హైదరాబాద్ భక్తుల పెద్దమనసు.. టీటీడీ ఎస్వీప్రాణదానట్రస్టుకు కోటి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన ఇద్దరు భక్తులు టీటీడీకి రూ. కోటి విరాళం అందించారు. రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ రామేశ్వరరావు, సాయిచందన ఏపిఐ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ తాతారావు అనే ఇద్దరు భక్తులు.. టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు చొప్పున విరాళంగా అందజేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన దాతలు.. విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్బంగా దాతల సేవాభావాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.తిరుపతిలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన టీటీడీమరోవైపు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉన్న పరేడ్ గ్రౌండ్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్, ఈవో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం టీటీడీ ఛైర్మన్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడు దర్శనం అనంతరం దివ్యానుభూతితో తిరిగే వెళ్లేలా సేవలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబరులో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరులో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చాయన్న టీటీడీ ఛైర్మన్.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు శ్రీవారి దివ్యదర్శనం, వాహనసేవలను భక్తిశ్రద్ధలతో వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన, రుచి, పరిశుభ్రమైన అన్నప్రసాదం అందించేందుకు రూ.120 కోట్లతో మరొక వంటశాలను నిర్మించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న 12 ఎలక్ట్రిక్ బస్సులకు, అదనంగా మరో 32 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చి శ్రీవారి భక్తులకు పర్యావరణ హితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించనున్నట్లు వివరించారు. తిరుమల ఎస్వీ మ్యూజియంలో శ్రీవారి సేవలు, ఉత్సవాలు, అరుదైన ఆభరణాలను 3డీ, 7డీ రూపంలో అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.టీటీడీ ట్రస్టులు, పథకాలకు విరాళాలు సమర్పించే భక్తులు