఉన్నాయి. సుప్రియ, సుమంత్ అన్నా చెల్లెళ్ళు. వీరి తల్లిదండ్రులు సురేంద్ర యార్లగడ్డ, సత్యవతి చిన్నతనంలోనే మరణించారు. దీనితో వీరిని పెంచి పెద్ద చేసింది నాగేశ్వర రావు. ఆ తర్వాత సుప్రియ పవన్ కళ్యాణ్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. కానీ ఆమె ఆ ఒక్క సినిమాలో మాత్రమే హీరోయిన్ గా నటించారు. శ్రీయ శరన్ తొలి చిత్రం ఇష్టం మూవీలో చరణ్ రెడ్డి హీరోగా నటించారు. అతడితో సుప్రియ ప్రేమలో పడడం, వివాహం చేసుకోవడం

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bigg Boss Agnipariksha Season 2: బిగ్‌బాస్ పదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుండగా.. ఈ హౌస్‌లోకి సాధారణ వ్యక్తులకు అవకాశం కల్పిస్తోంది. గత సీజన్లో కామనర్ ట్రోఫీ ఎత్తుకెళ్లడంతో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో మరోసారి సాధారణ ప్రజలకు అవకాశం కల్పించడంలో భాగంగా అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే కామనర్ల కేటగిరిలో కొందరిని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అగ్నిపరీక్షకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. అగ్నిపరీక్షకు సంబంధించిన వీడియో విడుదల అవడంతో ప్రేక్షకులు ఆసక్తిగా గమనించారు. మొత్తం 70 మంది అగ్నిపరీక్షకు ఎంపికయ్యారు. వారిలో నుంచి పది నుంచి 15 మంది వరకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వారి ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా విడుదల చేసిన ప్రొమోలో గత సీజన్ మాదిరి ప్రశ్నలతోపాటు టాస్క్‌లు ఇచ్చి అగ్నిపరీక్షలో కామనర్లను ఎంపిక చేయనున్నారు. విడుదల చేసిన ప్రొమో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అగ్ని పరీక్షకు లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిలో నిర్వాహకులు వడపోసి ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేయడానికి తీవ్రంగా శ్రమించారు. చివరికి 70 మందిని ఎంపిక చేశారని సమాచారం. ఎంపికైన వారిలో చివరకు 15మందిని ఎంపిక చేయనున్నారు. గత సీజన్‌కు వచ్చిన స్పందనతో ఈసారి కామనర్లను హౌస్‌లోకి ఐదు లేదా ఆరుగురికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది. 2024 సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలుచుకోగా.. ఈసారి కూడా రైతు బిడ్డ కేటగిరీలో ఓ అమ్మాయికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి కంటెంట్ చేస్తూ

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకునే అవకాశం దక్కడం కంటే అదృష్టం మరొకటి లేదని ప్రముఖ నటుడు నాగార్జున అన్నారు. చిన్నతనంలో తల్లిదండ్రులు తమను ఎలా చూసుకున్నారో.. పెద్దయ్యాక వారిని కూడా అలాగే చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని చెప్పారు.దర్శకుడు ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన ‘పళ్లబురుసు’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల సంరక్షణపై మాట్లాడారు. చిన్నప్పుడు భయపడితే చేయి పట్టుకుని ధైర్యం చెప్పారని.. జ్వరం వచ్చినప్పుడు దగ్గరుండి చూసుకున్నారని గుర్తుచేశారు. కరెంట్ పోయినా భయపడిన సమయంలో అండగా నిలిచారని తెలిపారు. ‘‘వాళ్లు మన కోసం ఉన్నట్టే.. మనం పెద్దయ్యాక వాళ్ల కోసం ఉండకూడదా?’’ అని ప్రశ్నించారు.తన భార్య అమలను ఉదాహరణగా చెబుతూ.. ఆమె 88, 90 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులను ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారని నాగార్జున తెలిపారు. ‘‘తల్లిదండ్రులను చూసుకునే అవకాశం నీకు దక్కడం చాలా అదృష్టం’’ అని ఆమెతో తరచూ చెబుతుంటానన్నారు. తల్లిదండ్రుల సంరక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.‘పళ్ల బురుసు’ కథను దర్శకుడు ఉదయ్ తనకు ఎంతో ఆసక్తికరంగా చెప్పారని నాగార్జున తెలిపారు. సినిమాలో సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ సహా నటీనటులంతా అద్భుతంగా నటించారని ప్రశంసించారు. చిత్రబృందం ఎంతో సమన్వయంతో పనిచేసినట్లు కనిపించిందన్నారు. ప్రేమతో తీసిన సినిమా ఎప్పుడూ విఫలం కాదని చెప్పారు.సినిమాను తాను ఇప్పటికే చూశానని నాగార్జున తెలిపారు. సినిమా చూస్తూ బాగా నవ్వానని.. అదే సమయంలో కళ్లలో నీళ్లు కూడా వచ్చాయని చెప్పారు. మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో పాటు వినోదం కూడా సినిమాలో ఉందన్నారు. చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌లో రేవంత్ రెడ్డి-గీతారెడ్డి దంపతులు! ఈ వార్తకు సంబంధించిన

అఖిల్ అక్కినేని నటించిన తాజా గ్రామీణ యాక్షన్ డ్రామా 'లెనిన్' ఓటీటీలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఆగస్టు 7న జీ5 వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం, కేవలం 48 గంటల్లోనే 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ మార్కును అధిగమించింది. అఖిల్ కెరీర్లో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవడంతో పాటు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సినిమాకు ఉన్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జూలై 10న థియేటర్లలో విడుదలైన లెనిన్ చిత్రం, అఖిల్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. నాగార్జున అక్కినేని, నాగ వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులు లెనిన్ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సినిమా విడుదల తర్వాత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ప్రత్యేక డ్రోన్ షోలతో చిత్రబృందం ప్రచారాన్ని హోరెత్తించింది. ఈ భారీ ప్రమోషన్లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సినిమాకు వ్యూయర్షిప్ పెరగడానికి ప్రధాన కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీ5 సంస్థ ఈ సినిమాను తమ ప్లాట్ఫామ్లో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న చిత్రాలలో ఒకటిగా పేర్కొంది. ఇప్పటికే తేహ్రాన్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు ఇటువంటి రికార్డులను అందుకున్నాయి. తాజా గణాంకాలతో లెనిన్ చిత్రం ఆ జాబితాలో చేరి తన హవాను కొనసాగిస్తోంది. భవిష్యత్తులో ఈ చిత్రం మరిన్ని రికార్డులను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, ఇతర దక్షిణాది భాషల ప్రేక్షకుల నుండి కూడా ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. సినిమాలోని మాస్ అంశాలు, తమన్ సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మొత్తానికి లెనిన్ చిత్రం థియేటర్ల

'కుటుంబ పెద్దలే మన ఫౌండేషన్. వాళ్ళే మన బలం' అనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. క్యూట్ అండ్ డీప్ ఎమోషన్ తో కూడిన సందేశం ఈ సినిమా ఇవ్వబోతుంది. 'కుటుంబ పెద్దలే మన ఫౌండేషన్. వాళ్ళే మన బలం' అనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. క్యూట్ అండ్ డీప్ ఎమోషన్ తో కూడిన సందేశం ఈ సినిమా ఇవ్వబోతుంది. మా తాత ఏఎన్నార్ ఉండుంటే.. మంచి సినిమా చేశావని ప్రశంసించేవారు' అని సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రూపొందిన ‘పళ్ళ బురుసు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. సుప్రియ మాట్లాడుతూ 'అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ‘పళ్ళ బురుసు’ వంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడంతో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం. సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. మా తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు ఈరోజు ఉండి ఉంటే.. ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నన్ను తప్పకుండా అభినందించేవారు. ఆయన ఆశయాలు, విలువలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం నాకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది' అని అన్నారు. Tollywood: సీనియర్ నట, రచయిత కృష్ణేశ్వరరావు మృతి శంకర్ డైరెక్షన్లో అజిత్ సినిమా.. వర్కవుట్ అవుతుందా?' Ranabaali: ‘రణబాలి’ విడుదల తేదీ ఖాయమైనట్టేనా?

మంచి కథలతో వచ్చే కొత్తవారికి అవకాశాలు ఇచ్చి సినిమాలు నిర్మించేందుకు తమ అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధంగా ఉందంటూ టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున అదిరిపోయే ప్రకటన చేశారు. ‘పళ్ళ బురుసు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... మంచి కథ ఉన్నవారు ఎవరైనా సరే నేరుగా అన్నపూర్ణ స్టూడియోను సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు. స్టూడియో అంటే కేవలం లీజుకు ఇచ్చి డబ్బులు సంపాదించడం మాత్రమే కాదని, తిరిగి సినీ రంగానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే కొత్త దర్శకులతో చిత్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని సాధించామని, ఇప్పుడు ‘పళ్ళ బురుసు’ నిర్మించి రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’తో పాటు తన ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రాబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు. కాగా, గోమతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా ప్రధాన పాత్రల్లో ఉదయ్ చౌహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పళ్ళ బురుసు’ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది

తన తల్లిదండ్రులని తలుచుకుని హీరో నాగార్జున భావోద్వేగానికి లోనయ్యారు. ఈయన నిర్మించిన 'పళ్లబురుసు' అనే చిన్న సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. ఇందులోనే నాగ్ మాట్లాడుతూ ఎన్నడూ లేనంతలా ఎమోషనల్ అయ్యారు. తండ్రితో జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. త్వరలో మూడో పార్ట్?) 'నా తండ్రి ప్రారంభించిన ఈ సంస్థతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్‌ని మరింత విస్తరించాం. నా తల్లిదండ్రులని ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకున్నాను. నా భార్య అమల కూడా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమె కూడా తల్లిదండ్రులని ఎంతో శ్రద్ధగా చూసుకుంటోంది. తల్లిదండ్రులు మన కోసం చేసిన త్యాగాలని గుర్తించి వారికి అండగా నిలవడం మన జీవితంలో అత్యంత విలువైన బాధ్యత. తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవడం కంటే జీవితంలో గొప్ప అదృష్టం మరొకటి ఉండదు' అని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టారు. మొన్ననే కొడుకు అఖిల్‌తో తీసిన 'లెనిన్' సక్సెస్ అయింది. అలానే నాగ్ కూడా తన 100వ సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ కూడా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. (ఇదీ చదవండి: ‘వారణాసి’లో హనుమంతుడిగా రామ్ చరణ్?) కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు) ‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు) ‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు) హైదరాబాద్ గచ్చిబౌలి లో సందడి చేసిన టాలీవుడ్ ముద్దుగుమ్మ మానస చౌదరి (ఫొటోలు) రోజుకు 3 గంటల క్లాసులు.. ఏడాదికి రూ.9 లక్షల ఫీజు.. అమెరికా ప్రీస్కూల్ వీడియో వైరల్ Big Question: ఆ నిందితులను 3 రోజులు ఎక్కడ దాచిపెట్టారు నన్ను
నాగార్జునసాగర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు మరోసారి ప్రత్యేక జ్ఞాపకాలను గుర్తుచేసిన ప్రదేశం. విజయపురిలో సోమవారం నిర్వహించిన మహా వరుణయాగం ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ యాగంలో మధ్యాహ్నం 3.24 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణయాగాన్ని నిర్వహించారు. అనంతరం యాగ ప్రదక్షిణం, పుణ్యాహవాచనం, అంకురార్పణ, రుష్యశృంగ పూజ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతితో మహా వరుణయాగం సంపూర్ణమైంది. యాగం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సతీసమేతంగా నాగార్జునసాగర్ జలాశయాన్ని పరిశీలించారు.రేవంత్ రెడ్డి, గీత దంపతులకు నాగార్జున సాగర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. వారి ప్రేమకథ నాగార్జునసాగర్ నుంచే మొదలైంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో సీఎం రేవంత్, సతీమణి గీత వెల్లడించారు. ఇంటర్ చదువుతున్న సమయంలో నాగార్జునసాగర్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డికి గీతతో అక్కడే తొలి పరిచయం ఏర్పడింది. గీత కజిన్‌కు రేవంత్ ఫ్రెండ్ కాగా.. ఆ సమయంలో టూర్ కోసం వీరు నాగార్జున సాగర్ వెళ్లారు. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది.ముందు వీరి పెళ్లికి గీత తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా.. చివరకు అందర్నీ ఒప్పించి 1992లో పెద్దల అంగీకారంతో రేవంత్ రెడ్డి, గీత వివాహం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం నాగార్జునసాగర్ వద్ద రేవంత్‌రెడ్డి, గీత కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేవంత్ అభిమానులు గతంలో దిగిన ఫోటోను, ప్రస్తుత ఫొటోను షేర్ చేస్తూ.. '34 ఏళ్ల తర్వాత అదే చోట, అదే ప్రేమ. కొన్ని పరిచయాలు అనుకోకుండా జరుగుతాయి.. కానీ కొన్ని పరిచయాలు మాత్రం జీవితాంతం మనతోనే నడుస్తాయి. 34 ఏళ్ల క్రితం నాగార్జునసాగర్ వద్ద అనుకోకుండా మొదలైన ఒక పరిచయం.. కాలంతో పాటు బంధంగా మారి, ప్రేమగా మారి, జీవిత