
నెల్లూరులో పండుగలా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న మంత్రి నారాయణ
Nellore: నెల్లూరులో పండుగలా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న మంత్రి నారాయణ! ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Nellore: నెల్లూరులో పండుగలా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న మంత్రి నారాయణ! ఈ వార్తకు సంబంధించిన

Minister Narayana: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాతావరణం వచ్చినట్టే కనిపిస్తోంది.. ఎన్నికల ప్రక్రియకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. మరోవైపు.. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ.. స్థానిక సంస్థల్లో వాటిని అమలు చేసేలా కూడా నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, ఈ సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోర్టు తీర్పుపై ఆధారపడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలపై కోర్టు తీర్పు రావాల్సి ఉందని, తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నీటి సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనలపై కూడా మంత్రి నారాయణ స్పందించారు. డేటా సెంటర్ల కారణంగా విశాఖలో నీటి సమస్యలు రావని స్పష్టం చేశారు. విశాఖ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఇక, భోగాపురం వెళ్లే రహదారి మరమ్మతులకు గురైనట్టు తన దృష్టికి రాలేదని మంత్రి నారాయణ అన్నారు. అయితే రహదారి పరిస్థితిపై పరిశీలన చేస్తామని చెప్పారు

సాక్షి,కృష్ణా: ఉయ్యూరులో డయేరియా (అతిసారం) ప్రబలిందనే విషయాన్ని స్వయంగా అంగీకరించిన మంత్రి నారాయణ, దాని వ్యాప్తికి గల కారణాలపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆర్వో ప్లాంట్ల (నీటిని శుద్ధి చేసే యంత్రాలు) నుంచి కూడా నీరు తాగుతున్నారని, వాటి వల్ల కూడా అతిసారం రావచ్చు కదా అంటూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాగునీటి పైపులైన్లను భారీగా మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందంటూ మున్సిపల్ శాఖ వైఫల్యాలను పరోక్షంగా ఒప్పుకున్నారు. డయేరియా తీవ్రంగా ఉన్న అసలు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించకుండా, బాధితుల ఇబ్బందులను తెలుసుకోకుండా మంత్రి నారాయణ మొహం చాటేశారని స్థానికులు మండిపడుతున్నారు. ఉయ్యూరులో డయేరియా కారణంగా సంభవించిన మరణాన్ని మంత్రి నారాయణ సహజ మరణంగా ధృవీకరించడం తీవ్ర వివాదాస్పదమైంది. బాధితుడు నూరుద్దీన్ డయేరియాతో కాకుండా కేవలం గుండెపోటుతోనే చనిపోయాడంటూ మంత్రి సమర్థించుకోవడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మొత్తంగా, బాధితులకు భరోసా ఇవ్వాల్సిన మంత్రి, వాస్తవాలను కప్పిపుచ్చుతూ పర్యటనను ముగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు..ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @ NO.1 ఎవరికీ సాధ్యం కాని ఘనత

కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా విస్తరిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయేరియా బాధితులను ఆయన ఈరోజు పరామర్శించారు. స్థానిక 5వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారని, బాధితులందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. ఆగస్టు 17న మృతి చెందిన ఒక వ్యక్తి గుండెపోటు కారణంగానే కన్నుమూశారని, ఆ మరణానికి డయేరియాకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి తేల్చిచెప్పారు. ప్రాథమిక నీటి పరీక్షల నివేదిక ప్రకారం తాగునీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని వెల్లడైందన్నారు. సమస్యకు కారణం మున్సిపల్ పైప్లైన్లా లేక ప్రైవేట్ ఆర్వో ప్లాంట్లా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని వివరించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో పాత పైప్లైన్లను మారుస్తున్నామని, అందులో భాగంగా ఉయ్యూరులో రూ. 98 కోట్లతో పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఏపీలో కీలకమైన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్ పర్సన్లను ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకునేందుకు మార్గం సుగమం అయింది. గతంలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని 2005లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి సర్కార్ దీన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు నిన్న కేబినెట్లో ఆమోదించిన బిల్లును ఇవాళ అసెంబ్లీలో (AP Assembly)ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో మున్సిపల్ చట్టంలో సవరణలు రానున్నాయి.మండలిలో వైసీపీకి హ్యాట్రిక్..! కూటమి మళ్లీ చేతులెత్తేసిందా ?1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని, 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని మంత్రి నారాయణ ఈ బిల్లుపై మాట్లాడుతూ వెల్లడించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి ఎన్నికైన మేయర్, చైర్మన్‌కు బలమైన ప్రజామోదం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల మేయర్ లేదా చైర్మన్‌పై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదన్నారు. తొలి రోజే మండలి డిప్యూటీ ఛైర్మన్ కు కూటమి షాక్..! బొత్స ఫైర్..!ప్రత్యక్ష ఎన్నికల విధానంతో మేయర్, చైర్మన్లు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు ఇది పనికొస్తుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. అభివృద్ధి పనుల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో మెరుగైన సమన్వయం చేసుకుంటూ పనులను

Minister Narayana: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కొన్ని స్థానిక సంస్థలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటంతో గతంలో వాటిని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మిగిలిన అన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. పవన్ కల్యాణ్ గైర్హాజరుపై వక్రభాష్యం వద్దు అమరావతిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడంపై మంత్రి నారాయణ స్పందించారు. ఈ విషయాన్ని ఎవరూ వక్రంగా అర్థం చేసుకోవద్దని సూచించారు. తానే స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్‌ను కార్యక్రమానికి ఆహ్వానించానని తెలిపారు. అయితే ఆపరేషన్ చేయించుకున్న కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేనని పవన్ తనకు చెప్పారని మంత్రి వివరించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావడం లేదని మంత్రి నారాయణ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రోజువారీ చెత్త సేకరణపై దృష్టి ఇళ్ల నుంచి వచ్చే చెత్తను రోజుకు రోజే తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన రోడ్లు, వీధి లైట్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వసతులు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం లక్షల టన్నుల లెగసీ చెత్తను పేరుకుపోయేలా చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని.. ఏపీకి ఆర్థిక రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు భావించారని మంత్రి నారాయణ తెలిపారు. తెలంగాణకు వచ్చే ఆదాయం హైదరాబాద్ నుంచే ఎక్కువగా వస్తోందన్నారు. అమరావతి, ఆగస్టు 13: రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని.. ఏపీకి ఆర్థిక రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు భావించారని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు(గురువారం) సీడ్ యాక్సెస్ రోడ్ రెండో దశను, బకింగ్‌హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జిను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణకు వచ్చే ఆదాయం హైదరాబాద్ నుంచే ఎక్కువగా వస్తోందన్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులకు ముంబాయి, బెంగళూరు, చెన్నైల ద్వారా ఆదాయం వస్తోందని తెలిపారు. ఆర్థిక రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా అందించిందని చెప్పుకొచ్చారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నార్మల్ ఫాస్టర్స్ లండన్ వారిని సంప్రదించినట్లు తెలిపారు. కృష్ణానది ఒడ్డున అమరావతి కడితే అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడించారు. అమరావతి.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మధ్యలో ఉంటుందని మంత్రి తెలిపారు. రైలు, రోడ్డు మార్గం అందుబాటులో ఉందన్నారు. 2015 జనవరిలో ల్యాండ్ పోలింగ్ నోటిఫికేషన్ ఇచ్చామని.. కేవలం 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలను రైతులు ఇచ్చారని వివరించారు. అమరావతిలో పనులు ప్రారంభించడం, టెండర్లు పిలవడం, ఇతర పనులు చేపట్టడానికి మూడున్నర సంవత్సరాలు పట్టిందన్నారు. మిగిలిన సంవత్సరం 6 నెలల్లో పదివేల కోట్లు అమరావతి కోసం ఖర్చు చేశామని అన్నారు. ఇంతలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడిందని మంత్రి విమర్శించారు. అమరావతి నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపేసిందన్నారు. నిర్మాణ సంస్థల ఒప్పందాలను క్లోజ్ చేయకుండా వదిలేసిందని.. దీంతో కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చాక ఆయా సంస్థలతో ఒప్పందాలను టెక్నికల్‌గా క్లోజ్ చేసి తిరిగి టెండర్లు పిలవాల్సి వచ్చిందని అన్నారు. గతంలో ఉన్న పనుల నాణ్యతను