
రాష్ట్రంలో పెనమలూరుప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి
Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

Paderu: ‘బడి కోసం డొనేట్’ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి ఈ వార్తకు సంబంధించిన

అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. 2027 సెప్టెంబర్‌కు వందశాతం అక్షరాస్యత లక్ష్యమని ఉద్ఘాటించారు. ఏడాదిలో 25 లక్షల మంది అక్షరాస్యులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఏపీని అభినందించిందని అన్నారు. రాష్ట్ర అక్షరాస్యత 72.6శాతం నుంచి 82.1శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. 2027 మార్చిలో మరో 25 లక్షలు.. సెప్టెంబర్‌కు మరో 27 లక్షల మందికి అక్షరాస్యత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూళ్లలో చేర్చాలి.. 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అక్షరాస్యత ఉద్యమం కొనసాగుతోందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూల్లో చేర్పించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఇంకా 1,64,821 మంది బడిబయట పిల్లలు ఉన్నారని.. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ ఏడాది 33 వేల మంది బడిబయట పిల్లలను స్కూల్లో విద్యాశాఖ చేర్చిందని వివరించారు. లీప్ యాప్ ద్వారా మిగిలిన పిల్లల వివరాలు ప్రధానోపాధ్యాయులకు అందించాలని నిర్ణయించామని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు 98.97శాతం.. విద్యార్థుల హాజరు 85.41శాతం ఉందని వివరించారు. మూడు రోజులు వరుసగా గైర్హాజరైతే తల్లిదండ్రులను

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. GO 25 Problems: నల్గొండ-హైదరాబాద్-ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయులు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ (SGT)లు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యా వ్యవస్థకు పునాది వంటి ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు, మౌలిక వసతుల కల్పనకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బడులు మూతపడకుండా కాపాడుకోవడంతో పాటు ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను శాసనమండలి వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బ్రతికించుకోవడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు (SGT) విజ్ఞప్తి చేస్తున్నారు. జీఓ నెంబర్ 25 వల్ల ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 1 నుండి 5 తరగతుల్లో 20 మంది విద్యార్థులు ఉంటే ఒక్కరినే ఉపాధ్యాయుడిగా ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 4,800 పాఠశాలలు ఒక్క టీచర్‌తోనే నడుస్తున్నాయని వాపోతున్నానరు. 21 నుండి 60 మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లను ఇస్తున్నారు. కానీ, ఇద్దరు టీచర్లు ఒకే సమయంలో ఐదు తరగతులకు పాఠాలు చెప్పడం అసాధ్యంగా మారింది. దీనినే బహుళ తరగతి బోధన అని పిలుస్తున్నప్పటికీ, ఆచరణలో ఇది విఫలమవుతోందని.. దీనివల్లే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,100 పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం: పాఠాలు చెప్పడంతో పాటు ఉపాధ్యాయులపై ప్రభుత్వం తీవ్రమైన బోధనేతర భారం మోపుతోందని వాపోతున్నారు. ప్రతిరోజూ యాప్‌లలో విద్యార్థుల, ఉపాధ్యాయుల

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (ఫిమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది. మొత్తం 1,931 పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం సాయంత్రం రెండో ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16 నుంచి 26వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం తుది మెరిట్ లిస్ట్, సెలక్షన్ జాబితాలను విడుదల చేస్తారు. ఈ పోస్టుల భర్తీ కోసం 2023 జులై 26న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది మే 14న ప్రొవిజినల్ లిస్ట్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం జులై 10న తొలి తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేశారు. మరోసారి అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిశీలించాక తాజాగా రెండో తాత్కాలిక జాబితాను విడుదల చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 28వ తేదీని రిజర్వ్‌డేగా నిర్ణయించారు. తమకు కేటాయించిన తేదీన వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయిన వారు ఆ రోజు వెళ్లే అవకాశం కల్పించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Nirmal: ఆచరణాత్మక విద్యతోనే సృజనాత్మకత కేజీబీవీ తనిఖీలో కలెక్టర్ మిశ్రా ఈ వార్తకు సంబంధించిన

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది జులై నెలలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని నడ్డా పేర్కొన్నారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు నడ్డా తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతి, వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించడాన్నీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వాగతించారు. కాగా, నీట్ పేపర్ లీక్‌తో దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని వారాలపాటు ఆందోళనలు కొనసాగగా.. జులై 20 నుంచి 25 మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు నేడు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంటామని, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు

మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు... లాతూర్, ఆగస్ట్ 20: మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. పాఠశాలల అభివృద్ధిలో విఫలమైన మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల అభివృద్ధి కోరుతూ ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో సీజేపీ గతవారం ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దీప్కే గురువారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉజని గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్‌ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ప్రజాప్రతినిధులు, మంత్రులను బాధ్యులుగా చేయాలన్నారు. చాలా పాఠశాలల్లో సరైన తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేవని, ఇక కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువుల కంటే దారుణంగా చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని.. అప్పుడు సగటు విద్యార్థులు పడే బాధలు వారికి తెలిసి వస్తాయన్నారు. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌కు చెందిన అవినాశ్ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్ మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించాలి. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యాలు పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సర్కారు ఇవ్వకపోవటంతో విద్యార్థులను అడుగుతున్న కాలేజీలు సర్టిఫికెట్ల కోసం నిరీక్షిస్తున్న రెండు లక్షల మంది విద్యార్థులు మంచి ర్యాంకులు వచ్చినా ఉన్నత చదువుల కోసం వెళ్లలేని పరిస్థితి ప్రభుత్వం తక్షణం చెల్లించాల్సిన బకాయిలు రూ.2,500 కోట్ల పైనే పాత బకాయిలు రూ.7,000 కోట్ల వరకు ఉంటాయంటున్న ఫాతీ హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన అవినాశ్ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్ మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించాలి. వీటిని ఇచ్చేందుకు కాలేజీ నిరాకరిస్తోంది. ఏడాదికి రూ.35 వేల చొప్పున మూడేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 1.05 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సర్కారు సకాలంలో ఇవ్వకపోవడంతో ఈ ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కౌన్సెలింగ్‌లో అవినాశ్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాడు. ఇలాంటి సమస్యనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర యూజీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పెండింగులో ఉండటంతో కాలేజీలు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ప్రభుత్వం కాలేజీలకు బకాయి పడిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం రూ.10 వేల కోట్ల వరకు ఉందని తెలంగాణ ఉన్నత విద్య ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతీ) అంటోంది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఫాతీ ఏడాది కాలంగా కోరుతోంది. గత ఏడాదిలో ప్రభుత్వం దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు విడుదల చేసింది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. MP School Urine Controversy: మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సదరు స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ఓ బాలుడు వాటర్ బాటిల్లో మూత్రం కలిపి తన క్లాస్‌లో ఉన్న ఇద్దరు బాలికలతో తాగించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని వారు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వారికి ఊరట కోసం రూ.10 విలువైన చాక్లెట్ తినమని చెప్పారని ఒక అధికారి తెలిపారు. గుణా జిల్లాలోని అరోన్ డెవలప్మెంట్ బ్లాక్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సోమవారం అనగా ఆగస్టు 17న ఈ ఘటన జరిగింది. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించి, ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేశారు. బాధిత బాలికల కుటుంబ సభ్యులు, స్థానికులు మంగళవారం పాఠశాల వద్ద ఆందోళన చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "కొంతమంది విద్యార్థులు నీళ్ల బాటిళ్లలో ఉన్న మూత్రాన్ని తమతో తాగించారని ఇద్దరు బాలికలు ఆరోపించారు. వారు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పుడు, ఆయన అమానుషంగా ప్రవర్తిస్తూ 'మీ నోటి రుచి బాగోలేకపోతే, రూ.10 చాక్లెట్ తినండి' అని అన్నారని తెలిసింది" అని గునా జిల్లా మేజిస్ట్రేట్ కిషోర్ కుమార్ కన్యాల్ చెప్పారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే తహసీల్దార్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)ను అక్కడికి పంపించామని, ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేశామని అరోన్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) మంజుషా ఖత్రీ తెలిపారు. రెండు రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని BEOను ఆదేశించారు. ఆ నివేదిక

ఇంటరాక్టివ్ సాహిత్య కార్యక్రమాలతో విద్యార్థుల్లో పఠనాసక్తి ఈ వార్తకు సంబంధించిన

ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ఏడాదిన్నరగా పీహెచ్డీ నోటిఫికేషన్ వేయని జేఎన్టీయూ హైదరాబాద్ సిటీ: ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ప్రతియేటా రెండు పీహెచ్డీ నోటిఫికేషన్లను జారీ చేస్తామని వివిధ సందర్భాల్లో వైస్ చాన్స్‌లర్ చేసిన ప్రకటనలు అధికారుల అలసత్వం కారణంగా అమలుకు నోచుకోవడం లేదని ఆయా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పిన వర్సిటీ ఉన్నతాధికారులు ఆర్నెల్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదని ఆశావహ అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీచేసినా దరఖాస్తుల పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూల పేరిట అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాదికిపైగా అధికారులు సమయం తీసుకుంటుండడం ఆశావహ అభ్యర్థులను తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు గురిచేస్తోంది. పీహెచ్డీ ప్రవేశాల నిమిత్తం ఈ ఏడాది (2026) నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో ఎవరికీ అంతుబట్టడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న పలువురు అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం అడ్మిషన్ల విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీ అఫిలియేటెడ్ (ప్రైవేటు) ఇంజనీరింగ్ కళాశాలల్లో మూడేళ్ల క్రితమే రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా కేంద్రాలకు అడ్మిషన్లలో ప్రాధాన్యతను ఇవ్వక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైస్ చాన్స్‌లర్ కిషన్‌కుమార్‌రెడ్డి.. ఈ ఏడాది ప్రారంభంలో ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో జరిపిన భేటీలో రానున్న నోటిఫికేషన్లో ప్రిన్సిపాల్స్‌కు సైతం స్కాలర్స్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, నోటిఫికేషన్ జారీపై అటు అర్అండ్డీ విభాగం నుంచి గానీ, ఇటు అడ్మిషన్ల విభాగం నుంచి గానీ స్పష్టమైన సమాచారం లేకపోవడంతో

మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై ఉపాధ్యాయులు అత్మగౌరవ పోరాటానికి సిద్ధమయ్యారు. ఐజీఎంసీ నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు నిర్వహణ దాదాపు 7 వేల మంది వరకూ పాల్గొంటారని అంచనా కూటమి ప్రభుత్వానికి సంఘీభావం తెలపనున్న టీచర్లు విజయవాడ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై ఉపాధ్యాయులు అత్మగౌరవ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కర్నూలు, తిరుపతిల్లో ఆందోళనలు చేపట్టగా, ఆదివారం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 7వేల మంది మెగా డీఎస్సీ టీచర్లు పాల్గొంటారని భావిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి అంబేడ్కర్ స్మృతివనం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేయనున్నారు. తమపై ఆరోపణలు చేసేవారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకోనున్నారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి టీచర్లు తమ సంఘీభావాన్ని, మద్దతును తెలపనున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులు అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛందంగా బెజవాడ తరలివస్తున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఎవరికి వారు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని రావాల్సిన లొకేషన్ పాయింట్‌ను షేర్ చేసుకుంటున్నారు. మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలతో తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తమ ప్రతిభను కించపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులపై తప్పుడు ప్రచారం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు

హరిద్వార్: దేశంలోని విద్యా వ్యవస్థపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కూడా ఉండడం లేదని ఆవేదన చెందారు. విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేక.. విద్యార్థులు ఉపాధ్యాయులు, ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను నిరసన చేపడతానని హెచ్చరించారు. హరిద్వార్‌లో శనివారం ఆయన స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. “దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది” అని పేర్కొన్నారు. “పుస్తకాలు ఉన్నాయి, కానీ ఉపాధ్యాయులు లేరు; ఉపాధ్యాయులు ఉన్నారు, కానీ పుస్తకాలు లేవు. పుస్తకాలు ఉన్నా ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. సరైన మౌలిక వసతులు, బోధనా వనరులు లేకపోవడంతో విద్యార్థులు చిన్న పాఠశాలలను వదిలి వెళ్లిపోతున్నారని తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీపైనా విమర్శలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని కూడా రామ్‌దేవ్ ప్రస్తావించారు. ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం విద్యార్థులు క్రమంగా పోటీ పరీక్షలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల ప్రస్తుత ప్రాధాన్యతపైనా ప్రశ్నలు లేవనెత్తారు. విద్యార్థుల ఉన్నత విద్య ప్రవేశాలు ఎక్కువగా పోటీ ప్రవేశ పరీక్షల ఆధారంగా నిర్ణయించబడుతున్న పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: అన్నాడీఎంకేకు మరో దెబ్బ.. అప్సరా రెడ్డి రాజీనామా జెన్‌జీ బాగానే ఉన్నారు కానీ.. దేశంలోని అనేక మంది యువత మంచి మార్గంలో రాణిస్తున్నప్పటికీ.. కొందరు హింస, ధూమపానం, మద్యపానం, అస్థిర సంబంధాల వంటి ధోరణుల్లో చిక్కుకుంటున్నారని రామ్‌దేవ్ అన్నారు. జెన్‌జీ యువత అందరినీ ఒకే కోణంలో చూడకూడదని సూచించారు. “చాలా మంది జెన్‌జీ యువత బాగా రాణిస్తున్నారు. అయితే కొందరు హింసకు పాల్పడుతున్నారు, పలువురు బాయ్ఫ్రెండ్లు లేదా గర్ల్ఫ్రెండ్లను కలిగి ఉంటున్నారు. మరికొందరు బీడీలు, సిగరెట్లు కాల్చడం, మద్యం సేవించడం చేస్తున్నారు” అని రామ్‌దేవ్ అన్నారు. రాహుల్ గాంధీకి కౌంటర్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై

విద్యార్థుల ఫీజులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్‌గా బ్యాంకు ఖాతాలో ఉంచుతున్నామని తెలిపారు. ఒలింపిక్స్ పతకం తెస్తే ప్రభుత్వ ఉద్యోగమిస్తాం రాష్ట్రంలో కులగణన చేసి కేంద్రానికి సవాలు విసిరాం విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు పనిచేస్తా మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణలో సీఎం రేవంత్ హైదరాబాద్ సిటీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఫీజులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్‌గా బ్యాంకు ఖాతాలో ఉంచుతున్నామని తెలిపారు. కాలేజీలో అడ్మిషన్ పొందిన వెంటనే ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలని, నెల రోజుల్లోవిద్యార్థి ఖాతాలో ఫీజు జమ చేస్తామని ప్రకటించారు. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అడగకుండానే మీ ఖాతాలో వేస్తాం. ఇందుకోసం ప్రతి సంవత్సరం రూ.2400 కోట్లను అడ్వాన్స్‌గా బ్యాంకు ఖాతాలో పెట్టి.. విద్యార్థుల ఖాతాల్లోకి బదిలీ చేస్తాం. ఈ విద్యా సంవత్సరానికి రూ.250 కోట్లు అడ్వాన్స్‌గా బ్యాంకు ఖాతాలో పెట్టాం. మీరు చింతించాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఏ కాలేజీ కూడా మీరు ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వబోమనే అవకాశం ఇవ్వం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులనుద్దేశించి చెప్పారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న నెక్లెస్ రోడ్డుకు, హెచ్ఎండీఏ గ్రౌండ్‌కు ఎదురుగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం హెచ్ఎండీఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్డులో ఓవైపు అంబేడ్కర్, మరోవైపు జ్యోతిబా పూలే, చౌరస్తాలో ఇందిరాగాంధీ, ఆ పక్కన పీవీ నర్సింహారావు విగ్రహాలను పెట్టింది వారి వర్థంతులు, జయంతులు జరుపుకోవడానికి మాత్రమే కాదన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఈ గొప్ప వ్యక్తుల విగ్రహాలను చూసి.. వారు చేసిన త్యాగాలను, వారి స్ఫూర్తిని పొందాలని, ఆ స్ఫూర్తితో విద్యలో

సాక్షి, ఢిల్లీ: ఎన్నికల ముందు ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతామని మాయమాటలు చెప్పి.. వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇప్పుడు వారి కష్టాలను గాలికొదిలేశారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ పరీక్ష భారం నుంచి బయటపడేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిల గురుమూర్తి, గొల్ల బాబూరావు నేతృత్వంలో టీచర్ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలిశారు. టెట్ పరీక్ష ఉత్తీర్ణత కావడం తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని వారు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుంటోందని మండిపడ్డారు. కేంద్రంలో తమ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని గొప్పలు చెప్పుకునే వెన్నుపోటు పార్టీ నేతలు, టీచర్లను ఆదుకునేందుకు 'విద్యా హక్కు చట్టాన్ని' ఎందుకు సవరించలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు వయసు దాటిన టీచర్లను ఉన్నట్టుండి ఇప్పుడు ఆన్లైన్లో అన్ని సబ్జెక్టులూ పరీక్ష రాయమనడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కనీసం రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో, ఉపాధ్యాయుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడిందని చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి టీచర్ల ఆవేదనను వివరించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే, ఉపాధ్యాయ లోకం తరపున చట్టసభల్లోనూ, న్యాయస్థానాల్లోనూ వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. వారు ఇంకా ఏం మాట్లాడారంటే.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదు?: గొల్ల బాబూరావు కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని, తమ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే కూటమి నేతలు.. మరి ఉపాధ్యాయులను ఈ 'టెట్' భారం నుంచి ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో సుమారు

DigiLocker | ఇంటర్నెట్ డెస్క్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2027) పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్! ఈ పరీక్ష షెడ్యూల్(GATE 2027 Reschedule)లో ఐఐటీ మద్రాస్(IIT Madras) కీలక మార్పులు చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తొలుత ప్రకటించినట్లుగా ఆగస్టు 14 నుంచి కాకుండా.. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులంతా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆలస్య రుసుంతో అక్టోబర్ 5వరకు దరఖాస్తు చేసుకోవచ్చని., పరీక్ష తేదీల్లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మరోవైపు, గేట్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అభ్యర్థులు డిజిలాకర్ ఖాతాతో లింక్ చేయడం తప్పనిసరని ఐఐటీ మద్రాస్ తెలిపింది. దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు వెబ్సైట్లో తమ డిజిలాకర్ ఖాతాను క్రియేట్/అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తుదారులు తమ డిజిలాకర్ను అనుసంధానం చేయాలని, దీనివల్ల ధ్రువీకరించిన వ్యక్తిగత సమాచారాన్ని పోర్టల్ సురక్షితంగా సేకరించగలుగుతుందని ఐఐటీ మద్రాస్ పేర్కొంది. అభ్యర్థి ఒకసారి అనుమతి ఇచ్చాక వారి పేరు, పుట్టిన తేదీ, ప్రొఫైల్ ఫొటో, వెరిఫైడ్ గుర్తింపు పత్రం నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగతమైన వివరాలను ఆటోమేటిక్‌గా పోర్టల్ సేకరిస్తుందని తెలిపింది. తద్వారా అప్లికేషన్ ప్రక్రియ వేగంగా, మరింత కచ్చితంగా పూర్తయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. ఇటీవల ప్రకటించినట్టుగానే గేట్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో జరగనున్నాయి. ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నట్లు ఐఐటీ మద్రాస్ తన షెడ్యూల్లో పేర్కొంది. సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లను డిజిటల్‌గా భద్రపరుచుకోవడం, షేర్ చేసుకోవడం, అవసరమైనప్పుడు వెరిఫై చేసుకోవడం కోసం కేంద్రప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందే ఈ ‘డిజిలాకర్’. పేపర్‌లెస్ సదుపాయం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటైన

Jangaon: దేవరుప్పులలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ! ఈ వార్తకు సంబంధించిన

Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో లయన్స్ క్లబ్ వ్యాసరచన పోటీలు! కర్నూలు: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో “క్రిటికల్ థింకింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనా సామర్థ్యాన్ని, పర్యావరణ పరిరక్షణపై అవగాహనను ప్రదర్శించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయిక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ మెల్విన్ జోన్ గవర్నర్ రాయపాటి శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్, లయన్స్ క్లబ్ సభ్యులు మురారి శంకర్ అప్ప తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా విధానం, సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మల్లికార్జున, విజయశేఖర్, సోమేశ్, ఉల్గోజి రావు, చిన్న మల్లేష్, శ్రీధర్ మూర్తి, బాలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికీ ప్రపంచ స్థాయి విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రతి విద్యార్థికీ ప్రపంచ స్థాయి విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో ఈ విద్యాలయాలు నిర్మితమవుతున్నాయని సీఎం వెల్లడించారు. ‘భవనాలు నిర్మించడం సులభమే.. కానీ కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి. ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలుకుతూ.. కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే గీతలను చెరిపేస్తూ.. ప్రతి చిన్నారికీ ప్రపంచ స్థాయి విద్యను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో నిర్మితమవుతున్న ఈ విద్యాలయాలు.. పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా, పరిపాలకులుగా, పారిశ్రామికవేత్తలుగా, నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలుగా నిలవబోతున్నాయి. పేద పిల్లల కలలకు చిరునామాగా... తెలంగాణ మోడల్‌కు ప్రతీకగా... యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తరతరాల భవిష్యత్తును మార్చబోతున్నాయి’ అంటూ ఎక్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. గుడిమల్కాపూర్‌లో బాలుడిపై తండ్రి దాడి ఘటన.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ పూర్తి... ఓటర్ల జాబితాలో కీలక మార్పులు

చేతిలో గొడ్డలి.. ఒంటిపై పుష్పరాజ్ గెటప్.. నోట ‘తగ్గేదేలే’ డైలాగ్! ఝార్ఖండ్ రాజధాని రాంచీలో పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా పుష్ప గెటప్‌లో వచ్చి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు.పేపర్ లీక్‌లను అడ్డుకోవాలని, డబ్బున్నవాళ్లకే ఉద్యోగాలు దక్కడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నిరసనలో పాల్గొన్నట్లు చెప్పాడు. ఆందోళన శాంతియుతంగా సాగుతుండటంతో తాను మద్దతుగా నిలిచానని తెలిపాడు. విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందని, ప్రభుత్వం వాటిని నెరవేర్చాలని కోరాడు.చివర్లో పుష్ప స్టైల్లో ‘డిమాండ్లు నెరవేరే వరకు విద్యార్థులు తగ్గేదేలే’ అంటూ చెప్పిన డైలాగ్ అక్కడున్న వారిని ఆకట్టుకుంది.ఇక తన గెటప్ వెనుక మరో ఆసక్తికరమైన విషయం ఉందని అతడు చెప్పాడు. తాను అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానినని తెలిపాడు. పుష్ప-2 విడుదలైనప్పటి నుంచి పుష్పరాజ్ గెటప్‌లోనే ఉంటున్నట్లు చెప్పాడు. పుష్ప-3 వచ్చే వరకు ఇదే గెటప్‌లో కనిపిస్తానని వెల్లడించాడు.ముంబయి సహా పలు నగరాల్లో పుష్ప గెటప్‌లో షోలు కూడా చేస్తుంటానని చెప్పాడు. అయితే ఈసారి తన గెటప్ వినోదం కోసం కాదు.. విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలిపేందుకేనని స్పష్టం చేశాడు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bharat Electronics Limited Recruitment 2026: రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 14 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11, 2026న జరిగే నియామక ప్రక్రియకు హాజరయ్యే ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఖాళీలను రాజస్థాన్, గుజరాత్‌లోని BEL ప్రాజెక్ట్ సైట్ల కోసం రిక్రూట్ చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులను జోధ్‌పూర్, జైసల్మేర్, జామ్‌నగర్, భుజ్ లేదా నలియాలో నియమించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ, జీత భత్యాలు వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి నాలుగేళ్ల బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అర్హత గల విభాగాలలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉన్నాయి. అనుభవం: దరఖాస్తుదారులు జూలై 1, 2026 నాటికి కనీసం 2 సంవత్సరాల సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు సడలింపు లభిస్తుంది. జీతభత్యం: జీతం నియామక సంవత్సరంపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్-I నెలకు రూ. 40,000 అందుకుంటారు. అయితే ప్రాజెక్ట్ ఇంజనీర్-II, III, IV వరుసగా రూ. 45,000, రూ. 50,000 రూ. 55,000 అందుకుంటారు. అభ్యర్థులు వారి పోస్టింగ్‌ను బట్టి ఏరియా అలవెన్స్ కూడా పొందవచ్చు. రూ

త్వరలో జరగనున్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను పిలవొద్దంటూ.. విద్యార్థులపై దాడి వీడియోలు చూసే తీరిక ఆయనకు లేదు స్నాతకోత్సవానికి ఆయనను ఆహ్వానించొద్దంటూ.. నల్సార్ వీసీ, రిజిస్ట్రార్లకు 450 మంది విద్యార్థుల లేఖ ఇప్పటికే సీజేఐని చీఫ్ గెస్ట్‌గా పిలిచి స్నాతకోత్సవాన్ని వాయిదా వేసుకున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హైదరాబాద్, శామీర్‌పేట, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను పిలవొద్దంటూ 450 మంది విద్యార్థులు ఆ వర్సిటీ ఉపకులపతికి, రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదని.. ముఖ్య అతిథి ఎంపిక ఇంకా చర్చల దశలోనే ఉందనే విషయం తమకు తెలుసని.. అందుకే అధికారిక నిర్ణయం తీసుకునే ముందే తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ లేఖ రాస్తునట్టు అందులో పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా పోలీసుల దౌర్జన్యంపై దాఖలైన పిటిషన్ విచారణలో.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యవహరించిన తీరుపై తమకు అభ్యంతరాలున్నాయని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. జూలై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆరోపణలు వచ్చాయని, పలువురు నిరసనకారులు గాయపడినట్లు పిటిషన్లో పేర్కొన్నారని.. కానీ, జూలై 23న జరిగిన విచారణ సందర్భంగా.. విద్యార్థులపై పోలీసుల దాడులకు సంబంధించి వీడియోలు చూసేందుకూ ఆయన నిరాకరించారని, అందుకు తనకు సమయం లేదని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. నిరసనలకు గల కారణాలను వివరించడానికి న్యాయవాది ప్రయత్నించినప్పుడు ఆయన మాటలను సీజేఐ మధ్యలోనే అడ్డుకుని ‘థాంక్యూ వెరీమచ్’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. న్యాయవిద్యార్థులుగా.. మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని పట్టాలు అందుకోబోతున్న బ్యాచ్‌గా తమ ఆందోళన పరిమితమైనదేనని.. రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందే అవకాశం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AOC recruitment 2026: దేశసేవ చేయాలని కలలు కంటున్న యువతకు ఇండియన్ ఆర్మీ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. కేవలం పదవ తరగతి ఉత్తీర్ణతతో ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలను రిక్రూట్ చేస్తోంది.తాజాగా భారత సైన్యం, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ గ్రూస్ సి సివిలియన్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్ మెంట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ట్రేడ్స్ మెన్ మేట్, ఫైర్ మాన్, ఎమ్ టీఎస్ వంటి పలు విభాగాల్లో మొత్తం 2,615 ఖాళీలకు ఈ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తోంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు 24, 2026 నుంచి సెప్టెంబర్ 23, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అధికారిక తాత్కాలిక ఖాళీల పత్రం ప్రకారం.. ఈ ఖాళీలలో 2,313 ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులు, 656 ఫైర్‌మ్యాన్ పోస్టులు.. 99 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. దీంతో ఈ జాబితాలోని మొత్తం ఖాళీల సంఖ్య 3,068కి చేరుకుంది. ఈ సంఖ్యలు తాత్కాలికమైనవి అయినప్పటికీ.. వివరణాత్మక రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయినప్పుడు మారే అవకాశం ఉంటుంది. జీత భత్యాలు: పోస్టును బట్టి జీతభత్యాలు కూడా మారుతూ ఉంటాయి. ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులు పే లెవల్ 1 కిందకు వస్తాయి. వీటి జీతం రూ. 18,000 నుండి రూ. 56,900 వరకు ఉంటుంది. కాగా, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు పే లెవల్ 2 కిందకు వస్తాయి. వీరికి జీతం రూ. 19,900 నుండి రూ. 63,200 వరకు ఉంటుంది. అర్హులు: విద్యా అర్హత పోస్టుపై ఆధారపడి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఖచ్చితమైన అర్హతా