
ఇరుముడి’లో ఎలా అవకాశం వచ్చిందంటే
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. ఇందులో రవితేజ కుమార్తెగా నటించిన బేబి నక్షత్ర చిత్ర విశేషాలను తెలిపారు. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ (Irumudi). ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆగస్ట్ 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో ఓ రేంజ్లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్ర (Baby Nakshathra), మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ‘‘నా పేరు నక్షత్ర. మాది కేరళ. ఏడో క్లాస్ చదువుకుంటున్నాను. ఇప్పటివరకు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కలిపి ఆరు సినిమాలు చేశాను. తెలుగులో ఇదే నా మొదటి చిత్రం. దర్శకుడు శివ నిర్వాణ ఇన్‌స్టాగ్రామ్‌లో నా రీల్స్ చూసి ముందుగా.. మా అమ్మను సంప్రదించారు. ‘ఇరుముడి’ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఒకే ఒక్కసారి శబరిమల వెళ్లాను. రవితేజ సార్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటించిన ‘విక్రమార్కుడు’ సినిమా నాకు చాలా ఇష్టం. ‘ఇరుముడి’ చిత్రంలో నా పాత్ర పేరు మణికంఠ. నేను రవితేజ సార్ కూతురిగా కనిపించబోతున్నాను. ప్రియా మేడమ్ నా తల్లి పాత్రలో నటించారు. ఇద్దరూ నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ సినిమాకి నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పాను. నా కెరీర్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సందర్భంగా మా

