ఒంట్లో వేడి తగ్గించే సింపుల్ చిట్కాలు
ఒంట్లో వేడి సమస్య ఉంటే నోటి పుండ్లు, మూత్రంలో మంట, తలనొప్పి వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. అలాగే చెమటలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకోండి. ఒంట్లో వేడి సమస్యతో బాధపడేవారు వీలైనంత ఎక్కువగా నీళ్ళు తాగడం మంచిది. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా, కూల్‌గా ఉంటుంది. వేడి తగ్గుతుంది. శరీరాన్ని కూల్ చేసి వేడి నుంచి ఉపశమనం కల్పించడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. అలాగే ఈ నీళ్లలోని ఎలక్ట్రోలైట్స్ మీకు తక్షణ శక్తిని అందిస్తాయి. ఒంట్లో వేడిని తగ్గించడానికి మజ్జిగా సహాయపడుతుంది. మజ్జిగలో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, కొత్తిమీర కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ ఎక్కువగా ఉండే పండ్లు తినడం ద్వారా ఒంట్లో వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా పుచ్చకాయ, కీరదోస, తర్భూజ, బత్తాయి,నారింజ, దానిమ్మ వంటి పండ్లు చాలా మేలు చేస్తాయి. రాత్రంతా నానబెట్టిన ధనియాల నీళ్లు, సోంఫు నీళ్లు, మెంతుల నీళ్లు బాడీని డీటాక్సిఫై చేయడమే కాకుండా ఒంట్లో వేడి నుంచి ఉపశమనం కల్పిస్తాయి. వేడి సమస్య ఉన్నవారు ఈ చిట్కా పాటించొచ్చు. పుదీనాలోని మెంథాల్ బాడీని కూల్ చేస్తుంది. దీనికోసం పుదీనా ఆకులు వేసిన నీళ్లు తాగొచ్చు. లేదంటే పుదీనాతో టీ చేసుకుని తాగొచ్చు. ఐస్ ప్యాక్ లేదా శుభ్రమైన క్లాత్‌లో ఐస్ క్యూబ్స్ చుట్టి మణికట్టు, నుదురు, మెడ వంటి ప్రాంతాల్లో కాసేపు ఉంచండి. ఇలా చేయడం వల్ల శరీర వేడి తగ్గుతుంది. ఒంట్లో వేడి సమస్య ఉన్నవారు కారం, మసాలా ఘాటు ఎక్కువగా ఉండే ఆహారాలు తగ్గించాలి. ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. ఆల్కహాల్, స్మోకింగ్ మానేయాలి. రోజుకు సరిపడా నిద్రపోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి