
వద్దన్నా... పెళ్లి చేశారు
బ్రెయిన్ వాష్ చేసి ఒప్పించారు జోగి రమేశ్‌పై కుమారుడు రాజీవ్ ధ్వజం కారు, గొలుసు ఇవ్వలేదంటూ కోడలిపై జోగి భార్య రుసరుసలు ఇక్కడికి రాకు అంటూ రాజీవ్ హుకుం విజయవాడ, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ‘‘అంతా మీరే చేశారు. నాకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోలేదు. మీరంతా కలిసి బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. బ్రెయిన్‌వాష్ చేసి ఒత్తిడి తెచ్చినందునే నేను పెళ్లి చేసుకున్నా’’ అని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ తన తల్లిదండ్రులపై మండిపడ్డారు. వివాహ జీవితానికి సంబంధించితన అశక్తతను కూడా అంగీకరించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. తనపై హత్యాయత్నం, వేధింపులకు పాల్పడ్డారంటూ జోగి రాజీవ్ భార్య మేఘన... గత నెల 24న విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె 20 వీడియోలు, రికార్డింగ్ వాయి్‌సలను పెన్‌డ్రైవ్‌లో పోలీసులకు అందజేశారు. దీనిపై జోగి రమేశ్ సహా మొత్తం 11 మందిపై కేసు నమోదైంది. దీనికంటే ముందే ఇరుపక్షాల కుటుంబ సభ్యుల మధ్య పలుమార్లు పంచాయితీ జరిగింది. అప్పుడు జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోలే ఇప్పుడు బయటపడ్డాయి. ‘ఎన్ని చేసినా, ఎన్ని మాటలు అన్నా భరించాను. జీవితంలో హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పుడు ఇలా చేశారు’ అని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు తెలిసేలా తమ పెళ్లి చేశారని, ఇప్పుడు తన తప్పులేదనే విషయం కూడా అందరికీ తెలియాలని ఆమె స్పష్టం చేశారు. ‘‘నన్ను ఒత్తిడి చేయడంతో పెళ్లికి అంగీకరించాను. నీతో మంచిగా ఉండాలని ఈ పెళ్లి చేసుకున్నా. మేఘన ఫ్రెండ్ హర్ష, వాడి బాబు, మరో అంకుల్ కలిసి తెల్లవారుజామున మూడు గంటల వరకు కూర్చోబెట్టి బలవంతంగా పెళ్లికి ఒప్పించారు’’ అని రాజీవ్ పేర్కొన్నారు. ఒక దశలో తండ్రిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెళ్లయిన 20 రోజుల్లోనే తనను పంపిచేశారని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంట్లో