
Telangana Rains : తెలంగాణలో వేగంగా మారుతున్న వాతావరణం.. ఈ రెండు రోజులు అప్రమత్తం.. భారీ వర్షాలకు ఛాన్స్!
Telangana Rains : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వర్షాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది.
© 2026 nimisham.in

Telangana Rains : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వర్షాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది.

Local Elections స్థానిక ఎన్నికలకు సన్నద్ధం

US Midterm Elections 2026 : ఈ APIAVote సర్వేలో ఇండియన్ అమెరికన్ ఓటర్లలో 66 శాతం మంది కాంగ్రెషనల్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులకు ఓటు వేయాలని భావిస్తున్నట్టు తేలింది. 18శాతం మాత్రమే రిపబ్లికన్లనకు సపోర్టు ఇస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ పై ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా ప్రారంభించిన యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని చాలా సులువుగా మొదలుపెట్టిన ట్రంప్.. ఎలా ముగించాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అటు ఇరాన్ మాత్రం దృఢంగా బదులిస్తోంది. అదే సమయంలో ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే అమెరికన్లు ఇరాన్ యుద్దంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక ట్రంప్ (donald trump) సతమతం అవుతున్నారు.US-Iran War: అమెరికా దాడి- ఇరాన్ ప్రతి దాడులు- మళ్లీ మొదలైన వార్..!ఎన్నికల తరుణంలో ఈ యుద్ధం మరింత తీవ్రతరం కాకుండా అడ్డుకోవాలని ట్రంప్ టీమ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇరాన్ వార్ వల్ల వల్ల ఓటర్లలో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని, తద్వారా రాబోయే ఎన్నికల్లో నష్టపోకుండా చూసుకోవాలని ట్రంప్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇరాన్‌తో జరుగుతున్న సుదీర్ఘ యుద్దంపై అమెరికా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల నిర్వహించిన ఒక పోలింగ్ విశ్లేషణ ప్రకారం కేవలం 31 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఈ యుద్ధాన్ని సమర్థిస్తుండగా, 63 శాతం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పెరిగిన పెట్రోలు ధరలు కూడా ఓటర్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెనేట్, ప్రతినిధుల సభలో తమ స్వల్ప మెజారిటీని కాపాడుకోవాలని చూస్తున్న రిపబ్లికన్లకు ఈ వార్ పెద్ద సవాలుగా మారింది.ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇరాన్‌పై పెద్ద ఎత్తున సైనిక చర్యల కంటే ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడమే మేలని వైట్ హౌస్ అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా భవిష్యత్తులో జరిగే చర్చల సమయానికి ఇరాన్‌పై బలమైన ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వంటి కీలక నేతలు కూడా ఎన్నికలు ముగిసే వరకు ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలను సాధ్యమైనంత వరకు అదుపులో ఉంచడానికే మొగ్గు చూపుతున్నారు.H-4

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. కర్నూలు, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. వైసీపీ ఏ రోజు ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారు.. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రజా సంక్షేమం కోసం ఏమి చేశారో చెప్పే దమ్ము ఉందా అని బీసీ జనార్దన్ రెడ్డి నిలదీశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారని తెలిపారు. పులివెందులకు కూడా నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పుకొచ్చారు. 36 నీటి ప్రాధాన్య ప్రాజెక్టులకు నీరు ఇస్తున్నామని వెల్లడించారు. ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ లేకుండా చేసింది జగన్ మోహన్ రెడ్డినే అని విమర్శించారు. వైసీపీ దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మరు.. వైసీపీ నేతలు దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అన్నారు. ప్రజలకు, రైతులకు ఏ విధంగా నీరు ఇవ్వాలో అధికారులతో తాము సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. తలకిందులు చేసిన కూడా గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీ కెనాల్‌కు నీరు ఎప్పుడు విడుదల

అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ హిస్టారిక్ నిర్ణయం తీసుకుంది. ఆలయ చరిత్రలోనే తొలిసారిగా పూర్తిస్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించేందుకు గాను బుధవారం సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ నివాసమైన మణిరామ్‌దాస్ ఛావనీలో ఈ భేటీ జరగనుండగా, అయోధ్య రామాలయం తొలి సీఈఓ ఎవరనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీఈఓ నియామకంతో పాటు ఖాళీగా ఉన్న కీలక పదవుల భర్తీపై కూడా ట్రస్ట్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి అధికారిక ప్రకటన వెలువరించనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉద్యోగ ప్రకటనకు ఏకంగా 5,585 దరఖాస్తులు వచ్చాయి. మాజీ న్యాయమూర్తి ప్రమోద్ కొహ్లీ, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, సురేశ్ హావరేలతో కూడిన ముగ్గురు సభ్యుల సెర్చ్ కమిటీ వీటిని క్షుణ్ణంగా పరిశీలించింది. సెర్చ్ కమిటీ మొత్తం 16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, చివరకు ముగ్గురితో కూడిన తుది ప్యానెల్ జాబితాను ట్రస్ట్‌కు సమర్పించింది. 50 నుంచి 70 ఏళ్ల వయస్సు, కనీసం 20 ఏళ్ల పరిపాలనా అనుభవం కలిగి ఉండి, ప్రాక్టీసింగ్ హిందువుగా ఉన్న వారిని మూడేళ్ల కాంట్రాక్ట్ కాలపరిమితికి సీఈఓగా ఎంపిక చేయనున్నారు. ఈ సీఈఓ పదవితో పాటు ట్రస్ట్ తొలి సెక్రటరీగా ఐఐటీ బాంబే ఎంటెక్ గ్రాడ్యుయేట్, రామాలయ ప్రాజెక్ట్ మేనేజర్ అయిన జగదీశ్ ఆఫ్లే పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాగ్డాను కూడా ట్రస్ట్ సభ్యుడిగా చేర్చుకునే దిశగా చర్చలు వేగవంతమయ్యాయి. ఇదిలా ఉండగా గతంలో మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాలు, అలాగే ట్రస్టీ విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం వల్ల ట్రస్ట్‌లో మూడు కీలక స్థానాలు ఖాళీగా

BCCI Selection Policy: ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ కీలక మార్పు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయంలో ఆటగాడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడనే విషయంలో బోర్డు మరింత స్పష్టత తీసుకోనుంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు ఫిట్నెస్ షరతు విధించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారా లేదా అనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే వారి తుది లభ్యతపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల గాయపడిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని, ఆ తర్వాత వారు మ్యాచ్‌లకు దూరమైన సందర్భాల నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. నివేదిక ప్రకారం.. ఇక ఆటగాడి ఫిట్‌నెస్‌పై 100 శాతం కాకుండా 200 శాతం నమ్మకం ఉన్నప్పుడే అతడిని పూర్తిగా ఎంపిక చేసినట్లు పరిగణించే విధానాన్ని బీసీసీఐ అవలంబించనుంది. దీనివల్ల జాతీయ జట్టులోకి ఎంపికైన తర్వాత ఫిట్నెస్ కారణంగా ఆటగాడు అందుబాటులో లేకపోయే పరిస్థితులను తగ్గించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్లో ఒంటి చేత్తో..! అయితే అంతర్జాతీయ సిరీస్‌కు జట్లను సాధారణంగా కొన్ని వారాల ముందే ఎంపిక చేస్తారు. ఎంపిక తేదీకి ఆటగాడు పూర్తి ఫిట్‌గా లేకపోయినా, సిరీస్ ప్రారంభానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటే అతడిని పూర్తిగా పక్కన పెట్టకుండా ‘ఫిట్‌నెస్‌కు లోబడి’ ఎంపిక చేసే విధానాన్ని బీసీసీఐ కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వివరించినట్లు నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌కు ప్రకటించిన 15 మంది జట్టులో బుమ్రా, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్ రాణాలకు ఫిట్నెస్ క్లియరెన్స్ తప్పనిసరి. నివేదిక ప్రకారం బుమ్రా, నితీశ్ సిరీస్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే
పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పేదల నుంచి అఫ్లికేషన్లు తీసుకోవటంతో పాటు ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా ప్రక్రియ నిర్వహించారు. లాటరీలో ఇళ్లకు ఎంపికైన వారి పూర్తి వివరాలను హౌసింగ్ బోరు వెబ్సైట్లో పెట్టింది. నియోజకవర్గాల వారీగా దరఖాస్తు నంబరు, పేరు, ప్రస్తుతం ఉంటున్న చిరునామాతో సహా ఏర్పాటు చేసింది. ఎంపికైన వారిపై ఇతర దరఖాస్తుదారులకు ఎవైనా అభ్యంతరాలుంటే తెలియజేసేలా ఆ పక్కనే అవకాశం కల్పించారు.ఇక నేటి నుంచి ఇందిరమ్మ టవర్స్‌కు ఎంపికైన వారి తుది పరిశీలన చేపట్టనున్నారు. మెుత్తం 16 నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. ఏ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇంటికి ఎంపికయ్యారో.. ఆ కుటుంబం గత పదేళ్లుగా అదే నియోజకవర్గంలోనే ఉంటుందా లేదా అని అధికారులు వచ్చి పరిశీలన చేయనున్నారు. ఇందుకు హౌసింగ్ బోర్డు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో నిర్మించనున్న 480 ఇళ్లకుగాను 600 మందికిపైగా అధికారులు ఎంపిక చేశారు. వీరందరినీ క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నియోజకవర్గానికి 20 మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. రోజుకు కనీసం 150 కుటుంబాల వద్దకు వెళ్లి.. వారి నివాసం నిర్ధారించనున్నారు. నాలుగు రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.అధికారులు పరిశీలించే అంశాలు ఇవే.. ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన వారు స్థానికంగానే ఉంటున్నారా లేదా అని అధికారులు నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత సదరు ఇంటిని జియోట్యాగ్ చేస్తారు. అఫ్లికేషన్‌లో పేర్కొన్న వివరాలు సరైనవేనా కాదా అనేది చూస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు పరిశీలిస్తారు. గత పదేళ్లుగా అదే నియోజకవర్గంలో ఉంటున్నాడా లేదా అని దర్యాప్తు చేస్తారు. వివరాలన్నీ అక్కడి నుంచే యాప్‌లో అప్లోడ్ చేస్తారు.ప్రస్తుతం నియోజకవర్గానికి 480 ఇళ్లను నిర్మిస్తుంటే.. అంతే మందిని ఎంపిక చేశారు

టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మంగళవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టులో ప్లేయర్లను వరుస గాయాలు వెంటాడుతుండటంతో కృనాల్‌కు అవకాశం దక్కుతుందంటూ వార్తలు వచ్చాయి. ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని అభిమానులు ఆశించారు. కట్ చేస్తే.. జట్టులో కృనాల్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కృనాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఆశ ఇంకా సజీవంగానే ఉంది’ అన్నట్లు ఓ పోస్ట్ చేశాడు. దానికి ఫింగర్ క్రాస్(HOPE) ఎమోజీతో పాటు భారత జెండా ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. కృనాల్ పాండ్య చివరిసారిగా 2021లో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. టీ20ల్లో భారత్‌కు 19 మ్యాచ్‌లు ఆడిన అతడు 10 ఇన్నింగ్స్‌ల్లో 124 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అనూహ్య కారణాల వల్ల కృనాల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న అతడిని.. జాతీయ జట్టులోకి తీసుకుంటారని భావించారు. అయితే వాషింగ్టన్ సుందర్‌కు ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. అతడు ఒకవేళ సుందర్ అందుబాటులోకి రాలేకపోతే.. కృనాల్ పేరును పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వంద కాదు 200 శాతం క్లారిటీ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం! ఇదేం విచిత్రం.. ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్డిన్లో పాకిస్థాన్ ఓపెన్ హైరింగ్!

తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల నేపథ్యంలో కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న నిర్మాత అశోక్‌కుమార్‌కు కోర్టులో ఊరట లభించింది. తెలుగు నిర్మాతలమండలికి (Telugu Film Producers Council) రెండేళ్లకు ఓ సారి జరిగే ఎన్నికలు ఈ ఏడాది ఈ నెల 6న జరుగనున్నాయి. ఇందులో అధ్యక్ష పదవి కోసం సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ (C Kalyan), మరో నిర్మాత బండ్ల గణేశ్ మొదట పోటీ పడ్డారు. చివరి క్షణంలో బండ్ల గణేశ్ (Bandla Ganesh) పోటీ నుంచి తప్పుకోవడంతో సి.కల్యాణ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇక కార్యదర్శి పదవికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి పోటీ పడుతున్న అశోక్‌కుమార్ (Ashok Kumar) నామినేషన్‌ను తిరస్కరించడంతో ఆయన న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న తర్వాత ఆయన నామినేషన్‌ను స్వీకరించి, ఎన్నికల ప్రక్రియలో కొనసాగేలా చూడమని ఎన్నికల అధికారికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అశోక్‌కుమార్ వెల్లడిస్తూ ‘ఇది నా వ్యక్తిగత విజయం కాదు.. నిజాయితీ, పారదర్శకత, నమ్మకం, ప్రతి సభ్యుడి ఎన్నికల హక్కుకు సంబంధించిన విషయం’ అని చెప్పారు

Srikakulam Corporation : శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు గ్రహణం పట్టుకుంది. 2005 వరకు సిక్కోలులో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి 2010తో మున్సిపల్ కౌన్సిల్ సమయం ముగిసిన నాటినుండి నేటి వరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగలేదు. 2015లో టీడీపీ హయాంలో ఏడు పంచాయతీలను శ్రీకాకుళం మున్సిపాలిటీలో కలిపి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. విలీనాన్ని వ్యతిరేకించిన పంచాయతీ గ్రామాల ప్రజలు కోర్టు మెట్లక్కడంతో.. సిక్కోలు కార్పొరేషన్‌కు పాలకులు లేకుండా పోయారు. 2005 ఎన్నికల తర్వాత దాదాపు 20 ఏళ్లకు పైగా ఎన్నికలు జరగకపోవడం 15 ఏళ్లుగా పాలకులు లేకపోవడం సిక్కోలు నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తుల ప్రారంభించడంతో శ్రీకాకుళం జిల్లా కేంద్ర వాసులకు కూడా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈసారి అయినా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధి బాటపడుతుందని కోటి ఆశలతో ఉన్నారు సిక్కోలు నగరవాసులు. శ్రీకాకుళం పట్టణంలో ఇప్పటికీ చాలారోడ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఇక డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు డ్రైనేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం కూడా మధ్యలోనే ఆగిపోవడంతో మురుగునీరు అంతా నాగావళి నదిలో కలుస్తుంది. దీంతో నాగవళి నది అంతా కాలుష్యంతో నిండిపోయింది. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే కార్పొరేషన్‌కు పాలకవర్గం ఉంటేనే ప్రజల కోసం సరైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు సిక్కోలు వాసులు. ఓ వైపు ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం ముంచుకొస్తుండటం.. మరోవైపు కోర్టు కేసులు ఇంకా తేలకపోవడంతో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదోనన్న డైలమా కొనసాగుతోంది. సిక్కోలు కార్పొరేషన్ ఎన్నికలకు ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందో లేదోనని..అధికార ప్రతిపక్ష నేతలు అంతా మల్ల గుల్లాలు పడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోర్టు కేసులను వీలైనంత త్వరగా క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ నేతలు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana SIR: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు సాగిన సర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ, ఫిర్యాదులు తదితర అంశాలపై ప్రకటన విడుదల చేసింది. సర్‌కు సంబంధించి ప్రత్యేక ప్రచారం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను 17.08.2026న ఆయా ఈఆర్ఓ కార్యాలయాల్లో ప్రచురించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితాతో పాటు ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాలను సీఈఓ తెలంగాణ వెబ్సైట్ ( అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ముఖ్య వివరాలు, గడువులు క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు: ఆగస్టు 17 నుంచి ఈనెల 16వ తేదీ వరకు నోటీసుల జారీ, పరిష్కారం: 17.08.2026 నుండి 15.10.2026 వరకు ప్రత్యేక ప్రచార (స్పెషల్ క్యాంపెయిన్) తేదీలు - మొదటి విడత: ఈనెల 5 నుంచి 6వ తేదీ వరకు - రెండో విడత: ఈనెల 12వ తేదీ నుంచి 13 వరకు ప్రస్తుత పురోగతి మొత్తం 92,88,112 నోటీసులు రూపొందించగా 31,74,952 నోటీసులు అందాయి. 1,94,737 నోటీసులపై విచారణ పూర్తయింది. మిగిలిన నోటీసులను 119 మంది ఈఆర్ఓలు, 1,973 మంది ఏఈఆర్ఓల ద్వారా గడువులోగా విచారించనున్నారు. మొత్తం క్లెయిమ్‌లు, అభ్యంతరాలు: 9,07,292 - ఫారం-6 (కొత్త ఓటరు): 3,94,517 - ఫారం-6ఏ (ప్రవాస భారతీయులు): 6,346 - ఫారం-7 (పేర్ల తొలగింపు): 48,752

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువును రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెంచింది. ఈ నెల 10 వరకు సర్ గడువు ఉంటుందని తెలిపింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది. భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని అన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ‘‘వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలి. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలి. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల మధ్యే ఉండాలి... వారి సమస్యలపై పోరాడాలి... వైఎస్సార్సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తుచేయాలి. అలా చేస్తే స్థానిక

పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం నెలకొంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు వరుస ఓటములు ఆ జట్టులో ముసలం పుట్టించింది. టెస్టు సిరీస్‌లో పాక్ వరుస ఓటముల కారణంగా పీసీబీ (PCB) జట్టులో భారీ మార్పులు చేసింది. అయితే సెలెక్టర్లతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ప్లేయర్లను తొలగించడం, కోచింగ్ స్టాప్‌ను మార్చడం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన పాకిస్తాన్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతేకాదు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మిస్బా ప్రకటించాడు. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదు. అసలేం జరిగింది? లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్థాన్ జట్టులో పీసీబీ భారీ మార్పులు చేసింది. సెలక్టర్లను సంప్రదించకుండానే టెస్టు జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. టెస్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను కూడా వారి పదవుల నుంచి తొలగించినట్లు సమాచారం. మూడో టెస్టుకు ముందు వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హసన్, బౌలింగ్ కోచ్ ఆష్లే నాఫ్కే టెస్టు కోచింగ్ సిబ్బందిలో చేరారు. పాక్ జట్టు నుంచి విడుదలైన ఆటగాళ్లలో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్ ఉన్నారు. వీరి స్థానంలో సయీమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్‌తో పాటు కేవలం 10 మ్యాచ్‌ల ఉమ్మడి అనుభవం ఉన్న ఐదుగురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చింది. జట్టులోకి వచ్చిన ఐదుగురు కొత్త ఆటగాళ్లు: అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్ రంధావా, రజావుల్లా. 2019లో పాకిస్తాన్ హెడ్‌కోచ్ పదవి పాకిస్తాన్ అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా పేరు పొందిన మిస్బా ఉల్ హక్ వీడ్కోలు అనంతరం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అతిపెద్ద కీలక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని 13,278 గ్రామపంచాయతీల పరిధిలోని 1,33,128 వార్డులకు గాను మొత్తం 1,36,326 పోలింగ్ స్టేషన్లతో తుది జాబితాను అధికారికంగా విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో ఈ ప్రక్రియను పూర్తయినట్లు స్పష్టం చేశారు. స్థానిక పోరుకు సంబంధించి అత్యంత ముఖ్యమైన పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ తుది జాబితా రూపకల్పన వెనుక ఒక స్పష్టమైన టైమ్‌లైన్ మరియు నిబంధనావళిని ఎన్నికల సంఘం పక్కాగా అమలు చేసింది. ఆగస్టు 12న సర్క్యులర్ జారీతో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆగస్టు 23న డ్రాఫ్ట్ జాబితా వెలువడింది. ఆగస్టు 26 వరకు అందిన అభ్యంతరాలు మరియు సూచనలను పరిశీలించిన తర్వాతే ఈ సెప్టెంబర్ 1న తుది జాబితా ఖరారైంది. ప్రతి వార్డుకు కనీసం ఒక కేంద్రం ఉండేలా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు స్టేషన్లను సైతం అధికారులు సిద్ధం చేశారు. 2021లో ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం 2026 ఏప్రిల్‌తో ముగియడంతో రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా మారింది. దీంతో కొన్ని చోట్ల ఉన్న కోర్టు కేసులు, సరిహద్దుల మార్పులు, పట్టణ పరిధుల విస్తరణ లాంటి అడ్డంకులను దాటుకుంటూ ఈసీ వేగంగా చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేతా కలెక్టర్లు మరియు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరుగులు తీస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ప్రకటనతో ఇక నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. రాజకీయంగా కూడా స్థానిక పోరు వేడి తీవ్రస్థాయికి చేరింది. ఫలితంగా అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తుండగా, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్ని స్థానాల్లో పోటీకి కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ

BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్‌ను మరో ఏడాది పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డులోని ఓ వర్గం ఆయనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుత కాంట్రాక్ట్ 2026 సెప్టెంబర్‌లో ముగియనుంది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనను కొనసాగించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అగార్కర్‌కు మరో ఏడాది గడువు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం సమావేశం అనంతరం తీసుకోనున్నారు. అంతేకాదు.. ఈ బాధ్యతను కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అగార్కర్ అభిప్రాయం కూడా కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! 2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి కొన్ని అద్భుత విజయాలు సాధించింది. భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్లో జట్టు విజయాల్లో సెలక్షన్ కమిటీ పాత్రపై ప్రశంసలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సెలక్షన్ కమిటీలో

వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కోర్టుల్లో కేసులు వేసినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరుతాయని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నిబంధనలు, న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఇప్పటికే రూ. 3,300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని చూసి తట్టుకోలేక ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు కోర్టులను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని దయనీయ స్థితిలో ఆ పార్టీ ఉందన్న ఆయన... అందుకే రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదని జగన్ తన నేతలకు హుకుం జారీ చేశారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, వెలిగొండ ప్రాజెక్టుల క్రెడిట్ తమదేనని వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తోందని వివరించారు. నెల్లూరు నగరంలో కాలువల కట్టలపై ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలు మంజూరు చేసే అంశంపై త్వరలోనే ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని హామీ ఇచ్చారు

ఏపీలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే.. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ నేతృత్వంలోని అధికార కూటమి 20 స్థానాల్లో జయభేరి మోగించనుందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఏపీలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే.. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ నేతృత్వంలోని అధికార కూటమి 20 స్థానాల్లో జయభేరి మోగించనుందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. అయితే కూటమి 20 సీట్లు గెలుచుకున్నప్పటికీ వీటిలో బీజేపీ 3నుంచి 1 స్థానానికి పడిపోనుందని సర్వే పేర్కొంది. టీడీపీ, జనసేన తమ సంఖ్యా బలాన్ని 18 నుంచి 19 సీట్లకు పెంచుకుంటాయని తెలిపింది

బీసీ రిజర్వేషన్లు (BC reservations), ఓటర్ల జాబితాపై కేసులు వేస్తుండటంపై మంత్రి కొల్లు రవీంద్ర ( Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ( Jagan) ఎన్ని కుట్రుల పన్నినా స్థానిక సంస్థల ఎన్నికలు (local body Elections) ఆగవన్నారు. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు. ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికల విషయంలో జగన్‌ది ద్వంద్వ వైఖరి అని దుయ్యబట్టారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని కుట్రలు చేసినా తమను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి ప్రజలకు అంకింతం చేస్తామన్నారు

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుందన్నారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో పోటీచేసే అవకాశాలపై మాట్లాడిన అగ్రరాజ్య అధ్యక్షుడు.. ఆ విషయమై ఇప్పుడే చర్చ అక్కర్లేదని సమాధానాన్ని దాటవేశారు. 'హెగ్సెత్ అద్భుతంగా పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుంది. ముందుగా నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలను పూర్తి చేయాలి' అని ట్రంప్ అన్నారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా రెండు పర్యాయాలు మాత్రమే కొనసాగే అవకాశమున్న ట్రంప్.. 2029లో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. దీంతో ఆయన 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' ఉద్యమాన్ని ముందుకు నడిపించే తదుపరి నేత ఎవరన్న దానిపై రిపబ్లికన్ పార్టీలో చర్చ జోరందుకుంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నా.. తాజాగా ఆ లిస్ట్‌లో హెగ్సెత్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఐయోవా స్టేట్ ఫెయిర్‌లో రిపబ్లికన్ల తరఫున హెగ్సెత్ ప్రచారం చేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్టైంది. అయితే ఈ వార్తలను హెగ్సెత్ ఖండించారు. అవి '100 శాతం అవాస్తవం' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారాయన. హెగ్సెత్ గతంలో ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేశారు. అనంతరం ఫాక్స్ న్యూస్ ఛానల్లో టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన రాజకీయ భవితవ్యంపై ట్రంప్ మరింత ఆసక్తికరంగా స్పందించారు. 'ప్రస్తుతం ఆయనకు సైన్యం, సైనికుల సంక్షేమం తప్ప మరేదీ ముఖ్యం కాదు' అని వ్యాఖ్యానించారు. మరోవైపు 2028 అధ్యక్ష ఎన్నికల కోసం పలువురు నేతలు

బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువు పెంపు సెప్టెంబర్ 30 వరకు సమయం పెంపు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు అత్యంత కీలకం BC Dedicated Commission: ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక-ఆర్థిక పరిస్థితులపై కీలక అధ్యయనం చేస్తున్న బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కమిషన్ (BC Dedicated Commission)పరిమితి గడువును పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు ద్వారా కమిషన్ తన సమగ్ర విచారణను, నివేదిక తయారీ ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేందుకు మరింత సమయం లభించినట్లయింది. Cheyutha Pension: ‘చేయూత పెన్షన్ల’ లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్.. దరఖాస్తు గడువు పెంపు రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం: బీసీ సంక్షేమ శాఖ ఈ గడువు పెంపునకు సంబంధించి అధికారికంగా 'జీవో ఎంఎస్ నంబర్ -11'ను విడుదల చేసింది. నూతన ఉత్తర్వుల ప్రకారం కమిషన్ కాలపరిమితిని ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కొనసాగుతున్న ఈ కమిషన్, రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతో పాటు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లలో బీసీల ప్రాతినిధ్యంపై క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం జరుపుతోంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు ఈ నివేదికే కీలకం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం, సమగ్ర రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఈ కమిషన్ అందించే సిఫార్సులే అత్యంత కీలకం కానున్నాయి. వివిధ ప్రాంతాల్లో సేకరించిన సమాచారం, రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా కమిషన్ సమర్పించే నివేదికను బట్టే ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన, రాజకీయ నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకున్న గడువు పొడిగింపు నిర్ణయం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది

Kothagudem: ఎమ్మెల్సీ బరిలో గడల శ్రీనివాసరావు? జనసేనలో ఆసక్తికర చర్చ! భద్రాద్రి కొత్తగూడెం: జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గడల శ్రీనివాసరావు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఖమ్మం-వరంగల్-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడానికి గడల సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై తన పోరాటాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పట్టభద్రులు, యువత, విద్యార్థుల సమస్యలను శాసనమండలి వేదికగా ప్రస్తావించేందుకు అవకాశం కల్పిస్తే ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. అయితే గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం జనసేన పార్టీ అధిష్టానం తీసుకోవాల్సి ఉంది. పార్టీ నాయకత్వం నిర్ణయం ప్రకటించిన అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది

తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు వేడెక్కబోతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున ఈసారి అధ్యక్షుడిగా బండ్ల గణేశ్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సి. కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు నిర్మాతల మండలిలో ఎన్నికల శంఖారావం మ్రోగింది. గత కొంతకాలంగా ఈ అసోసియేషన్ ఎన్నికలు జరపాలని పలువురు నిర్మాతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరబోతోంది. సెప్టెంబర్ 6న ఎన్నికలను నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజేతలను ప్రకటిస్తారు. అయితే ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఆగస్ట్ 17 నుంచి నిర్మాతల మండలి ఎన్నికలకు నామినేషన్స్ ను స్వీకరిస్తున్నారు. ఇది 24వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజులు విత్ డ్రాస్ కోసం గడువు ఇచ్చి, 28న తుది జాబితాను ప్రకటిస్తారు. వీరందరికీ సెప్టెంబర్ 6న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎన్నికలు జరుగుతాయి. ఇదే రోజు సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తారు. తెలుగు నిర్మాతల మండలికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో పాటు చిన్న నిర్మాతలకు మధ్య హోరాహోరీ పోరు సాగుతూ ఉంటుంది. తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి ఈసారి అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సి. కళ్యాణ్ పోటీ పడుతున్నారు. సి. కళ్యాణ్ ప్యానల్ నుంచి కార్యదర్శులుగా తుమ్మలపల్లి ప్రసన్న కుమార్, వైవియస్ చౌదరి పోటీ చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీస్ గా అమ్మిరాజు, రామసత్యనారాయణ బరిలో నిలుస్తున్నారు. ట్రెజరర్‌గా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు పోటీ చేస్తున్నారు. కాగా... యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కు చెందిన బండ్ల గణేశ్ ప్యానల్ నుంచి ఏ పదవికి ఎవరెవరు పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా కలసి బండ్ల గణేశ్‌ను ఈసారి అధ్యక్ష పదవికి బరిలో దించడం

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ ఇంచార్జ్‌లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే నాలుగైదు రోజులు అత్యంత కీలకమని, అర్హులైన ఓట్లు తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల సూచించారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటును పరిశీలించాలని, డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై అభ్యంతరాలు దాఖలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా అవసరమైన ఫారాలను సమర్పించి వారి ఓట్లను కొనసాగించేలా చూడాలని స్పష్టం చేశారు. 44 లక్షల నోటీసుల అంశంపైనా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాలని సజ్జల పార్టీ నేతలకు సూచించారు. అర్హులైన ఓటర్లకు సంబంధించిన అంశాల్లో అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని, చిరునామా మార్పులు, ఇతర ఓటరు వివరాల సవరణలకు అవసరమైన ఫారాలను కూడా దాఖలు చేయాలని చెప్పారు.. అభ్యంతరాలు లేదా దరఖాస్తులు సమర్పించిన ప్రతిసారీ సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సజ్జల సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం రసీదులు, సంబంధిత పత్రాలను భద్రపరచుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలకు సంబంధించిన ప్రధాన ప్రక్రియను ఆగస్టు 27, 28 తేదీల నాటికి పూర్తి చేయాలని సజ్జల ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రాంతానికి బయట ఉన్న ఓటర్ల వివరాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వ్యవహారంలో

Minister Narayana: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాతావరణం వచ్చినట్టే కనిపిస్తోంది.. ఎన్నికల ప్రక్రియకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. మరోవైపు.. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ.. స్థానిక సంస్థల్లో వాటిని అమలు చేసేలా కూడా నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, ఈ సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోర్టు తీర్పుపై ఆధారపడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలపై కోర్టు తీర్పు రావాల్సి ఉందని, తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నీటి సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనలపై కూడా మంత్రి నారాయణ స్పందించారు. డేటా సెంటర్ల కారణంగా విశాఖలో నీటి సమస్యలు రావని స్పష్టం చేశారు. విశాఖ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఇక, భోగాపురం వెళ్లే రహదారి మరమ్మతులకు గురైనట్టు తన దృష్టికి రాలేదని మంత్రి నారాయణ అన్నారు. అయితే రహదారి పరిస్థితిపై పరిశీలన చేస్తామని చెప్పారు

Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి... వరుసగా రెండుసార్లు సీఎంగా చేశారు. ఇక ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్... ఆ పార్టీ సీఎం అభ్యర్థి కూడా ఆయనే అనేది పొలిటికల్ టాక్. అయితే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా సీఎం రేసులో ఉన్నారా? అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆమె తండ్రి, సోదరుడికి పొలిటికల్ గా దూరమయ్యారు... ఇటీవల కొత్త పార్టీ పెట్టారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు కలిసివచ్చేలా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పెట్టారు... దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో కవిత పలువురు ముఖ్యమంత్రులకు ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్న ఓ జ్యోతిషుడిని కలిశారు... ఇలా మరోసారి వార్తల్లో నిలిచారు కవిత. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రముఖ జ్యోతిషులు రాధన్ పండిట్ వేత్రివేల్తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి రాధన్ పండిత్ విచ్చేశారు... ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో పొలిటికల్ గా ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత, రాధన్ పండిత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రాధన్ పండిట్ ప్రముఖ రాజకీయ జ్యోతిషులు. ఆయన చూసే జాతకాలు, చెప్పే జోస్యాలు కరెక్ట్‌గా జరుగుతాయని చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు నమ్ముతారు. దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు ఈయనే ఆధ్యాత్మిక, జ్యోతిష సలహాదారు. వేద జ్యోతిషం, న్యూమరాలజీలో ఆయనకు ఏకంగా నలభై ఏళ్లకు పైగా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఈ సమావేశానికి ముందు వందేమాతరం గీతంలోని ఆరు చరణాలనూ నేతలంతా ఆలపించారు. అనంతరం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమైంది. ప్రజా జీవితంలో ప్రధాని మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కార్యాచరణపైనా చర్చ జరగనుంది. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం వరకు సాగిన ప్రయాణాన్ని ప్రజలకు వివరించడంపై చర్చించనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. మరోవైపు, నితిన్ నబీన్ కొత్త టీమ్‌లో అనుభవం, యువ నాయకత్వం, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించారు. దీంతో స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, బిప్లబ్ దేవ్, సునీల్ బన్సల్ తదితరులకు కీలక బాధ్యతలు దక్కాయి. నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అమరావతి, ఆగస్టు 22: 2024 సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. హత్యలు, దాడులనే నమ్ముకుని పాలిటిక్స్ చేస్తోందని వినిపిస్తోంది

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. దీనిపై ఇప్పటికే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించాయి. పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై మంతనాలు సాగించాయి.అటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 నియోజకవర్గాలకే పరిమితమైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును నిలుపుకోవడం, అదే స్థాయిలో స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల్లో స్థానిక సంస్థలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అదే స్థాయిలో పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.ఇందులో భాగంగా.. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన ఓ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 175 నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జ్లు, కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం దీనికి వేదిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.చిక్కుల్లో పడ్డ నెతన్యాహు: రెడ్ నోటీస్స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీ శ్రేణులను కిందిస్థాయి నుంచి సిద్ధం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జగన్ ఇన్ఛార్జ్లకు స్పష్టత ఇవ్వనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ధీటుగా స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు.హైదరాబాద్ లో జగన్ కు గ్రాండ్ వెల్కమ్: అదే హైలైట్ఈ కీలక భేటీలో నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా పనిచేసేలా క్యాడర్లో భరోసా నింపనున్నారు. అధికార కూటమి ప్రజావ్యతిరేక విధానాలపై

ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. కుల్దీప్ యాదవ్‌ను పూర్తిగా నమ్మడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపాడు. ప్రస్తుతం అశ్విన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. తొలి టెస్టులో కుల్దీప్ 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న గాలే పిచ్‌పై కూడా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే కుల్దీప్కు తగినంత బౌలింగ్ అవకాశాలు ఇవ్వకపోవడమే అతడి వైఫల్యానికి కారణమని అశ్విన్ పేర్కొన్నాడు. ‘జడేజా ఒక వైపు, సుతార్ మరోవైపు వికెట్లు తీస్తున్నారని అందరూ ప్రశ్నిస్తారు. కానీ కుల్దీప్ మూడో స్పిన్నర్. నేను, జడేజా ఆడుతున్నప్పుడు కూడా అతడు మూడో స్పిన్నర్‌గానే ఉండేవాడు. ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదు. 11 మంది ఉన్న జట్టులో మూడో లేదా నాలుగో స్పిన్నర్‌గా ఉండటం అంత సులభం కాదు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ‘కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు కుల్దీప్ యాదవ్ ప్రాధాన్యత కలిగిన బౌలర్ కాకపోవచ్చు. కుల్దీప్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతడు తన నైపుణ్యాన్ని కోల్పోయాడా? అంటే అస్సలు కాదు. చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా అతడిని సరిగ్గా ఉపయోగించలేదు. ఇది ఆటగాడి తప్పు కాదు. ఇది ప్లేయర్‌పై మేనేజ్మెంట్కు నమ్మకం లేదనడానికి ఒక సంకేతం. అతడికి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. అక్టోబర్‌లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనతో గ్రామాలు, పట్టణాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియగా, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలకు సంబంధించిన కాలపరిమితి కూడా పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ముందుగా పట్టణ ప్రాంతాల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో మేయర్లు, చైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాలని నిర్ణయించడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇప్పటివరకు ఉన్న పరోక్ష విధానంతో పోలిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్ల మద్దతు కూడగట్టడం కంటే ప్రజల్లో వ్యక్తిగతంగా బలమైన గుర్తింపు, స్థానిక సమస్యలపై అవగాహన, పార్టీకి ఉన్న ఆదరణ కీలకంగా మారుతుంది. ఈ మార్పు అధికార కూటమికి మాత్రమే కాకుండా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)కి కూడా రాజకీయంగా పరీక్షగా మారనుంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక ఎన్నికల్లో కొంత అనుకూలత ఉంటుందని గత అనుభవాలు సూచిస్తున్నాయి. అయితే ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలైతే స్థానిక నాయకుల వ్యక్తిగత ప్రభావం కూడా ఫలితాలను నిర్ణయించే అంశంగా మారుతుంది. దీంతో ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండే నాయకులకు అవకాశాలు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీలు కలిపి సుమారు 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఎన్నికలను ప్రతిపక్షం సమర్థవంతంగా వినియోగించుకుంటే రాజకీయంగా మంచి ఫలితం సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విశాఖపట్నం (Visakhapatnam), విజయవాడ (Vijayawada), రాజమహేంద్రవరం (Rajamahendravaram), తిరుపతి (Tirupati), కర్నూలు (Kurnool), కడప (Kadapa) వంటి ప్రధాన

హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్‌లో 1,816 మంది అధికంగా మహిళలు హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది. సుమారు నాలుగు లక్షలకు పై చిలుకు ఉన్న ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. సుమారు 44.19 శాతం ఓట్లు జాబితా నుంచి కనుమరుగు కావడంతో వాటిలో కొన్ని ఓట్లైనా తిరిగి రాబట్టుకునేలా కార్యచరణ చేసుకునేందుకు రాజకీయ శిబిరాలు ప్రయత్నాలు ఆరంభించాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ జాబితాను ఇటీవల ప్రచురించింది. దీని ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1.79 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. అత్యధిక ఓట్లు తొలగించబడిన నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ మూడోస్థానంలో నిలిచింది. పేరుకు జూబ్లీహిల్స్ అయినప్పటికీ నియోజకవర్గంలో బస్తీలు అత్యధికంగా ఉన్నాయి. మాస్ ఓటర్ల సంఖ్యే ఎక్కువ. ప్రతీ యేట ఇక్కడ ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో సుమారు 79 వేల ఓటర్లు పెరిగారు. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలస వచ్చిన వారే అధికంగా ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రకారం ఒకరికి ఒకే ఓటు అని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మెజారిటీ ఓటర్లు పుట్టిన ఊర్లో ఓటు ఉంచుకునేందుకు మొగ్గు చూపించారు. దీంతో ఓటు శాతం గణనీయంగా తగ్గింది. ఏకంగా 1.48 లక్షల మంది తమ ఓటును నియోజకవర్గం నుంచి వేరే చోటకు పెట్టుకున్నట్టు షిఫ్టింగ్ జాబితా ప్రకారం తెలుస్తోంది. అంతేగాకుండా ఇక్కడ హాస్టళ్లు కూడా ఎక్కువ ఉండడంతో చాలామంది స్థానిక చిరునామా కోసం ఓటరు కార్డులు చేయించుకున్నారు. ఇవి కూడా ఇప్పుడు తరలి పోయాయని లెక్కలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,219. ఇక్కడ పురుషుల కంటే మహిళలే 1,816 మంది ఎక్కువగా ఉన్నారు. పురుషులు 1,12,697 మంది ఉండగా, మహిళలు 1,14,513 మంది

సీనియర్లు, జూనియర్లు ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డికి నోటీసులు ఇచ్చాం.. 22-ఏపై బీఆర్ఎస్ది అనవసర రాద్ధాంతం: మహేశ్ గౌడ్ నిజామాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీనియర్లు, జూనియర్లు ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వాఖ్యలు బాధాకరమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఆమె వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సైతం అలా మాట్లాడి ఉండకూడదని.. ఎలాంటి పరిస్థితిలో అలా మాట్లాడారో వివరణ కోరామన్నారు. అభ్యర్థులం తామేనని ఎవరు ప్రకటించుకున్నా చెల్లదని, అభ్యర్థుల ఎంపికకు పార్టీలో ఓ విధానం ఉంటుందని.. ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. 22-ఏ విషయంలో బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు

సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 17న ఓటర్ల ముసాయిదా జాబితాలను విడుదల చేశారు. భద్రాద్రి జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాలో దొర్లిన తప్పులు కొత్తగూడెం కలెక్టరేట్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 17న ఓటర్ల ముసాయిదా జాబితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ డివిజన్లో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సోనియానగర్కు చెందిన మాలోత్ అరుణ 1992లో జన్మించగా.. ఆమె ప్రస్తుత వయసు 34 సంవత్సరాలు. కానీ ముసాయిదాలో మాత్రం 100 ఏళ్లుగా నమోదు చేశారు. ఇదే కాలనీకి చెందిన మాలోత్ రమేష్ 1991లో జన్మించగా ఆయన వయసు 35 ఏళ్లు. కానీ 99గా నమోదు చేశారు. వీరిద్దరూ పోలింగ్ స్టేషన్ నం. 45 శేఖరం బంజర యూపీఎస్సీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ విషయం గురువారం వెలుగులోకి రావడంతో ఓటర్లు ముసాయిదా జాబితాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ జాబితాలో పేరు, చిరునామా, వయస్సు లాంటి వివరాలను సవరించుకోవడానికి ఫారం-8ను ఉపయోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు పార్టీలు సమన్వయంతో సీట్ల పంపకాల పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇదే సమయంలో అటు వైసీపీ సైతం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అక్టోబర్ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. సీట్ల సర్దుబాటు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ స్థానిక ఎన్నికల పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.ఏపీలో ఇప్పుడు స్థానిక ఎన్నికల రాజకీయం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పైన జనసేన నుంచి ఈ సారి వాయిస్ బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల ఫార్ములా ఇప్పుడు ఈ ఎన్నికలకు వర్తించదని పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. తమకు బలం ఉన్న చోట్ల పోటీ చేసి తీరుతామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో, కూటమి లోని మూడు పార్టీల అధినేత లు కలిసి కూర్చొని సీట్ల పంపకాల పైన మాట్లాడుకుందామని చంద్రబాబు సూచించారు. కాగా.. ఇక, ఇప్పుడు జనసేన నుంచి సీట్ల పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ అసెంబ్లీలోని జనసేన కార్యాలయ ప్రాగణంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికల పైన చర్చించారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. ఇదే సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!పవన్ సంకేతాల వెనుకసమావేశం తరువాత పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో..జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం.. అని పవన్ స్పష్టం చేసారు. ఇందులో ప్రత్యేకంగా జనసైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా అని చెప్పటం ద్వారా సీట్ల

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. విశాఖపట్నం, ఆగస్టు 20: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. ఈరోజు(గురువారం) విశాఖ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎంపీ తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో మంచి ప్రతిపక్షం లేదని... ప్రతిపక్షంలో ఉన్నవారికి వారి పాత్ర అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చారు. ఎల్‌నినో వలన నీటి సమస్య తలెత్తుతోందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని డేటా సెంటర్ల వలన నీటి సమస్య వస్తోందని కొన్ని శక్తులు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. డేటా సెంటర్లు రావడానికి ఇంకా రెండు సంవత్సరాలు సమయం పడుతుందని తెలిపారు. వర్షాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. పోలవరం నీటిని విశాఖకు తీసుకువస్తున్నారని, నదులన్నీ అనుసంధానం అయిన తర్వాత దక్షిణ భారతదేశంలో నీటి సమస్య తగ్గుతుందని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. ఏపీలో మిలాద్-ఉన్-నబి సెలవు తేదీ మార్పు.. ఎస్సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక

సాక్షి, హైదరాబాద్: ఓటరు ముసాయిదా జాబితా విడుదలైంది. అందులో చాలామంది తమ పేర్లు కనిపించడం లేవంటున్నారు. ముసాయిదాలో పేర్లున్నా, చాలామందికి నోటీసులు వస్తాయని, వాటికి వివరణ ఇస్తేనే తుది జాబితాలో పేరుంటుందని, లేని పక్షంలో ఉండదని చెబుతున్నారు. ముసాయిదాలో పేర్లున్న వారు తమ పేరు, ఎపిక్నెంబరు, వయసు, చిరునామా, పోలింగ్ కేంద్రం తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకుంటే మంచిది. పొరపాట్లు దొర్లితే సవరణకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏఎస్డీ/అన్ కలెక్టబుల్ అంటే.. ఏఎస్డీ, అన్ కలెక్టబుల్గా, డూప్లికేట్లుగా పేర్కొంటూ హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19,41,444 మంది పేర్లు తొలగించారు. ఇళ్లలో లేనివారు, చిరునామా మారిన వారు, మరణించిన వారిని సంక్షిప్తంగా ఏఎస్డీగా చెబుతున్నారు. ఒక చోటు కంటే ఎక్కువ చోట్ల ఓట్లున్నవారిని డూప్లికేట్లుగా పేర్కొంటున్నారు. అలాంటి వారికి ఒక్కచోట మాత్రం ఉంచి మిగతా చోట్ల తొలగించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరి పేరైనా పొరపాటున తొలగించి ఉంటే, వారు మళ్లీ తాజాగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి. నో మ్యాపింగ్, అనామలీస్ అంటే.. ఏమిటో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాలో నో మ్యాపింగ్ కేటగిరీలో 5.80 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫారంలో అడిగిన 2002 ఓటర్ల జాబితా(గత ‘సర్’)లోని స్వీయ లేదా రక్తసంబం«దీకుల వివరాలు భర్తీ చేయని వారిని నో మ్యాపింగ్ కేటగిరీలో చేర్చారు. ఈ వివరాలను భర్తీ చేసినప్పటికీ, అవి వాస్తవ విరుద్ధంగా, అసంగతంగా ఉన్న వాటిని అనామలీస్‌గా అధికారులు తెలిపారు. అంటే తోబుట్టువుల మధ్య వయసు తేడా 9 నెలల కంటే తక్కువగా ఉండటం, తల్లిదండ్రులు– సంతానం మధ్య వయసు తేడా 50 ఏళ్లకన్నా ఎక్కువ ఉండటం, పాత సర్ జాబితాలో తల్లిదండ్రుల పేర్లకు, ఇప్పుడు పేర్కొన్న పేర్లకు మధ్య తేడాలుండటం, తల్లిదండ్రులు– సంతానం మధ్య వ్యత్యాసం 15 ఏళ్లకన్నా తక్కువ ఉండటం, గతంలో భర్త పేరు పేర్కొన్న

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. అయితే, ఈ గెలుపు ఉత్సాహంలో ఉన్నప్పటికీ, జట్టు కూర్పుపై యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్.. కొలంబోలో జరగబోయే రెండో టెస్టుకు జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో కుల్దీప్ యాదవ్ తేలిపోయాడు. 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ వంటి ఇతర లెఫ్టార్మ్ స్పిన్నర్లు అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో, కుల్దీప్ను పక్కనపెట్టి, అతడి స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సరాన్ష్ జైన్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం.తొలి టెస్టులో భారత్ ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లతో (జడేజా, సుతార్, కుల్దీప్) బరిలోకి దిగింది. అయితే శ్రీలంక జట్టులో ఉన్న ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడానికి ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఉంటే జట్టుకు వైవిధ్యం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే సరాన్ష్ జైన్‌ను సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇప్పుడు అతడిని తుది జట్టులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.అయితే, ఈ మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ దీనిపై స్పందిస్తూ

సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించేందుకు నిర్వహిస్తున్న 'అగ్నిపరీక్ష' కార్యక్రమంలో అతిగా జరుగుతోంది. బిగ్ బాస్‌లోకి వెళ్లడం ఏమో గానీ, అంతకంటే ముందే అగ్నిపరీక్ష షోలోనే కంటెస్టెంట్లకు అసలైన టార్చర్ చూపిస్తున్నారు. సెలబ్రిటీలు నేరుగా బిగ్ బాస్‌లోకి వచ్చి తమను తాము నిరూపించుకోవడానికి టాస్క్‌లు ఆడతారు. కానీ సామాన్యులు మాత్రం అంతకంటే కఠినమైన టాస్క్‌లను ఇక్కడే ఎదుర్కోవాల్సి వస్తోంది.అగ్నిపరీక్ష సీజన్ 2లో సెకండ్ రౌండ్ ప్రారంభమైంది. 18 మంది కంటెండర్లను కంటెస్టెంట్లుగా మార్చడానికే ఇంత టార్చర్ చూపిస్తే, ఇక హౌస్ లోపల ట్రోఫీ కోసం వీరు ఇంకెంత పెద్ద యుద్ధం చేయాలో! మొత్తానికి అగ్నిపరీక్ష 2లో రెండో రౌండ్ ఒక చెత్త టాస్క్‌తో మొదలైంది. వారం రోజులు కుళ్లబెట్టిన చెత్త కంపును భరిస్తూ.. లాక్ ఓపెన్ చేసే కీ కోసం వెతకాలి. లాక్ తెరిచిన తర్వాత అందులో ఉన్న జ్యూస్‌ను పూర్తిగా తాగితేనే ఆ టాస్క్ పూర్తవుతుంది. ఈ టాస్క్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చినప్పటికీ, ఆఖరిగా అమన్, షాలినీ పోటీ పడ్డారు. ఇద్దరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ, చాలా చిన్న తేడాతో షాలినీ గెలిచి కంటెస్టెంట్‌గా మారింది. అమన్ చేసిన ప్రయత్నానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇక రెండో రౌండ్లో రెండో టాస్క్.. బ్రేకప్ లవ్ స్టోరీ. ముందుగా లవ్ స్టోరీస్ గురించి యాంకర్ శ్రీముఖి అడగ్గా ఎవరూ స్పందించలేదు. కానీ బ్రేకప్ లవ్ స్టోరీస్ గురించి అడిగినప్పుడు మాత్రం అందరూ స్పందించారు. తమ ఎక్స్ లవర్‌కి ఫోన్ చేసి, మళ్లీ వారిని ప్రేమలోకి దింపిన వారిని 'డేరింగ్ పర్సన్'గా గుర్తించి కంటెస్టెంట్‌గా ప్రమోషన్ ఇస్తారు. ఈ టాస్క్ కోసం నలుగురు సిద్ధమవ్వగా, శివ సృష్టికి ఆ అవకాశం దక్కింది. ఆమె తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కి ఫోన్ చేయగా అతను తీవ్రంగా షాక్ అయ్యాడు. చివరికి అనుకున్న టాస్క్‌ను పూర్తి చేసి శివ సృష్టి కంటెస్టెంట్ల లిస్ట్‌లోకి చేరిపోయింది. అగ్నిపరీక్షలో

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ప్రక్రియను బహిష్కరిస్తూ అధికార కూటమి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.మండలి ఛైర్మన్ మోషేనురాజు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టగానే, టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో వైసీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే మిగిలారు. వైసీపీ తరఫున మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఛైర్మన్ ప్రకటించారు.అనంతరం పలువురు సభ్యులు 'జై జగన్' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడిపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం వివాదాస్పదమైంది. అయితే, ఆ తర్వాత ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్‌ను కోరారు.కూటమి సభ్యుల వాకౌట్‌పై బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని, రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. రాజకీయాల్లో కక్షలు ఉండకూడదని, సభా గౌరవాన్ని కాపాడాలని హితవు పలికారు. ఎన్నిక ముగిసిన అనంతరం, నూతన డిప్యూటీ ఛైర్మన్ మాధవరావు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని 100 పురపాలక సంఘాలలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీలు) 33.33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పురపాలక శాఖ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలలో.. 100 చోట్ల త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.87 పురపాలక సంఘాల పదవీకాలం ఇప్పటికే పూర్తికాగా.. మరో 13 పురపాలక సంఘాల పదవీకాలం నవంబర్ నాటికి ముగియనుంది. కోర్టు కేసులు ఇతరత్రా న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా 23 పురపాలక సంఘాలలో ఎన్నికలు సాధ్యపడేలా కనిపించడం లేదు. మిగతా వంద చోట్లా త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి బీసీలకు మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ వంటి ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.మరోవైపు ఎన్నికల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు వేగవంతం చేసింది. అందులో భాగంగా బుధవారం రోజున రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కీలక వివరాలు వెల్లడించారు. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించామని, ఒక్కో ప్రక్రియ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో పూర్తిచేసి.. 16వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో

అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, ఆగస్టు 19: అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓలు, ఈఆర్ఓలతో సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని వారిని ఆదేశించారు. అనామలీస్, నో- మ్యాపింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. క్లెయిమ్స్, అభ్యంతరాలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణలు చేపట్టాలని తెలిపారు. ASDD జాబితాలోని కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని వారికి వివరించారు ఫారం 6, 6A, 7, 8పై క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం చేయ్యాలన్నారు. ఓటర్లకు నోటీసుల వివరాలు బీఎల్వోలు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నో- మ్యాపింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వారికి సీఈవో సుదర్శన్ రెడ్డి వివరించారు. కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్ తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్

ఏపీ మున్సిపల్ ఎన్నికల కసరత్తు బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు 123 స్థానిక సంస్థల్లో ఎన్నికలు Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ దిశగా సన్నాహక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు పరిపాలనాపరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పారదర్శకమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయడానికి అవసరమైన ముందస్తు చర్యలు, నిబంధనలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. CNG Cylinder Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. పేలిన సీఎన్జీ సిలిండర్.. ముగ్గురు దుర్మరణం! రిజర్వేషన్లు, స్థానిక సంస్థల గడువు: రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల్లో ఇప్పటికే పాలకవర్గాల పదవీకాలం పూర్తి కాగా, మరికొన్ని పట్టణ స్థానిక సంస్థల(Local Body Elections) గడువు కూడా త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో కీలకమైన ఘట్టంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల సమాచారం కోసం అధికారిక వనరులు: ఎన్నికల నిర్వహణ, ముసాయిదా ఓటర్ల జాబితా, నోటిఫికేషన్లు, ఇతర అధికారిక మార్గదర్శకాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని తెలుసుకోవడానికి ఓటర్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను లేదా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ పోర్టల్‌ను పరిశీలించవచ్చు. ఎన్నికల షెడ్యూల్, ఓటరు నమోదు సంబంధిత సేవల వివరాలను సంబంధిత అధికారిక వనరుల ద్వారా నేరుగా సరిచూసుకోవచ్చు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan Padayatra: మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర జరిగిన తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే (వైఎస్సార్సీపీ) విజయం అని పూర్తి విశ్వాసం ప్రకటించారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. 'అన్నింట్లో చంద్రబాబు విఫలమవడంతో వైఎస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి వైఎస్సార్సీపీ పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. స్థానిక యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కండి. గెలుపే లక్ష్యంగా పని చేయాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదు' అని తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనిపించకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి' అని పార్టీ శ్రేణులకు సూచించారు. మనకు అత్యంత ప్రజాదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఇసుక

ఏపీలో కీలకమైన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్ పర్సన్లను ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకునేందుకు మార్గం సుగమం అయింది. గతంలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని 2005లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి సర్కార్ దీన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు నిన్న కేబినెట్లో ఆమోదించిన బిల్లును ఇవాళ అసెంబ్లీలో (AP Assembly)ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో మున్సిపల్ చట్టంలో సవరణలు రానున్నాయి.మండలిలో వైసీపీకి హ్యాట్రిక్..! కూటమి మళ్లీ చేతులెత్తేసిందా ?1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని, 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని మంత్రి నారాయణ ఈ బిల్లుపై మాట్లాడుతూ వెల్లడించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి ఎన్నికైన మేయర్, చైర్మన్‌కు బలమైన ప్రజామోదం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల మేయర్ లేదా చైర్మన్‌పై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదన్నారు. తొలి రోజే మండలి డిప్యూటీ ఛైర్మన్ కు కూటమి షాక్..! బొత్స ఫైర్..!ప్రత్యక్ష ఎన్నికల విధానంతో మేయర్, చైర్మన్లు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు ఇది పనికొస్తుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. అభివృద్ధి పనుల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో మెరుగైన సమన్వయం చేసుకుంటూ పనులను

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మళ్లీ ప్రభుత్వంలోకి తిరిగి రాబోతున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీక్ వివాదం, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా ఆయన గతంలో విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యత తగ్గలేదని, త్వరలోనే ఆయనకు కీలక పోర్ట్‌ఫోలియో అప్పగించేందుకు స్క్రిప్ట్ సిద్ధమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే బీజేపీ సంస్థాగత స్థాయిలో అనేక మార్పులు చేసింది. పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ నేతృత్వంలో కొత్త బృందాన్ని ప్రకటించారు.కాశ్మీర్ పై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్.. పాకిస్తాన్ కు బిగ్ షాక్..!అయితే ఆగస్టు నెలాఖరు నాటికి మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విద్యాశాఖకు రాజీనామా చేసినప్పటికీ.. పార్లమెంట్ భవనంలో మంత్రుల విభాగం వద్దనే ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడం ధర్మేంద్ర ప్రధాన్ రీ-ఎంట్రీని బలపరుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఆయనకున్న నమ్మకం కారణంగా ఆయనకు ప్రాధాన్యత కలిగిన శాఖ దక్కవచ్చని భావిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు మరికొందరు మంత్రుల పోర్ట్‌ఫోలియోలను మార్చడం, కొత్త ముఖాలకు చోటు కల్పించడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.కీలక మంత్రుల స్థానాలపై అంచనాలు పీయూష్ గోయల్ ప్రధాని మోదీ కేబినెట్లో వాణిజ్య శాఖ మంత్రిగా కొనసాగుతారని వార్తలు వస్తున్నాయి. ఆయన పనితీరు పట్ల ప్రధాని మోదీ సంతృప్తిగా ఉన్నారు. అమెరికాతో చర్చలు నిరంతరం మారుతున్న తరుణంలో వాణిజ్య మంత్రిత్వ శాఖను మరెవరికీ అప్పగించి ప్రభుత్వం రిస్క్ తీసుకోదు. కేవలం రెండు రోజుల క్రితమే ఆయన పార్టీ కోశాధికారిగా కూడా నియమితులయ్యారు. అయితే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరీ విషయంలో పరిస్థితి అస్పష్టంగా ఉంది. పూరీ రాజ్యసభ పదవీకాలం నవంబర్ 25తో ముగుస్తుంది, ఆయన తిరిగి ఎన్నికయ్యే విషయంపై ఇంకా

ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు.. కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, దామోదర రాజనర్సింహ, దిగ్విజయ సింగ్, ఎన్.రఘువీర రెడ్డి, పల్లంరాజుతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్‌తోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాంపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే అయోధ్య రామమందిర విరాళాల ‘చోరీ’ ఆరోపణలపై పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణకు రూపకల్పన జరగనుందని సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించనున్నారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు విద్యార్థులతో ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో జులై 20వ తేదీన న్యూఢిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దీంతో దేశ

స్థానిక ఎన్నికలకు పార్టీ సన్నద్ధం కూటమి పాలనపై జగన్ విమర్శలు ఏడాదిలో జగన్ పాదయాత్ర ప్రారంభం YS Jagan: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యాధికారులతో జరిగిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన జగన్, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎంతటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించాలని స్పష్టం చేశారు. Konda Sushmitha: పరకాల బరిలో దిగేది నేనే.. కళ్ళు నెత్తికెక్కినయా.. సీఎం రేవంత్ కి కొండా సుస్మిత మాస్ కౌంటర్? కూటమి పాలనపై విమర్శలు, లా అండ్ ఆర్డర్ వైఫల్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానిని నిలబెట్టుకోలేకపోయిందని, రెండేళ్ల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మద్యం, ఇసుక, మట్టి మాఫియాలు విజృంభిస్తున్నాయని దుయ్యబట్టారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక దారుణ హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, కేసును తొక్కిపెట్టేందుకు అధికార పార్టీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. ప్రభుత్వ విఫల విధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల కుట్రలు పన్నుతున్నారని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వైఎస్సార్సీపీ నేతలు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలు, పాదయాత్రపై జగన్ ధీమా: గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనకు, ప్రస్తుత కూటమి రౌడీయిజానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రతి ఇంట్లోనూ ప్రజలు పోల్చి చూస్తున్నారని జగన్ పేర్కొన్నారు. నిత్యం జనంలో ఉంటూ ప్రజ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు