
రాష్ట్రంలో పెనమలూరుప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి
Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

Kankipadu: కంకిపాడులో పోలీసుల కాల్పుల కలకలం క్లూస్ టీమ్ విస్తృత తనిఖీలు ఈ వార్తకు సంబంధించిన

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ, సెప్టెంబర్ 1: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న(సోమవారం) రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో నిందితుడిపై సీఐ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించగా కంకిపాడు వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సీఐ, కానిస్టేబుల్ శ్రీనివాస్.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. నిందితుడు అవినాధ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ, కానిస్టేబుల్‌పై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. అవినాధ్ కాళ్లపై కాల్పులు జరిపారు. ఆపై గాయపడిన యువకుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అవినాధ్.. పెనమలూరు గ్రామ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ శ్రీనివాస్, నిందితుడు అవినాధ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తిరువూరు, ఆగస్టు 22: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శనివారం తిరువూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పుట్రేల సమీపంలో స్కూటిపై వెళ్తున్న నిందితుడు గోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామన్నారు. తమ విచారణలో ఈ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. ఏ కొండూరు, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు వరుస చోరీలకు పాల్పడుతున్నాడని వివరించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ అతడి స్వస్థలమని డీసీపీ చెప్పారు. ఆగస్టు10వ తేదీన ఏ. కొండూరు మండలం చీమలపాడు, విస్సన్నపేట మండలం కలగర, తిరువూరు మండలం మల్లేల గ్రామాల్లో వరుస చోరీలు జరిగాయి. ఆయా ఇళ్ల తాళాలను పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులతోపాటు నగదు దొంగలించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టామన్నారు. అలా అతడిని శనివారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ

మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు. కృష్ణా జిల్లా, ఆగస్టు 22: మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. గుడివాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు. అవకతవకలు జరిగాయంటూ వైసీపీ వేసిన 341 పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని.. దీంతో నిజం తేలిపోయిందని చెప్పారు. ‘ఓపెన్ డిబేట్‌కు రా.. లేదా అసెంబ్లీకి రా.. నీ అనుమానాలు క్లియర్ చేస్తా అని లోకేశ్ సవాల్ విసిరినా జగన్ నుంచి సమాధానం లేదు’ అంటూ విమర్శించారు. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులు మీడియా ముందు స్పష్టంగా చెబుతున్నా.. అధికారుల దగ్గరకు వెళ్లి ఇది తప్పు అని చెప్పలేని దుస్థితిలో వైసీపీ ఉందని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బిజీ అయితే తమ ప్రతినిధులను పంపి అనుమానాలు తెలుసుకోవచ్చు కదా అని అన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడమే వాళ్ల పని అంటూ మండిపడ్డారు. సమాధానం చెప్పకుండా తాడు బొంగరం లేని బందర్ పిచ్చోడిని పంపిస్తున్నారని.. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుణ్య నియామకంలా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అని.. నేరస్థులంటే ఆయనకు చాలా ఇష్టమని, పలకరించడానికి అత్యుత్సాహం చూపుతున్నారని రామయ్య విమర్శించారు. కౌరవుల మాదిరి జగన్ ఎప్పుడూ నేరస్థులు, దొంగలు, విధ్వంసకారుల పక్షమే అని.. అందుకే తల్లి, చెల్లి కూడా తోడు లేరన్నారు. జెన్-జీ అంటూ జగన్ పెట్టే మీటింగ్‌లో గంజాయి బ్యాచ్ ఉంటుంటే... రాష్ట్రంలో నిజమైన జెన్-జీలు లోకేశ్‌కు మద్దతు

కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా విస్తరిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయేరియా బాధితులను ఆయన ఈరోజు పరామర్శించారు. స్థానిక 5వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారని, బాధితులందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. ఆగస్టు 17న మృతి చెందిన ఒక వ్యక్తి గుండెపోటు కారణంగానే కన్నుమూశారని, ఆ మరణానికి డయేరియాకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి తేల్చిచెప్పారు. ప్రాథమిక నీటి పరీక్షల నివేదిక ప్రకారం తాగునీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని వెల్లడైందన్నారు. సమస్యకు కారణం మున్సిపల్ పైప్లైన్లా లేక ప్రైవేట్ ఆర్వో ప్లాంట్లా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని వివరించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో పాత పైప్లైన్లను మారుస్తున్నామని, అందులో భాగంగా ఉయ్యూరులో రూ. 98 కోట్లతో పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

కృష్ణాజిల్లా: గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఏఎన్ఎం ఉద్యోగిని, ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా మానసికంగా, లైంగికంగా తన ఇంటికి రావాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఈ నెల 17న ఆమె తండ్రి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఫిర్యాదు అనంతరం ఆమెను అధికారం అండతో బంటుమిల్లికి బదిలీ చేయించిట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని బాధితురాలు కోరారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే మార్కెట్ యార్డు చైర్మన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రవికుమార్ అన్నారు. ఆరోపణలపై డీఎస్పీ శ్రీనివాసకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) అందుకే సచిన్ క్రికెట్ దేవుడు.. 100 ఏళ్లయినా ఎవరు బ్రేక్ చేయలేని రికార్డు శ్రావణమాసం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గత 20 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్న దంపతులు.. పేదలు కష్టపడి దాచుకున్న డబ్బులను ఎగ్గొట్టి ఇల్లు ఖాళీ చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారిని బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రోడ్డు పక్కన చేపలు అమ్ముకునే వారు, ఇళ్లలో పనిచేసే వారు, ఇతర రోజువారీ కూలీలు, పేద కుటుంబాలే ఈ చిట్టీలకు ప్రధానంగా డబ్బులు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తూ తమ నుంచి డబ్బులు వసూలు చేశారని, ఇప్పుడు చిట్టీ డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చిట్టీ డబ్బులు అడిగిన సమయంలో నిర్వాహకుల కుటుంబ సభ్యులు తమతో గొడవకు దిగేవారని బాధితులు తెలిపారు. తమకు జరిగిన మోసంపై సుమారు 15 రోజుల క్రితమే గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తాజాగా నిర్వాహకులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని అడ్డుకున్నామని బాధితులు తెలిపారు. తమ వద్ద నుంచి సేకరించిన చిట్టీ డబ్బులతో శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. చిట్టీల పేరుతో పేదల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించి మోసం చేశారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని ‘నిబంధనల

కృష్ణాజిల్లా పెడనలో గురుకుల బాలికలపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కృష్ణాజిల్లా, ఆగస్టు 10: జిల్లాలోని పెడనలో గురుకుల బాలికలపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈరోజు(సోమవారం) ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈనెల 6న పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమయ్యారని తెలిపారు. మచిలీపట్నం రుద్రవరంలోని టిడ్కో హౌసెస్ వద్ద బాలికలపై అత్యాచారం జరిగిందని ఎస్పీ అన్నారు. బాలికలపై ఇద్దరు ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని చెప్పారు. నిందితులను శారదానగర్‌కు చెందిన మద్దాల శ్యామ్ కిరణ్ (20), కొక్కిలిగడ్డ సిద్ధు(20)గా గుర్తించామన్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. 40 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు. లండన్‌లో మంత్రి నారాయణ బృందం.. అమరావతి ఐకానిక్ భవనాలపై కీలక చర్చలు ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధం పొడిగింపు