
Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. '90స్' డైరెక్టర్పైట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. '90స్' డైరెక్టర్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
© 2026 nimisham.in

Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. '90స్' డైరెక్టర్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!

Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!

దర్శకుడు వెంకీ అట్లూరి సితార ఎంటర్టైన్మెంట్స్తో తనకున్న ప్రత్యేక అనుబంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్య కథానాయకుడిగా నాగవంశీ నిర్మించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సితార సంస్థతో తనకున్న సంబంధం డబ్బులు, అగ్రిమెంట్లకు అతీతమైనదని ఆయన స్పష్టం చేశారు. తన్ను నమ్మి వరుసగా అవకాశాలు ఇచ్చినందుకు ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితమే సిద్ధమైన కథఈ సినిమా వెనుక ఉన్న నిర్మాణ ప్రయాణాన్ని వెంకీ అట్లూరి వివరంగా పంచుకున్నారు. ఈ కథను 2022 లోనే రాసుకున్నానని, సూర్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా కొన్ని మార్పులు చేశానని తెలిపారు. సూర్య కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్న సమయంలో ఈ కథ వినగానే ఎంతో ఇష్టపడ్డారని పేర్కొన్నారు. అనవసరమైన కామెడీ లేకుండా కథను ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా చెప్పాలని సూర్య సూచించడంతో దానికి అనుగుణంగా చిత్రీకరించినట్లు వెల్లడించారు. పాత్రల ఎంపిక మరియు వసూళ్ల తీరుకథాంశం మరియు నటీనటుల ఎంపిక గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. 'ప్రేమలు' సినిమా చూసిన తర్వాత మమితా బైజును ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశామని, తమిళంపై ఆమెకున్న పట్టు సినిమాకు ప్లస్ అయిందని తెలిపారు. దీంతో తమిళ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని ప్రధానంగా తమిళంలో రూపొందించినట్లు చెప్పారు. అక్కడ థియేటర్లు, టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ప్రారంభ వసూళ్లు తక్కువగా కనిపిస్తాయి, అయితే లాంగ్ రన్ బలమైన ప్రభావం చూపిస్తుందని ఆయన విశ్లేషించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయంసినిమా వసూళ్ల వివరాలను చూస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా మొదటి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ₹155 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో నికరంగా ₹81.63 కోట్లు వసూలు

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, ‘విశ్వనాథ్ & సన్స్’ సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఈ సినిమా ప్రయాణం వెనుక ఉన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. త్రివిక్రమ్ గారి రచనలో ఉండే బలం, మీ రచనలో కనిపిస్తుంది అనే ప్రశంసలు రావడం ఎలా ఉంది? నేను సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి నింపినది మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు. అలాంటిది త్రివిక్రమ్ గారితో నన్ను పోల్చడం అనేది గౌరవంగా భావిస్తున్నాను. దానిని

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య వరుసగా బ్లాక్‌బస్టర్ విజయాలను చేతులారా వదులుకున్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) వరుసగా బ్లాక్‌బస్టర్ విజయాలను చేతులారా వదులుకున్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కింగ్ నాగార్జునకు వీరాభిమాని అయిన టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే, వెంకీ అట్లూరి ఇప్పటివరకు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల కథలన్నీ మొదట వెళ్లింది అక్కినేని కాంపౌండ్కేనట. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ చిత్రాలతో పాటు ఇతర హీరోలతో తీసి భారీ హిట్స్ కొట్టిన ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ కథలను కూడా తొలుత నాగచైతన్యకే వినిపించారట. అయితే వేర్వేరు కారణాలతో చైతూ వాటన్నింటినీ రిజెక్ట్ చేసినట్లు స్వయంగా వెంకీ అట్లూరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వెంకీ తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు టాలీవుడ్లో ఆయన పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ ఆయన కెరీర్లో 24వ చిత్రంగా రూపొందుతోంది. దీని తర్వాత చైతూ చేయబోయే ల్యాండ్‌మార్క్ 25వ సినిమా (సిల్వర్ జూబ్లీ ఫిల్మ్) బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే దానిపై అక్కినేని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి పేరు మరోసారి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. కథల ఎంపికలో వైవిధ్యం చూపుతూ వరుస హిట్స్‌తో గోల్డెన్ ఫామ్‌లో ఉన్న వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే చైతూ 25వ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ సైతం బలంగా కోరుకుంటున్నారు. గతంలో ‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ లాంటి వరుస బ్లాక్‌బస్టర్స్‌ను మిస్ చేసుకున్న చైతన్య.. ఈసారైనా వెంకీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక కాంబినేషన్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ

నిర్మాత నాగవంశీకి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్‌గా మారింది. వరుస విజయాలతో గతేడాది ఎదురైన నష్టాలు, విమర్శలకు బాక్సాఫీస్ కలెక్షన్లతో గట్టి సమాధానం ఇచ్చారు. టాలీవుడ్లో నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్, క్రేజ్ క్రియేట్ చేసుకున్న నిర్మాతలు మాత్రం కొందరే కనిపిస్తారు. అందులో ముందు వరుసలో వినిపించే పేరు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) అలియాస్ చింటూ. సినిమా మేకింగ్‌లోనే కాదు, ప్రమోషన్లలో కూడా ఆయన స్టైలే వేరు. మైక్ పట్టుకుంటే మనసులో ఏముందో ఓపెన్‌గా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం నాగవంశీ నైజం. ఎవరి కోసమో మాట మార్చకుండా, డేరింగ్ అండ్ డాషింగ్‌గా స్టేట్మెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రేమమ్ సినిమాతో నిర్మాతగా తన జర్నీ మొదలుపెట్టిన నాగవంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌ను టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ ఏటా కనీసం మూడు నాలుగు రిలీజ్‌లతో థియేటర్లను కళకళలాడేలా చేస్తుంటారు. అయితే సినిమా పరిశ్రమలో గెలుపోటములు సహజం. ఎంతటి టాప్ ప్రొడ్యూసర్‌కైనా ఒక్కోసారి లెక్కలు తప్పుతుంటాయి. గతేడాది నాగవంశీకి కూడా కొన్ని ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. గతేడాది నాగవంశీ ఏకంగా నాలుగు సినిమాలకు నిర్మాతగా, మూడు క్రేజీ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఇందులో డాకు మహారాజ్ (Daaku Maharaaj), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగే కింగ్డమ్ (Kingdom), మాస్ జాతర (Mass Jathara) చిత్రాలు యావరేజ్ టాక్‌తో నెట్టుకొచ్చాయి. అయితే ఆయన భారీ ఆశలు పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2 (War 2), రెట్రో (Retro) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ఈ

టాలీవుడ్ లో అంతే సక్సెస్ ఉన్న వాళ్ళకే ఇక్కడ డిమాండ్. ప్రస్తుతం వెంకీ అట్లూరి పరిస్థితి అదే. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి బాక్సాఫీస్ సక్సెస్ లతో పాటు ఇటీవల ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో వెంకీ అట్లూరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ట్రాక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడితో పని చేసేందుకు హీరోలు లైన్ లో ఉన్నారు. అయితే వెంకీ తన నెక్ట్స్ సినిమాను అక్కినేని హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన మైల్స్టోన్ 25వ చిత్రం కోసం దర్శకుడిని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు చైతన్య కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని చిత్రాలుగా ఇతర భాషల హీరోలతో పని చేసిన వెంకీ ఈసారి ప్రాపర్ తెలుగు హీరోతో ఓ వైవిధ్యమైన కథను తెరకెక్కించాలని భావిస్తున్నారు. గతంలో తాను రాసుకున్న అనేక కథలను ముందుగా నాగ చైతన్యకే వినిపించానని వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ క్రేజీ కాంబినేషన్‌ను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అక్కినేని అఖిల్ కు లెనిన్ తో సూపర్ హిట్ ఇచ్చాడు నాగవంశీ. ఇప్పడు నాగ చైతన్య మైల్ స్టోన్ మూవీని నాగవంశీ టేకప్ చేసి వెంకీ అట్లూరితో మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నడట నాగవంశీ

నాగచైతన్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మైలురాయి చిత్రం కోసం యువ దర్శకుడు వెంకీ అట్లూరిని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. గతంలో వెంకీ అట్లూరి పలు కథలను నాగచైతన్యకు వినిపించినట్లు ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ మరియు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి వరుస విజయాలతో వెంకీ అట్లూరి ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇతర భాషల హీరోలతో సినిమాలు చేసిన వెంకీ అట్లూరి, ఇప్పుడు ఒక స్వచ్ఛమైన తెలుగు కథతో ముందుకు రానున్నారు. ఇందుకోసం నాగచైతన్య సరైన ఎంపిక అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా కథాంశం వైవిధ్యంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నట్లు సమాచారం. ఇటీవల అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాగవంశీ, ఇప్పుడు నాగచైతన్యతో కలిసి మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య 25వ సినిమా బాధ్యతలను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది. అన్ని అంశాలు కుదిరిన తర్వాత త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కథ, కథనం మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా కొంత సమయం

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయాణం' అని సూర్య (Suriya) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ & సన్స్’ (Viswanath & Sons) వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. సక్సెస్ లో భాగంగా చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహించింది. సూర్య మాట్లాడుతూ 'వ్యక్తిగత అనుబంధాలతో కూడిన కుటుంబ కథలు చాలా ముఖ్యమైనవి. త్రివిక్రమ్ సర్ మొదటి నుంచి ఇలాంటి కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా ఈ తరహా కథలతో మరిన్ని సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి విజయాలను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో లెక్కలు కట్టలేం. ప్రేక్షకులు సినిమాలో నవ్విన నవ్వులు, పెట్టిన కన్నీళ్లను లెక్కల్లో చూపించగలమా? సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారు, ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేదే నాకు ముఖ్యం ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ అద్భుతమైన కథను, చక్కని పాత్రలను రాసి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రావడం, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడు నుంచి వచ్చాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. మమితా కేరళ నుంచి, రవీనా మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేమంతా

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయాణం' అని సూర్య (Suriya) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ & సన్స్’ (Viswanath & Sons) వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. సక్సెస్ లో భాగంగా చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహించింది. సూర్య మాట్లాడుతూ 'వ్యక్తిగత అనుబంధాలతో కూడిన కుటుంబ కథలు చాలా ముఖ్యమైనవి. త్రివిక్రమ్ సర్ మొదటి నుంచి ఇలాంటి కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా ఈ తరహా కథలతో మరిన్ని సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి విజయాలను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో లెక్కలు కట్టలేం. ప్రేక్షకులు సినిమాలో నవ్విన నవ్వులు, పెట్టిన కన్నీళ్లను లెక్కల్లో చూపించగలమా? సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారు, ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేదే నాకు ముఖ్యం ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ అద్భుతమైన కథను, చక్కని పాత్రలను రాసి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రావడం, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడు నుంచి వచ్చాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. మమితా కేరళ నుంచి, రవీనా మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేమంతా

సూర్య చివరగా `కరుప్పు` చిత్రంతో విజయాన్ని అదుకున్నారు. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకొని కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో తెలుగు సినిమా `విశ్వనాథ్ అండ్ సన్స్` చేశారు. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటించగా, రాధిక శరత్ కుమార్, రవీనా టండన్ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూర్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 14)న తెలుగు, తమిళంలో విడుదలైంది. మరి సూర్య తెలుగు మూవీ ఆకట్టుకుందా? ఆయనకు మరో హిట్ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. సంజయ్ విశ్వనాథ్(సూర్య) బిగ్ కార్పొరేట్ టైకూన్. చిన్నప్పట్నుంచి ఫిస్టల్ క్రీడలో రాణించాలనుకుంటాడు. నలభై ఏళ్ల వయసులో ఛాంపియన్‌గా నిలుస్తాడు. దీంతో ఆయనేంటో అందరికి తెలుస్తుంది. అదే సమయంలో దేశంలో ఎవరైనా మ్యానేజ్ చేయగల మోస్ట్ ఇన్ఫ్లూయెన్స్ డ్ పర్సన్ కూడా. అయితే నలభై దాటినా కూడా పెళ్లి చేసుకోడు. దానికి కారణం తన నాన్న అమ్మ నిర్మలమ్మ(రాధికా శరత్ కుమార్) ని కాకుండా నటి అంజలి(రవీనా టండన్)ని పెళ్లి చేసుకుంటాడు. దీంతో తమని దూరం పెట్టడంతో సంజయ్ బాధపడతాడు. తండ్రిని, అంజలి ఫ్యామిలీని హేట్ చేస్తాడు. అమ్మనే సర్వస్వంగా బతుకుతాడు. అయితే జీవితంలో అన్నీ సాధించిన తనకు పెళ్లి చేయాలని అమ్మ కోరుకుంటుంది. కానీ సంజయ్ నో చెబుతాడు. కానీ అమ్మ కోరిక మేరకు సరోగసి ద్వారా అబ్బాయికి తండ్రి అవుతాడు. అతను చిన్నప్పుడే బోన్ మ్యారోకి సంబంధించిన లోపంతో బాధపడతాడు. దానికి తన సరోగసి మదర్ కావాల్సి వస్తుంది. ఆమెనే మ్యాడీ(మమితా బైజు). డబ్బు కోసం ఆ పని చేస్తుంది. తనకు ఎవరూ లేరు. ఇప్పుడు సంజయ్ రిక్వెస్ట్ మేరకు ఆమె బోన్ మ్యారో రీప్లేస్‌మెంట్‌కి ఓకే చెబుతుంది. దీనికోసం సంజయ్ ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో సంజయ్‌కి ఆమె

నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ఎప్పుడు మాట్లాడినా కాస్త ఓపెన్ గా, ఓవర్ గా మాట్లాడతారనే విషయం అందరికీ తెలిసిందే. అది ఆయన తెచ్చిపెట్టుకున్నది కాదు, ఆయన నైజం అది. తాజాగా మరోసారి ఆయన అంతే ఓపెన్ గా మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే ఓపెన్ ఛాలెంజ్ లాంటిది అనుకోవచ్చు. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా ప్రమోషన్ లో మాట్లాడారు నాగవంశీ. ఈ సినిమాతో పాటు సూర్యను చాలా విధాలుగా పొగిడారు. వాటన్నింటి కంటే ఆయన ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ చాలామందిని ఆకర్షించింది, మరెంతో చర్చకు దారితీసింది. “నేను చాలా రోజుల తర్వాత స్టేజ్ పైన నమ్మకంగా ఓ సినిమా బాగుందని చెబుతున్నాను. ఇన్నాళ్లూ నేను తగ్గాను, భయపడ్డాను. కానీ చాలా రోజుల తర్వాత ధైర్యంగా, సభాముఖంగా చెబుతున్నాను. సినిమా చాలా చాలా బాగుంది.” సినిమాల్లో వంకలు వెతకడం సహజమని, ఆ చిన్నచిన్న వంకల గురించి తను ప్రస్తుతం చర్చించలేనని, ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా కచ్చితంగా 90 శాతం తృప్తినిస్తుందని చెబుతున్నాడు. నాగవంశీ స్పీచ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. “వార్-2” సినిమా నుంచి నాగవంశీ ఏం మాట్లాడినా దాన్ని ట్రోల్ చేయడం కామన్ అయిపోయింది. గతేడాది సరిగ్గా ఇదే టైమ్ కు ఇలానే మాట్లాడి ఎన్టీఆర్ అభిమానుల్ని ఫూల్స్ చేశావంటూ నాగవంశీని ట్రోల్ చేస్తున్నారు. ఈసారి నాగవంశీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఎఁత నిజం అవుతుందో త్వరలోనే తేలిపోతుంది

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya), డైరెక్టర్ వెంకీ అట్లూరి(venky Atluri)పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విశ్వనాథ్ & సన్స్(Vishwanath & Sons) ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన, లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమా చూసిన తర్వాత వెంకీ అట్లూరితో తప్పకుండా వర్క్ చేయాలని తాను డిసైడ్ అయినట్టు వెల్లడించారు. డైరెక్టర్ వర్క్ తనను ఎంతగా ఆకట్టుకుందో సూర్య మాటల్లో స్పష్టంగా కనిపించింది. లక్కీ భాస్కర్ తర్వాత ఆయన ఏ స్క్రిప్ట్ తీసుకొచ్చినా ఓకే చెప్పాలని డిసైడ్ చేసుకున్నానని, ఎందుకంటే ఆయనతో వర్క్ చేయాలని తాను మానిఫెస్ట్ చేస్తున్నానని, తర్వాత ప్రొడ్యూసర్ వంశీ(naga vamsi) నుంచి ఫోన్ వచ్చిందని, వంశీ గారు ఫోన్ చేసి వెంకీ గారి డేట్స్ ఉన్నాయని చెప్పారని, కానీ మొదట అనుకున్నది పూర్తిగా వేరే బయోపిక్ కథ అని సూర్య అన్నారు. ఈ కామెంట్స్ వెంకీ అట్లూరిపై ఆయనకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్ హీరోలు సాధారణంగా కథ, పాత్ర, మార్కెట్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఒక ప్రాజెక్ట్‌కు అంగీకరిస్తారు. అలాంటి సమయంలో కథ వినకముందే డైరెక్టర్ తర్వాతి స్క్రిప్ట్‌కు ఓకే చెప్పాలనుకున్నానని సూర్య చెప్పడం విశేషంగా మారింది. ఇదే సందర్భంలో ఆయన ప్రస్తావించిన వెంకీ డేట్స్, బయోపిక్ కథ అంశం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు సూర్యతో నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. సూర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీతో సూర్యలో మరోసారి సంజయ్ రామస్వామిని గుర్తుకు తెస్తామని ప్రకటించారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. మదర్ సెంటిమెంట్ ఈ మూవీలో మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా చూశాక మీ మదర్‌ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తారని అన్నారు. రాధిక క్యారెక్టర్ చూస్తే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూస్తారని అన్నారు. ఈ సినిమా త్రివిక్రమ్‌కు కూడా నచ్చిందని వెల్లడించారు. ఆయన మెచ్చుకున్న ఏ సినిమా నాది ఫెయిల్ అవ్వలేదని పేర్కొన్నారు. హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..? భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నిర్మాతలలో నాగవంశీ ఒకరు. చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమా, భారీ సినిమా ఇలా తేడా లేకుండా నాగవంశీ సితార సంస్థ నుంచి క్రేజీ చిత్రాలు వస్తున్నాయి. ఆగష్టు 14న నాగవంశీ నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం రిలీజ్ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అగ్ర హీరో సూర్య నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో నాగవంశీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. తన బాబాయ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత చినబాబు (రాధాకృష్ణ) సహకారంతో సహకారంతో నాగవంశీ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. హారిక అండ్ హాసిని సంస్థ సినిమాలలో కూడా నాగవంశీ ఇన్వాల్వ్ అవుతుంటారు. నాగవంశీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అజ్ఞాతవాసి మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు గుంటూరు కారం చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ పరంగా పర్వాలేదు అనిపించింది. నాగవంశీ మాట్లాడుతూ.. అజ్ఞాతవాసి మూవీ బాక్సాఫీస్ వద్ద బాగా నిరాశపరిచింది. అది వాస్తవమే. కానీ గుంటూరు కారం అలా కాదు. కొన్ని ఏరియాలో చాలా బాగా వర్కౌట్ అయింది. నైజాం, ఓవర్సీస్ లో సరిగ్గా ఆడలేదు. కానీ గుంటూరు కారం చిత్రానికి ఎక్కువగా నెగిటివ్ టాక్ వచ్చింది. దీనికి సినిమా కంటెంట్ కంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎక్కువ కారణం అయ్యాయి. అదే సినిమాని డ్యామేజ్ చేసింది. అదే సంక్రాంతికి గుంటూరు కారంతో పాటు హనుమాన్ కూడా రిలీజ్ అయింది. అందరూ ఈ రెండు చిత్రాలని కంపేర్ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో థియేటర్ల గొడవ ఎక్కువ జరిగింది. ఈ అంశాల వల్లే గుంటూరు కారం చిత్రానికి డ్యామేజ్ జరిగింది అని నాగవంశీ తెలిపారు. గుంటూరు కారం, హనుమాన్ రెండు చిత్రాలు 2024

Vishwanath And Sons : సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వనాధ్ & సన్స్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పలు సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు. విశ్వనాధ్ & సన్స్ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సౌత్ మొత్తం రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కూడా ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు చెన్నై, కేరళ కొచ్చిలో ఈవెంట్స్ నిర్వహించగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తాజాగా ప్రకటించారు. విశ్వనాధ్ & సన్స్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. రేపు ఆగస్టు 11న సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ జరగనుంది. మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. Also See : Farnaz Shetty : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్.. ఫర్నాజ్ శెట్టి ఫొటోలు.. విశ్వనాధ్ & సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా చేయనున్నారు. తెలుగులో కూడా సూర్యకు అభిమానులు చాలామంది ఉన్నారని తెలిసిందే. రేపు విశ్వనాధ్ & సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీగా సూర్య అభిమానులు తరలిరానున్నారు. ఈ ఈవెంట్ కి మూవీ టీం మొత్తం హాజరవనుంది. గెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తారని సమాచారం

నిర్మాత నాగవంశీ.. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్. మోస్ట్ వైరల్ ప్రొడ్యూసర్ అంటే ఆయనే అని చెప్పొచ్చు. ఆయన మీడియా ముందుకు వచ్చాడంటే వైరల్ అయిపోవాల్సిందే. బోల్డ్ గా కామెంట్లు చేస్తూ వైరల్ అవుతుంటాడు. అదే సమయంలో ట్రోల్స్ కి గురవుతుంటాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఆయన బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సినిమా కలెక్షన్ల గుట్టు రట్టు చేశాడు. అదే సమయంలో సినిమాకి సంబంధించిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి ఓపెన్ అయ్యాడు. తప్పు ఎవరిదో బయటపెట్టాడు. తమ తప్పు లేదనే విషయాన్ని ఆయన చెప్పడం గమనార్హం. పోస్టర్‌పై వేసే కలెక్షన్లు నిజం కాదని చెప్పేశాడు. అవి కచ్చితంగా ఇన్ఫ్లూయెన్స్ అయినవే అని, ప్రతి ఒక్కరు అలానే చేస్తారని, ఒరిజినల్ నెంబర్స్ ఎవరూ వేయరని చెప్పారు. అభిమానుల కోసం, వారి ఆనందం కోసం ఇలా పోస్టర్ పై ఎక్కువ కలెక్షన్లు వేస్తారని వెల్లడించాడు. హీరోల అభిమానులను హ్యాపీ చేయడానికి ఇలాంటివి తప్పదని వెల్లడించాడు నాగవంశీ. అదే సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ రాదా అనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ, తాము వేసే పోస్టర్ లెక్కలు ఫేక్ అని, అవి నిజం కాదని వాళ్లకి కూడా తెలుసు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే ఐటీ వాళ్లు కూడా ఈ లెక్కలను నమ్మరు అని చెప్పడం విశేషం. ఫేక్ కలెక్షన్లని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదని, దాన్ని ఎవరూ పట్టించుకోరని చెప్పారు. అయితే తాను సినిమా రిలీజ్‌కి ముందు మీడియాతో మాట్లాడినప్పుడు సినిమాపై హైప్ కోసం కొన్ని మాట్లాడాల్సి వస్తుందని, జర్నలిస్ట్ లు గిల్లే ప్రశ్నలు అడగడంతో వాళ్లకి అదే స్థాయిలో సెటైరికల్ గా సమాధానం చెబుతానని, దాన్ని వాళ్లు వైరల్ చేస్తున్నారని, ట్రోల్ చేస్తున్నారని చెప్పాడు. అదేసమయంలో తాను మాట్లాడే మాట తీరుని బట్టే సినిమా ఆడుతుందా లేదా అనేది తెలిసిపోతుందని, అభిమానులు, ఆడియెన్స్ ఫిక్స్ అవుతారని వెల్లడించారు. సినిమా ఖర్చులు(కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్)

Naga Vamsi: సినిమా ఫీల్డ్ బయటికి ఎంతో కలర్‌ఫుల్ ప్రపంచంలా కనిపించినప్పటికీ.. నిర్మాతలు, దర్శకులు ఎదుర్కొనే ఒత్తిడి అంతా బయటకు కనిపించదని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. సినిమా ఫెయిల్యూర్‌ను తాను అంత సింపుల్‌గా తీసుకోలేనని, సినిమా రిలీజ్‌కి ముందు తీవ్ర ఒత్తిడికి గురవుతానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా నిర్మాణంలో ఉండే మానసిక ఒత్తిడి, రిలీజ్ సమయంలో ఎదురయ్యే టెన్షన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూరేనని.. దాన్ని తాను అంత ఈజీగా అంగీకరించలేనని చెప్పారు. సినిమా ఫలితం నెగిటీవ్ వస్తే కొన్ని రోజుల పాటు తాను మానసికంగా తీవ్రంగా ప్రభావితమవుతానని చెప్పారు. ముఖ్యంగా సినిమా రిలీజ్‌కి ముందు రోజు తనకు అసలు నిద్ర, తిండి ఉండవని నాగవంశీ పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత రెవెన్యూ సెటిల్మెంట్కు సంబంధించిన విషయాలు స్పష్టంగా తెలిసే వరకు తీవ్ర ఆందోళన ఉంటుందని చెప్పారు. బయటకు చూస్తే నిర్మాతలు చాలా ప్రశాంతంగా, సంతోషంగా కనిపించినప్పటికీ.. వారి మనసులో ఎలాంటి ఒత్తిడి నడుస్తుందో ఎవరికీ తెలియదన్నారు. తనతో పాటు ప్రయాణించే ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు మాత్రమే తన ఒత్తిడి ఎంత ఉంటుందో తెలుసని అన్నారు. వారితో తరచూ ఫోన్లో మాట్లాడుతుంటానని, తన ఆందోళనను దగ్గరగా ఉండేవారే అర్థం చేసుకోగలరని చెప్పారు. సినిమా రిలీజ్‌కు ముందు వారం రోజుల పాటు అంతా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుందని.. అయితే నిర్మాత, దర్శకుడి మనసులో మాత్రం ఎన్నో టెన్షన్స్ ఉంటాయని నాగవంశీ కామెంట్స్ చేశారు. బయట నుంచి చూసినంత గ్లామరస్‌గా సినిమా ఫీల్డ్ ఉండదని, ప్రతి సక్సెస్ వెనుక ఎంతో ఒత్తిడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు

Nagavamsi: సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమా బడ్జెట్లు, ఆదాయ వ్యయాల లెక్కలపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వ శాఖలకు పూర్తి సమాచారం ఉంటుందని, కాబట్టి కలెక్షన్ల విషయంలో ఏదీ దాచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించే విధానం, పన్నుల వ్యవహారం, జీఎస్టీ అమలు తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్లలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. సినిమా పోస్టర్లపై ప్రచారం చేసే కలెక్షన్లకు, వాస్తవ లెక్కలకు మధ్య తేడా ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా తెలుసని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ, టీడీఎస్ వంటి పన్నుల వ్యవస్థల కారణంగా సినిమా పరిశ్రమలో ఆర్థిక లావాదేవీలు గతంతో పోలిస్తే మరింత పారదర్శకంగా మారాయని అన్నారు. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా జీఎస్టీ ఇన్పుట్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలైనంత వరకు బ్యాంకింగ్ మార్గాల్లోనే లావాదేవీలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. సినిమా బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించడం వల్ల నిర్మాతలకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక సినిమా నిజంగా ఎంత వసూలు చేసిందో ప్రభుత్వ విభాగాలకు వివిధ మార్గాల ద్వారా తెలిసే అవకాశం ఉందన్నారు. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న డేటా, టెక్నాలజీ కారణంగా సినిమాల వాస్తవ ఆర్థిక లావాదేవీలను గుర్తించడం కష్టమైన పని కాదని అన్నారు. మరోవైపు సినిమా నిర్మాణంలో ఖర్చులను పెంచి చూపించడం వల్ల కూడా చివరికి నిర్మాతకే నష్టం జరుగుతుందని నాగవంశీ పేర్కొన్నారు. ఖర్చులు పెరిగితే లాభాల మార్జిన్ తగ్గిపోతుందని, అందువల్ల అలా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక సినిమా హిట్ అయిన తర్వాత దాని