విధ్వంసం వైపు నడవకండి.. యువతకు పవన్ కళ్యాణ్ సూచన
విధ్వంసం వైపు నడవకండి.. యువతకు పవన్ కళ్యాణ్ సూచన కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే, మరొక తరం దాన్ని కాపాడిందని అన్నారు. వికసిత్ భారత్ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. యువత నిజానిజాలు తెలుసుకుని ప్రశ్నించాలని, మార్పు కోసం చేసే పోరాటం నిర్మాణం వైపు ఉండాలి తప్ప విధ్వంసం వైపు కాదని హితవు పలికారు. డబ్బుకు ఓటును, తప్పుడు సమాచారానికి ఆలోచనను అమ్ముకోవద్దని, ద్వేషానికి భవిష్యత్తును బలి చేయవద్దని యువతకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ వార్తకు సంబంధించిన
.webp)