
రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది
Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే! ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే! ఈ వార్తకు సంబంధించిన

తనకు సంబంధించిన వివాదంపై కాంగ్రెస్ అగ్రనేతలకు ఇప్పటికే రాతపూర్వకంగా వివరించినట్లు కొండా సురేఖ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వ్యక్తిగతంగా కలిసి తాజా పరిణామాలపై మాట్లాడినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర ముఖ్య నేతలకు కూడా తన వాదనను లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో తనపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించానని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరానని తెలిపారు. పార్టీ నాయకత్వం తన వివరణ విన్న తర్వాత ఆలోచిస్తామని చెప్పిందని వెల్లడించారు. ప్రస్తుతం తనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై వేచి చూస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను తన రాజకీయ జీవితంతో ముడిపెట్టడం సరికాదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కుమార్తెకు స్వతంత్ర వ్యక్తిత్వం ఉందని, ఆమె తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు స్వయంగా తీసుకుంటుందని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఆమె మరో కుటుంబంలో భాగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉండవచ్చని అన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తాను ఖండించబోనని, అదే సమయంలో సమర్థించబోనని స్పష్టం చేశారు. దేశంలో ప్రతిరోజూ ఎంతో మంది అనేక అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారని, కేవలం తన కుమార్తె కావడం వల్ల ఆమె మాటలకు తనను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. తాను, తన భర్త రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలు వేరని, కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాలు వేరని పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిపారు. తనపై మాత్రమే చర్యల విషయంలో చర్చ జరగడంపై కొండా సురేఖ ప్రశ్నలు సంధించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తన విషయంలో ఒక విధమైన ప్రమాణాలు, క్యాబినెట్‌లోని ఇతర సామాజిక వర్గాల నేతల విషయంలో మరో విధమైన ప్రమాణాలు అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇతర మంత్రులపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై పార్టీ వైఖరి

కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు(బుధవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సురేఖ మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని అన్నారు. అధిష్ఠానం ఏం చేస్తుందో వేచిచూస్తున్నట్లు తెలిపారు. రాజీనామా చేయాలని తనను కోరలేదని చెప్పారు. బీసీ అయిన తనకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం పాటిస్తారా అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేబినెట్లో ఉన్న ఇతర సామాజికవర్గాల నేతలపై పెద్దఎత్తున అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారని.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగారు. అన్ని అంశాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా అధిష్ఠాన పెద్దలందరికీ రాతపూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌పై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గేకు చెప్పినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్ కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, సెప్టెంబర్ 2: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు సీఎం అని రేవంత్ ఎలా అంటారని ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గేను కలిశానని, కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని తెలిపారు. వాళ్లు ఏం చేస్తారో వేచి చూస్తున్నానని కొండా సురేఖ పేర్కొన్నారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన సోనియాగాంధీ కుటుంబం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినందుకు.. నిరసనగా ఈరోజు (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద గంటసేపు రోడ్డుపై బైఠాయించి మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహించి దేశ ప్రజలను చైతన్యం చేశారని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. అలాంటి కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఉత్తరప్రదేశ్‌లోని అల్ది హల్ద్వానిలోని ర్యాలీ వేదికను ఎక్కారని.. శుద్ధి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. ఆ విషయాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ‘మోదీ హటావో దేశ్‌కి బచావో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి ‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత జి.చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వనపర్తి ఎమ్మెల్యే టి. మేఘారెడ్డి నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న చిన్నారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.శుక్రవారం న్యూఢిల్లీలో తన మద్దతుదారులతో కలిసి ఖర్గేను కలిసిన మేఘారెడ్డి.. చిన్నారెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారని వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ ఫిర్యాదుపై ఖర్గే సానుకూలంగా స్పందించారని, నివేదిక ఇవ్వాలని తన కార్యాలయాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అన్ని ఆధారాలు ఇచ్చామని, ఆ కమిటీ చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసిందని వివరించారు.ఇటీవల వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. 2023 ఎన్నికల్లో డబ్బు కారణంగానే తనకు టికెట్ రాలేదని, అధిష్ఠానం, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో ఉన్నా భరించలేకపోతున్నామని, మరో జీవన్‌రెడ్డిలా తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు పంపింది.ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి కొండా సురేఖతో పాటు ఆయనపైనా చర్యలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు

‘ప్రక్షాళన’ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. ఢిల్లీ, ఆగస్టు 20: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో తన ప్రసంగం అనంతరం చోటుచేసుకున్న ‘ప్రక్షాళన’ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. బుధవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హల్ద్వానీలో తాను ప్రసంగించిన వేదికను అనంతరం ‘శుద్ధి’ చేశారనే అంశంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి. ఆగస్టు 8న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి ఖర్గే వెళ్లారు. అక్కడ ఆయన ప్రసంగించిన వేదికను కొందరు ‘ప్రక్షాళన’ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఖర్గే గతంలో బహిరంగంగానే స్పందించారు. తన ప్రసంగం అనంతరం అదే ప్రదేశంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన కుల వివక్షకు సంబంధించినదిగా పేర్కొంటూ బీజేపీపై విమర్శలు చేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఈ వివాదంపై పార్టీకి చెందిన పలువురు నాయకులు తనకు మద్దతుగా స్పందించకపోవడం ఖర్గేను బాధించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనకు ఇలాంటి సందర్భంలో నేతల నుంచి మద్దతు ఉంటుందని ఆయన ఆశించినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. సొంత పార్టీ నేతల మౌనం తనను నిరాశకు గురిచేసిందని ఖర్గే చెప్పినట్లు సమాచారం. పార్టీ అంతర్గతంగా ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ

వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది. తాజాగా ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది (Congress Vande Mataram). కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బుధవారం సమావేశమై వందేమాతరం అంశంపై చర్చించింది. 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు నేతలు ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం. అప్పట్లో జాతీయ, ప్రజా సమావేశాల్లో వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తాజాగా గోవాలో జరిగిన ఓ కాంగ్రెస్ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించారు. దీనిపై బీజేపీ విమర్శలు చేస్తూ ఆయన అసంపూర్ణ వందేమాతరం పాడారని ఆరోపించింది (1937 Congress Resolution). బీజేపీ విమర్శలపై ఖర్గే ఘాటుగా స్పందించారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి నాయకులు ఆలపించిన వందేమాతరాన్నే తాను పాడానని చెప్పారు. అదే తప్పయితే ఆ నాయకులపై కూడా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్నే తాను పాటించానని స్పష్టం చేశారు (Vande Mataram First Two Stanzas). వందేమాతరం గీతాన్ని బంకిమ్ చంద్ర ఛటర్జీ 1875లో రచించారు (National Song India). ఈ గీతంలోని తొలి రెండు చరణాలు మాతృభూమి ప్రకృతి సౌందర్యం, సస్యశ్యామలత్వాన్ని కీర్తిస్తాయి. ఆ తరువాతి చరణాల్లో హిందూ మతపరమైన, పౌరాణిక ప్రతీకలు ఉంటాయి. అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే జాతీయ

ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు.. కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, దామోదర రాజనర్సింహ, దిగ్విజయ సింగ్, ఎన్.రఘువీర రెడ్డి, పల్లంరాజుతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్‌తోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాంపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే అయోధ్య రామమందిర విరాళాల ‘చోరీ’ ఆరోపణలపై పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణకు రూపకల్పన జరగనుందని సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించనున్నారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు విద్యార్థులతో ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో జులై 20వ తేదీన న్యూఢిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దీంతో దేశ

సాక్షి, ఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ జాతీయగేయం వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారంటూ వివాదం చెలరేగింది. తాజాగా దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. తాము పాడిన వందేమాతరం గతంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాడినదేనని ఆయన స్పష్టం చేశారు. అది నేరమైతే మహాత్మా గాంధీ, నెహ్రూలపైనా కేసులు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖర్గే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వందేమాతరం ఆలాపన జరిగింది. అయితే గాయకులు వందేమాతరంలోని పూర్తి వెర్షన్‌ను ఆలపిస్తుండగా సోనియా గాంధీ ఖర్గే వైపు సైగ చేసి, అనంతరం గాయకులకు కూడా ఏదో చెప్పినట్లు కనిపించిందని బీజేపీ ఆరోపించింది. ఆమె వందేమాతరం పూర్తి ఆలాపనను ఆపించేందుకు ప్రయత్నించారని బీజేపీ నేతలు విమర్శించారు. అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. ఖర్గే చాలాసేపు నిల్చోవడంతో ఆయనకు కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్వాహకులకు సైగ చేశారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తెలిపారు. వందేమాతరం గీతాన్ని ఆపాలని ఆమె ఎలాంటి సూచన చేయలేదని స్పష్టం చేశారు. ఖర్గే ఆరోగ్యం బాగోలేదని, ఎక్కువసేపు నిల్చోలేరని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సోమవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. వందేమాతరం గీతాలాపనను అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. తాజాగా దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఖర్గే మాట్లాడుతూ.. ‘‘మేము పాడిన వందేమాతరం మహాత్మా గాంధీ పాడినదే. జవహర్లాల్ నెహ్రూ పాడినదే. గత 18 ఏళ్లుగా మేము అదే వందేమాతరాన్ని పాడుతున్నాం. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనూ ఇదే పాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లపాటు ఇదే వందేమాతరం పాడారు’’ అని అన్నారు. ‘‘మేము చేసినదే నేరమైతే

‘వందేమాతరం’ పూర్తి గేయం ఆలాపనపై నెలకొన్న వివాదం రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ అంశంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మాత్రమే వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని.. దేశానికి కూడా వ్యతిరేకంగా మారుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు.ఆగస్టు 15న ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం వందేమాతరం ఆలాపన ప్రారంభమైంది. అయితే పార్టీ నిర్ణయం ప్రకారం తొలి రెండు చరణాలకే పరిమితం కావాల్సిన గీతాన్ని గాయకులు పూర్తిగా ఆలపించినట్లు సమాచారం.పూర్తి గేయం ఆలాపనను సోనియా గాంధీ గమనించినట్లు సమాచారం. ఆమె ఖర్గే వైపు సైగ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం గాయకులను ఆపాలని సూచించినట్లు ప్రచారం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన కంగనా.. వందేమాతరం భారతదేశ చైతన్యానికి ప్రతీక అని అన్నారు. కళాకారిణిగా కళ, కవిత్వం ప్రజలపై చూపే ప్రభావం తనకు తెలుసని చెప్పారు. అలాంటి గేయాన్ని ఆలపించకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ వైఖరిపై కంగనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ బీజేపీని వ్యతిరేకించడం దాటి దేశానికి వ్యతిరేకంగా మారుతోందని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బీజేపీ తన బృందాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పారు. యువతపై సోషల్ మీడియా, రీల్స్ ప్రభావం పెరిగిందని.. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పార్టీలో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. 2047 నాటికి

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అమిత్ షా చిన్నపిల్లాడిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అమిత్ షా చిన్నపిల్లాడిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘నేను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు. ఇప్పుడు ఆయన మాకు దేశభక్తి గురించి బోధిస్తున్నారు’ అంటూ ఖర్గే విమర్శించారు. దేశభక్తిపై తమకు బీజేపీ నేతలు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ నేతల దేశభక్తిని ప్రశ్నించే నైతిక హక్కు ఆ పార్టీకి లేదన్నారు. గోవాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై వివాదం చెలరేగింది. గీతాన్ని మధ్యలోనే ఆపాలని సోనియా గాంధీ కోరారంటూ అమిత్ షా ఆరోపణలు గుప్పించారు. దీనిపై స్పందిస్తూ ఖర్గే నిప్పులు చెరిగారు. ‘మా ప్రజలు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన వారు ఎవరైనా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను దేశభక్తి గురించి ప్రశ్నించడం మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌లో తన సభ అనంతరం జరిగిన శుద్ధీకరణ అంశాన్నీ ఖర్గే ప్రస్తావించారు. సభలో తాను ప్రసంగించిన తర్వాత ఓ రైట్‌వింగ్ సంస్థ.. శుద్ధీకరణ హోమం చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మతాన్ని ఇలాంటి చర్యలకు పరిమితం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. కాగా, అమిత్ షాపై ఖర్గే చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు, వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై చెలరేగిన వివాదం గురించి కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఖర్గే కోసం కుర్చీ ఏర్పాటు

వందేమాతరం గీతాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వందేమాతరం గీతం చరిత్ర, ప్రాధాన్యతను కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్, ఆగస్టు 17: వందేమాతరం గీతాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వందేమాతరం చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తిని నింపిన గీతం వందేమాతరమని, ఈ గీతాన్ని విని అప్పట్లో బ్రిటీష్ వారు భయపడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడు వందేమాతరం పూర్తి గీతాన్ని చూసి కాంగ్రెస్ వణుకుతోందని విమర్శించారు. దేశం మారితే సరిపోదని.. దేశ విలువలు, సంస్కృతి, వేల ఏళ్ల చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని, ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ విమర్శించారు. వందేమాతరాన్ని కాంగ్రెస్ అవమానించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నీట్ వ్యవహారంలో దోషులను అరెస్ట్ చేసి విచారణ జరిపారని, మళ్లీ పరీక్ష నిర్వహించి ఫలితాలను కూడా వెల్లడించారని బండి సంజయ్ తెలిపారు. విద్యార్థుల్లో విపక్షాలు విషబీజాలు నాటుతున్నాయని ఆరోపించారు. విపక్షాల మాటల్లోని అంతరార్థాన్ని యువత అర్థం చేసుకోవాలని, వాస్తవాలను గ్రహించకపోతే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కావని స్పష్టం చేసిన ఆయన.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. గతంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారం పంచుకున్నాయని, ఇప్పుడు కూడా లోపాయికారీ ఒప్పందం కొనసాగుతోందని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ అవినీతి కేసులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అడ్రస్ లేకుండా పోయాయని, తెలంగాణలో బీజేపీ సింగిల్‌గా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం

న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్లు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల మధ్య విభేదాలను పెంచుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో శాంతి, ఐక్యతలను పెంపొందించేందుకు తమ పార్టీ ప్రేమ దుకాణం తెరిచిందని చెప్పారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఖర్గే ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాం«దీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు పేర్లు మారుస్తూ వాటిని ప్రధాని మోదీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే, మున్ముందు మోదీ మన జాతీయ జెండాను సైతం ఎగురవేయబోరంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రపంచాన్ని తానే సృష్టించానంటూ మోదీ చెప్పుకోలేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా సలహా ఇచ్చి ఈ ప్రపంచాన్ని తానే రక్షించానంటూ చెప్పుకునే ఉండేవారన్నారు. అది మోదీ ఏర్పాటు చేసిన ట్రస్ట్ అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఆరోపణల అంశాన్ని ఖర్గే ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేద ప్రజలు భక్తితో ఇచ్చిన రూ. 50 విరాళానికి కూడా భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విరాళాల దొంగతనానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘తన ఘనతగా చెప్పుకునేందుకే ప్రధాని మోదీ రామాలయ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, అందులోకి సొంతవాళ్లను నియమించుకున్నారు. సాధుసంతులతో పనిలేకుండా ఒంటరిగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నిజంగాదేశభక్తుడే అయితే ఆధ్యాతి్మకవేత్తలను, రామభక్తులను కలుపుకుని ఈ కార్యక్రమం పూర్తి చేసేవారు’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి ధోరణి వల్ల, భవిష్యత్తులో మోదీ జాతీయ జెండాను కూడా కిందకు దింపేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉంది’అని

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధానిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ జాతీయ గేయం వందేమాతరం ఆలాపనను ఆపాల్సిందిగా అక్కడి సిబ్బందికి చేత్తో సంజ్ఞలు చేస్తోన్నట్లు కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అదే విధమైన సైగలు చేయడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం ఖర్గే.. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడుతుండగా సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది.వందేమాతరం పూర్తి వెర్షన్ ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు అసహనానికి గురైనట్లు కనిపిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ విమర్శించారు. దేశ విభజనకు ముందు ఉన్న నాటి పాత మనస్తత్వమే కాంగ్రెస్ లో ఇప్పటికీ కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు దేశం పట్ల ఏ మాత్రం భక్తిభావం లేదని, విభజించి పాలించు దోరణిని కనపర్చుతోందని మండిపడ్డారు.ఎర్రకోటపై ప్రధాని మోదీ ధరించినది అసలు మన దేశ జాతీయ పతాకమే కాదు- ఆ దేశానిదిఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఖర్గే కోసం ఆమె ఓ కుర్చీని తీసుకుని రావాలంటూ ఆమె సిబ్బందిని కోరుతూ చేతిని ఊపారని వివరణ ఇచ్చింది. వృద్ధాప్యం కారణంగా ఖర్గే ఎక్కువ సేపు నిల్చోలేకపోయారని, ఇబ్బంది పడటాన్ని గమనించిన సోనియా గాంధీ ఆయన కూర్చోవడానికి కుర్చీని తీసుకుని రావాలంటూ అక్కడి సిబ్బందికి చేత్తో సైగలు చేశారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీన్ని కూడా

కాంగ్రెస్ ఆఫీసులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందేమాతరం చుట్టూ కొత్త వివాదం మొదలైంది. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే చేసిన సైగలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ఇద్దరూ చేతులతో కొన్ని సంకేతాలు చేశారు. సోనియా అక్కడి నిర్వాహకులపై ఏదో విషయంలో అసహనం వ్యక్తం చేసినట్లుగా వీడియోలో కనిపించింది. గేయాన్ని ఆపాలని సూచించినట్లుగా ఆ సైగలు కనిపించాయని అధికార పక్షం ఆరోపిస్తోంది.ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సహా పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా, ఖర్గే పక్కనున్న వారివైపు చేతులతో సంకేతాలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు గేయాన్ని ఆపాలని చెప్పారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. కాంగ్రెస్ నాయకత్వం జాతీయ గీతాన్ని గౌరవించడం లేదంటూ బీజేపీ సహా పలువురు విమర్శలు చేశారు.ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌ను మీడియా ప్రశ్నించింది. ఇందులో ఎలాంటి వివాదం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ వైఖరిని పార్టీ అధిష్ఠానం లేదా జైరాం రమేశ్ వివరిస్తారని తెలిపారు. అయితే వీడియోలో కనిపించిన సైగలపై కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు పూర్తి వివరణ రాలేదు.వందేమాతరం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. వందేమాతరం పూర్తి రూపాన్ని కాంగ్రెస్ గతంలో కుదించిందంటూ ప్రధాని మోదీ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో తాజాగా జరిగిన ఘటన బీజేపీకి మరో రాజకీయ అస్త్రంగా మారింది.కేరళలోనూ

కాంగ్రెస్అధ్యక్షుడు, దళిత నేత, రాజ్యసభలో విపక్ష నేతగా కూడా ఉన్న మల్లిఖార్జున ఖర్గేకు (Mallikarjun Kharge)కు ఉత్తరాఖండ్ లో తాజాగా నిర్వహించిన ఓ ర్యాలీ తర్వాత తీరని అవమానం జరిగింది. ఆయన ర్యాలీ నిర్వహించిన ప్రదేశాన్ని శ్రీరామ్ సేన శుద్ధీకరణ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై ఆయన ఇవాళ నేరుగా రాజ్యసభలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ఇరుకునపడ్డ ప్రభుత్వం.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు ప్రకటించింది.విపక్షాలకు అమిత్ షా బంపర్ ఆఫర్..! తోసిపుచ్చిన రాహుల్..!ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో ఉన్న రామ్‌లీలా మైదానంలో తాను ప్రసంగించిన తర్వాత అక్కడ జరిగిన శుద్ధి కార్యక్రమంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ఈ దేశంలో దళితులకు చోటు లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ దేశంలో దళితులకు చోటు లేదని తాము ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. బీజేపీ మతం పేరుతో ప్రజలందరినీ విభజిస్తోందని, అక్కడ శుద్ధి చేయాల్సిన అవసరం ఏముందని శ్రీరామ్ సేన ను ఉద్దేశించి రాజ్యసభలో ఖర్గే ప్రశ్నించారు. రామ్‌లీలా మైదానం అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభల కోసం ఉపయోగించే వేదిక అని, కానీ వారు చేసిన పని మొదటగా హిందూ మతానికే విరుద్ధమని ఖర్గే తెలిపారు. రెండవది వారు దేశాన్ని విభజించడానికి, కులాల మధ్య ఘర్షణలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. Jantar Mantar Season 2: తాను హల్ద్వానిలోని రామ్‌లీలా మైదాన్‌లో బహిరంగ ప్రసంగం చేశానని, అక్కడ లక్షలాది మంది ప్రజలు ఉన్నారని, ఆ సమయంలో తాను ఏ వర్గం లేదా మతం పేరునూ ప్రస్తావించలేదని ఖర్గే తెలిపారు. కేవలం ప్రభుత్వం గురించి మాత్రమే మాట్లాడానన్నారు. కానీ తన ప్రసంగం తర్వాత ఆ వేదికను శుద్ధి చేయడానికి బీజేపీకి చెందిన వారు అక్కడ ఒక హవన్‌ను నిర్వహించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదేనా పద్ధతి? మీరు రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతున్నారు? నేను ప్రతిపక్ష నాయకుడిని అని ఖర్గే ప్రభుత్వానికి గుర్తుచేశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి జేపీ

Viral Video: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కూతురు రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాల మధ్య సరదా సంభాషణ కనిపిస్తుంది. ఈ ఇద్దరు నాయకుల మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఉన్నారు.ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమాన మార్గం: మనకు ఇంత దగ్గర్లోనే!ఆ వీడియోలో ప్రధానమంత్రి మోదీ ప్రియాంక గాంధీని.. ప్రియాంక, ఎలా ఉన్నావు? అని అడగ్గా, ప్రియాంక గాంధీ, నేను బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? అని బదులిస్తుంది. దీనికి ప్రధానమంత్రి మోదీ నవ్వుతూ, నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను అని అంటారు.మోదీకి ఖర్గేకు ఫన్నీ పంచ్! ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆ సంభాషణలో చేరారు. ఆయన ప్రధాని మోదీతో సరదాగా, అన్నా, మీరు కొంచెం మారారు. మీరు కొంచెం మారారు అని అన్నారు. ఖర్గే కామెంట్‌కు ప్రధాని మోదీ నవ్వి, ఓ, నిజమా? అని అడిగారు. పెళ్లి విందులో జరిగిన ఈ అనధికారిక, సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఈ ముగ్గురు నాయకుల మధ్య జరుగుతున్న ఈ సంభాషణను ప్రజలు ఆస్వాదిస్తున్నారు.రీల్స్‌పై మోదీ తీవ్ర వ్యాఖ్యలు! యూత్ కు సీరియస్ మెసేజ్జూన్ 20న జరిగిన సుప్రియా సూలే కుమార్తె వివాహంసుప్రియా సూలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)కి చెందిన ఓ ప్రముఖ నాయకురాలు, మహారాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నారు. సుప్రియా సూలే కూతురు రేవతీ సూలే 2026 జూన్ 20న ముంబైలో పారిశ్రామికవేత్త సారంగ్ లఖానీని వివాహం చేసుకున్నారు. ఆగస్టు 10న ఢిల్లీలో ఘనంగా రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్‌కు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ప్రధాని మోదీకి సంబంధించిన