
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Doctors Use Torches To Operate | ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంట వరకు అక్కడ అంధకారం అలముకున్నది. ఈ నేపథ్యంలో మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో ఇద్దరు గర్భిణీలకు డాక్టర్లు ఆపరేషన్ కొనసాగించారు.

హైదరాబాద్ నగర పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: నగరంలో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడుల వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వెల్లడించారు. ఏకకాలంలో దాడులు.. 10 ఫేక్ క్లినిక్‌ల సీజ్ మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నకిలీ క్లినిక్‌ల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్ చెరు, ఆర్సీ పురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 నకిలీ క్లినిక్‌లను సీజ్ చేశారు. టెన్త్, బీకామ్ చదివి.. సెలైన్లు ఎక్కిస్తూ! టెన్త్, ఇంటర్, బీకామ్ వంటి చదువులు మాత్రమే చదివిన ఈ కేటుగాళ్లు, ఎలాంటి కనీస మెడికల్ నాలెడ్జ్ లేదా గుర్తింపు పొందిన డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారని విచారణలో తేలింది. చిన్నపిల్లలకు వైద్యం: ఎలాంటి అర్హత లేకున్నా క్లినిక్‌లలో ఏకంగా బెడ్లు ఏర్పాటు చేసి, అమాయక రోగులకు, చిన్నపిల్లలకు వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిరంజీలు, సెలైన్ల వాడకం: తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లకు ఎడాపెడా సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ (IV Fluids) ఎక్కిస్తూ ప్రాణాలపైకి తెస్తున్నారని పోలీసులు తెలిపారు. సామగ్రి సీజ్: దాడుల సమయంలో ఈ క్లినిక్‌ల నుంచి పెద్ద ఎత్తున బీపీ మిషన్లు, స్టెతస్కోప్‌లు

వైద్యుల కొరతతో రోగుల అవస్థలు మరమ్మతులు లేక మూలనపడ్డ కోట్ల విలువ చేసే యంత్రాలు కమీషన్ల కక్కుర్తితో ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్న సిబ్బంది 8 నెలలుగా నిలిచిన న్యూరో సర్జరీలు న్యూరో సర్జరీలో ఒకే ఒక్క వైద్యుడు వరంగల్ మెడికల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రితోపాటు సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రిలో న్యూరో కేర్.. డోంట్ కేర్.. అన్న చందంగా మారింది. రోడ్డు ప్రమాదాలు, న్యూరో సం బంధిత జబ్బులతో చావు బతుకుల మధ్య నిత్యం రోగులు వస్తుంటారు. కానీ చికిత్స అందించే వైద్యు లే కరువయ్యారు. న్యూరో విభాగంలో న్యూరో ఫిజీ షియన్ సేవలు, న్యూరో సర్జరీ సేవల కోసం ప్రత్యే క వార్డులను వైద్యులను ఏర్పాటు చేశారు. కానీ రోగుల సంఖ్యకనుగుణంగా వైద్యులు లేకపోవడం వల్ల సేవలు నిల్‌గా మారాయి. ఎనిమిది నెలలుగా న్యూరో సర్జరీలు బంద్ కావడమే ఎందుకు నిలువె త్తు సాక్ష్యం. సర్జరీ విభాగంలో ఒకే ఒక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సేవలు అందిస్తున్నారు. మరో కాంట్రాక్ట్ వైద్యుడు కూడా కొనసాగుతున్నారు. ఒక్క వైద్యులు ఎంతమందికి శస్త్ర చికిత్స చేయగలరు ఉన్నతాధికారులకే తెలియాల్సి ఉంటుంది. రోగుల తాకిడి ఎక్కువ న్యూరో విభాగంలో ఒక నెలలో 4 వేలకు పైగా ఓపీ ఉంటుందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. కానీ ఓపీ చూసేందుకు కూడా వైద్యులు లేక రోగు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి నిరీక్షించిన న్యూరో సర్జరీ, న్యూరో ఫిజీషి యన్లను రోగులు కలవలేక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి బాధ వర్ణనాతీతంగా మారింది. న్యూరో విభాగంలో అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరం ఉన్న రోగులకు దేవుడే దిక్కు అన్న విధంగా మారింది. నిత్యం 10 నుంచి 15 మంది రోడ్డు ప్రమాదాలల్లో తలకు గాయాలు, స్పైన్ సర్జరీలు, ట్రామా లాంటి మెడికో లీగల్ కేసులు ఎంజీఎం సూపర్ స్పెషాలిటీకి వస్తుంటాయి. ఉమ్మడి
Pakistan Award Mumbai Doctors : భారత్-పాకిస్థాన్ విభజన ఎంత మంది మనసులను కలిచి వేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ దేశ విభజన వెనుక ఓ అనూహ్యమైన రహస్యం దాగి ఉందనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా పాకిస్థాన్ జాతిపితగా భావించే మహమ్మద్ అలీ జిన్నా తీవ్రమైన ప్రాణాంతక టీబీ వ్యాధితో బాధ పడుతున్నారనే విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచడం వల్లే పాక్ ఏర్పడిందని.. దానికి కారణం ముంబైకి చెందిన ఇద్దరు పార్శీ వైద్యులే కాగా.. పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు వారికి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్-ఎ-ఇంతియాజ్’ను ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.దేశ ఆవిర్భావానికి దోహదపడిన రహస్య నివేదికదేశ విభజన జరిగే నాటికే జిన్నా ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయింది. ఆయన మరో రెండేళ్లకు మించి బతికే అవకాశం లేదనే స్థాయికి టీబీ వ్యాధి ముదిరింది. అయితే ఆ సమయంలో ముంబైకి చెందిన వైద్యులు డాక్టర్ జల్ రతన్జీ పటేల్, డాక్టర్ జల్ ధాయ్భోకూలు ఈ అనారోగ్య విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. ఈ వైద్యులు జిన్నా ఆరోగ్య పరిస్థితిని బయటకు పొక్కనివ్వకపోవడం వల్లే పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించగలిగిందని పాక్ యంత్రాంగం భావిస్తోంది. ఈక్రమంలోనే.. తమ దేశ ఆవిర్భావంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు పార్శీ డాక్టర్లకు మరణానంతరం 'నిషాన్-ఎ-ఇంతియాజ్' అవార్డును ప్రకటిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రణాళికా శాఖ మంత్రి ఎహసాన్ ఇక్బాల్ వెల్లడించారు.ఆ సమాచారం తెలిసుంటే చరిత్ర మారేదా?జిన్నా ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నారనే విషయం ఆ రోజుల్లోనే వెలుగులోకి వచ్చి ఉంటే.. బహుశా విభజన ప్రక్రియ ఆగిపోయేదేమోనన్న చర్చ కూడా చరిత్రకారుల్లో ఉంది. నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ సైతం ఈ విషయంపై గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్నా అనారోగ్యం గురించి తమకు ముందుగానే తెలిసి ఉంటే విభజన నిర్ణయాన్ని వాయిదా వేసే వాళ్లమని, అదే జరిగి ఉంటే

ఉస్మానియా ఆస్పత్రిలో సమయానికి రాని వైద్యులు, సిబ్బంది మాన్యువల్ అటెండెన్స్ రిజిస్టర్లు మరిచిన వైనం మంత్రి మందలించినా మారని తీరు రాత్రి అయితే జూనియర్ డాక్టర్లే దిక్కు మెరుగైన వైద్యం అందక ప్రైవేట్ బాట పడుతున్న రోగులు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు ప్రాణం పోయాల్సిన వారు బాధ్యతను గాలికొదిలేసి వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు రావాల్సిన ఆసుపత్రి వైద్యాధికారి 10.30 తర్వాత వస్తుండడంతో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ హాజరుతోపాటు మాన్యువల్ రిజిస్టర్లలో సంతకం చేయాల్సి ఉండగా రెండేళ్లుగా దాని ఊసే ఎత్తడం లేదు. కేవలం పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు, కిందిస్థాయి సిబ్బందికి మాత్రమే రిజిస్టర్లు పెడుతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కఠినంగా వ్యవహరించకపోవడం, రిజిస్టర్లను మెయింటైన్ చేయకపోవడంతోనే సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఆదేశాలకూ ‘డోంట్ కేర్’ గత నెలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అటెండెన్స్, గవర్నెన్స్, రిజిస్టర్ల నిర్వహణకు సంబంధించిన రికార్డులన్నీ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సదరు మీటింగ్‌కు ఉస్మానియా నుంచి ఎలాంటి రికార్డులూ తీసుకెళ్లలేదంటే వారి నిర్లక్ష్యం, బేఖాతరు అర్థమవుతుంది. ఆ సమావేశం తర్వాతైనా రికార్డులను పక్కాగా మెయింటెయిన్ చేయాలన్న సోయి అధికారుల్లో లోపించింది. పెద్ద ప్రమాదంతో వచ్చినా పట్టింపేదీ? ఉస్మానియా ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సునీత ఉదంతం తేటతెల్లం చేసింది. నాంపల్లిలో నివాసం ఉండే సునీత గన్ ఫౌండ్రిలోని ఎస్బీఐ హౌస్ కీపింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ నెల 12న ఆబిడ్స్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ప్రముఖ సినీ నిర్మాత కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సునీత తీవ్రంగా గాయపడింది. తీవ్ర
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మూడు ప్రధాన డిమాండ్లతో ఏపీలో జూడాల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ల డాకర్ల నిరసనను విరమింపజేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్లకు స్టైపండ్ పెంచాలని నిర్ణయించింది. జూనియర్ డాక్టర్ల స్టైపండ్‌ను ప్రస్తుతం రెండేళ్లకు ఓసారి సవరణ చేస్తుండగా.. ఇకపై ప్రతి సంవత్సరం సవరించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదన ప్రకారం.. ఇంటర్న్‌షిప్ చేసేవారికి 2026 జనవరి ఒకటో తేదీ నుంచి స్టైపండ్ ఐదు శాతం మేరకు పెంచనున్నారు. తర్వాతి సంవత్సరం నుంచి ఏటా 3 శాతం చొప్పున పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థుల స్టైపండ్ ప్రతి ఏడాది 3 శాతం చొప్పున పెంచుతామని ప్రభుత్వం ప్రతిపాదించింది.మరోవైపు ఇంటర్న్‌షిప్ చేసే వైద్య విద్యార్థులతో పాటుగా, పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు స్టైపండ్‌ను పెంచాలని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కోరుతోంది. స్టైపండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ వారం రోజులకు పైగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో ఆగస్ట్ 17 నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రులలో రోగులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే జూడాలో సమ్మె విరమింపజేసేందుకు.. వారికి స్టైపండ్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణం విధుల్లోకి చేరాలని సూచించింది.వెనక్కి తగ్గని జూడాలు..మరోవైపు ఐదు శాతం స్టైపండ్ పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త ప్రకటనేమీ చేయలేదని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తమ నిరసనలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరల ప్రకారం ఐదు శాతం స్టైపండ్ పెంపు సరిపోదని చెప్తున్నారు. తాము స్టైపండ్ 30 శాతం పెంచాలని కోరుతుంటే.. కేవలం ఐదు శాతం మాత్రమే పెంచుతామని అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో

తమ స్టైఫండ్ పెంచాలంటూ ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఉపకార వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ స్టైఫండ్ పెంచాలంటూ ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఉపకార వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. జూడాలకు 5 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన చేసింది. పెంచిన ఈ శాతాన్ని 2026 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఇక నుంచి పీజీతో పాటు సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు ప్రతి ఏటా స్టైఫండ్ 3 శాతం పెంచనున్నట్లు స్పష్టం చేసింది. జూనియర్ డాక్టర్లు తక్షణమే విధుల్లోకి చేరాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. NTR Health Update: ఎన్.టి.ఆర్. అభిమానులను కొంతకాలంగా ఆందోళనకు గురిచేస్తున్న ఆయన భుజం గాయంపై తాజాగా స్పష్టత వచ్చింది. షూటింగ్ సమయంలో కుడి భుజానికి గాయం కావడంతో తారక్‌కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ, కోలుకునే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తారక్‌కు అందించిన చికిత్స, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు వివరాలు వెల్లడించారు. కుడి భుజం జాయింట్ ప్రాంతంలో గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తారక్ ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తారక్ రికవరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని, వైద్యుల సూచనలను పాటిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన అంకితభావాన్ని చూస్తుంటే త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాత సుమారు రెండు నెలల్లో షూటింగ్లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో అభిమానుల్లో నెలకొన్న ఆందోళన కొంత తగ్గింది. తారక్ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తారక్ నటిస్తున్న డ్రాగన్ సినిమాపై కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ‘డ్రాగన్’కు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో స్తంభించిన వైద్యం స్టైపెండ్ పెంచబోమంటూ బాబు సర్కారు మొండి వైఖరి సాక్షి, అమరావతి: జూనియర్ డాక్టర్ల(జూడా) సమ్మెతో రాష్ట్రంలో వైద్యం స్తంభించింది. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సర్కారు స్పందించకపోవడంతో సోమవారం నుంచి అత్యవసర సేవలనూ జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. సమ్మెను తీవ్రతరం చేశారు. దీంతో అన్ని బోధనాస్పత్రుల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణ ఓపీ, ఐపీ, సర్జరీలతోపాటు, ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూల్లోనూ రోగుల నాడి పట్టే వారు కరువయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం స్టైపెండ్ పెంపులో అన్యాయం చేస్తోందని ఈ నెల 10 నుంచి జూడాలు సమ్మెలోకి వెళ్లిన విషయం తెలిసిందే. జూడాల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అవి కనిపించడం లేదు. వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాల్లో జూడాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరసనలు చేపట్టారు. ఉయ్ వాంట్ జస్టిస్ నినాదాలతో ఆస్పత్రులు, కళాశాలలను హోరెత్తించారు. న్యాయమైన స్టైపెండ్ ఇచ్చే వరకూ వెనక్కు తగ్గబోమని ప్రభుత్వానికి తేల్చి చెప్పేశారు. సర్జరీలు వాయిదా గడిచిన వారం రోజులుగా జూడాల సమ్మె నేపథ్యంలో వైద్య సేవలకు బోధనాస్పత్రుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఈఎన్టీ, గైనిక్, పీడియాట్రిక్స్ వంటి రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న విభాగాల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆపరేషన్ థియేటర్(ఓటీ) సేవలపై సమ్మె ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. జూడాలంతా అందుబాటులో లేకపోవడంతో అత్యవసరం కాని సర్జరీలను వారం, 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నారు. కేవలం అత్యవసరమైతేనే సర్జరీలు చేస్తున్నారని రోగులు గగ్గోలు పెడుతున్నారు. గుంటూరు, విశాఖ, కర్నూలు, విజయవాడ వంటి చోట్ల రోగుల తాకిడి ఎక్కువగా ఉండే జీజీహెచ్‌లలో వైద్యులు అందుబాటులో లేరని, ఓపీ సేవల కోసం గంటల తరబడి