
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్లక్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
© 2026 nimisham.in

Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?

Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుల్ జంగం నాని (ఏ3), హెడ్ కానిస్టేబుల్ బాబురావు (ఏ5), సాంబయ్య (ఏ6) తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్లను కొట్టివేసింది.ప్రస్తుతం ఈ నలుగురు రిమాండ్ ఖైదీలుగా వేర్వేరు జైళ్లలో ఉన్నారు. సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో ఉన్నారు. తాజా తీర్పు నేపథ్యంలో వారంతా జైలుకే పరిమితం కానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

తమిళ చిత్రసీమలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కోలీవుడ్ క్వీన్ త్రిష కృష్ణన్, ప్రస్తుతం లండన్‌లో ప్రారంభమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. తమిళ చిత్రసీమలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కోలీవుడ్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan), ప్రస్తుతం లండన్‌లో ప్రారంభమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుంచి కోలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది. ఇదే త్రిష నటిస్తున్న చివరి సినిమా కానుందా? ఆమె త్వరలోనే సినిమాలకు పూర్తి స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందా? అనే చర్చలు నడుస్తున్నాయి. దళపతి విజయ్‌తో త్రిషకు ఉన్న సాన్నిహిత్యం,వారిద్దరి కాంబినేషన్‌కు కోలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఈమధ్య కాలంలో విజయ్- త్రిష కలిసి కనిపించడం తగ్గింది. విజయ్ రాజకీయాల్లో బిజీగా మారగా.. త్రిష వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఈమధ్యనే లండన్ లో ఫ్రెండ్స్ తో కనిపించిన త్రిష తాజాగా అక్కడే సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాకు శ్రీకారం చుట్టింది. బాలీవుడ్లో ఎయిర్‌లిఫ్ట్, చెఫ్, పిప్పా వంటి విభిన్న కథాంశాలతో ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా న ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ బ్యానర్.. లోకోమోటివ్ గ్లోబల్, ఫ్యూజన్ ఫ్లిక్స్ సంస్థలతో కలిసి కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ ఈ ఈ సినిమాతో మొదటిసారి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అపర్ణ బాలమురళి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముగ్గురు పవర్ఫుల్ నటీమణులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటం, లండన్ నేపథ్యంలో సాగే
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసులో నిందితులకు విజయవాడ కోర్టు లో చుక్కెదురైంది. ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు జంగం నాని, బాబూరావుతో పాటుగా సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న నాగరాజు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వీరంతా తమకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది.మరోవైపు సాయికృష్ణ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయాడనే ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది. ఐజీపీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం నాగరాజు, ముగ్గురు పోలీస్ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా వేర్వేరు జైళ్లల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.అయితే ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. లాకప్ డెత్ లాంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న నేపథ్యంలో.. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు దర్యాప్తు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని భావించిన కోర్టు.. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిందితులు

గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం అంటే జీవితంలో స్థిరపడినట్లేనని చాలామంది నమ్ముతారు. అయితే, అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేసి, లేఆఫ్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన నలుగురు మాజీ టెక్కీల జీవితాలు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై అనిశ్చితి వారిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి.ఒక తాజా ఇంటర్వ్యూలో ఈ నలుగురు తమ బాధాకరమైన అనుభవాలను పంచుకున్నారు. వీరిలో మెటా మాజీ ఉద్యోగిని బ్రిట్నీ బాల్ (37) ఏడాదికి 180,000 డాలర్ల వేతనం అందుకునేవారు. గూగుల్‌లో పనిచేసిన జాసన్ జాంగ్ (25) వార్షిక వేతనం 200,000 డాలర్లకు పైమాటే. ఇక మైక్రోసాఫ్ట్‌లో 23 ఏళ్లు సుదీర్ఘ అనుభవం ఉన్న జో ఫ్రెండ్ (62) 250,000 డాలర్ల వేతనం అందుకుంటుండగా, ఇంటెల్‌లో అంతే కాలం పనిచేసిన శ్రీరామ్ రామకృష్ణ (57) 180,000 డాలర్ల వేతనం పొందేవారు. ఎటువంటి ముందుస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా లేఆఫ్‌కు గురవడం వీరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం వారు ఊహించిన దానికంటే అత్యంత కష్టతరంగా మారింది. బ్రిట్నీ బాల్ ఏకంగా 8,000కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. శ్రీరామ్ రామకృష్ణ ఏడాది కాలంగా ఉద్యోగ వేట సాగిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి వారి ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపింది. బ్రిట్నీ తన పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయడమే కాకుండా, జీవన వ్యయాన్ని తగ్గించుకోవడానికి వాషింగ్టన్ డీసీ నుంచి వేరే

Macherla: వైఎస్సార్ 17వ వర్ధంతి - ఘన నివాళులర్పించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వార్తకు సంబంధించిన
మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణ జన్మాష్టమి వేళ కన్నయ్యకు ఎరుపు రంగు దుస్తులతో అలంకరించొచ్చు. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు మానసికంగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కృష్ణాష్టమి వేళ లడ్డూ గోపాలుడి అలంకరణ కోసం వెండి ఆభరణాలు లేదా వస్తువులను ఉపయోగించొచ్చు. ఇలా చేయడం వల్ల బాల వేణుమాధవుడి ప్రత్యేక ఆశీస్సులు పొందొచ్చు. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కృష్ణాష్టమి రోజున లడ్డూ గోపాలుడిని లహరియ(అలల వంటి లేదా చారల) డిజైన్ కలిగిన వస్త్రాలతో అలంకరించాలి. ఇలాంటి అలంకరణ ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కన్నయ్యకు ఎంతో ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మదినోత్సవం రోజున బాల గోపాలుడిని తెల్లని దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణ జన్మాష్టమి రోజున బాల గోపాలుడిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కన్య రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణా జన్మాష్టమి రోజున బాల గోపాలుడిని పచ్చని రంగు దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల మీకు కన్నయ్య ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ బాల గోపాలుడిని కుంకుమ రంగు(కాషాయం వంటి) రంగు వస్త్రాలతో అలంకరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

కన్నడ స్టార్ నటుడు, అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ తన పుట్టినరోజున అభిమానులకు అద్భుతమైన కానుక అందించారు. ఆయన కథానాయకుడిగా రాబోతున్న భారీ చారిత్రక చిత్రానికి 'దేవరాయ' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్‌తో కూడిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఇందులో సుదీప్, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రాజసంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియా సుదీప్ తన సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో ద్వారా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. టైటిల్ వీడియోలో సుదీప్ లుక్ అత్యంత గంభీరంగా, రాజసం ఉట్టిపడేలా ఉంది. తలపై కిరీటం, మెడలో ముత్యాల హారాలు, ఇతర రాజాభరణాలతో ఆయన ఆహార్యం ఆకట్టుకుంటోంది. గౌర హరి అందించిన నేపథ్య సంగీతం ఈ వీడియోకు మరింత బలాన్ని చేకూర్చింది."చరిత్రను మలుపుతిప్పిన సామ్రాజ్యం, ఒక శకాన్ని నిర్మించిన రాజు, కాలానికి అతీతంగా నిలిచిన లెజెండ్" అనే శక్తివంతమైన వాక్యాలతో చిత్ర బృందం 'దేవరాయ' పాత్రను పరిచయం చేసింది. ఈ వ్యాఖ్యలు శ్రీకృష్ణదేవరాయల కీర్తి ప్రతిష్ఠలకు అద్దం పడుతున్నాయి. తన నటనతో పాత్రలకు ప్రాణం పోసే సుదీప్, ఈ చారిత్రక పాత్ర కోసం అద్భుతంగా రూపాంతరం చెందారని ఫస్ట్ లుక్‌ను చూస్తేనే అర్థమవుతోంది.ఈ భారీ చారిత్రక చిత్రాన్ని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి

ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసి సీఎం జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్రకు గోదారమ్మను తీసుకువచ్చామని తెలిపారు. నదులు, వాగులు, వంకలు దాటుకుని గోదారమ్మ వచ్చిందని ప్రస్తావించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణమ్మను తరలించి.. కరువు పీడిత మార్కాపురానికి నీళ్లిచ్చామని ఉద్ఘాటించారు. నల్లమల కొండలను చీల్చుకుని కృష్ణమ్మ వచ్చిందని అన్నారు. ఎన్నో సమస్యలను అధిగమించి గోదావరి జలాలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ కోసం రూ.4 వేల కోట్ల ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా మారేలా చేస్తామని తెలిపారు. ఈ జల విజయం.. ప్రజల విజయమని చెప్పుకొచ్చారు. ఆధునిక దేవాలయాలు.. సాగునీటి ప్రాజెక్టులు అని అభివర్ణించారు. నీరు ఉంటేనే భద్రత, భవిష్యత్తుపై ఓ భరోసా కల్పిస్తుందని తెలిపారు. నీరు ఉంటేనే పరిశ్రమలు.. తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని వివరించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టిపెట్టామని అన్నారు. 2019 నాటికి 72 శాతం పోలవరం పనులు పూర్తిచేశామని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం.. పోలవరాన్ని పర్యవేక్షించేలా మార్చామని వెల్లడించారు. 2019లో గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చిందని.. పోలవరానికి శాపమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ధ్వజమెత్తారు. పోలవరం నిర్వాసితులకు గొడ్డలి పార్టీ పైసా కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరానికి శాపవిముక్త కలిగిందని వ్యాఖ్యానించారు. 2028 నాటికి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Meat shops closed in Hyderabad city on September 4: ప్రస్తుతం మనం శ్రావణ మాసంలో ఉన్నాం. ఈనెలలో ప్రతి రోజు ఏదో ఒక పండగను మనం జరుపుకుంటాం. అయితే.. సెప్టెంబర్ 4న మనం జన్మాష్టమిని భక్తి శ్రద్దలతో జరుపుకుంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ రోజున చాలా మంది ఉపవాసాలు ఉంటారు. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తారు. పలు చోట్ల దహి హండీ ఉట్టి కొట్టే వేడుకను నిర్వహిస్తారు. తమ పిల్లలకు చిన్నారి శ్రీకృష్ణుడు, రాధలా కాస్ట్యూమ్ లు వేసి పొంగిపోతారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడనే విశ్వాసంతో రాత్రి వేళ పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు అష్టమి, రోహిణి తిథి ఉండేలా చూసుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజునే జన్మాష్టమి వేడుకలు నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న చికెన్, మటన్ అమ్మకాలపై ఒక రోజు నిషేధం విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. Read more: Konda Surekha: నన్ను ఎవరు పిలువలేదు.. నేనే వచ్చా... ఉత్కంఠ వేళ కొండంత ట్విస్ట్ ఇచ్చిన మంత్రి సురేఖ..! ఈ మేరకు రిటైల్, చికెన్, మటన్ షాపులు, పశువధ శాలలన్ని మూసి వేసి ఉంచాలని అధికారులు తెల్చి చెప్పారు. ఎవరైన రహస్యంగా మాంసం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా తనిఖీలు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ వాసులు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Janmashtami 2026 Famous Temples: శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, భక్తులు భారతదేశం అంతటా ఉన్న ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలను సందర్శిస్తుండటంతో, జన్మాష్టమి 2026ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. జన్మాష్టమి భారతదేశంలోని అత్యంత ఆనందకరమైన, ఆధ్యాత్మిక శక్తితో నిండిన పండుగలలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ సందర్భం కోసం దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ముస్తాబవుతాయి. అందమైన అలంకరణలు, గుంపులు గుంపులుగా తరలివచ్చే భక్తులు, గాలిలో మారుమోగే భజనలు, మీరు ఊహించిన దానికంటే చాలా సేపటి వరకు సాగే అర్ధరాత్రి వేడుకలు ఈ పండుగ ప్రత్యేకత. ఈ సమయంలో మీరు కృష్ణ దేవాలయాన్ని సందర్శించగలిగితే, అది మీ మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన అనుభూతిగా మారుతుంది. దైవ ఆశీస్సుల కోసం మీరు తప్పక సందర్శించవలసిన 7 ప్రసిద్ధ ఆలయాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 1) బాంకే బిహారీ దేవాలయం (బృందావన్) బృందావన్‌కు అనేక విధాలుగా ఇది ఒక కిరీటం వంటిది. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలలో ఒకటి, జన్మాష్టమి సమయంలో ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడి భక్తి శక్తి ఉప్పొంగే విధానాన్ని వర్ణించడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదు. 2) కృష్ణ జన్మభూమి ఆలయం (మథుర) ఇది శ్రీకృష్ణుని అసలైన జన్మస్థలం అని నమ్ముతారు. అందుకే ఇక్కడ జన్మాష్టమి జరుపుకోవడం అనేది ఇతర ఆలయాలు సరిపోల్చలేని ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం కృష్ణుడు జన్మించాడని చెప్పే అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ప్రధాన పూజలు

శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు పండితులు. కాగా, ఇప్పుడు మనం శ్రీ కృష్ణుడు జన్మించిన నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారిపై చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు చాలా ఆకర్షణీయంగా, అందంగా, భావోద్వేగ పరంగా అన్ని విధాలుగా చాలా సృజనాత్మకతను కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరికి కళలు, సంగీతం, వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు వారి చుట్టూ ఉన్నవారి కంటే కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా అనర్గళంగా మాట్లాడుతారు. అందుకే 27 నక్షత్రాలలో రోహిణి నక్షత్రం చాలా ప్రత్యేకమైనది. అంతే కాకుండా పవిత్రమైనది అంటారు. అంతే కాకుండా ఈ నక్షత్రంలో జన్మించిన వారు మాట్లాడే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. మర్యాదపూర్వకంగా, మృదువుగా మాట్లాడుతుంటారు. అంతే కాకుండా వీరికి అందరినీ ఆకట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్లలో ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తుంది. అంతే కాకుండా వీరు మాట్లాడే విధానం కూడా అందరికంటే భిన్నంగా చాలా అందంగా ఉంటుంది. వీరు అందరిపై ఎక్కువ ప్రేమను కురిపిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కళాత్మకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అంతే కాకుండా అందరి దృష్ణిని కూడా ఆకర్షిస్తారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చే ఏకైక పేరు.. శ్రీకృష్ణదేవరాయలు. ఆ గొప్ప విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, కృష్ణదేవరాయ రాజసాన్ని ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేమికులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇచ్చింది. అదే 'దేవరాయ' (Devaraaya) సినిమా టైటిల్ అనౌన్స్మెంట్. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోతో పీపుల్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిచ్చా సుదీప్ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించబోతున్నారు. దేవరాయ పాత్రలో సుదీప్ రాయల్ లుక్, ఈ టైటిల్ గ్లింప్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ గ్లింప్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించారని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్ టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ విజువల్ స్పెక్టకిల్‌ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ గ్రాండ్‌నెస్.. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బిగ్ స్క్రీన్ పై ఒక పీరియాడిక్ ఎపిక్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి గౌరహరి అందిస్తున్న సంగీతం వింటేనే ఒక రేంజ్లో గూస్బంప్స్ వస్తున్నాయి. కిచ్చా సుదీప్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ 'దేవరాయ' విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్స్ పై చూడటానికి 2027 డిసెంబర్ వరకు వేచి చూడక తప్పదు. Panjaa Re Release: 3 గంటల్లో 150 షోలు సోల్డ్ అవుట్.. రీ రిలీజ్ బాక్సాఫీస్ షేక్!

Devaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి కీలకమైన అప్డేట్ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం’ అంటూ ‘దేవరాయ’ను మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి చారిత్రక పాత్రలో సుదీప్ కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. విడుదల చేసిన గ్లింప్స్‌లో సుదీప్ లుక్ రాజసం, గంభీరతతో ఆకట్టుకునేలా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్లో థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు సుదీప్ మాస్, యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వంటి చారిత్రక పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సుదీప్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

కన్నడ హీరో సుదీప్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలియొచ్చేమో. 'ఈగ' విలన్ అంటే మాత్రం ఎక్కువగా గుర్తుపడతారు. సైరా, బాహుబలి లాంటి తెలుగు చిత్రాల్లోనూ అతిథి పాత్రలు చేసినప్పటికీ ప్రస్తుతం సొంత భాషకే ఎక్కువగా పరిమితమైపోయాడు. ఈ రోజు సుదీప్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. (ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు) తెలుగు ప్రముఖ నిర్మాణ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుదీప్ కాంబోలో తీస్తున్న కొత్త సినిమాకు 'దేవరాయ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మనందరికీ తెలిసిన శ్రీ కృష్ణ దేవరాయలు జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ గౌరహరి సంగీత దర్శకుడు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ బాగుంది. అలానే ప్రాజెక్టుపై అంచనాలు పెంచేసింది. వచ్చే ఏడాది డిసెంబరులో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించడం వరకు బాగానే ఉంది. కానీ దర్శకుడు ఎవరనేది బయటపెట్టలేదు. ఇంకా డైరెక్టర్ ఎవరనేది ఫిక్స్ కాలేదా లేదంటే కావాలంటే పేరుని రివీల్ చేయలేదా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. అలానే ఇది పాన్ ఇండియా మూవీనా కాదా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. (ఇదీ చదవండి: విజయ్ ప్రభుత్వంపై డైలాగ్స్.. 'జైలర్ 2' వాయిదా రూమర్స్.. తీరా చూస్తే) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..! దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Madanapalle: మదనపల్లెలో బ్రహ్మకుమారీస్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు! Madanapalle: మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో బ్రహ్మకుమారి పద్మావతి మాట్లాడుతూ: బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, మదనపల్లె ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 3) శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణుడి ప్రసాదాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. చిన్నారులు, విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయే కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేయాలని బ్రహ్మకుమారి పద్మావతి కోరారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరి పాల్గొననున్నట్లు తెలిపారు

Anakapalle: జనసేనాని బర్త్‌డే జోష్.. బైక్ నడిపిన ఎమ్మెల్యే కొణతాల! ఈ వార్తకు సంబంధించిన

టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. ఐదు శతాబ్దాల క్రితం దక్షిణాది ప్రాంతాన్ని తిరుగులేని చక్రవర్తిగా ఏలిన శ్రీ కృష్ణ దేవరాయలు (SRI KRISHNA DEVARAAYA) కథ నేపథ్యంలో దేవరాయ (Devaraaya) సినిమా తెరకెక్కుతోంది. శాండిల్ వుడ్ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ (KicchaSudeep) టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ రోజు (బుధవారం) సుదీప్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ సామాజిక మాధ్యమాలను దున్నేస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా (People Media Factory) బ్యానర్‌పై సుప్రియాన్వీ పిక్చర్ స్టూడియో (Supriyanvi Picture Studio)తో కలిసి టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), కృతి ప్రసాద్ (Krithi Prasad ) నిర్మిస్తున్నారు. గౌర హరి (Gowra Hari) సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ఎదుటకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రటించారు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాధా-కృష్ణుల బంధం ఎప్పుడూ చర్చలోకి వస్తుంది. రాధా-కృష్ణుల ప్రేమను కేవలం ప్రేమకథగా మాత్రమే చూడరు. నమ్మకం, గౌరవం, అవగాహన, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం వంటి విషయాలకు వీరి అనుబంధాన్నే ఉదాహరణగా చెబుతారు. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య గొడవలు రావడం, అపార్థాలు పెరగడం, ఒకరిపై ఒకరికి అనుమానం రావడం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో రాధా-కృష్ణుల బంధం నుంచి కొన్ని మంచి విషయాలను నేటి జంటలు నేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి బంధం ఒకేలా ఉండదు. కానీ ప్రేమతో పాటు నమ్మకం, గౌరవం ఉంటే ఏ బంధమైనా మరింత బలపడుతుంది. ఏ ప్రేమ బంధానికైనా నమ్మకమే చాలా ముఖ్యం. భాగస్వామిపై పదే పదే అనుమానం పెట్టడం, ప్రతి చిన్న విషయానికీ ప్రశ్నించడం వల్ల బంధంలో దూరం పెరుగుతుంది. ఏదైనా విషయం అనుమానంగా అనిపిస్తే మనసులో పెట్టుకుని బాధపడకుండా నేరుగా మాట్లాడటం మంచిది. అలాగే భాగస్వామి ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు ముందుగా వారి మాటను పూర్తిగా వినాలి. వెంటనే మనదే సరైన మాట అని చెప్పకుండా, వారి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రేమలో గౌరవం కూడా చాలా అవసరం. భాగస్వామి అభిప్రాయాలు, ఇష్టాలు, నిర్ణయాలను గౌరవించాలి. కోపంలో మాట్లాడే మాటలు ఎదుటివారిని చాలా బాధపెట్టవచ్చు. అందుకే గొడవ వచ్చినప్పుడు మాటలను అదుపులో పెట్టుకోవడం మంచిది. బంధం బలంగా ఉందో లేదో సంతోష సమయంలో కంటే కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. భాగస్వామి ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఎగతాళి చేయకుండా, ఒంటరిగా వదిలేయకుండా అండగా నిలవాలి. కొన్నిసార్లు సమస్యకు పరిష్కారం చెప్పడం కంటే ఎదుటివారి మాటను ప్రశాంతంగా వినడమే వారికి ఎంతో ధైర్యం ఇస్తుంది. అదే సమయంలో ప్రేమ పేరుతో భాగస్వామిపై ఎక్కువ ఆంక్షలు పెట్టకూడదు. ప్రతి ఒక్కరికీ తమకంటూ ఇష్టాలు, స్నేహితులు, వ్యక్తిగత సమయం ఉంటాయి. కాబట్టి ఒకరికి ఒకరు కొంత స్పేస్ ఇవ్వాలి

తెలుగు సినిమా చరిత్రలో 90s టైమ్ అద్భుతమనే చెప్పాలి. అప్పుడే అదిరిపోయే సినిమాలెన్నో వచ్చాయి. ఎంటర్టైన్మెంగ్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ మూవీస్ సందడి చేశాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ‘హలో బ్రదర్’ కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ చిత్రం 1994 ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. నాగార్జున మాస్, క్లాస్ లుక్స్‌తో పాటు రమ్యకృష్ణ, సౌందర్యల గ్లామర్, రాజ్-కోటి సంగీతం ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. మిసెస్ అండ్ మిస్టర్ చక్రవర్తి (శరత్ బాబు, సంగీత) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. జన్మతః వీరిద్దరికీ ఒక విచిత్రమైన కనెక్షన్ (రిఫ్లెక్స్ యాక్షన్) ఉంటుంది. ఒకరికి నొప్పి కలిగితే మరొకరికి స్పందన రావడం, ఒకరు కదిలితే మరొకరు కూడా అదే పనిచేయడం వీరి ప్రత్యేకత. అయితే, విశ్వనాథ్ ఉద్యోగరీత్యా ఒక ప్రమాదకరమైన క్రిమినల్ మిట్రా (నెపోలియన్)ని అరెస్ట్ చేసే క్రమంలో, మిట్రా ఈ కవలలలో ఒకరిని ఎత్తుకెళ్లి ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఒక బాబు (దేవా) కూలిపనులు చేసుకునేవారికి దొరుకుతాడు. వారికి అప్పటికే ఓ ఆడపిల్ల కూడా ఉంటుంది. రోడ్డుపై రఫ్ అండ్ టఫ్ వాతావరణంలో దేవా (నాగార్జున) పెరిగి పెద్దవాడవుతాడు. మరో బాబు (రవి వర్మ) తన తల్లిదండ్రుల వద్దే పెరిగి విదేశాలలో చదువుకుని పెద్ద మ్యూజిషియన్‌గా ఇండియాకు తిరిగివస్తాడు. దేవా స్థానిక రౌడీలతో గొడవపడుతూ మాస్ క్యారెక్టర్‌గా మారితే, రవి వర్మ అత్యంత సాఫ్ట్ అండ్ క్లాస్ కుర్రాడిగా ఉంటాడు. దేవాను చక్రవర్తి ఫ్రెండ్ (గిరిబాబు) కూతురు మంగ (రమ్యకృష్ణ) ప్రేమిస్తుంది. రవి వర్మను తన ఈవెంట్ మేనేజర్ అక్కమాంబ( అన్నపూర్ణమ్మ) కూతురు ఊహ (సౌందర్య) ప్రేమిస్తుంది. విధి వశాత్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే నగరంలో కలుసుకున్నప్పుడు వారి రిఫ్లెక్స్ చర్యల వల్ల ఎలాంటి అలజడి సృష్టింపబడింది?

మేష రాశి : మేష రాశి వారిపై ఎప్పుడూ శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటుంది. అందువలన వీరికి అన్ని విధాలుగా ఇది చాలా మంచి సమయం. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. వృషభ రాశి : వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆర్థికంగా, అన్ని విధాలుగా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే భూ వివాదంతో సతమతం అవుతున్నారో, వారు వాటి నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా ఇది వారికి చాలా అద్భుతమైన సమయం అవుతుంది. కన్యా రాశి : శ్రీకృష్ణుడి అనుగ్రహం వలన కన్యా రాశి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టింది బంగారమే. ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అలాగే సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారు తమ ఇంటిలో శుభ కార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా, ఆర్థికంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా శుభ ప్రదమైన సమయం అని చెప్పాలి. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

గుజరాతీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ‘లాలో’ తెలుగు రీమేక్‌పై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాతీ చిత్రసీమలో (Gujarati Cinema) సంచలన విజయాన్ని అందుకున్న ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ (Laalo: Krishna Sada Sahaayate) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రీమేక్ రూపంలో రానుందనే వార్తలు సినీ వర్గాల్లో హాల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘లాలో’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆధ్యాత్మికత, ఎమోషన్, కామెడీ కలగలిపి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించింది. ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమా సాధించిన ఘన విజయంతో తెలుగు సహా ఇతర భాషల నిర్మాతల దృష్టి ఇప్పుడు ఈ చిత్రంపై పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కథలోని అంశాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతాయని, ఇక్కడి వారికి చాలా దగ్గరగా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ రీమేక్‌కు ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, కథలను తనదైన శైలిలో విభిన్నంగా చెప్పడంలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ సంపాదించుకున్న ఆయన, ‘లాలో’ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మరింత భారీ స్థాయిలో ఆవిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే అది రామ్ చరణ్ (Ram Charan) పేరు వినిపించడం. ఈ సినిమా ప్రధానంగా శ్రీకృష్ణుడి పాత్ర చుట్టూ సాగే కథ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన సోనియాగాంధీ కుటుంబం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినందుకు.. నిరసనగా ఈరోజు (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద గంటసేపు రోడ్డుపై బైఠాయించి మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహించి దేశ ప్రజలను చైతన్యం చేశారని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. అలాంటి కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఉత్తరప్రదేశ్‌లోని అల్ది హల్ద్వానిలోని ర్యాలీ వేదికను ఎక్కారని.. శుద్ధి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. ఆ విషయాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ‘మోదీ హటావో దేశ్‌కి బచావో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి ‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు
'పెద్ది' సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. సుకుమార్ దర్శకత్వంలో 'RC 17' అనే వర్కింగ్ టైటిల్ తో అప్పట్లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది క్లారిటీ లేదు. ఇటీవల చరణ్ చేతికి సర్జరీ జరగడంతో, ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి చెర్రీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గుజరాత్లో సంచలన విజయం సాధించిన సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’. సుమారు రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన వీ ఈ గుజరాతీ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడీ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీని కోసం రామ్ చరణ్ తో చర్చలు జరుపుతున్నారనే ఓ వార్త బీటౌన్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.‘లాలో: కృష్ణ సదా సహాయతే’ మూవీలో శ్రీకృష్ణుడి పాత్ర ఉంటుంది. ఇప్పుడు తెలుగు రీమేక్ లో ఆ పాత్ర రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. 'గేమ్ ఛేంజర్' స్టోరీ ఐడియా ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్.. ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది పక్కన పెడితే.. 'శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్' అనే న్యూస్ మెగా అభిమానులను ఆకర్షిస్తోంది.'గోపాల గోపాల' మూవీలో మోడరన్ శ్రీకృష్ణ అవతార్ లో పవన్ కళ్యాణ్ కనిపించారు. బాబాయ్ పోషించిన అలాంటి పాత్రలోనే ఇప్పుడు అబ్బాయ్ చరణ్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికైతే దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ

శ్రీకృష్ణ జన్మాష్టమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2026లో కృష్ణాష్టమి సెప్టెంబర్ 4న రానుంది. ఈ సందర్భంగా పూజా సమయం, ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం.. 2026లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సెప్టెంబర్ 4, శుక్రవారం నిర్వహించనున్నారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడనే విశ్వాసం ఉండటంతో.. ఆ సమయానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అష్టమి తిథి: సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:25 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 5న అర్ధరాత్రి 12:13 గంటలకు ముగుస్తుంది. రోహిణి నక్షత్రం: సెప్టెంబర్ 4న రాత్రి 11:04 గంటల వరకు ఉంటుంది. శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని భక్తుల విశ్వాసం. కృష్ణుడి జన్మ సమయం అర్ధరాత్రి కావడంతో.. ఈసారి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజునే జన్మాష్టమి వేడుకలు నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు. పూజా ముహూర్తం: సెప్టెంబర్ 4న రాత్రి 11:57 గంటల నుంచి 12:43 గంటల వరకు ఉంటుంది. ఈ నిశిత కాలంలో బాలకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి.. జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. జన్మాష్టమి పూజల్లో అర్ధరాత్రి సమయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణుడు నిశిత కాలంలో జన్మించాడని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు ఆ సమయంలో భజనలు, కీర్తనలు చేస్తూ శ్రీకృష్ణుడిని పూజిస్తారు. పూజ అనంతరం బాలకృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలలో వేసి ఊపడం కూడా ముఖ్యమైన ఆచారం. జన్మాష్టమి సందర్భంగా ఇళ్లు, దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. బాలకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి పూజలు చేస్తారు. పూలు, పండ్లు, వెన్న, పాలు వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. పిల్లలకు కృష్ణుడు, రాధ వేషాలు వేయించడం కూడా జన్మాష్టమి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడనే విశ్వాసంతో జన్మాష్టమి రోజంతా భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి సమయంలో

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు చిత్ర యూనిట్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వర్కింగ్ టైటిల్ NBK111 సినిమాకి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమా అధికారిక టైటిల్ తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ వార్త బయటకు రావడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ భారీ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా గ్లింప్స్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఆ గ్లింప్స్ కు లభించిన అనూహ్య స్పందనతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా అనౌన్స్మెంట్కు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం దాదా లేదా గాడ్ అనే రెండు శక్తివంతమైన పేర్లలో ఒకదాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో సెప్టెంబర్ 6న ఏ టైటిల్ ప్రకటిస్తారో అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఫలితంగా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల వివరాలు కూడా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ఒక అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ గాయం కారణంగా కొద్దిరోజుల పాటు షూటింగ్‌కు విరామం లభించిన సంగతి

Janmashtami 2026 Holiday: శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 2026లో జన్మాష్టమి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజున వచ్చింది. దీంతో ఈ పండుగ సందర్భంగా స్కూళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుందా అనే ఆసక్తి చాలామందిలో ఉంది. జన్మాష్టమి సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవు ఉండే అవకాశం ఉంది. అయితే అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన సెలవు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ, స్కూల్ బోర్డు నిర్ణయాలను బట్టి సెలవు మారవచ్చు. అందుకే విద్యార్థులు తమ స్కూల్ హాలిడే క్యాలెండర్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 4న పలు ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు మూసి ఉండనున్నాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, లక్నో, జైపూర్, భువనేశ్వర్, చండీగఢ్, కోచి, పాట్నా, రాంచీ, తిరువనంతపురం, శ్రీనగర్ వంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే తమ బ్రాంచ్‌కు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం మంచిది. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. ముఖ్యంగా కృష్ణుడి జన్మస్థలమైన మథుర, వృందావన్ ప్రాంతాల్లో వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. అయితే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లు, CBSE, ICSE, రాష్ట్ర బోర్డు పాఠశాలలకు సెలవుల విషయంలో తేడాలు ఉండవచ్చు. జన్మాష్టమి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొన్ని ప్రాంతాల్లో మూసి ఉండవచ్చు. దీనిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సెలవుల జాబితానే తుది నిర్ణయంగా భావించాలి. ఈసారి సెప్టెంబర్ 4 శుక్రవారం కావడంతో శని, ఆదివారాలు సెలవుగా ఉండే

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని వీడి, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న విజయసాయిరెడ్డి.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను వైసీపీలో ఉండగా ఓ సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనను కొట్టారని వెల్లడించారు. అయితే దాని వెనుక ఉన్న కారణం మాత్రం చెప్పలేదు. జగన్ సమక్షంలోనే ఇది జరిగినా, ఆయన స్పందించలేదంటూ బాంబు పేల్చారు. దీనిపై ఓవైపు తీవ్ర చర్చ జరుగుతుండగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఇవాళ దాని వెనుక ఉన్న కారణం ఏంటో బయటపెట్టారు.Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా మంగళగిరిలో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆయనను మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టడం నిజమేనని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ వెల్లడించారు. అయితే దీని వెనుక ఉన్న కారణం కూడా బయటపెట్టారు. అప్పట్లో వైసీపీ ప్లీనరీ వేదికపై ఎవరితో మాట్లాడించాలనే దానిపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ రోజు ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి చివరికి విజయసాయి రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టారని కోటంరెడ్డి పేర్కొన్నారు. సాయిరెడ్డి తనకు 72 అవమానాలు జరిగాయని చెప్పారని, కానీ తనకు తెలిసి మరో అవమానం కూడా ఆయనకు జరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో సొంతూరు తాళ్లపూడి వచ్చినప్పుడు కాకుపల్లి సెంటర్లో వంద వాహనాలతో స్వాగతం పలికినందుకు.. సాయిరెడ్డిని సజ్జల నోటితో చెప్పలేని విధంగా తిట్టారన్నారు. గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ కన్ను ? మాజీ వైసీపీ నేతకు ఆఫర్..!మరోవైపు రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ వైసీపీ వికృత రాజకీయాలు చేస్తోందంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వైసీపీ క్రెడిట్ చోరీ చూస్తుంటే, ప్రాజెక్టులన్నీ కట్టింది జగనే అని, దేశానికి

Anakapalli: అనకాపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు! Anakapalli: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి వేల్పులవీధి కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి మాజీ మంత్రి, శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ ప్రోత్సాహంతో మెగా యూత్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ శ్రీ సురభి హరీష్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరానికి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ భీమరశెట్టి రామ్కీ ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసిన వారిని అభినందించారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, సేవా కార్యక్రమాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భీమరశెట్టి రామ్కీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమం.. జన్మదిన వేడుక. రెండింటినీ కలిపిన ఈ కార్యక్రమం అనకాపల్లిలో జనసేన శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది
మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత కన్నయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి. ఈ పవిత్రమైన రోజున గులాబీ రంగు వస్త్రాలను ధరించాలి. అనంతరం నుదుటిపై కుంకుమ పెట్టుకోవాలి. చిన్ని కృష్ణుడికి సమర్పించే నైవేద్యంలో పిండి పదార్థాలను చేర్చాలి. ఇలా చేయడం వల్ల మీకు ఎదురయ్యే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి ఈ రాశి వారు గోకులాష్టమి రోజున బాల గోపాలుడికి పాలు, తేనే కలిపి స్నానం చేయించాలి. అనంతరం పసుపు చందనం తిలకం రాయాలి. ఆ తర్వాత స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. అదే విధంగా శ్రీ కృష్ణుడితో పాటు రాధను పూజించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కృష్ణాష్టమి వేళ వేణు మాధవుడికి ఎర్రని రంగు దుస్తులను సమర్పించాలి. మీరు తయారు చేసే నైవేద్యంలో లడ్డూలను చేర్చాలి. ఇలా చేయడం వల్ల అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున శంఖంలో నీటితో బాల గోపాలుడికి స్నానం చేయించాలి. అలాగే చిన్ని కృష్ణుడికి సమర్పించే నైవేద్యంలో పిండి పదార్థాలను చేర్చాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ కన్నయ్యకు వెన్న, నెయ్యి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుందని

Kankipadu: కంకిపాడులో పోలీసుల కాల్పుల కలకలం క్లూస్ టీమ్ విస్తృత తనిఖీలు ఈ వార్తకు సంబంధించిన

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ, సెప్టెంబర్ 1: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న(సోమవారం) రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో నిందితుడిపై సీఐ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించగా కంకిపాడు వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సీఐ, కానిస్టేబుల్ శ్రీనివాస్.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. నిందితుడు అవినాధ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ, కానిస్టేబుల్‌పై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. అవినాధ్ కాళ్లపై కాల్పులు జరిపారు. ఆపై గాయపడిన యువకుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అవినాధ్.. పెనమలూరు గ్రామ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ శ్రీనివాస్, నిందితుడు అవినాధ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి ఆ నీటి ప్రవాహంలో యువకులు చిక్కుకుపోయారు. వారిని జిల్లా అధికారులు రక్షించారు. మార్కాపురం,సెప్టెంబర్01: జిల్లాలోని పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలోని వెలిగొండ నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులోని ముగ్గురు యువకులు సమీపంలోని చెట్టు ఎక్కి రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే జిల్లా అధికారులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి.. ఆ యువకులను రెస్క్యూ టీం కాపాడింది. వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి.. ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లు ఆ యువకులు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం విదితమే
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌కు టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సంచలన విజయం సాధించడంతో వీరి తాజా చిత్రం 'NBK111'పై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’తో ఇటీవల బ్లాక్‌బస్టర్ అందుకున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అదిరిపోయే ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్ అధికారిక టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ని సెప్టెంబర్ 6న రివీల్ చేయనున్నారు. ఆ రోజు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు కావడంతో నందమూరి అభిమానులకు ఇది డబుల్ ధమాకాగా మారనుంది. ఇటీవల షూటింగ్లో బాలకృష్ణ కాలికి గాయమై శస్త్రచికిత్స జరిగినప్పటికీ, ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారు. గాయం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.* బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్.. దసరా రేసు నుంచి రజనీకాంత్ 'జైలర్ 2' ఔట్?గతంలో విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలయ్య ఎన్నడూ చూడని సరికొత్త, అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, విలక్షణ నటుడు మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా.. బాలయ్య కటౌట్‌కి తగినట్లుగా పదునైన సంభాషణలు రాస్తున్నారు. బాలయ్య మార్క్ యాక్షన్, గోపీచంద్ మలినేని మాస్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్లో గాయపడిన బాలయ్య, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూనే ఇప్పటివరకు పూర్తయిన సీన్లకు డబ్బింగ్ పూర్తి చేస్తున్నారని సమాచారం. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన ప్రత్యేక పాత్ర కోసం తమిళ హీరో ఆర్యను ఎంపిక చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో ఆర్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఫిలిం నగర్ టాక్. కొరటాల శివ బాలయ్యను పూర్తి స్థాయి మాస్ అవతారంలో చూపిస్తూనే, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా పెద్దపీట వేసేలా పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది చివర్లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, SLV సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ NBK111. ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అధికారిక టైటిల్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 6న అధికారికంగా వెల్లడించనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రానికి మేకర్స్ ‘GOD’ మరియు ‘DADA’ (దాదా) అనే రెండు మాస్ క్యాచీ టైటిల్స్ చిత్ర బృందం పరిశీలనలో ఉన్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. బాలయ్య ఇమేజ్‌కి, గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ డ్రామాకి ఈ రెండు పేర్లు పర్ఫెక్ట్గా సరిపోతాయని భావిస్తున్నారు. అయితే దాదాపు ‘దాదా’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ముంబై నేపథ్యంలో జరిగే గ్యాంగ్ స్టార్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య గాయపడడంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు మేకర్స్. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ 6న వచ్చే అధికారిక ప్రకటనతో ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదీపై పూర్తి స్పష్టత రానుంది

‘ఇరుముడి’ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ చేసే సినిమాకు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరనే విషయం పై రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. వరుస ప్లాప్‌లతో కాస్త వీక్‌గా ఉన్న రవితేజకు ఈ సినిమా ఊపిరి పోయడమే కాదు, ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల రూపాయల షేర్ మార్కును దాటేసింది. ఇక ఓవర్సీస్, ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న హోల్డ్ చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లో ఈజీగా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇతర పెద్ద సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ‘ఇరుముడి’ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ హిట్ పడటంతో దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు చిత్రసీమలో ఒక డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో గ్రాండ్ హిట్ కొడితే చాలు.. నిర్మాతలు, హీరోల మేనేజర్లు వారి చుట్టూ తిరగడం సహజమే. ఇప్పుడు శివ నిర్వాణ విషయంలోనూ ఇదే జరుగుతోందట. పలువురు ప్రముఖ నిర్మాతలు ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని చెక్కులు పట్టుకుని తిరుగుతున్నారట. ఇప్పుడు కాకపోయినా పర్లేదు.. భవిష్యత్తులో మీతో సినిమా చేస్తాం, అడ్వాన్స్ తీసుకోండి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారనే పుకార్లు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ NBK111. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్లో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ NBK111. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో, ఈ తాజా చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీపడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ ఫస్ట్ గ్లింప్స్‌లో బాలయ్య అల్ట్రా స్టైలిష్, పవర్ఫుల్ అవతార్‌లో కనిపించి మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో NBK111 నుంచి చిత్ర బృందం ఒక అదిరిపోయే బిగ్ అప్డేట్ను సిద్ధం చేసింది. ఈ సినిమా అధికారిక టైటిల్‌తో పాటు ప్రపంచవ్యాప్త థియేట్రికల్ విడుదల తేదీని సెప్టెంబర్ 6వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ రోజు విశేషం ఏమిటంటే.. నటసింహం తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) పుట్టినరోజు! తనయుడి బర్త్‌డే వేళ అభిమానులకు డబుల్ ధమాకా ట్రీట్ ఇచ్చేందుకు బాలయ్య ఈ క్రేజీ అప్డేట్ను లాక్ చేశారు. ఈ ప్రకటనతో అటు మోక్షజ్ఞ బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో పాటు ఇటు సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో నందమూరి ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. వెర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అత్యున్నత

అది కేవలం నీటి ప్రవాహం కాదు, దశాబ్దాలుగా కరవు నేల చూస్తున్న కల సాకారమైన క్షణం. అందుకే, పరుగులు పెడుతున్న కృష్ణమ్మను చూసి అక్కడికి వచ్చిన జనం కేవలం కేరింతలు కొట్టడమే కాదు, ఆ నీటిని చేతులతో తాకి భక్తితో కళ్లకద్దుకున్నారు. ఎంతో పవిత్రంగా భావిస్తూ తలపై చల్లుకున్నారు. కొందరైతే తాము తెచ్చుకున్న బాటిళ్లలో ఆ పుణ్య జలాలను నింపుకుని ఇళ్లకు పట్టుకెళ్లారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కనిపించిన ఈ దృశ్యం, ఆ ప్రాంత ప్రజల గుండెల్లో కృష్ణా జలాలకు ఉన్న స్థానాన్ని, వారి నిరీక్షణ తీవ్రతను చెప్పకనే చెప్పింది.దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ప్రారంభించారు. ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేయడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా జల సంబరంతో పులకించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల కళ్లముందే ప్రవాహమై పరుగులెడుతుంటే, అక్కడికి తరలివచ్చిన రైతులు, మహిళలు, ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.గేట్లు ఎత్తగానే కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే, ప్రజల ఈలలు, కేరింతలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చాలా మంది తమ సెల్ఫోన్లలో ఈ అపురూప దృశ్యాన్ని బంధించారు. తమ ప్రాంతానికి నీళ్లు వస్తాయో రావో అనే సందేహంతో బతికిన తాము, ఇప్పుడు కళ్లారా కృష్ణమ్మ పరవళ్లను చూస్తున్నామంటూ పలువురు రైతులు భావోద్వేగానికి గురయ్యారు. తమ జీవితాల్లో ఇదొక చారిత్రక మలుపు అని, తమ కరవు కష్టాలు తీరినట్టేనని ఆనందబాష్పాలతో తెలిపారు.సాధారణంగా సభ ముగియగానే జనం ఇళ్లకు

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తిరువూరు, ఆగస్టు 22: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శనివారం తిరువూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పుట్రేల సమీపంలో స్కూటిపై వెళ్తున్న నిందితుడు గోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామన్నారు. తమ విచారణలో ఈ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. ఏ కొండూరు, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు వరుస చోరీలకు పాల్పడుతున్నాడని వివరించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ అతడి స్వస్థలమని డీసీపీ చెప్పారు. ఆగస్టు10వ తేదీన ఏ. కొండూరు మండలం చీమలపాడు, విస్సన్నపేట మండలం కలగర, తిరువూరు మండలం మల్లేల గ్రామాల్లో వరుస చోరీలు జరిగాయి. ఆయా ఇళ్ల తాళాలను పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులతోపాటు నగదు దొంగలించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టామన్నారు. అలా అతడిని శనివారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ

తెలుగు చిత్ర పరిశ్రమలో 'మహానటి' సావిత్రి తర్వాత అంతటి గౌరవం, కీర్తి సంపాదించుకున్న నటి సౌందర్య. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతో ఆమె నటించారు. తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగారు. గ్లామర్ కి దూరంగా ఉంటూ చీరకట్టుతో కనిపించి ఆ చీరకే అందాన్ని తీసుకొచ్చారు. 2004లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణం చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. సౌందర్య నటించిన చివరి సూపర్ హిట్ సినిమా వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'సీతయ్య' (2003). ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ హీరోగా నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది. దురదృష్టవశాత్తు, ఈ సినిమా విడుదలైన కొద్ది నెలలకే సౌందర్య ప్రమాదంలో మరణించారు. విధి విచిత్రమో ఏమో గానీ, 'సీతయ్య' చిత్ర హీరో నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు విడిచారు. 2018లో నెల్లూరు జిల్లాలో ఒక పెళ్లికి వెళ్తుండగా, నల్గొండ జిల్లా సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరికృష్ణ మరణించారు. ఒకే సినిమాలో జంటగా నటించిన హీరో, హీరోయిన్ ఇద్దరూ వేర్వేరు ప్రమాదాల్లో మరణించడం నిజంగా ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయం. సౌందర్య, హరికృష్ణ ఇద్దరూ ఈ రోజు మన మధ్య లేరు. హరికృష్ణ.. జూ ఎన్టీఆర్, కళ్యాణ్‌లకు తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ కొడుకు. అనే విషయం తెలిసిందే. భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారి నటన, చిరునవ్వు, మంచి మనసుతో కోట్లాది అభిమానుల గుండెల్లో సౌందర్య, హరికృష్ణ ఎప్పటికీ జీవించే ఉంటారు. సౌందర్య `సీతయ్య` తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది. అందులో `స్వేతనాగు`, ` ప్రేమ దొంగ` చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆడలేదు. అదే సమయంలో మోహన్ బాబుతో `శివ శంకర్`, `నర్తనశాల` చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ జరిగే సమయంలోనే ఆమె కన్నుమూయడం అత్యంత బాధాకరం

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ ఇంచార్జ్‌లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే నాలుగైదు రోజులు అత్యంత కీలకమని, అర్హులైన ఓట్లు తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల సూచించారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటును పరిశీలించాలని, డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై అభ్యంతరాలు దాఖలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా అవసరమైన ఫారాలను సమర్పించి వారి ఓట్లను కొనసాగించేలా చూడాలని స్పష్టం చేశారు. 44 లక్షల నోటీసుల అంశంపైనా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాలని సజ్జల పార్టీ నేతలకు సూచించారు. అర్హులైన ఓటర్లకు సంబంధించిన అంశాల్లో అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని, చిరునామా మార్పులు, ఇతర ఓటరు వివరాల సవరణలకు అవసరమైన ఫారాలను కూడా దాఖలు చేయాలని చెప్పారు.. అభ్యంతరాలు లేదా దరఖాస్తులు సమర్పించిన ప్రతిసారీ సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సజ్జల సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం రసీదులు, సంబంధిత పత్రాలను భద్రపరచుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలకు సంబంధించిన ప్రధాన ప్రక్రియను ఆగస్టు 27, 28 తేదీల నాటికి పూర్తి చేయాలని సజ్జల ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రాంతానికి బయట ఉన్న ఓటర్ల వివరాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వ్యవహారంలో
తిరుమల శ్రీవారిని మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ అభిమాని రామచంద్ర రాజు అలియాస్ ఎన్టీఆర్ కుమారుడు శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా.. ఆయనతో కలసి నందమూరి రామకృష్ణ , మోహనకృష్ణ కుటుంబంతో స్వామివారిని దర్శించుకున్నారు. రామచంద్రరాజుతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. శ్రీధర్ వర్మకు తన తండ్రి ఎన్టీఆర్, ఎన్టీఆర్ రాజు ఆశీస్సులు ఉండాలంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.ఎన్టీఆర్ రాజు రెండుసార్లు వరుసగా పాలకమండలిలో సభ్యుడిగా ఉన్నారని.. మూడోసారి పదవి ఇవ్వబోతే ఎన్టీఆర్ వద్దని చెప్పిన విషయాన్ని నందమూరి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఎన్టీఆర్ టీటీడీ పాలకమండలి సభ్యుల పదవీ కాలానికి సంబంధించి ఓ నిబంధనను తీసుకొచ్చారని.. టీటీడీ పాలకమండలిలో రెండుసార్లకు మించి ఎవరూ ఉండకూడదని ఎన్టీఆర్ జీవో తెచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజు సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.శ్రీధర్ వర్మకు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిరావడం ఆనందంగా ఉందన్నారు నందమూరి మోహనకృష్ణ. శ్రీధర్ వర్మ తండ్రి ఎన్టీఆర్ రాజుతో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ రాజు పిల్లలు మాకు సోదరసమానులు.. అందరం అన్నదమ్ముల్లా ఉంటామన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఎన్టీఆర్ రాజును పోటీచేయమని కోరితే.. ఆయన నిరాకరించి 'మీకు సేవ చేసుకుంటాను' అని చెప్పిన మాటన గుర్తు చేశారు. ఎన్టీఆర్ కోరితేనే టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించారని.. ఆయన భూ దానం కూడా చేశారన్నారు. అంతేకాదు ఎన్టీఆర్ రాజు గతేడాది కన్నుమూశారు.. ఆయన పాడెను మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కుమారులు నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ మోశారు.టీడీపీ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ టీటీడీకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు