
దొంగపెళ్లి చేయడానికే వచ్చారా? రెచ్చగొట్టేసిన సేనాపతి.. రామరాజు కౌంటర్ .. ధీరజ్ పేరు, గోత్రం దాటేసినప్రేమ
Illu Illalu Pillalu August 10th Episode Review: ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి చీర సారె పెట్టి మొక్కాలని రామరాజు, భద్రావతి గడికి వెళతారు. పగతో రగిలిపోతున్న సేన .. రామరాజును మాటలతో రెచ్చగోడతాడు. ఎత్తుకు పై ఎత్తులు వేసే భద్రావతి ప్రేమను కంట్రోల్లో పెట్టుకుంటుంది. గుడిలో ధీరజ్ తో ప్రేమను కలపాలనే వేదవతి ప్లాన్‌ను అడ్డుకుంటుంది. ఇదీ ఇవాళ్టి ఎపిసోడ్ సంక్షిప్తంగా.. ఇక వివరాల్లోకి వెళితే.. స్పెషల్ క్లాస్‌కి వెళ్లాలి నేను గుడికి రాలేను అంటున్న ప్రేమను ఎలాగైనా ఒప్పించాలి .. గుడికి తీసుకెళ్లాలి అని అన్న విశ్వ ప్రయత్నిస్తుంటాడు. గుడి్కి వెళ్లడానికి భద్రావతి, రామరాజు రెడీ అవుతారు. ప్రేమ కాలేజీకి బయలుదేరుతుంది. రాత్రి మీ ఆయన నన్ను ఎగతాళి చేసాడు అని ప్రేమను రెచ్చగొడతాడు అన్న విశ్వ. ప్రేమ ఆవేశపడిపోయి ఏమన్నాడో చెప్పు అని నిలదీస్తుంది. నాతో మళ్లీ ప్రేమలో పడిపోతుందనే భయంతో రేపు మీ చెల్లెలు గుడికి రాదు. అని ఎగతాళి చేసాడు అంటాడు విశ్వా. ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడు..అదంతా వాడి భ్రమ .. నేనేంటో చూపిస్తా.. గుడికి వస్తా అంటుంది ప్రేమ. [caption id="attachment_1884748" align="alignnone" width="1280"] Illu Illalu Pillalu Serial[/caption] రామరాజు కుటుంబం ఆటోలో.. భద్రావతి, సేన, ప్రేమ, కారులో దిగుతారు. ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని గుడికి దొంగ పెళ్లి చేయడానికి వచ్చారా ..మొక్కడానికి వచ్చారా.. అని సేన రామరాజుతో అంటాడు. డబ్బున్న అమ్మాయిని లేపుకెళ్లి గుడిలో పెళ్లి చేసుకోవడం.. అయ్య దగ్గర నుంచి కొడుకుల దాకా .. మీకు ఫ్యామిలీ బిజినెస్ కదా అంటాడు. దానికి ధీరజ్ ఏయ్ అంటూ వార్నింగ్ ఇస్తుంటే.. రెచ్చగొట్టేలా అరుపులు మాటలు మనకు వినిపిస్తాయి .. అవన్నీ పట్టించుకుంటే మన విలువ తగ్గుతుంది. ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి వెళదాం అంటాడు రామరాజు. ఎలాగోలా ప్రేమ, ధీరజ్‌ను కలపాలని అనుకుంటాడు విశ్వా. చెల్లిని ధీరజ్ వైపుకు బలంగా నెట్టి