
ఆసై దోసై అప్పళం వడై
ప్రతి ఇంటిలో మనం మరచి΄ోయిన ఒక నిధి ఉంటుంది. కొద్దిమందికి ఆ నిధి అకస్మాత్తుగా గుర్తుకు వచ్చి వెలుగులోకి తెస్తారు. ఆ వెలుగులు పిల్లల ప్రపంచంలోకి వస్తే ఎంత బాగుంటుంది? ఎంత బాగుంటాయో చెబుతున్నాయి అమ్మ చెప్పిన కథలు. ‘ఫోక్టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో వచ్చిన పుస్తకం సోషల్ మీడియాలో ఎట్రాక్షన్గా మారింది. ‘నాకు కూడా మా అమ్మ చెప్పిన కథలు గుర్తుకు వస్తున్నాయి’ అంటూ కలం పడుతున్నారు నెటిజనులలో కొందరు... చిన్నప్పుడు తల్లి తనకు చెప్పిన జానపద కథలను ఈతరం పిల్లలకు ‘ఫోక్ టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో చేరువ చేస్తున్నారు నారాయణ్. అమ్మ చెప్పిన ఆ కథలు ఎలా ఉంటాయి? ఏనుగు పక్కింటి అబ్బాయిలా పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. పులి గాండ్రిస్తూనే ‘హాయ్’ చెబుతుంది. గర్జిస్తూనే సింహం మన యోగక్షేమాలు అడుగుతుంది. ఒక్కటా రెండా... ఎన్నెన్ని చిత్రవిచిత్రాలో! ఈ పుస్తకంలో 21 కథలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. నైతిక విలువలు అంటే ఏమిటో చెప్పకనే చెబుతాయి. తెల్లగుర్రంపై ఎక్కించి మేఘాలపై స్వారీ చేయిస్తాయి. పనిదొంగ పక్షులు అనగనగా ఒక కోడి. ఆ కోడి పిండి కలిపి చపాతీలు చేస్తుండగా, దాని పొరుగున ఉన్న కాకి, పిచ్చుక, బాతు, చిలకలాంటివి కోడికి సహాయం చేయకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటాయి. అయితే, వేడి వేడి చపాతీలు రెడీ అయిన వెంటనే... ‘మాకు కూడా’ అంటూ ఆత్రుతగా కోడి చుట్టూ చేరతాయి. అప్పుడు కోడి నోటి నుండి... ‘ఆసై దోసై అప్పళం వడై’ అనే పాట వినిపిస్తుంది. పిల్లలకు తెగ నవ్వొస్తుంది. ఇక ‘కా...కా’ కథ విషయానికి వస్తే, ఒక సోమరి కాకి తన ఆహారాన్ని వెదుక్కోవడానికి బద్దకించి, పిచ్చుకల నుండి దొంగిలిస్తుంటుంది. ఆహారాన్ని దొంగిలించడంలో అపారమైన తెలివితేటలు చూపే కాకి అత్యంత సులువుగా ఉచ్చులో పడుతుంటుంది. తన మూర్ఖత్వాన్ని చాటుకుంటుంది. పాటల కథలు! అమ్మ చెప్పిన కథలలో పాటలు, కవితలు ఉండడం మరో