
Indian Railways: పండగల్లో రైలుప్రయాణమా? కన్ఫర్మ్డ్ టిక్కెట్ కోసం ఈ సింపుల్ టిప్స్.. ఎవ్వరు చెప్పని సీక్రెట్స్!
Indian Railways: పండగల్లో రైలు ప్రయాణమా? కన్ఫర్మ్డ్ టిక్కెట్ కోసం ఈ సింపుల్ టిప్స్.. ఎవ్వరు చెప్పని సీక్రెట్స్!
© 2026 nimisham.in

Indian Railways: పండగల్లో రైలు ప్రయాణమా? కన్ఫర్మ్డ్ టిక్కెట్ కోసం ఈ సింపుల్ టిప్స్.. ఎవ్వరు చెప్పని సీక్రెట్స్!

Indian Railways: పండుగ సీజన్లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి

రైల్వే సీట్లు, బెర్త్‌లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు సీట్లు, బెర్త్‌లు నీలం రంగులో ఉండటాన్ని చాలాసార్లు గమనించే ఉంటారు. అయితే రైల్వే సీట్లకు నీలం రంగునే ఎందుకు ఎంచుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? రంగులు మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని కలర్ సైకాలజీలో చెబుతారు. నీలం రంగును సాధారణంగా ప్రశాంతత, స్థిరత్వంతో అనుసంధానిస్తారు. ఆకాశం, సముద్రం వంటి విశాలమైన ప్రకృతి దృశ్యాలు కూడా నీలం రంగుతో ముడిపడి ఉంటాయి. అందువల్ల ఎక్కువసేపు ప్రయాణించే సమయంలో నీలం వంటి ప్రశాంతమైన రంగు కంటికి సౌకర్యంగా అనిపించవచ్చని భావిస్తారు. రైళ్లలో రోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సీట్లు, బెర్త్‌లపై దుమ్ము, చిన్నపాటి మరకలు పడటం సహజం. లేత రంగులతో పోలిస్తే ముదురు నీలం రంగు ఉపరితలంపై కొన్ని రకాల మరకలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. దీంతో సీట్లు తరచూ మురికిగా కనిపించకుండా ఉండటానికి ఈ రంగు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. సుదూర రైలు ప్రయాణాలు గంటల తరబడి సాగుతాయి. కొన్నిసార్లు ఒకటి, రెండు రోజులు కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కోచ్‌లోని రంగులు, వెలుతురు, శబ్దం వంటి అంశాలు ప్రయాణికుల అనుభూతిపై ప్రభావం చూపవచ్చు. నీలం రంగు సాధారణంగా కంటికి ప్రశాంతంగా కనిపించే రంగుల్లో ఒకటిగా భావిస్తారు. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు. రక్షాబంధన్ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త! సౌత్ సెంట్రల్ రైల్వే ట్యుటికోరిన్ నుండి నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కూడా దీనికి సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ ఈరోజు అంటే ఆగస్టు 22వ తేదీ నుండి ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. రైల్వే ప్రయాణికులకు ఒక మంచి వార్త .. ఇటీవలె చర్లపల్లి నుండి సోలాపూర్ వరకు ప్రత్యేక రైలును నడుపుతున్న సౌత్ రైల్వే, ఇప్పుడు ఈ కొత్త ప్రత్యేక రైలును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక రైలు కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ ఆగస్టు 22 ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ట్రైన్ నంబర్ 06019 ట్యుటికోరిన్ నుండి నర్సాపూర్ వెళ్లే ప్రత్యేక రైలు రాత్రి 11:30 గంటలకు బయలుదేరుతుంది. ఇది సోమవారం (7, 14, 21, 28 తేదీల్లో) అందుబాటులో ఉండనుంది. ఈ రైలు నర్సాపూర్‌కు చేరుకునే సమయం మూడవ రోజు అర్ధరాత్రి 12:20 గంటలు. ట్యుటికోరిన్ నుండి బయలుదేరే ఈ రైలు మధురై, తంజావూరు, కుంభకోణం, తాంబరం, చెన్నై ఎగ్మోర్ మీదుగా నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, భీమవరం మీదుగా నర్సాపూర్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా, ట్రైన్ నంబర్ 06020 నర్సాపూర్ నుండి తమిళనాడుకు వెళ్లే రైలు కూడా గురువారం ఉదయం 4:30 గంటల సమయంలో అందుబాటులో ఉంటుంది. సోమవారం రాత్రి 11:30 గంటలకు ట్యుటికోరిన్ నుండి బయలుదేరే ఈ రైలు, తంజావూరు, కుంభకోణాలను మంగళవారం ఉదయం చేరుకుంటుంది. నర్సాపూర్ చేరుకునే సమయానికి బుధవారం తెల్లవారుజామున 12:20 గంటలవుతుంది. ఈ ప్రత్యేక రైలు ముఖ్యంగా వివిధ ఆలయాలను సందర్శించాలనుకునే భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది

ఆంధ్రప్రదేశ్-తమిళనాడు మధ్య కీలకమైన గూడూరు-గుమ్మిడిపూండి రైల్వే మార్గం సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 90 కిలోమీటర్ల గూడూరు-గుమ్మిడిపూండి రైల్వే ప్రాజెక్టుకు రూ.2,229 కోట్ల అంచనా వ్యయం నిర్ణయించారు. ఈ విస్తరణ పనులను నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త లైన్లతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ప్రయాణికులు, సరకు రవాణాకు అవసరమైన అదనపు సామర్థ్యం అందుబాటులోకి రానుంది. నెల్లూరు, తిరుపతి ప్రాంతాలతో పాటు తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాకు ఈ ప్రాజెక్టు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చనుంది. ప్రస్తుతం గూడూరు-గుమ్మిడిపూండి సెక్షన్ డబుల్ లైన్‌గా ఉండగా, ట్రాఫిక్ సామర్థ్యం 131 శాతాన్ని దాటింది. దీంతో ప్రయాణికుల రైళ్లు, సరకు రైళ్ల నిర్వహణపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి తరచుగా ఆలస్యాలు ఎదురవుతున్నాయి. ఈ మార్గం చెన్నై-విజయవాడ, చెన్నై-తిరుపతి రైల్వే మార్గాల్లో కీలకమైన అధిక రద్దీ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంది. అంతేకాకుండా విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, ఈస్ట్ కోస్ట్ ఆర్థిక కారిడార్‌కు కూడా ఇది కీలక అనుసంధాన మార్గం. ఇప్పటికే చెన్నై-అత్తిపట్టు మధ్య నాలుగు లైన్లు ఉండగా, అత్తిపట్టు-గుమ్మిడిపూండి విస్తరణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. గూడూరు వరకు నాలుగు లైన్ల సామర్థ్యం విస్తరించడం ద్వారా మొత్తం చెన్నై-గూడూరు కారిడార్‌పై రద్దీ తగ్గే అవకాశం ఉంది. గూడూరు-గుమ్మిడిపూండి రైల్వే ప్రాజెక్టులో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టనున్నారు. స్వర్ణముఖి నదిపై 360 మీటర్ల భారీ వంతెనతో పాటు 21 పెద్ద, 127 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. అదనంగా 34 రోడ్ ఓవర్, అండర్ బ్రిడ్జ్‌లను నిర్మించే ప్రణాళిక ఉంది. దీంతో రైల్వే సామర్థ్యం పెరగడంతో పాటు సంవత్సరానికి అదనంగా 21.24 మిలియన్ టన్నుల సరకు రవాణా సాధ్యమవుతుందని అంచనా. లాజిస్టిక్స్ వ్యయంలో సంవత్సరానికి రూ.382.15 కోట్ల వరకు ఆదా అవుతుందని రైల్వే అంచనా వేసింది. చెన్నై, కామరాజర్, కృష్ణపట్నం

భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. దుర్భేద్యమైన కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే క్రమంలో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతమైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై మన ప్రతిష్టాత్మక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో, ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై గంటకు దాదాపు 100 కి.మీ వేగంతో శరవేగంగా ప్రయాణించి, భారత్ తన రవాణా సాంకేతికతతో ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచింది.ఉత్తర రైల్వే పరిధిలోని శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి బనిహాల్ వరకు ఉన్న 111 కిలోమీటర్ల పొడవైన నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 100 కిలోమీటర్లకు పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. గతంలో ఈ మార్గంలోని కత్రా-సంగల్దాన్ సెక్షన్లో గంటకు 85 కి.మీ, అలాగే సంగల్దాన్-బనిహాల్ సెక్షన్లో గంటకు 75 కి.మీ మాత్రమే గరిష్ట వేగానికి అనుమతి ఉండేది. అయితే అన్ని రకాల ముందస్తు భద్రతా తనిఖీలను సమర్థవంతంగా పూర్తి చేసి నిబంధనలు పాటించడంతో అధికారులు ఈ స్పీడ్ లిమిట్‌ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 24-కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్దం: తెలుగు రాష్ట్రాలకు ఇలా, రూట్.. షెడ్యూల్..!!సమయం ఆదా.. పర్యాటకానికి సరికొత్త జోష్!నూతన వేగ పరిమితి అమలులోకి రావడంతో కత్రా - బనిహాల్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, కాశ్మీర్ లోయలో ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారనుంది. జమ్మూ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ స్పందిస్తూ.. ఈ వేగం పెరుగుదల ప్రాంతీయ రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. ప్రయాణికుల రాకపోకలకు సమయం తగ్గడంతో పాటు స్థానిక పర్యాటక రంగం, వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పురోగతికి ఈ రైలు మార్గం భారీ ఊతాన్నిస్తుందని

Gudur-Gummidipoondi Railway: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు గూడూరు-గుమ్మిడిపుండి సెక్షన్ మధ్య రూ. 2,229 కోట్ల వ్యయంతో మరో రెండు (3, 4వ) కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌లో ఈ మార్గం అత్యంత కీలకమైనదిగా మారనుంది. గూడూరు నుంచి గుమ్మిడిపుండి (Gudur-Gummidipoondi Railway)మధ్య 90 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ ప్రాజెక్టును రాబోయే నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణంలో భాగంగా స్వర్ణముఖి నదిపై ఒక భారీ బ్రిడ్జి, 21 పెద్ద వంతెనలు, 127 చిన్న వంతెనలతో పాటు 34 ఆర్వోబీ లేదా ఆర్‌యూబీలను నిర్మించనున్నారు. ఈ కొత్త లైన్ల వల్ల పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం వంటి పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరింత సులువవుతుంది. ఈ ప్రాజెక్టుతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం రూ. 9,450 కోట్ల అంచనా వ్యయంతో 4 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల భారతీయ రైల్వే నెట్వర్క్ మరో 410 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. దాదాపు 6,448 గ్రామాలకు చెందిన 60 లక్షల మంది జనాభాకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. 2030-31 నాటికి ఈ విస్తరణ లక్ష్యాలను పూర్తిగా సాధిస్తామని కేంద్రం స్పష్టం చేసింది

ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూర్చే కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. గూడూరు-గుమ్మిడిపూండి మధ్య 90 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,229 కోట్లుగా నిర్ణయించారు.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం డబుల్ లైన్‌గా ఉన్న ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, మరిన్ని ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు వీలవుతుందని వివరించారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై-కోల్‌కతా, ఢిల్లీ-చెన్నై మార్గాలతో పాటు వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుంది.ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ అదనపు ట్రాక్‌లు ప్రాంతీయ అభివృద్ధికి, ప్రగతికి బాటలు వేస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొంటూ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపినందుకు రైల్వే మంత్రికి ఎంపీ గురుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.ప్రాజెక్టుతో చేకూరే ప్రయోజనాలుఈ ప్రాజెక్టు పూర్తయితే గూడూరు జంక్షన్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. చెన్నై, విజయవాడ, తిరుపతి వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి. ముఖ్యంగా పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం, శ్రీహరికోటలోని సతీశ్

Union Cabinet | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో నాలుగు నూతన రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.9,450 కోట్ల అంచనా వ్యయంతో 410 కి.మీ మేర అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలను కవర్ చేస్తూ ఈ నెట్వర్క్ విస్తరించనున్నారు. 2030-31 నాటికి ఈ కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి.. ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన సేవలందించడమే లక్ష్యమని రైల్వే శాఖ (Indian Railways) ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులలో పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్, ఒడిశాలోని భద్రక్ (రానితాల్) మధ్య 173 కి.మీ మేర నాలుగో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే, ఒడిశాలోని భద్రక్, హరిదాస్పూర్ మధ్య 75 కిలోమీటర్ల మేర నాలుగో లైన్; వీటితో పాటు ఏపీలోని గూడూరు - తమిళనాడులోని గుమ్మిడిపూండి మధ్య 90 కి.మీ; ఒడిశాలోని కటక్, పారాదీప్ మధ్య 72 కి.మీ మేర మూడు, నాలుగో రైల్వే లైన్లను నిర్మించనున్నారు. రైల్వే నెట్‌వర్క్‌ను మరో 410 కి.మీ మేర విస్తరించే ఈ నూతన ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.9,450 కోట్లుగా నిర్ణయించారు. ఈ కొత్త రైల్వే లైన్లు ఎనిమిది జిల్లాల్లోని 6,448 గ్రామాలకు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయని రైల్వేశాఖ తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు

తాగునీటిలో ప్రమాదకర ఈ-కోలి 458 రైల్వేస్టేషన్లలో అధ్వాన సౌకర్యాలు బయటపడ్డ రైల్వే శాఖ నిర్లక్ష్యం E-Coli In Drinking Water: దేశవ్యాప్తంగా ప్రతినిత్యం లక్షలాది మంది ప్రయాణించే రైల్వే స్టేషన్లలో కనీస మౌలిక సదుపాయాలు దారుణంగా తయారయ్యాయని, ప్రయాణికులకు అందించే తాగునీరు తీవ్ర అసౌకర్యాలకు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన ఈ నివేదిక ప్రకారం, దేశంలోని వందలాది ప్రధాన స్టేషన్లలో పారిశుధ్యం, మంచినీటి సౌకర్యాలు అత్యంత అధ్వానంగా ఉన్నాయని స్పష్టమైంది. అనేక రైల్వే జోన్లు ప్రయాణికుల రక్షణ, పరిశుభ్రత కోసం రూపొందించిన ప్రామాణిక నిబంధనలను పాటించడంలో దారుణంగా విఫలమయ్యాయని కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. BRS Protest: కల్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర.. కేటీఆర్ సంచలన ఆరోపణలు.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారాస నిరసనలు తాగునీటి నమూనాల్లో ప్రమాదకర బ్యాక్టీరియా: కాగ్ అధ్యయనం చేసిన 512 నాన్-సబర్బన్ స్టేషన్లలో దాదాపు 89 శాతానికి పైగా (458 స్టేషన్లు) నిబంధనల కంటే దారుణమైన స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, కోయంబత్తూరు, ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, పాలక్కాడ్, కల్యాణ్, లోనావాలా వంటి ప్రముఖ స్టేషన్లలోని వాటర్ కూలర్లు, ప్లాట్‌ఫామ్ కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో తీవ్ర అనారోగ్యానికి గురిచేసే 'ఈ-కోలి(E-Coli In Drinking Water)', టోటల్ కోలిఫార్మ్స్ బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. పరిశుభ్రత లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు: కేవలం తాగునీరే కాకుండా, స్టేషన్లలోని వాష్‌రూమ్‌లు, ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణ కూడా అధ్వానంగా ఉందని కాగ్ పేర్కొంది. 2022-23, 2023-24 సంవత్సరాల్లో వివిధ జోన్లలో నిర్వహించిన తనిఖీల్లో ఈ దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి తీవ్ర లోపాలపై తక్షణమే చర్యలు చేపట్టి, స్టేషన్లలో సురక్షితమైన తాగునీటిని అందించాలని రైల్వే శాఖను కాగ్ ఆదేశించింది

స్వతంత్ర భారతంలో సామాన్యుడికి కనీసం స్వచ్ఛమైన తాగు నీరు కూడా దొరకడం లేదు. బయటకు వెళ్తే తాగే నీరు ఎంత కలుషితమై ఉంటుందో మనం ఊహించలేం. మినరల్ వాటర్ అనుకుని కొనుక్కొని తాగే నీరు కూడా ఒరిజినల్ కాకపోవడం మన దౌర్భాగం. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే రైల్వే స్టేషన్లలో తాగు నీటి గురించి దిమ్మతిరిగే వార్త బయటకు వచ్చింది. రోజువారీ ప్రయాణాల్లో లక్షలాది మంది ప్రజలకు దిక్కయిన భారతీయ రైల్వే వ్యవస్థలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తాగే నీటిలో ప్రమాదకరమైన ఈ-కోలై (E. coli) బ్యాక్టీరియా ఉందని కాగ్ నివేదిక బాంబు పేల్చింది. హైదరాబాద్, కొయంబత్తూరు, ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ వంటి దిగ్గజ స్టేషన్లతో సహా పలు చోట్ల తాగే నీటి నాణ్యత అధ్వానంగా ఉందని హెచ్చరించింది. ఈ నివేదికతో తక్షణమే స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని అందించేందుకు ట్యాంక్ టు ట్యాప్ అనే బృహత్తర ప్రాజెక్టును అత్యవసరంగా రంగంలోకి దించారు.20,000 కేంద్రాల్లో నయా ఫిల్ట్రేషన్ ప్రాసెస్!కాగ్ హెచ్చరికల నేపధ్యంలో రైల్వే శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన రైల్వే మంత్రి, యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌లోని వాటర్ కూలర్లు , ప్రధాన నీటి కేంద్రాలతో కలిపి దాదాపు 20,000 ప్రాంతాల్లో అత్యంత ఆధునిక ట్యాంక్ టు ట్యాప్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. పాతబడిపోయిన నీటి ట్యాంకులను వెంటనే తొలగించి, సోర్స్ నుంచి ప్రయాణికులు ట్యాప్ వరకు ప్రతి దశలోనూ వాటర్ క్వాలిటీ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజూ ఈ నీటిని ఒక గ్లాస్ తాగితే..బీపీ, షుగర్ కంట్రోల్, కిడ్నీలు ఆరోగ్యంగా..!!కేంద్రీకృత నిఘా.. బోర్డు లెవెల్లో రోజువారీ మానిటరింగ్!ఈ ప్యూరిఫికేషన్ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా రైల్వే బోర్డు గుర్తించింది. కేవలం ఫిల్టర్లు పెట్టడమే కాకుండా, రైల్వే

దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందిస్తున్న తాగునీరు సురక్షితం కాదని, ప్రమాదకర బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించడంతో రైల్వే మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలో సీనియర్ అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం, స్టేషన్లలో సురక్షితమైన తాగునీటిని అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రైల్వే బోర్డును ఆదేశించారు.ఈ సమస్యను అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ, రైల్వే బోర్డు స్థాయిలో నేరుగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లోని 20,000 ప్రదేశాలలో వాటర్ కూలర్లతో పాటు సమగ్ర ఫిల్టరేషన్, పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్లలో "ట్యాంక్ టూ ట్యాప్" వాటర్ ఫిల్టరేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని, పాత నీటి ట్యాంకులను వెంటనే మార్చాలని ఆదేశించారు. నీటి నాణ్యత పరీక్షల నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, దీనిపై జవాబుదారీతనాన్ని స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. నీటి నాణ్యతకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచి పారదర్శకత పాటించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు.కాగ్ నివేదికలో కీలక అంశాలుదేశంలోని అన్ని జోన్ల పరిధిలో 512 నాన్-సబర్బన్ గ్రేడ్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సేవలను కాగ్ అంచనా వేసింది. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు జోన్ల పరిధిలోని ఎనిమిది స్టేషన్లలోని వాటర్ కూలర్ల నుంచి సేకరించిన నీటి నమూనాలలో 'ఇ కొలి (E. coli)' బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్ర ఆరోగ్య

దేశవ్యాప్తంగా వందలాది రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు కనీస సదుపాయాలు కూడా లేవని కాగ్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, కోయంబత్తూరు సహా పలు స్టేషన్లలోని వాటర్... జాబితాలో హైదరాబాద్, కోయంబత్తూరు, ముంబై స్టేషన్లు 458 స్టేషన్లలో సదుపాయాలు అధ్వానం: కాగ్ నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా వందలాది రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు కనీస సదుపాయాలు కూడా లేవని కాగ్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, కోయంబత్తూరు సహా పలు స్టేషన్లలోని వాటర్ కూలర్లు, ప్లాట్‌ఫాంలపై కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో ఈ-కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించినట్లు తెలిపింది. వాష్‌రూంలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని పేర్కొంది. ప్రయాణికుల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించిన అనేక నిబంధనలను పాటించడంలో జోన్లు విఫలమయ్యాయని ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో కాగ్ వివరించింది. అన్ని జోన్లలోని 512 నాన్-సబర్బన్ గ్రేడ్ స్టేషన్లలో పరిస్థితులను అధ్యయనం చేసినట్లు తెలిపింది. హైదరాబాద్‌తో పాటు కోయంబత్తూరు, పాలక్కాడ్, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, భివండీ రోడ్, కల్యాణ్, లోనావాలా, మధుపూర్ స్టేషన్లలో వాటర్ కూలర్ల నుంచి సేకరించిన మంచినీటి నమూనాల్లో ఈ-కోలి బయటపడింది. 2022-23లో ఎనిమిది జోన్లలోని 49 స్టేషన్లు, 2023-24లో తొమ్మిది జోన్లలోని 56 స్టేషన్ల ప్లాట్ఫాంల్లోని కుళాయిల నీటిలో ఈ-కోలితో సహా టోటల్ కోలిఫార్మ్స్ బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఎంపిక చేసిన 512 రైల్వేస్టేషన్లలో 458 (89 శాతానికి పైగా) స్టేషన్లలో సౌకర్యాలు నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయని కాగ్ అందోళన వ్యక్తం చేసింది. జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్ నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Shortest Train Journey In India : సాధారణంగా రైలు ప్రయాణం అంటే గంటల కొద్దీ ప్రయాణం, వందల కిలోమీటర్లు దూరం గుర్తుకొస్తాయి. కానీ, భారతదేశంలో ఒక రైలు ప్రయాణం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కేవలం మూడు కిలోమీటర్లు దూరం.. ఏడు నుంచి తొమ్మిది నిమిషాల్లోనే ప్రయాణం పూర్తవుతుంది. ఈ ప్రత్యేకమైన చిన్న రైలు ప్రయాణం మహారాష్ట్రంలోని నాగ్‌పూర్ జంక్షన్ నుంచి అజ్ని రైల్వే స్టేషన్ల మధ్య ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే. నాగపూర్ నగరంలోని ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నాగ్‌పూర్ జంక్షన్, అజ్ని రెండూ సమీప రైల్వే స్టేషన్లు అయినప్పటికీ.. ఈ రెండు స్టేషన్లు రైల్వే కార్యకలాపాలు, ప్రయాణికుల రాకపోకల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇతర గమ్యస్థానాలకు వెళ్లే రైళ్లు ఈ రెండు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. అధికశాతం రైళ్లు ఈ రెండు స్టేషన్లలో ఆగుతాయి. దీంతో ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే వారికి రైలు ద్వారా నేరుగా, త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, ప్రయాణికుల కోసం ఇది ఆసక్తికరమైన అనుభవంగా మారడానికి ప్రధాన కారణం దూరం కంటే ప్రయాణ సమయం. మూడు కిలోమీటర్ల రైలు ప్రయాణం 7-9 నిమిషాల్లో పూర్తవుతుండటంతో ఈ మార్గం గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భారత దేశంలో తొలి ప్యాసింజర్ రైలు 1853లో బోరి బందర్ (అప్పటి బాంబే) నుంచి థానే వరకు నడిచింది. ఈ రైలు మార్గం ప్రయాణం 34 కిలో మీటర్లు. అదే సమయంలో నాగ్ పూర్ – అజ్ని రైలు ప్రయాణం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే.. అంటే భారతదేశపు తొలి ప్యాసింజర్ రైలు ప్రయాణం కంటే ఈ దూరం పదోవంతు కంటే కూడా తక్కువ. ఈ రెండు స్టేషన్ల మధ్య రైలులో ప్రయాణించే ప్రయాణికులు.. రైలు ఎక్కి ఒక పాట వినడం

భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటి షాకింగ్ నివేదికను వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 1.75 కోట్లకు పైగా ప్రయాణికులు రైలు మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇంతటి భారీ సంఖ్యలో ప్రజలు నమ్ముకున్న రైల్వే స్టేషన్లలో అందించే తాగునీరు, పారిశుధ్య ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించిన కాగ్ , తీవ్ర ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టింది. రైల్వే స్టేషన్లలో లభ్యమయ్యే ఉచిత తాగునీటి నాణ్యత మరియు అక్కడ నిర్వహించే పారిశుధ్యంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో అమర్చిన వాటర్ కూలర్లు, ప్లాట్‌ఫారమ్‌లపై ఉండే తాగునీటి కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాలను అధునాతన పరీక్షలకు పంపగా, వాటిలో ఈ.కోలై (E. coli) మరియు కలెక్టివ్ కోలిఫామ్ బ్యాక్టీరియా లభ్యమైనట్లు ఆడిట్లో తేలింది. వైద్య నిపుణుల ప్రకారం E. coli బ్యాక్టీరియా నీటిలో ఉందంటే అది ప్రధానంగా మల వ్యర్థాల కాలుష్యానికి సూచికగా భావిస్తారు. ప్రతి E. coli స్ట్రెయిన్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగించకపోయినప్పటికీ, ఇటువంటి బ్యాక్టీరియా కలిసిన నీటిని నేరుగా తాగడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మరియు ఇతర తీవ్రమైన జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం మెండుగా ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రైల్వే నిబంధనలు మార్గదర్శకాల ప్రకారం ప్లాట్‌ఫారమ్‌లపై ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, మూత్రశాలలు, విశ్రాంతి గదులు ప్లాట్‌ఫారమ్ షెల్టర్లు వంటి కనీస వసతులు కచ్చితంగా కల్పించాలి. అయితే ఆడిట్ నివేదిక ప్రకారం క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నీటి ట్యాంకులు, వాటర్ కూలర్లు, పైప్లైన్లను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించకపోవడం వల్లే నీరు కలుషితమవుతోందని కాగ్ ఎత్తిచూపింది. గతంలో 2021లో వెలువడిన రైల్వే ఆడిట్ నివేదికలో కూడా మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ లోపాలపై హెచ్చరించినప్పటికీ

దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.4,894 కోట్ల ఆదాయం వచ్చిందని జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు. 32 వేల మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రూ.3,300 కోట్ల ఆదాయం పొందిందని వివరించారు. విశాఖపట్నం, ఆగస్టు15: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.4,894 కోట్ల ఆదాయం వచ్చిందని జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు. 32 వేల మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రూ.3,300 కోట్ల ఆదాయం పొందిందని వివరించారు. శనివారం 80వ స్వాతంత్ర్య వేడుకలు సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా జోన్ పరిధిలోని రైల్వే సిబ్బంది, అధికారులతోపాటు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీఎం సందీప్ మాథుర్ మాట్లాడుతూ.. భారతీయ రైల్వేలో18వ జోనల్ హెడ్ క్వార్టర్‌గా 2026 జూన్ 1వ తేదీన ప్రారంభమైందని గుర్తు చేశారు. దీంతో ఈ రైల్వే జోన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. జోన్ పరిధిలోని 1070 లోకోమోటివ్‌లలో ఇప్పటికే ప్రమాదాల నివారణకు 719 లోకోమోటివ్‌లకు కవచ్ ఏర్పాటు చేశామని అన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందులోభాగంగా డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులను రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. అందులో రూ.54,479 కోట్లు ఇప్పటికే వెచ్చించి పనులు చేపట్టామని ఆయన వివరించారు. విశాఖపట్నం యార్డ్ మోడలింగ్ ప్రాజెక్టుకు రూ.299 కోట్లు ఆమోదం లభించిందన్నారు. దీంతో 6 అదనపు లైన్లు, 6 అదనపు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుంతకల్- బళ్లారి డివిజన్లో నాలుగు లైన్లు నిర్మాణం కోసం రూ.1,205 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Railways Approves 7 New Amrit Bharat Express: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లడం వల్ల ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. లోయర్, మిడిల్ క్లాస్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టారు. ఇవి సుదీర్ఘ ప్రయాణాలను తక్కువ సమయంలో పూర్తి చేయడమే కాకుండా, ప్రీమియం రైలు సర్వీసుల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ మొత్తం 7 రైళ్ల కనెక్టివిటీకి రైల్వే బోర్డు అనుమతి తెలిపింది. ఆ రైళ్లు ఏ రూట్లలో వెళ్తాయో చూద్దాం. ధన్ బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రైల్వే బోర్డు ధన్ బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసింది. ట్రైన్ నంబర్ 22363/ 22364 కలిగిన ఈ రైలు ధన్ బాద్ జంక్షన్ నుంచి ఎన్.ఎస్.ఈ బోస్ జంక్షన్, పరాశనాద్, హజారీబాగ్ రోడ్డు, కోడెర్మా, గయా, అనుగ్రహ నారాయణ రోడ్డు, డెహ్రాసారాం, దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, మీర్జాపూర్, ప్రయాగ రాజ్, కాట్నీ, జబల్పూర్, నర్సింగ్ పూర్, పిపారియా, ఇటార్సీ, బేతుల్, నాగపూర్, చంద్రపూర్, బాలార్ష, సిర్పూర్, కాగజ్ నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుత్తని, కార్డ్పాటి, జోలర్, పెట్టాయి, సేలం, ఈరోడ్ మరియు తిరుప్పుర్ మీదుగా వెళ్తుంది. ప్రయాగరాజ్ నుంచి లోకమాన్య తిలక్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది ప్రయాగరాజ్ నుంచి

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. పల్నాడు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు రోజూ ఆలస్యమే సమయానికి గమ్యం చేరుకోక ప్రయాణికుల ఇబ్బందులు హైదరాబాద్ సిటీ: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. గుంటూరు నుంచి నగరానికి వచ్చే పల్నాడు ఎక్స్‌ప్రెస్ రోజూ గంటకు పైగా ఆలస్యం అవుతుండగా, విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ముప్పావుగంట ఆలస్యంగా నడుస్తోందని చెబుతున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సకాలంలో గమ్యానికి చేరుకోలేకపోతున్నారని, వారి విలువైన సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నుంచి బుధవారం ఉదయం 5.45 గంటలకు బయల్దేరిన పల్నాడు ఎక్స్‌ప్రెస్ బేగంపేట్‌కు 10.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, గంటకు పైగా ఆలస్యంతో 11.40 గంటలకు వచ్చింది. అలాగే, విశాఖపట్నం నుంచి వచ్చే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ బేగంపేట్‌కు సాయంత్రం 6.30 గంటలకు రావాల్సి ఉండగా, 50 నిమిషాల ఆలస్యంగా రాత్రి 7.20 గంటలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే అతి ముఖ్యమైన పల్నాడు, జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రతిరోజు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికుల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గుంటూరు నుంచి బీబీనగర్ వరకు సింగిల్‌లైన్ కావడం, డబ్లింగ్ పనులు జరుగుతుండడం సూపర్‌ఫాస్ట్ రైళ్ల ఆలస్యానికి కారణాలుగా రైల్వే సిబ్బంది చెబుతున్నారు. సికింద్రాబాద్- వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఐదు స్టేషన్ల ముందే క్లియరెన్స్ ఇవ్వాల్సి రావడంతో తరచుగా సూపర్‌ఫాస్ట్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రయాణికుల సంఘాలు అంటున్నాయి. రైళ్ల నిర్వహణపై పర్యవేక్షణను మరింతగా పెంచాలని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు ఆయా సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్ రైళ్లు నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

భారతీయ రైల్వే అనగానే మనకు సుదీర్ఘ ప్రయాణాలు, కొన్ని గంటల నుంచి రోజుల తరబడి సాగే ప్రయాణాలు గుర్తుకొస్తాయి. కానీ, దేశంలోనే అత్యంత తక్కువ దూరం ప్రయాణించే రైలు మార్గం ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ మార్గంలో రైలు ఎక్కిన ప్రయాణికులు సరిగ్గా సర్దుకుని కూర్చోకముందే గమ్యస్థానం వచ్చేస్తుంది. కేవలం 3 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి 7 నుంచి 9 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.ఎక్కడుంది ఈ మార్గం? మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో నాగ్‌పూర్ జంక్షన్ (NGP), అజ్ని (AJNI) రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రత్యేక రైలు మార్గం ఉంది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే. రైలును బట్టి ఈ ప్రయాణానికి 7, 8 లేదా 9 నిమిషాల సమయం పడుతుంది. 1853లో ప్రారంభమైన భారతదేశపు తొలి ప్యాసింజర్ రైలు ముంబై నుంచి థానే మధ్య 34 కిలోమీటర్లు ప్రయాణించింది. దానితో పోలిస్తే ఈ మార్గం పదో వంతు కంటే తక్కువ దూరం కావడం గమనార్హం.ఎవరు ప్రయాణిస్తారు? ఇదేదో కేవలం వింత కోసం నడుపుతున్న రైలు కాదు. నాగ్‌పూర్‌లోని స్థానిక ప్రయాణికులు తమ రోజువారీ పనుల కోసం ఈ మార్గాన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా నగరం నుంచి పశ్చిమ, నైరుతి దిశగా ప్రయాణించాల్సిన ఉద్యోగులు, విద్యార్థులకు ఈ మార్గం ఎంతో సౌకర్యవంతంగా ఉంది. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా నిమిషాల్లో గమ్యం చేరడం వారికి సౌలభ్యంగా మారింది.టికెట్ ధరలు చూస్తే షాక్! ఈ ప్రయాణంలో ఆశ్చర్యపరిచే మరో విషయం టికెట్ ధరలు

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది తరచూ వస్తూ ఉంటారు. దీంతో తిరుపతి రైల్వే మార్గంలో ట్రైన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఈ రూట్లో ఎప్పటికప్పుడు నడుపుతోంది. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా స్పెషల్ రైళ్లు, వీక్లీ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇక సెలవులు, పండుగ రోజుల్లో మరిన్ని రైళ్లను తీసుకొస్తుంది. ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ఈ ప్రత్యేక రైళ్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. ఇక తిరుమల వెళ్లే ప్రయాణికులకు మరో వీకెండ్ స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. తిరుపతి-విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్(08509) తీసుకొచ్చింది. ఆగస్ట్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 10 వరకు నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు షెడ్యూల్ విషయానికొస్తే.. ప్రతీ ఆదివారం, గురువారం తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఇక ఇదే రైలు విశాఖపట్నం-తిరుపతి(08510) ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 11 వరకు సర్వీసులు అందించనుంది. ప్రతీ సోమ, శుక్రవారాల్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్లో 22 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగపడతాయని, ప్రయాణికులు ఈ అవకాాశాన్ని ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక సంబల్పూర్- చర్లపల్లి(08309) ప్రత్యేక రైలు ఆగస్ట్ 14న ఉదయం 11.45 గంటలకు బయల్దేరి.. ఈ నెల 15వ తేదీ ఉదయం 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ ట్రైనులో మొత్తం 20 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అటు తమిళనాడులో ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్

దేశంలో రైలు ప్రయాణాన్ని ఎక్కువమంది ఇష్టపడతారు. కంఫర్టబుల్‌గా ఉంటుందనే ఉద్దేశంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారే ట్రైన్ జర్నీ చేస్తుంటారు. టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది. రైళ్లల్లో జనరల్, స్లీపర్, ఏసీ, చైర్ కార్ వంటి కోచ్‌లు ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రతీ కోచ్‌లో టికెట్ల ధరలు వేర్వురుగా ఉంటాయి. అయితే ఏసీ కోచ్‌లలో రైల్వేశాఖ బెడ్ రోల్ అనేది అందిస్తూ ఉంటారు. బెడ్ షీట్, దుప్పటి, దిండు, టవల్ ఇస్తారు. ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రతీఒక్కరికీ ఇది తప్పనిసరిగా అందించాలని రైల్వే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి వీటిని తప్పనిసరిగా ఇవ్వాలి. టికెట్లోనే ఈ బెడ్ రోల్ ఛార్జీలు కలిసి ఉంటాయి. దీంతో ప్రత్యేకంగా వీటికి ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించేవారు ప్రత్యేకంగా వీటి కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్టాకును బట్టి సిబ్బంది అందిస్తూ ఉంటారు. ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి బెడ్ రోల్ ఇవ్వకపోతే ఫిర్యాదు చేయవచ్చు. రైల్వేశాఖ నుంచి రీఫండ్ కూడా పొందే హక్కు ఉంది. అలాగే ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా తప్పనిసరిగా అందించాలి. ఈ మేరకు రైల్వే నిబంధనలు ఉన్నాయి. మీకు బెడ్ రోల్ అందించకపోతే ముందుగా కోచ్ అటెండర్‌ను సంప్రదించాలి. అయినా ఇవ్వకపోతే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయాలి. నిర్ణీత గడవులోగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దీంతో మీరు దిగాల్సిన స్టేషన్ వద్ద రూ.20 రీఫండ్ పొందవచ్చు. ఇది చిన్న మొత్తమే అయినా మీ టికెట్లోనే బెడ్ రోల్ ఛార్జీలు కలుపతారు గనుక రైల్వే ప్రయాణికులకు ఈ హక్కు ఉంది. ఇది చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇక ఏసీ కోచుల్లోని ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా తప్పనిసరిగా బెడ్ రోల్ అందించాలి. ఆర్ఏసీ ప్రయాణికులకు అందించడం లేదనే విమర్శలు ఇటీవల వినిపిస్తున్నాయి. దీంతో రైల్వేశాఖ అన్ని జోన్లకు

వేరే రైలు ఎక్కితే జరిమానా టీడీఆర్తోనే టికెట్ రిఫండ్ లభ్యం తదుపరి స్టేషన్లో అందుకోవడానికి అవకాశం TDR Filing: రైలు ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా అనివార్య కారణాల వల్ల రైలు మిస్సయితే, తదుపరి ఏం చేయాలనే దానిపై ప్రయాణికుల్లో అనేక అనుమానాలు ఉంటాయి. మిస్సయిన రైలు టికెట్‌తో వేరే రైలు ఎక్కవచ్చా, ప్రయాణించని టికెట్‌కు డబ్బులు వెనక్కి వస్తాయా, టిడిఆర్ (TDR Filing) ఎలా దాఖలు చేయాలి అనే అంశాలపై ఇండియన్ రైల్వేస్‌కు నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. బుక్ చేసుకున్న సర్వీస్‌ను కోల్పోయినప్పుడు చట్టబద్ధమైన హక్కులు, రైల్వే నిబంధనలు తెలుసుకోవడం ప్రయాణికులకు ఎంతో అవసరం. Chandrababu: ఎల్ నినో ప్రభావం ప్రజలపై పడకూడదు.. ధరలు పెరగకూడదు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు వేరే రైలు ఎక్కవచ్చా? జరిమానాలు, టీటీఈ రూల్స్: రిజర్వ్ చేసిన రైలు మిస్సయితే అదే టికెట్‌తో మరొక రైలులో ప్రయాణించడం రైల్వే నిబంధనలకు విరుద్ధం. అలా ప్రయాణిస్తే టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించి టీటీఈ (TTE) అదనపు ఛార్జీలు, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అయితే సాధారణ జనరల్ టికెట్లకు కొంత సడలింపు ఉంటుంది. ఒకవేళ మీ బోర్డింగ్ స్టేషన్లో రైలు మిస్సయినా, టీటీఈ వెంటనే మీ బెర్త్‌ను ఇతరులకు కేటాయించరు. తదుపరి రాబోయే కొద్ది స్టేషన్ల వరకు అదే రైలును అందుకోవడానికి ప్రయాణికుడికి అవకాశం ఉంటుంది. రిఫండ్ ప్రక్రియ, టీడీఆర్, దాఖలు చేసే విధానం: రైలు మిస్సయినంత మాత్రాన ఆటోమేటిక్‌గా డబ్బులు ఖాతాలో జమకావు. రైల్వే నిబంధనల ప్రకారం నిర్దిష్ట గడువులోగా 'టికెట్ డిపాజిట్ రిసీప్ట్' దాఖలు చేస్తేనే రిఫండ్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడవడం వల్ల ప్రయాణం విరమించుకుంటే పూర్తి రిఫండ్ లభిస్తుంది. సరైన సమయంలో టీడీఆర్ సమర్పించకపోతే ఎలాంటి రిఫండ్ రాదని ప్రయాణికులు గుర్తుంచుకోవాలి. కాబట్టి, మీరు ఏదైనా కారణాల వల్ల రైలు మిస్ అయినప్పుడు తదుపరి

Train Bed roll| ఇంటర్నెట్ డెస్క్: ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ రైల్వే నిబంధనల ప్రకారం బెడ్‌రోల్ ఇస్తారు. ఇందులో దుప్పటి, బెడ్‌షీట్, దిండు, టవల్ ఉంటాయి. సాధారణంగా ఏసీ బోగీలో టికెట్ బుక్ చేసినప్పుడే టికెట్ ధరలోనే ఈ బెడ్‌రోల్ ఛార్జీలు ఇమిడి ఉంటాయి. తీరా ట్రైన్ ఎక్కాక బెడ్‌రోల్ సప్లయ్ చేయకపోతే ఏం చేయాలి? ఆర్ఏసీ ప్రయాణికులకు బెడ్‌రోల్ నిరాకరించొచ్చా? ఇంతకీ రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయ్..? భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ ప్రయాణికులందరికీ బెడ్‌రోల్ (Train Bed roll) ఇవ్వాల్సిందే. అదే స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే వారైతే డబ్బులు చెల్లించి (ఎంపిక చేసిన రైళ్లలో/అందుబాటును బట్టి) బెడ్‌రోల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏసీ బోగీలో మీకు బెడ్‌రోల్ అందకపోతే ప్రతిగా పరిహారం పొందే హక్కు ఉంటుంది. ఇందుకోసం ముందుగా బెడ్‌రోల్ కోసం కోచ్ అటెండెంట్‌ను సంప్రదించాలి. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే రైల్వే కేటాయించిన నిర్ణీత గడువులోపు ఫిర్యాదు నమోదు చేయాలి. నిబంధనల ప్రకారం.. గమ్యస్థాన స్టేషన్ వద్ద రూ.20 రిఫండ్ పొందేందుకు అర్హత ఉంటుంది. చిన్న మొత్తమే అయినా ప్రయాణికుడిగా మీకున్న హక్కు కింద మీ నగదును పొందేందుకు రైల్వే నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. రైల్వే నిబంధనల ప్రకారం.. చైర్‌కార్ మినహా ఏసీ బోగీల్లో ప్రయాణించేవారందరికీ పూర్తి బెడ్‌రోల్ కిట్ (Train Bed roll)ను అందించాలి. అయితే, రిజర్వేషన్ అగనిస్ట్ క్యాన్సిలేషన్ (RAC) ప్రయాణికులకు బెడ్‌రోల్ నిరాకరిస్తున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రైల్వే బోర్డు అన్ని జోన్లకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలోనే బెడ్‌రోల్ ఛార్జీలు కూడా కలిసి ఉన్నందున కన్ఫామ్ టికెట్ ప్రయాణికులతో సమానంగా పూర్తి కిట్‌ను అందించాలని సూచించింది. ఈ ఆదేశాలను అన్ని జోన్లూ పాటించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కళ్లు బైర్లు కమ్మే భయానక దృశ్యం ఒకటి కెమెరాకు చిక్కింది. వేగంగా దూసుకొస్తున్న రైలు నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి తన శరీరాన్నే అడ్డుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్లాట్‌ఫామ్‌కు, రైలు పట్టాలకు మధ్య ఉన్న ఇరుకైన సందులో ఇద్దరు పిల్లలు గోడకు అతుక్కుని ఉండగా, వారిపై వంగి ఆ తల్లి రైలు నుంచి కాపాడుతున్నట్టు కనిపిస్తుంది.రైలు అతి సమీపం నుంచి వేగంగా వెళ్తున్నప్పుడు, ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. రైలు వెళ్లేంత వరకు ఆ తల్లి, పిల్లలు గోడకే అతుక్కుని ఉండిపోయారు. రైలు వెళ్లిపోయిన తర్వాత వారు సురక్షితంగా పైకి లేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను 'భారత్ మాతా కే సేవక్' అనే 'ఎక్స్' ఖాతాలో షేర్ చేయగా, ఇది నెట్టింట వైరల్‌గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చాలామంది పిల్లలను కాపాడుకోవడానికి ఆ తల్లి చూపిన ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. "ఇది అమ్మ ప్రేమ, ఆ సమయంలో ఆలోచించేంత సమయం ఉండదు, ఆమె నిజమైన హీరో" అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, మరికొందరు ఆ తల్లి నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు. "అసలు అంత ప్రమాదకరమైన ప్రదేశానికి పిల్లలను ఎందుకు తీసుకెళ్లింది? ఇది ధైర్యం కాదు, బాధ్యతారాహిత్యం" అంటూ విమర్శిస్తున్నారు. అసలు ఆ కుటుంబం ఆ ప్రదేశానికి ఎలా చేరుకుంది అనే దానిపై మాత్రం స్పష్టత లేదు

రైల్వే క్రాసింగ్ వద్ద ఓ వ్యక్తి ఫోన్ కాల్‌తో రైలును ఆపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కుటుంబ సభ్యులను రైలు ఎక్కించేందుకు వచ్చిన అతను.. స్టేషన్‌కు వెళ్లక ముందే దానిని ఆపేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బిహార్: రైల్వే క్రాసింగ్ వద్ద ఓ వ్యక్తి ఫోన్ కాల్‌తో రైలును ఆపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కుటుంబ సభ్యులను రైలు ఎక్కించేందుకు వచ్చిన అతను.. స్టేషన్‌కు వెళ్లక ముందే దానిని ఆపేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో రైల్వే క్రాసింగ్ వద్ద వేచి ఉన్న వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అదేదో బస్సునో, ఆటోనో ఆపినట్లు రైలును ఆపడంతో షాక్ అయ్యారు. ఈ ఘటన బిహార్‌లో జరగగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను @SitamarhiJila అనే ఎక్స్ అకౌంట్ యూజర్ పోస్టు చేశాడు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ రైల్వే క్రాసింగ్ వద్ద సిగ్నల్ పడింది. దీంతో పట్టాలకు ఇరువైపులా పదుల సంఖ్యలో వాహనాలు నిలిచాయి. ఇదే సమయంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ వాహనంలో అక్కడికి వచ్చాడు. నేరుగా రైల్వే లైన్ వద్దకు వెళ్లాడు. అదే సమయంలో అటుగా ప్యాసింజర్ రైలు వస్తోంది. ఇంతలో ఆ వ్యక్తి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అనంతరం రైలును ఆపాలంటూ చేతితో సైగ చేశాడు. కొద్దిసేపటికే రైలు వచ్చి వారి వద్ద ఆగింది. అతను తన కుటుంబ సభ్యులను ఎక్కించడంతో తిరిగి రైలు వెళ్లిపోయింది. దీంతో వీడియో తీస్తున్న వ్యక్తితో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ వీడియోను కాస్తా సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. రైల్వే సేవా అధికారిక ఖాతా స్పందించింది. ఈ ఘటనను సమస్తిపూర్ డివిజన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది