ముఖంపై జిడ్డును తగ్గించే చిట్కాలు
ముఖాన్ని రెండుసార్లు కడగండి. సున్నితమైన క్లెన్సర్‌తో ముఖాన్ని వాష్ చేయడం వల్ల జిడ్డు తొలగుతుంది. అయితే అతిగా ఫేస్‌వాష్ చేస్తే జిడ్డు ఎక్కువ అవుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు బ్లాటింగ్ పేపర్‌తో సున్నితంగా ముఖాన్ని తుడవండి. దీంతో అదనపు నూనె తొలగుతుంది. జిడ్డు తగ్గుతుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను, జిడ్డును మాయం చేస్తాయి. తేనెను ముఖానికి రాయడం వల్ల అందం కూడా రెట్టింపు అవుతుంది. ముల్లానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాయండి. ఈ ప్యాక్ జిడ్డును మాయం చేస్తుంది. ముల్తానీ మట్టి చర్మాన్ని మెరిపిస్తుంది. తాజా కలబంద జెల్‌ను ముఖానికి రాయండి. 5 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగితే జిడ్డు మాయం అవుతుంది. ముఖానికి టమాటా రసం అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగండి. వీటిలోని పోషకాలు జిడ్డును మాయం చేస్తాయి. యూవీ కిరణాల నుంచి రక్షణ అందిస్తాయి. నానబెట్టిన బాదం పప్పులను రుబ్బి పేస్ట్ తయారు చేయండి. దీన్ని ముఖంపై రాసి తర్వాత కడిగితే జిడ్డు తగ్గుతుంది. నాన్ కామోడోజెనిక్, ఆయిల్ ఫ్రీ క్రీమ్‌లు ఉపయోగించండి. ఇవి చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చూస్తాయి. దీంతో జిడ్డు తొలగుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. నూనె పదార్థాలు తింటే జిడ్డు సమస్య తీవ్రం అవుతుంది