
Kamal Haasan : ప్రతి కుర్రాడి మనసుకు టచ్ అయ్యే సీన్.. అబ్బాయి జీవితాన్ని తెలిపే డైలాగ్.. మీరు విన్నారా.. ?
Kamal Haasan : ప్రతి కుర్రాడి మనసుకు టచ్ అయ్యే సీన్.. అబ్బాయి జీవితాన్ని తెలిపే డైలాగ్.. మీరు విన్నారా.. ?
© 2026 nimisham.in

Kamal Haasan : ప్రతి కుర్రాడి మనసుకు టచ్ అయ్యే సీన్.. అబ్బాయి జీవితాన్ని తెలిపే డైలాగ్.. మీరు విన్నారా.. ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పష్టత ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని ఆయన తెలిపారు. ప్రభాస్ తన ఇతర సినిమా కమిట్మెంట్లు పూర్తి చేసుకుని ఫ్రీ అయిన వెంటనే తర్వాతి షెడ్యూల్స్‌ను వేగంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వార్తతో కల్కి 2 సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రొడక్షన్ పురోగతిపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇంతకుముందు జూన్ నెలలో వచ్చిన నివేదికలతో పోలిస్తే ఈ ప్రకటన కొంత మార్పును సూచిస్తోంది. ఆ సమయంలో రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో మొదలవుతుందని, రైటింగ్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులు ఎక్కువగా పూర్తయ్యాయని నాగ్ అశ్విన్ వెల్లడించారు. అయితే ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా సెప్టెంబర్ ప్లాన్ వాయిదా పడిందని ఆగస్టు నివేదికలు స్పష్టం చేశాయి. ఫౌజీ మరియు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ప్రభాస్‌ను బిజీగా ఉంచడంతో కల్కి 2 సెట్స్‌కు ఆయన రావడం ఆలస్యమైంది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ భాగాలు ఇప్పటికే కొంతవరకు పూర్తయినట్లు సమాచారం అందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ భైరవ లేదా కర్ణ పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్ హాసన్ తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. మరోవైపు సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొనే సెప్టెంబర్ 2025లో అధికారికంగా బయటకు రావడంతో ఆ ముఖ్యమైన పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ స్కేల్ చాలా పెద్దది కావడం వల్ల సినిమా నిర్మాణం మరింత సమయం తీసుకోనుంది. హెవీ VFX

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కల్కి 2’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ పై దర్శకుడు కీలక అప్డేట్ ఇచ్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కల్కి 2’ (Kalki 2) ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌పై మొదటి భాగం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ‘కల్కి 2’కు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందనే విషయం స్పష్టమైంది. ప్రభాస్ ప్రస్తుతం తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన తన మిగతా సినిమాల కమిట్మెంట్స్ను పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చిన తర్వాత ‘కల్కి 2’ తదుపరి షెడ్యూళ్లను వేగంగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కథ, పురాణ అంశాలు, అత్యున్నత స్థాయి విజువల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సీక్వెల్‌కు సంబంధించిన అంశాలను చూపించడంతో ‘కల్కి 2’పై ఆసక్తి మరింత పెరిగింది. మొదటి భాగంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా.. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా మెప్పించారు. కమల్ హాసన్ యాస్కిన్ పాత్రలో కనిపించి సినిమాకు మరింత బలాన్ని తీసుకొచ్చారు. ఈ ముగ్గురు నటులు సీక్వెల్లో కీలకంగా ఉండనుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. శివన్నలో మరో యాంగిల్.. ఆసక్తికరంగా ‘కూర్మ అవతార్’ టీజర్

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా ధర్మన్ (Dharman) పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. కమల్‌హాసన్(Kamal Haasan), ఆర్. మహేంద్రన్ (R. Mahendran) నిర్మిస్తున్న ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు(Aswath Marimuthu) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌లో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ధర్మన్ మూవీకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే కాదని, కథలో కీలకమైన మలుపులతో ముడిపడి ఉండే ప్రాధాన్యత కలిగిన క్యారెక్టర్లో రామ్ కనిపించనున్నారని సమాచారం. ఆయన క్యారెక్టర్ లెంగ్త్ కూడా రెగ్యులర్ క్యామియో కంటే ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. రజనీకాంత్, రామ్ పోతినేని ఒకే సినిమాలో కనిపించనున్నారనే వార్త సహజంగానే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కథలో వీరిద్దరి పాత్రలకు ఎలాంటి సంబంధం ఉంటుంది? రామ్ క్యారెక్టర్ కథను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుంది? అనే అంశాలపై ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. మరోవైపు రామ్ పోతినేని RAPO23తో డైరెక్టర్‌గానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మన్ లో ఆయనకు లభించనున్న క్యారెక్టర్ నిజమైతే.. ఆయన కెరీర్లో ఇది మరో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది

సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్ కథానాయకుడిగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ధర్మన్’లో రామ్ పోతినేని ఒక కీలకపాత్రలో నటించనున్నారని సమాచారం.ఈ సినిమాలో రజనీకాంత్ అల్లుడి పాత్రలో రామ్ కనిపించనున్నారని తెలుస్తోంది. కేవలం అల్లుడిగానే కాకుండా మామతో నిత్యం విభేదించే శక్తిమంతమైన పాత్రలో ఆయన నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఈ వార్త నిజమైతే, తెలుగు ప్రేక్షకులకు ఇది పండగే అని చెప్పొచ్చు. ‘ధర్మన్’ సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం.వాస్తవానికి ఈ సినిమా అనేక అడ్డంకులను దాటుకుని సెట్స్ పైకి వెళ్లింది. తొలుత వేరే దర్శకులతో చర్చలు జరిపినా, చివరికి ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరిముత్తుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.భారీ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. రామ్ పోతినేని చేరికపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ వార్తపై

మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ రజనీకాంత్ నడుమ బాక్సాఫీస్ వార్ సాగనుంది. అది ఒకసారి కాదు రెండు సార్లు జరగనుందని టాక్. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)నడుమ బాక్సాఫీస్ వార్ సాగనుంది. అది ఒకసారి కాదు రెండు సార్లు జరగనుందని టాక్. ఈ 'డబుల్ క్లాష్' క్రమంలో ఇటు టాలీవుడ్ లో చిరు - అటు కోలీవుడ్ లో రజనీ ఇతర టాప్ స్టార్స్ తో పోటీపడ్డ వైనాన్ని గుర్తు చేసుకుందాం. డబుల్ క్లాష్'పై సినీ ఫ్యాన్స్ ఫోకస్... రజనీకాంత్ 'జైలర్-2' చిత్రం అక్టోబర్ 15న విడుదలవుతూండగా, చిరంజీవి 'విశ్వంభర' సినిమా ఆ మరుసటి రోజునే జనం ముందుకు వస్తోంది. ఈ దసరా సీజన్ పోటీ తరువాత పొంగల్ బాక్సాఫీస్ వార్ లోనూ రజనీకాంత్, చిరంజీవి మరోమారు తలపడనున్నారని టాక్. అప్పుడు చిరంజీవితో బాబీ తెరకెక్కిస్తోన్న 'కదిరి నరసింహుడు'తో రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తోన్న 'ధర్మన్' ఢీ కొంటుందని వినికిడి. అలా చిరు-రజనీ బాక్సాఫీస్ వార్ రెండు సార్లు సాగనుండటం సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి చోటు చేసుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ - కోలీవుడ్ సూపర్ స్టార్ మధ్య పోటీ కావడం వల్ల ఇతర చిత్రసీమల్లోనూ వీరి సినిమాలపై సినీజనం ఫోకస్ పెట్టారు. చిరుపై రజనీ పైచేయి... చిరంజీవి, రజనీకాంత్ సినిమాలు ఒకే రోజున రిలీజైన సందర్భాలు ఇంత వరకూ లేవు. అయితే ఒకే ఒక్కసారి వీరిద్దరి చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదలయ్యాయి. ఆ బాక్సాఫీస్ వార్ 2023లో చోటు చేసుకుంది. అప్పుడు ఆగస్టు 10న రజనీకాంత్ 'జైలర్' రిలీజ్ కాగా, మరుసటి రోజునే ఆగస్టు 11న చిరంజీవి 'భోళాశంకర్' జనం ముందు నిలచింది. రజనీకాంత్ 'జైలర్' బంపర్ హిట్ అనిపించుకుంది. అందువల్లే ఈ సారి 'జైలర్-2' ముందు 'విశ్వంభర' ఏం చేస్తుందో అన్న ఉత్కంఠ ఫ్యాన్స్ లో ఉంది

భారతీయ సినీ చరిత్రలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ది ప్రత్యేకమైన స్థానం. ఆగస్టు 15 ఆయన సినీ ప్రయాణంలో మరుపురాని రోజు. భారతీయ సినీ చరిత్రలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ది (Rajinikanth) ప్రత్యేకమైన స్థానం. ఆగస్టు 15 ఆయన సినీ ప్రయాణంలో మరుపురాని రోజు. 1975లో ఇదే రోజున రజనీకాంత్ నటించిన తొలి చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన తమిళ ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత దశాబ్దాల పాటు తనదైన స్టైల్, మేనరిజమ్స్, నటనతో భారతీయ చిత్రసీమలో తిరుగులేని సూపర్‌స్టార్‌గా ఎదిగారు. తొలి సినిమా విడుదలై 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజనీకాంత్ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ‘ధర్మన్’ చిత్రబృందం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్స్‌లో రజనీకాంత్ సమక్షంలో కేక్ కటింగ్ చేసి ఆయనకు ఘనంగా సత్కారం చేశారు. ఈ వేడుకలో ‘ధర్మన్’ దర్శకుడు అశ్వత్ మారిముత్తు, కథానాయికలు సిమ్రన్, రాశీ ఖన్నాతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. రజనీకాంత్‌తో కలిసి కేక్ కట్ చేసి ఆయన 51 ఏళ్ల అద్భుతమైన సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ నటుడు కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది

విలక్షణ నటుడు కమల్ హాసన్ సినీ రంగ ప్రవేశం చేసి 67 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ, మారుతున్న చిత్ర పరిశ్రమకు అనుగుణంగా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటానని చెబుతూ.. తనను తాను సినిమా రంగంలోని "అత్యంత పెద్ద వయసు జెన్ Z" (Oldest of Gen Z) గా అభివర్ణించుకున్నారు.ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా కమల్ హాసన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. "నా 67 ఏళ్ల సినీ ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ 67 ఏళ్లలో నేను నిజంగా నేర్చుకున్నది కేవలం 20 సంవత్సరాలే అని భావిస్తున్నాను. మిగిలిన సమయం మురుగునీటి ప్రవాహంలో కొట్టుకుపోవడమే. కళాకారులు, ప్రేక్షకులు అందరం కలిసికట్టుగా సినిమా అనే సముద్రంలో కలిసేందుకు ప్రవహిస్తున్నాం. అదొక గొప్ప ఆశ" అని తనదైన తాత్విక ధోరణిలో పేర్కొన్నారు.అంతేకాదు, సినిమా చరిత్రను కూడా ఆయన గుర్తుచేశారు. "1895 డిసెంబర్లో లూమియర్ బ్రదర్స్ తొలిసారిగా చిత్రాన్ని ప్రదర్శించారు. అప్పటి నుంచి సినిమా పరిశ్రమకు సుమారు 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మొత్తం సినీ చరిత్రలో సగానికి పైగా, అంటే 67 ఏళ్లుగా నేను ఈ రంగంలోనే ఉన్నానని నా బృందం గుర్తు చేసింది. ఇది నమ్మశక్యం కాని ఆలోచన. అయినా నేను నేర్చుకున్నది 20 ఏళ్లే" అని ఆయన తన పోస్టులో వివరించారు.కమల్ హాసన్ కేవలం ఆరేళ్ల వయసులో "కళత్తూర్ కన్నమ్మ" చిత్రంతో బాలనటుడిగా వెండితెర

వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని చాలామంది అంటుంటారు. కానీ, దానిని ప్రాక్టికల్‌గా నిరూపించి చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని చాలామంది అంటుంటారు. కానీ, దానిని ప్రాక్టికల్‌గా నిరూపించి చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth). ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో ఉన్న తలైవా వేగం చూస్తుంటే.. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా కుర్ర హీరోలందరికీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ ఏజ్‌లో ఆ స్పీడ్ ఏంటి తలైవా.. అంటూ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఏడాదికి కనీసం ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలనే క్లియర్ టార్గెట్‌తో దూసుకుపోతున్నారు రజనీకాంత్. గతేడాది ఆయన కథానాయకుడిగా వచ్చిన ‘కూలీ’ (Coolie) సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ.. టాక్ విషయంలో కాస్త మిశ్రమ ఫలితాలనే సాధించింది. అయితే, ఆ సినిమా టాక్ ఎలా ఉన్నా సరే, తలైవా రేంజ్, మేనియా మాత్రం తగ్గలేదని బాక్సాఫీస్ నంబర్స్ స్పష్టం చేశాయి. ఇక ‘కూలీ’ తర్వాత అభిమానుల చూపు మొత్తం ‘జైలర్ 2’ (Jailer 2) పైనే ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ భారీ సీక్వెల్ ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. మొదటి భాగం సృష్టించిన సునామీతో పోలిస్తే.. పార్ట్-2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రజనీకాంత్ మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఇక్కడితోనే రజనీ వేగం ఆగలేదు. ‘జైలర్ 2’ రిలీజ్ కాకముందే మరొక క్రేజీ ప్రాజెక్ట్‌ను జెట్ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు. ‘ఓ మై కడవులే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో ‘ధర్మన్’ (Dharman) అనే చిత్రం తెరకెక్కుతోంది. విశ్వనటుడు కమల్ హాసన్ సొంత నిర్మాణ

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు ఆల్ టైమ్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. మాయాబజార్, శంకరాభరణం వంటి అద్భుతమైన చిత్రాల సరసన సాగర సంగమం నిస్సందేహంగా నిలుస్తుంది. కొంతమంది ప్రేక్షకులు, అలాగే సినీ ప్రముఖులు శంకరాభరణం కన్నా కె. విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి సాగర సంగమం అని కూడా అభిప్రాయపడతారు. అలాంటి ఒక అపురూపమైన చిత్రంలో మాధవి అనే కీలకమైన, ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రను పోషించిన నటి జయప్రద తన అనుభవాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మాధవి పాత్ర తన జీవితంలో ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నానని జయప్రద తెలిపారు. ఈ పాత్ర లభించడం ఒక ఆర్టిస్ట్‌కు దొరికే గొప్ప ఛాలెంజ్ అని, తన దర్శకుడు కె. విశ్వనాథ్ తన వెనకాల నిలబడి చేయించారని ఆమె అన్నారు. మాధవి పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్భుతమని, ప్రతి కళాకారుడి వెనకాల ఒక మాధవి ఉంటే బాగుంటుందనిపించేలా ఆ పాత్రను విశ్వనాథ్ గారు సృష్టించారని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్లో ఎన్నో మంచి చిత్రాల్లో, ఆణిముత్యాల్లో ప్రథమ శ్రేణిలో ఉంటుందని జయప్రద చెప్పారు. సాగర సంగమం వచ్చిన సమయంలో తాను కమర్షియల్ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నానని, బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపుతో ఉన్నానని జయప్రద గుర్తు చేసుకున్నారు. అటువంటి సమయంలో ఓల్డ్ రోల్ చేయడానికి చాలా మంది తనను వద్దని, అది తన కెరీర్‌ను ప్రభావితం చేస్తుందని అన్నారని తెలిపారు. అయినప్పటికీ, తాను “నా కెరీర్ పోనీ, తర్వాత పిక్చర్లు చేయక పోనీ, నాకు రాక పోనీ. బట్ ఐ విల్ డూ దిస్ ఫిల్మ్. దీని తర్వాత నేను రిటైర్ అయిపోయినా కూడా పర్వాలేదు” అని నిర్ణయించుకుని ఈ చిత్రంలో నటించానని ఆమె ధైర్యంగా చెప్పారు. అలాగే కమల్ హాసన్ పోషించిన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కమల్ హాసన్ పోషించిన ఒక పాత్ర అఖిల భారతీయ నృత్య కార్యక్రమాలలో పాల్గొనాలని గొప్ప

శివకార్తికేయన్ హీరోగా శివకుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్న ‘సేయోన్’ రెండో షెడ్యూల్ మదురైలో ప్రారంభమైంది. శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కుతున్న ‘సేయోన్’ (Seyon )సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ మదురైలో ప్రారంభమైంది. సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం భారీ ఖర్చుతో ప్రత్యేక సెట్‌ను నిర్మించి షూటింగ్ నిర్వహిస్తున్నారు. ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శివకుమార్ మురుగేశన్ (Sivakumar Murugesan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నటుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. అరుల్స్, రేచల్ రెబాకా, సింగంపులి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించనుండటం ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శివకార్తికేయన్, సీమాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది

వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న ‘సెయాన్” ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చేతులు కలిపారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న ‘అమరన్’ తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో శివకార్తికేయన్ చేస్తున్న చిత్రమిది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో శివకార్తికేయన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్స్, మాస్ అప్పీల్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్ గా సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, షాన్ లోకేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్‌గా సుప్రీమ్ సుందర్ పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను అరుణ్ వెంకటరామూడి రూపొందిస్తున్నారు

ఒక సినిమా కోసం కంపోజ్ చేసిన ట్యూన్లన్నీ అందులో వాడరు. కొన్నిసార్లు ట్యూన్ బాగున్నా, కథకు, సీన్‌కు సెట్ కాకపోతే పక్కన పెట్టేస్తారు. ఆ ట్యూన్‌ను మరో సినిమాలో వాడుకోవడం, అదే ట్యూన్‌కు కొత్త హంగులు అద్ది అదే సినిమాలో మరో పాటగా మార్చడం జరుగుతుంది. సినీ సంగీత చరిత్రలో ఇలాంటివి చాలా జరిగే ఉంటాయి. కానీ అవి తెరబయటే ఉండిపోతాయి. కానీ అలాంటి విషయాలు తెలిసినప్పుడు మాత్రం వాహ్ అనిపిస్తుంది. ఇలాంటివి మ్యూజికల్ మ్యాస్ట్రో ఇళయరాజా కెరీర్లో చాలానే ఉన్నాయి. సినిమా కథ ప్రకారం, కమల్ హాసన్ మాదక ద్రవ్యాలను పడవలో స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు తెలిసిపోతుంది. వాళ్లు వస్తున్నారని తెలియగానే, అవి ఉన్న మూటను ఉప్పుతో కలిపి సముద్రంలో పడేస్తాడు. ఈ టెన్షన్ సీన్ మధ్యలో, ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు 'నిలా అదు వానత్తు మేలే' పాట వస్తుంది. ఇప్పుడు వింటుంటే పక్కా మాస్ బీట్ సాంగ్లా అనిపించే ఈ ట్యూన్, మొదట ఓ జోలపాట కోసం కట్టింది

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 173వ చిత్రం ధర్మన్ షూటింగ్ గురించి ప్రచారంలో ఉన్న వార్తలపై స్పష్టత వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టు 11 నుంచి ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నప్పటికీ అసలు వాస్తవం వేరేలా ఉంది. ఈ భారీ ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ జూన్ 25 నుంచే చెన్నైలో చాలా వేగంగా ప్రారంభమైంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ మొదటిసారిగా ఒక శక్తివంతమైన డాక్టర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ జూన్ 24న అధికారిక టైటిల్ ప్రకటన, పూజా కార్యక్రమాలతో చెన్నైలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దానికి మరుసటి రోజే అంటే జూన్ 25న ఒక ప్రత్యేకమైన పాట చిత్రీకరణతో షూటింగ్ శరవేగంగా మొదలైంది. ఇదిలా ఉండగా జూన్ 27న ప్రముఖ నటుడు కె. భాగ్యరాజ్ మరణించడంతో రజినీకాంత్ ఆయనకు చివరి నివాళులు అర్పించేందుకు వెళ్లారు. దీంతో కొన్ని రోజుల పాటు చిత్రీకరణ పనులకు తాత్కాలికంగా విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత జూలై ప్రారంభంలోనే మొదటి షెడ్యూల్ పనులను చిత్రబృందం విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఆగస్టు నెలలో కూడా ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నటి రాశి ఖన్నా సెట్స్‌లో రజినీకాంత్‌తో పనిచేసిన అనుభవాన్ని పంచుకోగా, దర్శకుడు అశ్వత్ ఆయన పడయప్పా ఛార్మ్‌ను ప్రశంసించారు. ఫలితంగా ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో రజినీకాంత్ పడయప్పా మార్కు మేనరిజమ్స్, కమల్ హాసన్ వేట్టయాడు విళయాడు తరహా థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా ఉంటాయని దర్శకుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఉత్సుకతను పెంచేసింది. ఈ భారీ చిత్రంలో రజినీకాంత్ సరసన సిమ్రాన్, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తుండగా యోగి బాబు