
భర్త చిన్నవాడైనా ఓకే.. పెళ్లిపై మారిన యువతరం ఆలోచన
ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో వధూవరుల మధ్య ఐదు, పదేళ్ల వయసు తేడా ఉన్నా ‘ఈడూ జోడూ బాగుంది’ అని మురిసిపోయేవారు. అబ్బాయి వయసులో కాస్త పెద్దవాడైతేనే బంధం నిలబడుతుందని, పరిణతితో సంసారాన్ని నడిపిస్తాడని బలంగా నమ్మేవారు. కానీ, కాలం మారింది. డిజిటల్ యుగంలో పుట్టిపెరిగిన నేటి తరం యువత, పెళ్లి బంధంపై సరికొత్త నిర్వచనాలు రాస్తోంది. వయసు అంతరం (ఏజ్ గ్యాప్) అనే అంశం ఇప్పుడు వధూవరుల ఎంపికలో అత్యంత కీలక ఫిల్టర్‌గా మారింది.లక్షల జీతం ఉన్నా.. ఆ గ్యాప్ ఉంటే వద్దు!ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్ల సమాచారం ఈ మార్పును స్పష్టంగా చూపిస్తోంది. రూ.20 లక్షల వార్షిక వేతనం, నగరంలో సొంతిల్లు, సమాజంలో మంచి హోదా.. ఇవన్నీ ఉన్నప్పటికీ, అబ్బాయి వయసు అమ్మాయి కంటే 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే చాలు, దాదాపు 65 శాతం మంది యువతులు ఆ ప్రొఫైళ్లను ప్రాథమికంగానే తిరస్కరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని 78 శాతం మంది యువత, తమకు కాబోయే భాగస్వామితో కేవలం 1 నుంచి 3 ఏళ్ల వయసు వ్యత్యాసం మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారు.ఈ మార్పు ఇక్కడితోనే ఆగలేదు. పెళ్లిలో పురుషుడే పెద్దవాడై ఉండాలనే సంప్రదాయ ఆలోచనా ధోరణి కూడా క్రమంగా బలహీనపడుతోంది. భార్యాభర్తల మధ్య వయసు తేడా కేవలం కొన్ని నెలలు ఉండటమే కాదు, అబ్బాయి అమ్మాయి కంటే ఆరు నెలల నుంచి ఏడాది చిన్నవాడైనా పర్వాలేదని అంగీకరిస్తున్న వారి సంఖ్య 4 శాతానికి పెరగడం గమనార్హం. ఇది చిన్న శాతమే అయినా