
వివాహం'పై కిరణ్ బేడీ షాకింగ్వ్యాఖ్యలు
మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ ఏ విషయాన్ని అయినా చాలా ముక్కుసూటిగా నిష్కపటంగా చెబుతుంటారు. మహిళల సమస్యల విషయానికి వస్తే, ఆమె ఏమాత్రం భయపడకుండా, సాంప్రదాయాలను సవాలు చేసేలా..చాలా సూటిగా మాట్లాడతారు. నెల రోజుల క్రితం అభిషేక్ వ్యాస్‌తో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో, భారతీయ మహిళలకు వివాహం ఎలాంటిదో చాలా ఓపెన్‌గా చెప్పారు. ప్రతి ఆడపిల్ల ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతుందో కూడా మాట్లాడారు. మరి అవేంటో చూద్దామా..! పెళ్లి చాలా అందంగా ఉంటుంది, పెళ్లి ఊరేగింపు అట్టహాసంగా, వైభవంగా ఉంటుంది అంతే..అని అన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ మహిళకు చాలా సురక్షితమైన, ప్రేమగా, అండగా నిలిచే ఇంటిని వెళ్లిపోవాల్సి వస్తుంది కాబట్టి అది ఆమెకు 'మానసిక క్షోభే' అని నర్మగర్భంగా చెప్పారామె. అంతేగాదు ఒక మహిళ తన పుట్టింటిని విడిచి వెళ్లడమే కాకుండా, తన అత్తమామలను కూడా సొంత తల్లిదండ్రుల్లా చూడాలని ఆశిస్తారని, ఇది చాలా హాస్యాస్పదమైనదని అన్నారు. ఎందుకంటే అది ఆచరణ సాధ్యమైనది కాదని తేల్చి చెప్పారు. అసలు ఎవరైనా ఏదో ఒక మహిళను 'అమ్మా' అని పిలవగలరా? అది అసలు సాధ్యమేనా అని నిలదీశారు. వాస్తవం ఏంటంటే అసలు ఎవరూ అలా చేయలేరు, కానీ పెళ్లైన భారతీయ మహిళపై అలా చేయమని ఒత్తిడి చేస్తుంటారని అన్నారు. కొత్తగా పెళ్లయిన మహిళ తన భర్త ఇంటి వాతావరణం ఎలా ఉన్నా సరే, దానికి అనుగుణంగా సర్దుకుపోవాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే పెళ్లి అన్న రెండు అక్షరాలతో ఆమె ఇంటికి 'యజమాని'గా మారుతుంది కాబట్టి అని అన్నారు. అయినా ఒక మహిళ గృహిణిగా ఉండాలనుకుంటుందా లేదా అనే విషయాన్ని కుటుంబాలు అసలు ఆలోచించవని అన్నారు. ఒకవేళ వివాహిత ఉద్యోగం చేస్తుంటే, ఇంటి పనుల కోసం సహాయకులను (domestic help) నియమించుకోవచ్చని ఆమె సూచించారు. వివాహానికి ముందే జంటలు ఈ విషయం గురించి ఎందుకు