
ఏఐ కంటెంట్ ను గుర్తించేందుకు అదృశ్య వాటర్ మార్క్
ఏఐ కంటెంట్ గుర్తింపును మరింత సులభతరం చేసేందుకు క్లాడ్ ఏఐ మోడల్స్ మాతృసంస్థ అదృశ్య వాటర్‌మార్కులను జోడించేందుకు సిద్ధమైంది. ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్ ఇష్టారీతిన పెరిగిపోతోంది. మనుషులు తయారు చేసిన కంటెంట్‌కు ఏఐ కంటెంట్‌కు మధ్య తేడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏఐ కంటెంట్ గుర్తింపును మరింత సులభతరం చేసేందుకు ఆంథ్రోపిక్ సంస్థ అదృశ్య వాటర్ మార్కులను తీసుకొచ్చింది. క్లాడ్ మోడల్స్‌తో సిద్ధం చేసిన టెక్స్ట్, ఇమేజీలకు ఈ వాటర్మార్కును జోడిస్తారు. యూరోపియన్ ఏఐ యాక్ట్ ప్రకారం, ఈ వాటర్ మార్క్ విధానానికి ఆంథ్రోపిక్ శ్రీకారం చుట్టింది. క్లాడ్ ఏఐ మోడల్స్‌తో సిద్ధం చేసిన టెక్స్ట్‌లో మనుషులు గుర్తించలేని విధంగా ఈ వాటర్ మార్క్‌ను జత చేయనున్నారు. ఈ టెక్స్ట్‌ను కాపీ చేసి మరో డాక్యుమెంట్లో పేస్టు చేసినా తొలగిపోని విధంగా వాటర్మార్కును రూపొందించారు. స్వల్ప ఎడిటింగ్ చేసినా ఈ వాటర్ మార్కు తొలగిపోదు. ఇక చిత్రాలకు సంబంధించి కూడా ఇలాంటి వాటర్ మార్కు అందుబాటులో ఉంటుంది. ఏఐతో సిద్ధం చేసిన చిత్రాలకు చెందిన ప్రోవెనెన్స్ మెటాడేటాలో ఈ వాటర్ మార్కును చేరుస్తారు. దీంతో, ఇమేజీలకు ఏఐతో మార్పులు చేశారా? లేదా? అన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఇమేజీకి ఇతరత్రా విధానాల్లో చేసిన మార్పులను కూడా వాటర్ మార్క్ ఆధారంగా గుర్తించొచ్చు. ఇటీవల కాలంలో విడుదలైన అన్ని క్లాడ్ ఏఐ మోడల్స్‌లో ఈ వాటర్ మార్కు అందుబాటులో ఉంటుందని ఆంథ్రోపిక్ సంస్థ పేర్కొంది. ఆంథ్రోపిక్ క్లౌడ్ పార్ట్నర్స్ అయిన ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీల్లో కూడా ఈ వాటర్ మార్క్ అందుబాటులో ఉంటుంది. ఒక కంటెంట్‌ను క్లాడ్ ఏఐతో ఉత్పత్తి లేదా మార్పులు చేశారా? లేదా? అనే విషయాన్ని ఇతరులు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక డిటెక్షన్ వ్యవస్థను కూడా రూపొందిస్తున్నట్టు ఆంథ్రోపిక్ పేర్కొంది. అయితే, ఈ వాటర్ మార్కు ఉన్న కంటెంట్ కనిపిస్తే అది