
Delhi Car Blast: ఢిల్లీ కారుబ్లాస్ట్పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
© 2026 nimisham.in

Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
Sukesh Chandrashekhar Sentenced 8 Years : సాధారణంగా బెయిల్ పొందడానికి ఏవేవో కారణాలు చెబుతుంటారు. ఎలాగోలా బయటకు వచ్చేందుకు సాధ్యమైనన్ని పనులు చేస్తుంటారు చాలా మంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ వ్యక్తి మాత్రం బెయిల్ కోసం.. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవతారమెత్తాడు. అంతేనా ఓ ప్రత్యేక జడ్జీని బెదిరించి ఘోర మోసానికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ తీవ్ర నేరానికి గాను అతనికి ఎనిమిది ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ హర్షితా మిశ్రా సంచలన తీర్పును ఇచ్చారు. నిందితుడు చేసిన తప్పు.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, విచారణ ప్రక్రియను దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు.పోలీస్ కస్టడీలోనే ప్లాన్.. కానిస్టేబుల్ ఫోన్‌తో డ్రామాఅవినీతి కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ 2017 ఏప్రిల్ 28వ తేదీన.. కానిస్టేబుల్ మంజీత్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను దక్కించుకున్నాడు. దాని ద్వారా అప్పట్లో అవినీతి నిరోధక చట్టం కేసులను విచారిస్తున్న స్పెషల్ జడ్జ్ పూనం చౌదరి ల్యాండ్‌లైన్, మొబైల్ నంబర్లకు ఫోన్ చేశాడు. మొదట సుప్రీంకోర్టు జడ్జి వద్ద పనిచేసే ప్రైవేట్ కార్యదర్శినని పరిచయం చేసుకుని, ఆ తర్వాత స్వయంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తినేనని బురిడీ కొట్టించాడు. తన కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని, లేకపోతే ఉద్యోగ పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జడ్జీని బెదిరింపులకు గురిచేశాడు.ఇదీ చూడండి: జడ్జిపై తెలుగు లాయర్ అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన సీజేఐవిడివిడిగా శిక్షలు.. ఒకదాని తర్వాత ఒకటి అమలు!కానీ జడ్జీ మాత్రం ఈ పని చేసింది ఎవరో తెలుసుకున్నారు. ముఖ్యంగా అది కానిస్టేబుల్ నెంబర్ అని తెలుసుకుని.. నిందితుడిపై మరికొన్ని కేసులు నమోదు చేశారు. ఆపై విచారణ జరిపి.. సుకేష్ చంద్రశేఖరే నిందితుడిని గుర్తించారు. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన సుకేష్‌ను ఐపీసీ సెక్షన్లు

కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్ తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక మాయమాటలు నమ్మి మరో బస్సులోకి.. దాంట్లోనే దారుణం.. నిందితుల అరెస్టు ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి ఢిల్లీలో నర్సరీ చదివే చిన్నారిపై పాఠశాల బస్సు డ్రైవర్ లైంగికదాడి న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ రాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికపై ఇద్దరు దుండగులు నడుస్తున్న బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగినప్పటికీ.. వివరాలు సోమవారం వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. తల్లి తిట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి, ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63లో ఉండే తమ బంధువుల ఇంటికి బస్సులో బయల్దేరింది. చీకటి, దానికితోడు వర్షం కురుస్తుండటంతో ఆ బాలిక తాను దిగాల్సిన ప్రాంతాన్ని గుర్తించలేక, రాత్రి 9 గంటల సమయంలో సెక్టార్ 63 చేరుకోకముందే బస్సు నుంచి దిగేసింది. అక్కడి నుంచి వాళ్ల బంధువుల ఇల్లు మరో 25 కి.మీ.ల దూరం ఉండటంతో.. ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంతలో ఓ స్లీపర్ బస్సు వచ్చి ఆమె ముందు ఆగింది. దాంట్లో ఉన్న కండక్టర్ తాము నోయిడా సెక్టార్ 63 వైపే వెళ్తున్నామని చెప్పటంతో, ఆ బాలిక బస్సు ఎక్కింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. బస్సు బయల్దేరిన కొంతసేపటికి, కండక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి జరిపాడు. ఆ తర్వాత డ్రైవర్ కూడా దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా బస్సు కదులుతుండగానే జరిగింది. స్లీపర్ బస్సు కావటంతో కిటికీలకు ఉన్న తెరల వల్ల.. లోపల జరుగుతున్న అఘాయిత్యం గురించి బయట ఎవరికీ కనిపించలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ఓల్డ్

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ సీఎన్జీ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ సీఎన్జీ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. సీఎన్జీతో నడిచే ఓ ట్రక్ బుధవారం సిలిండర్‌లో గ్యాస్ నింపించుకోవడానికి తిక్రి కలాన్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న సీఎన్జీ పంప్ దగ్గరకు వచ్చింది. సిలిండర్‌లో గ్యాస్ నింపుతున్న సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలటంతో సీఎన్జీ పంపులో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయిన ముగ్గురిని మహేష్, బ్రహ్మ్జీత్, సన్నీగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాబోయ్ పులి.. గుర్రాన్ని ఎలా ఈడ్చుకెళ్తోందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్.. ఏపీ ప్రయోజనాలపై కేంద్రంతో కీలక చర్చలు.. మహాబలిపురానికి సీఎం చంద్రబాబు

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్‌లో జరిగిన పేలుడికి అల్‌ఖైదా అనుబంధ సంస్థ ‘అల్‌ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అధికారికంగా పేర్కొంది. ఆగస్టు 10న విడుదలైన యూఎన్ఎస్సీ విశ్లేషణాత్మక సహాయ, ఆంక్షల పర్యవేక్షణ బృందం తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.2025 నవంబర్ 10న రాత్రి 7 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కారును ఉమర్-ఎ-నబీ నడిపినట్లు దర్యాప్తులో గుర్తించారు. అతడే ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ దాడిని తొలుత పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ (జేఈఎం) అని అయి ఉంటుందని అనుమానించారు. ఓ సభ్య దేశం కూడా వరుస దాడులతో పాటు రెడ్‌ఫోర్ట్ పేలుడికి జేఈఎం కారణమని పేర్కొన్నట్లు యూఎన్ఎస్సీ నివేదిక తెలిపింది. తాజాగా ఏక్యూఐఎస్‌కు అధికారికంగా ఆపాదించడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.2014లో ఏర్పాటైన ఏక్యూఐఎస్.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో అల్‌ఖైదా కార్యకలాపాలను విస్తరించేందుకు ఏర్పడిన ప్రాంతీయ అనుబంధ సంస్థ. పెద్ద ముఠాల కంటే చిన్న చిన్న చెదురుమదురు సెల్‌లుగా పనిచేస్తూ లాజిస్టిక్స్, ఆర్థిక నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసుకుంటోందని యూఎన్ఎస్సీ నివేదిక పేర్కొంది.అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థల సామర్థ్యాలపై కూడా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. రసాయన, జీవ ఆయుధాలపై ఆసక్తి ఉన్నప్పటికీ వాటిని తయారు చేయడంలో సాంకేతిక సవాళ్లు ఇప్పటికీ ఉన్నాయని తెలిపింది

ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన బెంగాల్ వికెట్ కీపర్, బ్యాటర్ అభిషేక్ పోరెల్ సంచలన రీతిలో అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడటం, శారీరక వేధింపులకు గురిచేయడం, వ్యక్తిగత ఫోటోలతో బెదిరించడం వంటి తీవ్ర ఆరోపణలతో హుగ్లీ జిల్లాలోని మోగ్రా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఇచ్చిన కఠిన ఆదేశాల మేరకే పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మంగళవారం ఛిన్సురాలోని చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పోరెల్‌ను హాజరుపరచగా, న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన యువతి కర్ణాటకకు చెందిన మూడో సంవత్సరం మెడికల్ స్టూడెంట్. మోగ్రా పోలీసు స్టేషన్లో జూన్ 23న ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పోరెల్, ఆమె 2023 జనవరిలో మొదట కలుసుకున్నారు. ఆ ఏడాది ఏప్రిల్ నుంచి ఇద్దరి మధ్య నిరంతరం సంభాషణలు సాగాయి. దాదాపు మూడేళ్లన్నర పాటు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పరస్పరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య కూడా పెళ్లికి సంబంధించిన చర్చలు జరిగాయి. వీరు కలిసి విదేశాలకు కూడా వెళ్లారని సమాచారం. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితురాలి గుర్తింపును రహస్యంగా ఉంచారు. పెళ్లి చేసుకుంటానని పోరెల్ తనను లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. 2026 ఏప్రిల్ 2న పోరెల్‌ను కలవడానికి ఆమె ఢిల్లీకి వెళ్లింది. అక్కడ తనను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశాడని, గదిలో ఒంటరిగా బంధించి ఆహారం కూడా ఇవ్వకుండా వేధించాడని పేర్కొంది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. తమ ఇంటిమేట్ క్షణాల ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని బయటపెడతానని బెదిరించాడని తెలిపింది. ఇతర మహిళలతో కూడా పోరెల్‌కు సంబంధాలు ఉన్నాయని తెలిశాకే తానెంతగా మోసపోయానో అర్ధమైందని ఆమె వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మోగ్రా పోలీసులు అభిషేక్ పోరెల్‌పై భారతీయ
భారత దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మెరుపులు మెరిపించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ తీవ్రమైన లైంగిక దాడి ఆరోపణల్లో చిక్కుకున్నాడు. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో పోలీసులు పోరెల్‌ను అరెస్ట్ చేశారు. హుగ్లీలోని ఎమామి సిటీలో అతడిని అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చించురా న్యాయస్థానంలో హాజరుపరిచారు.బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2023 జనవరి నుంచి అభిషేక్ పోరెల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి, పోరెల్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని సదరు విద్యార్థిని ఆరోపించింది. తాము కలిసి విదేశాలకు సైతం వెళ్లామని తెలిపింది. ఏడాది కాలంగా వీరి మధ్య విబేధాలు తలెత్తాయి. ప్రశ్నించిన తనపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ కేసులో పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ధర్మాసనం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, నిందితుడైన అభిషేక్ పోరెల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, అతడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేయాలని జూలై 14న బెంగాల్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు చర్యలు ముమ్మరం చేసి, కీలక ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి పోరెల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో ఇండియా-ఏ జట్టుకు సైతం ఎంపికైన 23 ఏళ్ల పోరెల్ కెరీర్‌కు ఈ అరెస్ట్ పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గతంలో ఈ ఆరోపణలను పోరెల్ ఖండించాడు. అయితే ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నందున కోర్టు విచారణ ఆధారంగానే ఈ కేసులో తుది తీర్పు వెలువడనుంది.వికెట్ కీపర్ కమ్ లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన అభిషేక్ పోరెల్.. ఐపీఎల్లో 2023 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Abishek Porel Arrest: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడనే ఆరోపణలపై ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు అభిషేక్ పరేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు, దాడి తదితర తీవ్రమైన ఆరోపణలు ఓ యువతి చేయగా.. అతడిపై పోలీసులకు ఓ వైద్య విద్యార్థిని ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగ్గా అభిషేక్‌ను అరెస్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో యువ క్రికెటర్ అభిషేక్ పరేల్‌ను అరెస్ట్ చేయడం క్రికెట్ రంగంలో కలకలం రేపుతోంది. ఏం జరిగింది..? అభిషేక్ పరేల్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం ఏర్పరచుకున్నాడని.. తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ మెడికల్ విద్యార్థిని డమ్ డమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూన్‌లో వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు అభిషేక్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు, దాడి తదితర తీవ్రమైన ఆరోపణలు ఆ యువతి చేసింది. అభిషేక్‌తో తనకు మూడేళ్లు తాను సంబంధం కొనసాగిస్తున్నట్లు.. గతేడాది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని ఆ యువతి ఆరోపణలు చేసింది. అనంతరం కేసులో పోరెల్‌ను అరెస్ట్ చేయాలని కోల్‌కతా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో ఎమామి సిటీలో పోలీసులు అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు హుగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ ప్రకటించారు. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి కేసు ఎదుర్కోవడంతో అభిషేక్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడింది. విచారణ అనంతరం శిక్ష పడితే మాత్రం అభిషేక్ భవిష్యత్ అంధకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ ఐపీఎల్ ప్రస్థానం పశ్చిమ బెంగాల్

Hardik Pandya: ఐపీఎల్ 2027 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉంది. అంతకుముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముంబై ఇండియన్స్‌ను హార్దిక్ పాండ్యా వీడబోతున్నాడనే ప్రచారం జరుగుతున్న వేళ, మొదట్లో కేవలం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాత్రమే రేసులో ఉన్నాయనే వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఏకంగా 5 ఐపీఎల్ జట్లు హార్దిక్‌ను తమ వైపు తిప్పుకోవడానికి పెద్ద వ్యూహాలనే రచిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వంటి టీమ్‌లు తమ స్టార్ ప్లేయర్లను ఇచ్చి అయినా హార్దిక్‌ను సొంతం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి అక్షర్ పటేల్‌ను ముంబై ఇండియన్స్‌కు ఇచ్చే ప్రతిపాదన తెచ్చే అవకాశముంది. గత కొన్నేళ్లుగా ముంబై వద్ద స్ట్రాంగ్ స్పిన్ ఆల్ రౌండర్ లేకపోవడం, అక్షర్‌కు లీడర్షిప్ స్కిల్స్ ఉండటం దీనికి కలిసివచ్చే అంశం. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ పవర్ఫుల్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను ముంబైకి పంపి, హార్దిక్‌ను తెచ్చుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మిచెల్ మార్ష్ వంటి ఆల్ రౌండర్ ఉన్నప్పటికీ, అతను బౌలింగ్ తక్కువగా చేస్తుండటంతో LSG హార్దిక్ కోసం ఆరాటపడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విషయానికొస్తే.. స్టీఫెన్ ఫ్లెమింగ్ నిష్క్రమణతో ఖాళీ అయిన హెడ్ కోచ్ పదవిని భర్తీ చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. అయితే ఒకవేళ ట్రేడ్ కుదిరితే హార్దిక్ కోసం శివమ్ దూబే, ఆయుష్ మ్హాత్రే లేదా డెవాల్డ్ బ్రెవిస్ వంటి ఇద్దరు ఆటగాళ్లను చెన్నై వదులుకోవాల్సి రావచ్చు. అలాగే, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద రూ. 25.2 కోట్లకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత యాషెస్ సిరీస్ ఉన్నందున