
Kakatiya University | కేయూలో మళ్లీ దొంగలు పడ్డరు.. డెవలప్మెంట్ ఆఫీస్‌లో చోరీకి యత్నం..!
Kakatiya University | కేయూలో మళ్లీ దొంగలు పడ్డరు.. డెవలప్మెంట్ ఆఫీస్‌లో చోరీకి యత్నం..!
© 2026 nimisham.in

Kakatiya University | కేయూలో మళ్లీ దొంగలు పడ్డరు.. డెవలప్మెంట్ ఆఫీస్‌లో చోరీకి యత్నం..!

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నరసరావుపేట సమీపంలోని కాకాని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించారు. అనంతరం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండను సందర్శించి శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాకానిలోని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన గౌతమి, కృష్ణవేణి, నాగార్జున హాస్టల్ భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన కోటప్పకొండ క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.తన పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు

వర్షాకాలంలో లభించే అతి ముఖ్యమైన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒకటి.. దీనిని అడవి కాకరకాయ అని కూడా పిలుస్తారు. ఈ సీజనల్ కూరగాయ జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు ఎక్కువగా లభిస్తుంది. నగర మార్కెట్లలో, ముఖ్యంగా రైతు బజార్లలో బోడ కాకరకాయలు విస్తృతంగా విక్రయిస్తారు. ఈ కూరగాయకు ప్రస్తుతం అసాధారణమైన డిమాండ్ ఉంది.. ప్రధానంగా దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఎంతో మంది దీనిని తినేందుకు ఇష్టపడతారు. బోడ కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ (కరోటిన్), విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ తోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ లభిస్తాయి. దీనిలోని డైటరీ ఫైబర్ (ఫైబర్) జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బోడ కాకరకాయలో అనేక పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇది ముఖ్యంగా షుగర్ (మధుమేహం) స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే షుగర్ వ్యాధితో బాధపడేవారు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బోడ కాకరకాయలో పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పండే బోడ కాకరకాయ ఇప్పుడు నగర ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తోంది. రైతులు తమ పొలాల నుండి తాజా బోడ కాకరకాయలను నేరుగా రైతు బజార్లకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ కాయలు చాలా తాజాగా, మంచి ఆకృతితో కనిపిస్తాయి. ఇవి కొంత బొడిపెలుగా, గుండ్రంగా ఉంటాయి. బోడ కాకరకాయ రుచి కూడా ఎంతో బాగుంటుంది. దీన్ని కూరగా వండుకోవచ్చు

తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ లక్ష్య సాధనకు విద్యార్థుల మెరుగైన విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్ర విశ్వవిద్యాలయాలు విదేశీ ఉన్నత విద్యాసంస్థలతో వేగంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇటీవల వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్మనీకి చెందిన ప్రతిష్ఠాత్మక రూట్లింగెన్ యూనివర్సిటీతో కీలక ఒప్పందాలు చేసుకుంది.జర్మనీ యూనివర్సిటీతో కాకతీయ విశ్వవిద్యాలయం ఒప్పందం ఈ ఒప్పందాల ద్వారా 3+2 విద్యా నమూనా ప్రవేశపెట్టారు. విద్యార్థులు మొదటి మూడేళ్ల డిగ్రీని స్థానిక విశ్వవిద్యాలయాల్లో పూర్తి చేసి, తర్వాత రెండేళ్ల మాస్టర్స్ కోర్సును జర్మనీలో అభ్యసిస్తారు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో విద్యార్థులకు ఈ మేరకు అవకాశాలు ఉన్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత జర్మనీ విశ్వవిద్యాలయమే మాస్టర్స్ డిగ్రీ అందిస్తుంది.ఏటా 20మంది విద్యార్థులు రూట్లింగెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఈ విధానంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఏటా 20 మంది విద్యార్థులు ఎంపికవుతారు. ఇంతకు ముందు తెలంగాణ ఉన్నత విద్యా శాఖ బృందం జర్మనీలోని RWTH ఆచెన్, ఆస్ట్ఫాలియా, గొట్టింగెన్ విశ్వవిద్యాలయాలను సందర్శించి లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ మార్పిడి చేసుకుంది. విద్యార్థి-అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి పరిశోధనలు, డ్యూయల్ డిగ్రీలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకుని తదనుగుణంగా చేసిన ప్లాన్ కు ఓకే అన్నారు.పలు విదేశీ యూనివర్సిటీలు హైదరాబాద్ లో ఆఫ్‌షోర్ క్యాంపస్లుఅంతేకాదు బోస్టన్ లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ, ఎల్ఎస్ఈ వంటి ప్రముఖ సంస్థలతో కూడా వివిధ యూనివర్సిటీలతో చర్చలు సాగుతున్నాయి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ జపాన్‌లోని హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.తెలంగాణ ఆర్టీసీ మరో కీలకనిర్ణయం.. మెట్రో రైళ్ళ తరహాలో బస్సుల్లో కూడా..!

నేడు.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన జన్మదిన వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు అభిమానులు. పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ కాకా టైటిల్ పోస్టర్ కూడా విడుదల కావడం ఫ్యాన్స్ లో జోష్ నింపింది. 2027 జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందీ మూవీ. బాబీ కొల్లి దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ కింద వెంకట్ కే నారాయణ దీన్ని నిర్మిస్తోన్నారు. పాన్ ఇండియా మూవీకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కృష్ణా జిల్లా గుడివాడలో ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. మెగాస్టార్‌కు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు. టాలీవుడ్ కు చిరంజీవి ఓ దిక్సూచి లాంటివారని కొనియాడారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా తన ప్రతిభ, అంకితభావం, అకుంఠిత దీక్షతో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారని ప్రశంసించారు. తెలుగు సినీ రంగంలో రాణిస్తున్న ఎంతో మంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు చిరంజీవిని చూసి స్ఫూర్తి పొందారని, ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. మెగాస్టార్ ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయమని కొడాలి నాని వ్యాఖ్యానించారు.పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కు అల్టిమేట్ పవర్స్: సర్వశక్తిమంతుడు: భారత్ కు సవాళ్లుసినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరానికి చిరంజీవి సినీ ప్రయాణం ఓ పాఠ్యపుస్తకం లాంటిదని కొడాలి నాని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ, ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేయడం ఒక్క మెగాస్టార్‌కే సాధ్యమని, వెండితెరపైనే కాకుండా, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ బ్యాంక్ వంటి సామాజిక సేవా

హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక నేపథ్యం కలిగిన గోల్కొండ కోట వెలుపలి ప్రాకారంలో ఓ రహస్య సొరంగం బయటపడిందన్న వార్త తీవ్ర ఉత్సాహాన్ని, సంచలనాన్ని రేకెత్తించింది. ఈ వార్త వెంటనే సోషల్ మీడియాలో వ్యాపించడంతో స్థానిక ప్రజలు, పర్యాటక ప్రేమికులు ఈ సొరంగాన్ని వీక్షించేందుకు గురువారం సాయంత్రం, శుక్రవారం ఉదయాల్లో కోట వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.హంతకుడే సంతాపం తెలిపినట్లు..దోపిడీ గురించి హరీష్ రావ్ చెప్పాలి!గోల్కొండలోని 18 సీడీ (అథర సీడీ) ప్రాంతంలో ఉన్న 400 ఏళ్ల పురాతన కుతూబ్ షాహీ స్మశానవాటిక, క్రీడా మైదానం వద్ద భారత సైన్యానికి చెందిన అధికారులు అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ తవ్వకాలం క్రమంలోనే ఓ సొరంగం వెలుగుచూసినట్లు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెల్లడించారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఈ సొరంగం బయటపడిన విషయం గురించి గురువారం రాత్రి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.వివాదస్పద భూమి నేపథ్యం సొరంగం బయటపడిన 18 సీడీ లేదా అథర సీడీ ప్రాంతం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. ఆర్మీ అధికారులు ఆ స్థలాన్ని తమ ఆస్తిగా పేర్కొంటుండగా.. స్థానిక నివాసితులు దాన్ని స్మశానవాటికగా ఉపయోగిస్తూ ఖననాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కాలా చబుత్ర నుంచి అథర సీడీ వరకు ఉన్న బహిరంగ ప్రాంగణాన్ని స్థానిక యువకులు క్రికెట్, గిల్లీ-దండా వంటి ఆటలు ఆడుకోవడానికి వినియోగిస్తుంటారు.ఇరాన్ - అమెరికా మధ్య ఒప్పందం.. భారత్ చేతిలోనే.. టెహ్రాన్ రాయబారి సంచలనంరహస్య మార్గాలు, చారిత్రక వదంతులు కాకతీయులు, కుతుబ్ షాహీల పాలన సాగిన గోల్కొండ కోట బహుళ అంతస్తుల నిర్మాణ ప్రాభవం కలిగి ఉంది. ఈ కోట నుంచి చార్మినార్, గోషామహల్, చౌమహల్లా ప్యాలెస్, నౌబత్ పహాడ్ వంటి నగరంలో కీలక ప్రాంతాలకు భూగర్భ రహస్య మార్గాలు, సొరంగాలు ఉన్నాయని శతాబ్ధాలుగా ప్రచారం జరుగుతోంది. వీటిలో కొన్నింటిలో

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ #Mega158 గురించిన క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రానికి 'కాకా' అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. 'Mega158' సినిమాకి మొదటినుంచి 'కాకా', 'కాకాజీ' టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇటీవల 'కొరియన్ కనకరాజ్' సక్సెస్ మీట్ లో.. 'Mega158' టైటిల్ గురించి మాట్లాడుతూ, 'కదిరి' అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. దాంతో ఈ మూవీ టైటిల్ 'కదిరి కాకాజీ' అయ్యుంటుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు మళ్ళీ 'కాకా' టైటిల్ నే ఫైనల్ చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న రాబోయే బర్త్‌డే స్పెషల్ టీజర్లో ఈ చిత్ర టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ రోజే టీజర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేయబోతున్నారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్నివిడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ పర్ఫెక్ట్ పండగ సినిమాలా బాబీ దీనిని మలుస్తున్నట్లు సమాచారం. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. వాళ్ళకి మాత్రం షాక్: ఓటీటీలోకి జననాయకుడు.. డేట్ ఇదే ఎందుకు వెళ్లిపోయిందో తెలిసింది.. కేరళ యూట్యూబర్ అఖిల్ భార్య సంచలనం

వర్షాకాలం... వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారుతుంది. చుట్టూ పరిసరాలు ఆకుపచ్చగా మారిపోతాయి. ఆకుపచ్చని కూరగాయలు మార్కెట్‌ను ముంచెత్తుతాయి. అలా వానాకాలంలో ఆరోగ్య అతిథిగా పలకరించేది బొంత కాకరకాయ. ఈ కూరగాయ రుచిలో మేటి. ఆరోగ్యానికీ ఎంతో మంచిది. అరచేతిలో ఇమిడిపోయే బొంతలో అణువణువూ సుగుణాలు ఎన్నో. అలా వానలు మొదలవ్వగానే... వంటింట్లోంచి వచ్చే ఘుమఘుమల్లో ఇట్టే తేడా కనిపిస్తుంది. అల్లం, వెల్లుల్లి, పుదీనా తదితరాల వాడకం ఎక్కువవుతుంది. మార్కెట్లో గుమ్మడికాయ, కాకరకాయ, బెండకాయ, పొట్లకాయ లాంటి కూరగాయల హవా మొదలవుతుంది. అయితే ఏడాది పొడవునా దొరికే వీటిని పట్టించుకోకుండా... వానాకాలపు ఆరోగ్య అతిథి కోసం తెగ వెదుకుతుంటారు గృహిణులు. అదే బొంత కాకరకాయ.... కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయ, అడవి కాకరకాయ అంటారు. కేవలం మాన్సూన్ సీజన్లోనే కనిపించే బొంత కాకరకాయ ఎంతో అపురూపమైన కూరగాయ. ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాలతో ఈ సీజన్లో వీటిని తప్పక తింటుంటారు. ఒక్కో చోట ఒక్కో పేరు... భారతదేశం ఎంతో వైవిధ్యమైన దేశమని చెప్పడానికి బొంత కాకరకాయను చూపొచ్చు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో దీనిని పిలుస్తుంటారు. తెలుగువాళ్లు అడవి కాకరకాయ, బోడ కాకరకాయ, బొంత కాకరకాయ అంటారు. అదే హిందీలో - కాకోడా, మరాఠీలో - కంటోలి, గుజరాతీలో - కంటోలా, తమిళంలో- మూకు పావక్కాయ్, మలయాళంలో - కొట్టుపావక్కా, కన్నడలో - మాడహాగలకాయి... ఇలా వీటికి ఎన్నో పేర్లు. దీని తోలుపై మెత్తని ముళ్లు ఉండడం వల్ల ఇంగ్లీష్‌లో ‘స్పైనీ గార్డ్’ అంటారు. దేశమంతా ఈ కూరగాయ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ... మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రజలు అమితంగా బొంత కాకరకాయ రుచుల్ని ఆస్వాదిస్తారు. మల్టీ విటమిన్లకు చిరునామా... పేరును బట్టి బొంత కాకరకాయ, మామూలు కాకరకాయలాగానే చేదుగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి రెండూ ఒకే కుటుంబానికి చెందినా కూడా కాకరకాయంత చేదు ఇందులో

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన టైటిళ్లు లేదా కథాంశాలు అధికారిక ప్రకటన రాకముందే లీక్ కావడం ఇప్పుడు ఓ మినీ ట్రెడిషన్‌గా మారిపోయింది. గతంలో పలు చిత్రాల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయన నటించబోయే 158వ చిత్రం గురించి కూడా నెట్టింట ప్రచారం శరవేగంగా అందుకుంది మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ‘కదిరి కాకాజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని టాక్. అంతేకాకుండా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు నిమిషానికి పైగా నిడివి ఉన్న ఒక స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రతి సినిమా అనౌన్స్మెంట్కు ముందే ఇలాంటి టైటిల్ లీకులు బయటకు రావడం మెగా అభిమానులకు ఒకవైపు సరదాగా, ఉత్సాహంగా అనిపిస్తోంది. మెగా స్టార్ బర్త్ డే ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఫ్యాన్స్ భారీ ప్లాన్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆగస్టు 22న వచ్చే గ్లింప్స్ ఈ ‘కదిరి కాకాజీ’ టైటిల్ ప్రచారానికి చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి!

సుబేదారి (వరంగల్) ఆగస్టు 14 : హనుమకొండ హంటర్ రోడ్డులోని 'జూలో ఏం జరుగుతోంది?' అంటూ నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. కాకతీయ జూ పార్క్ ఇంజార్జి మయూరి డిప్యూటేషన్‌ను చీఫ్ కన్జర్వేటర్ వినయ్ కుమార్ రద్దు చేశారు. ఆమెను యథావిధిగా మహబూబాబాద్ జిల్లా గంగారం పాత పోస్టులోనే కొనసాగించాలని ఆయన ఆదేశించారు. "జూ పార్క్‌కు పూర్తి స్థాయి అధికారి లేక.. పర్యవేక్షణ కరువు .. హనుమకొండ కాకతీయ జూ పార్కు లో ఏం జరుగుతుంది..? అనే కథనాన్ని గురువారం నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించారు. మంత్రి ఇలాకాలో వరుసగా వన్య ప్రాణులు, పెద్ద పులి, కుక్కల వేటలో కృష్ణ జింకలు, మూషిక జింకలు, ఇటీవల కరెంట్ షాక్ తో ఎలుగుబంటి మరణాలను ప్రస్తావించిన నమస్తే కథనంపై అటవీ శాఖ ఉన్నత అధికారులు స్పందించారు. [caption id="attachment_2483485" align="alignnone" width="656"] [/caption] హనుమకొండ కాకతీయ జూ పార్క్‌కు డిప్యూటేషన్ పద్దతి ఇంఛార్జిగా పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మయూరితో పాటు భద్రాద్రి జోన్ లోని మరో నలుగురి ఫారెస్ట్ ఉద్యోగుల డిప్యూటేషన్లు రద్దు చేస్తూ , పాత రెగ్యులర్ పోస్టుల్లో కొనసాగిస్తూ శుక్రవారం చీఫ్ కన్జర్వేటర్ వినయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో భూ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. నెల్లూరు, ఆగస్టు 14: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో భూ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. వైసీపీ నేతలతో అంటకాగిన పలువురు అధికారులు... ఇష్టారాజ్యంగా భూములు, స్థలాలను పందారం చేసినట్లు తేలింది. వెంకటచాలం మండలం కనుపూరు బిట్ - 1లో దేవాదాయశాఖ భూముల్లో జగనన్న లే అవుట్ నిర్మించారని, 185 మందికి పట్టాలు పంపిణీ చేశారని, 310 స్థలాలకి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు అయినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అలాగే, సర్వేపల్లి బిట్ -2లో కోర్టుల్లో ఉన్న 57.16 ఎకరాల భూములని మాజీ మంత్రి కాకాణి అల్లుడికి చెందిన JKS ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సంస్థకి అధికారులు కారుచౌకగా కట్టబెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది. ఆరుగురు తహశీల్దార్లు, ఆర్ఐ, సర్వేయర్, వీఆర్వోలపై అభియోగాలు నమోదు చేసిన అధికారులు.. పదిరోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బందిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రెవెన్యూశాఖ అధికార వర్గాల్లో హై టెన్షన్ నెలకొంది. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. మెడికో మృతి శ్రావణ మాసం మొదటి శుక్రవారం.. దుర్గమ్మ ఆలయంలో భక్తుల సందడి

మైసూర్ పాక్ పేరు వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. 20వ శతాబ్దం ప్రారంభంలో మైసూర్ ప్యాలెస్ వంటగదిలో మహారాజు 4వ కృష్ణరాజ వడియార్ కోసం కొత్త స్వీట్ తయారు చేసే బాధ్యతను వంటమనిషి కాకాసుర మడప్ప తీసుకున్నారని చెబుతారు. శనగపిండి, పంచదార, నెయ్యితో చేసిన ఈ స్వీట్ అనుకోకుండా కొత్త రూపం దాల్చిందని కథనం.పంచదార పాకాన్ని మడప్ప ఉడికించిన సమయంలో అది కొంత ఎక్కువసేపు మంటపై ఉండటంతో బంగారు రంగులో, మెత్తగా ఉండే ప్రత్యేకమైన స్వీట్ తయారైందని ప్రచారంలో ఉన్న కథ చెబుతోంది. మహారాజు దాని పేరు అడిగినప్పుడు, అప్పటికప్పుడు మడప్ప దానికి ‘మైసూరు పాక’ అని పేరు పెట్టారని అంటారు. కన్నడలో ‘పాక’ లేదా ‘పాకా’ అనే పదానికి తీపి లేదా వంట ప్రక్రియ అనే అర్థాలు ఉన్నాయి.మహారాజుకు స్వీట్ నచ్చడంతో అది రాజభవనం దాటి ప్రజల్లోకి వెళ్లిందని చెబుతారు. మడప్ప మైసూర్ ప్యాలెస్ వెలుపల స్వీట్ షాపు ప్రారంభించారని, అదే తర్వాత ప్రసిద్ధ గురు స్వీట్స్‌కు మూలమైందనే వాదన కూడా ఉంది. అయితే ఈ విషయం కుటుంబ చరిత్రగా మాత్రమే ప్రచారంలో ఉంది. దీనికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు.కాలక్రమంలో మైసూర్ పాక్ కర్ణాటకతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఇది ప్రధానంగా మెత్తగా నోట్లో కరిగిపోయే రకం, సంప్రదాయంగా కొంత గట్టిగా ఉండే రకం అంటూ రెండు విధాలుగా కనిపిస్తుంది. అయితే ఈ స్వీట్ పేరు, ప్యాలెస్‌లో పుట్టిన కథకు సంబంధించిన వివరాలు ఎక్కువగా మౌఖికంగానే ప్రాచుర్యంలో

బూర్గంపహాడ్, ఆగస్టు 10 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో తురకకాశ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సంఘ జెండాను ముఖ్య అతిధిగా హాజరైన తురకకాశ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాషా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తురకకాశుల సంక్షేమం, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, యువత అభివృద్ధికి అందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేస్తామన్నారు. సంఘం అభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ బికారి, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ కరీం, వర్కింగ్ |ప్రెసిడెంట్ షేక్ జమాల్, సలహాదారులు సయ్యద్ జాన్పాషా, బూర్గంపహాడ్, అశ్వారావుపేట, చండ్రుగొండ మండలాల అధ్యక్షులు మౌలానా షేక్ అజీజ్, షేక్ కరీం, షేక్ లాలు, పటాన్ నాగుల్‌మీరా, యూత్ ప్రెసిడెంట్ సయ్యద్ కరీముల్లా, సయ్యద్ హుస్సేన్, షేక్ శంషార్, సంఘ నాయకులు పాల్గొన్నారు