
రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది
Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే! ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే! ఈ వార్తకు సంబంధించిన

భారతదేశం సాధించిన 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటుపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు, మాజీ ఉన్నతాధికారులను లక్ష్యం చేసుకుంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గణాంకాల వాస్తవికతను ప్రశ్నించేవారికి సరైన ఉపాధి లేదని, అందుకే వారు టీవీ చర్చా వేదికలపై కూర్చుని కల్పిత వాదనలను తెరపైకి తెస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఇటీవల 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. అయితే, ఈ గణాంకాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వంటి ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేశారు. వృద్ధి రేటుకు అనుగుణంగా ఉద్యోగ కల్పన, పెట్టుబడులు ఎందుకు పెరగడం లేదని రాజన్ ప్రశ్నించగా, ప్రభుత్వం పాత జీడీపీ అంచనాలను సవరించి తగ్గించడం వల్లే ప్రస్తుత వృద్ధి రేటు అధికంగా కనిపిస్తోందని గార్గ్ విశ్లేషించారు.ఈ విమర్శలపై ఢిల్లీలో జరిగిన ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వార్షిక సదస్సులో పీయూష్ గోయల్ స్పందించారు. విమర్శకులు పాత గణాంకాల సిరీస్‌ను ప్రస్తుత డేటాతో పోలుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. "యాపిల్స్‌ను యాపిల్స్తోనే పోల్చాలన్న కనీస పరిజ్ఞానం కూడా వారికి లోపించింది" అని ఆయన చురకలంటించారు. తమ పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయిన వారే ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారంటూ పరోక్షంగా కొందరు మాజీ అధికారులపై విమర్శలు గుప్పించారు.ప్రభుత్వం గణాంకాలను సృష్టించదని, వాస్తవాలను ఎప్పటికీ

Babar Azam: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై సెలెక్షన్ కమిటీ చీఫ్ ఆఖిబ్ జావేద్ తీవ్రంగా స్పందించాడు. కెప్టెన్ బాబర్ అజామ్, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ అవసరమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే జట్టు కూర్పులో మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. పాకిస్థాన్ తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్‌ను 0-2తో కోల్పోయిన తర్వాత ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. మూడో టెస్టుకు కొత్త ఆటగాళ్లను చేర్చడంతోపాటు కోచింగ్ బృందంలోనూ మార్పులు చేసింది. కెప్టెన్, కోచ్ కఠిన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు బోర్డు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆఖిబ్ తెలిపాడు. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌లో ఉబైద్ షాకు అవకాశం ఇవ్వాలని తాను సూచించినా ఆ నిర్ణయం అమలు కాలేదని చెప్పాడు. దీంతో కీలక పర్యటనలో జట్టు పోటీ ఇవ్వలేకపోవడం పరిస్థితిని తీవ్రంగా మార్చిందని వివరించాడు. ఆఖిబ్ ప్రకారం.. పాకిస్థాన్ జట్టులో ఉబైద్ షా, అదనపు వికెట్ కీపర్, పేస్ ఆల్‌రౌండర్ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఉబైద్‌ను ఆడించాలని బాబర్, సర్ఫరాజ్‌కు సూచించినట్లు వెల్లడించాడు. ప్రస్తుత పేసర్లలో ఒకే తరహా వేగం ఉండటంతో బౌలింగ్ విభాగంలో వైవిధ్యం అవసరమని చెప్పాడు. Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్లో ఒంటి చేత్తో..! లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత పాకిస్థాన్ ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహమ్మద్ అవైస్ జఫర్, ఖుర్రమ్ షహ్జాద్ ఈ జాబితాలో ఉన్నారు. వారి స్థానాల్లో సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్, అరాఫత్ మిన్హాస్ తదితరులను చేర్చారు. Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..? ఇదే సమయంలో హెడ్ కోచ్ సర్ఫరాజ్

జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్చల్ చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్చల్ చేశారు. భారతీయులు పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ సందడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో వారి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వీడియోలో కొందరు భారత పర్యాటకులు రైలు మధ్యలో నిల్చుని బిగ్గరగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉన్నారు. మరికొందరు వారికి వంతపాడుతూ చేతులు ఊపుతూ, ఫోన్లలో ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు. చుట్టూ ఉన్న ఇతర ప్రయాణికులు నిశ్శబ్దంగా కూర్చోగా, కొందరు మాత్రం అసంతృప్తిగా అలా చూస్తుండిపోయారు. ఈ వీడియోను Amit24TD అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఘటనలు విదేశాల్లో భారతీయ పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కొందరు వ్యాఖ్యానించారు. రద్దీగా ఉన్న ప్రజా రవాణాలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం సరికాదని మరికొందరు సూచించారు. వ్యక్తిగత వేడుకలు, సరదాలను బహిరంగ ప్రదేశాల్లో ఇతర ప్రయాణికులపై రుద్దకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై రైల్వే సిబ్బంది, అధికారులు ఎందుకు జోక్యం చేసుకోలేదని మరికొందరు ప్రశ్నించారు. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మిషిగన్ డెమోక్రటిక్ సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయెద్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. వాన్స్ భార్య, సెకండ్ లేడీ ఉషా వాన్స్‌ను ఉద్దేశించి ఎల్-సయెద్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై వాన్స్ తీవ్రంగా స్పందించారు. ‘‘నీ నోటితో నా భార్య పేరు ఎత్తొద్దు’’ అంటూ ఘాటు హెచ్చరిక చేశారు. మిషిగన్‌లో రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి మైక్ రోజర్స్‌కు మద్దతుగా సోమవారం జరిగిన మాగా కంపెనీ ర్యాలీలో జేడీ వాన్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్-సయెద్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నా భార్య పేరును నీ నోటితో ఎత్తొద్దు. నీ స్థాయికి అందనంత దూరంలో ఆమె ఉంది’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎల్-సయెద్ చాలా చాలా చెడ్డ వ్యక్తి అంటూ విమర్శించారు. ఎలా మొదలైంది? ఎల్-సయెద్ గతంలో షరియా చట్టంపై చేసిన వ్యాఖ్యలను వాన్స్ ఇటీవల విమర్శించారు. అమెరికా కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకునే ఓ రాజకీయ నాయకుడు షరియా చట్టానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తన దివంగత తాతను గుర్తుచేసుకున్న వాన్స్.. ‘‘ఇది నా తాతకు తెలిసిన డెమోక్రటిక్ పార్టీ అయితే కాదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన అబ్దుల్ ఎల్-సయెద్ Abdul El Sayed.. వాన్స్ తన తాత గురించి మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేస్తూ ఆయన భార్య ఉషా వాన్స్ పేరును ప్రస్తావించారు. ‘‘జేడీ ఉషాను కూడా తనతో పాటు గతంలోకి తీసుకెళ్లి తాతను కలిపిస్తారా?’’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. దీనిపై వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవతలి వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం ఎల్-సయెద్కు ఓ విచిత్రమైన అలవాటుగా మారిందని విమర్శించారు. ఇకపై తన భార్య పేరును ప్రస్తావించవద్దని హెచ్చరించారు. ‘చాలా చాలా చెడ్డ వ్యక్తి’ ఎల్-సయెద్పై వాన్స్ మరిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకే వర్గం ప్రయోజనాల కోసం మిగిలినవారిని పట్టించుకోని రాజకీయ

వరుసగా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అవుతున్నాడంటూ వస్తున్న విమర్శలపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఘాటుగా స్పందించాడు. సమస్య ఏదైనా సరే పరిష్కరించుకునే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: వరుసగా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అవుతున్నాడంటూ వస్తున్న విమర్శలపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఘాటుగా స్పందించాడు. సమస్య ఏదైనా సరే పరిష్కరించుకునే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్లో 14 వేలకుపైగా పరుగులు చేశానని, అందుకు తన అనుభవమే నిదర్శనమని చెప్పాడు. ఇటీవల ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో రూట్ ఏకంగా ఎనిమిది సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనే మూడుసార్లు ఎల్బీడబ్ల్యూ అవ్వడం గమనార్హం. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లోనూ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ‘నేను చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాను. ఇలాంటి సమస్యలను గతంలోనూ అధిగమించాను. దీనిని కూడా అలాగే పరిష్కరించుకుంటాను. నాకు 14 వేల పరుగులు ఊరికే రాలేదు. దీని వెనుక దాదాపు 15 ఏళ్లుకు పైగా కష్టం, శ్రమ ఉన్నాయి. అయితే ఈ వరుస వైఫల్యాలు నన్ను కూడా అసహనానికి గురి చేస్తున్నాయి. కానీ అందులో కొన్ని నిర్ణయాలు ‘అంపైర్స్ కాల్’ కారణంగా నాకు అనుకూలంగా రాలేదు. ఈ సమస్య నుంచి కూడా బయటపడతాను. దీనిపై నాకు పెద్దగా ఆందోళన లేదు’ అని రూట్ తెలిపాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో బ్యాటర్ల తడబాటుకు కొత్త డ్యూక్స్ బంతి కూడా ఒక కారణమని రూట్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఉపయోగిస్తున్న బంతుల్లో మార్పు కనిపిస్తోందని చెప్పాడు. ‘ఈ ఏడాది బంతులు చాలా భిన్నంగా ఉన్నాయి. వాటికి వేరే రకమైన లాకర్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీనిపై నా దగ్గర ఆధారాలు లేవు. డ్యూక్స్నే అడగాలి. బంతి త్వరగా ఆకారం కోల్పోకుండా ఉండేందుకు సీమ్‌పై ప్రత్యేకమైన లాకర్ వేసి ఉండొచ్చు’ అని రూట్ పేర్కొన్నాడు

Eng Vs Pak: ఇంగ్లాండ్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే వాతావరణం వేడెక్కింది. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై తీవ్రమైన విమర్శలు చేశాడు. “పాకిస్థాన్ పరమచెత్త జట్టు. వారిలో ఏమాత్రం టాలెంట్ లేదు. ఇంగ్లాండ్ ఈ సిరీస్‌ను 3-0 తేడాతో చాలా తేలికగా గెలుచుకుంటుంది” అంటూ వ్యాఖ్యానించాడు. లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ కేవలం 171 పరుగులకే ఆలౌట్ కావడంతో బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పై సల్మాన్ భట్ ప్రశ్నాస్త్రాలు స్టువర్ట్ బ్రాడ్ చేసిన విమర్శలపై సల్మాన్ భట్ ఘాటుగా స్పందించాడు. తమ జట్టు ప్రస్తుతం మంచి క్రికెట్ ఆడటం లేదనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని, అలా అని చెత్త జట్టు అని సంబోధించడం సరైంది కాదని మండిపడ్డాడు. ఇంగ్లాండ్ జట్టు గొప్పలు చెప్పుకోవడం ఆపి తమ సొంత రికార్డులను చూసుకోవాలని సూచించాడు. “మీరు ఆస్ట్రేలియా వెళ్లిన ప్రతిసారీ 0-5 తేడాతో ఘోరంగా ఓడిపోయి వస్తారు. గత 16 ఏళ్లుగా ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేకపోయింది. కేవలం ఒక్కటంటే ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే గెలిచింది” అంటూ ఇంగ్లాండ్ వైఫల్యాలను ఎండగట్టాడు. ఇది కూడా చదవండి: Test Record: సచిన్ 200 మ్యాచ్‌ల ప్రపంచ రికార్డ్ అవుట్.. 167వ టెస్టులోనే సంచలనం సృష్టించిన ఇంగ్లాండ్ బ్యాటర్ ఒకప్పుడు పాకిస్థాన్ బౌలింగ్ విభాగం అత్యంత బలంగా ఉండేదని సల్మాన్ భట్ గుర్తు చేశాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ జట్టులో 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సాధారణ బౌలర్లు ఉన్నారని, అప్పట్లో ఎవరూ ఇంగ్లాండ్‌ను చెత్త జట్టు అని అనలేదని పేర్కొన్నాడు. తమ జట్టు బలహీనంగా ఉన్న మాట వాస్తవమేనని, ఒకవేళ ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్

‘కేజీఎఫ్’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్, తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’పై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ఈ సినిమా అశ్లీలతను, పురుషాధిక్యతను ప్రోత్సహించేలా ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. "సినిమాల్లో అశ్లీలతను నేను ఎన్నడూ ప్రోత్సహించను. అది ముమ్మాటికీ తప్పే. సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణకు కూడా ఒక హద్దు ఉంటుందని, వాటిని కళాత్మకంగా తెరకెక్కించాలని నేను నమ్ముతాను" అని స్పష్టం చేశాడు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కలిగే అనుభూతే అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డాడు.‘టాక్సిక్’ కథాంశం గురించి వివరిస్తూ.. "ఈ చిత్రం ప్రధానంగా నేటి తరం యువత (జెన్-జీ) ఎదుర్కొంటున్న సమస్యలు, పాతతరం ఆలోచనలతో వారికి ఎదురయ్యే సంఘర్షణల చుట్టూ తిరుగుతుంది. ఇందులో భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఇది యువత కోసమే తీసిన చిత్రమని అందరికీ అర్థమవుతుంది" అని యశ్ ధీమా వ్యక్తం చేశాడు.‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ, నయనతార, హ్యూమా ఖురేషీ వంటి ప్రముఖ తారలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది

న్యూఢిల్లీ: స్వాతంత్య్రోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ కోటు జేబులోని ఒక వస్త్ర విశేషం శనివారం సామాజిక మాధ్యమంలో పెద్ద దుమారమే రేపింది. మూడు రంగులున్న ఈ పాకెట్ స్క్వెర్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. జాతీయ జెండా రంగుల్లోనే ఉన్నప్పటికీ వాటి క్రమం తిరగేసి ఉండటం విమర్శలకు కారణమైంది. ఆ పాకెట్ స్క్వెర్ భారత జాతీయ జెండాలా లేదని, ఐర్లాండ్ పతాకంలా ఉందని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే... ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ‘‘లగ్తా హై సాహిబ్ నే ఉర్దూ మే తిరంగా పెహనా హై. యా ఫిర్ భారత్ కి జగా ఐర్లాండ్‌గా ఇండిపెండెన్స్ డే మనా రహా హై’’(బహుశా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఉర్దూలో ధరించినట్లు ఉన్నారు. లేదంటే ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారేమో) అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ఉర్దూ భాషను కుడి నుంచి ఎడమకు రాస్తారన్న విషయం తెలిసిందే. పవన్ ఖేరా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ సమర్థించడమే కాకుండా... ఆ పాకెట్ స్క్వెర్లోని రంగులు కాషాయం, తెలుపు, పచ్చలుగా కాకుండా తిరగేసి ఉన్నాయని ఎత్తి చూపారు. ‘‘ఇది ఏ శైలి త్రివర్ణ పతాకం. తిరగేసి ఉంది. భారతదేశానిది కాకుండా ఐర్లాండ్దిలా ఉంది’’అని ఆమె ఎక్స్ పోస్టులో తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు కాంగ్రెస్‌ను విమర్శిస్తే మరికొందరు మోదీ జాతీయ పతాకాన్ని వేసుకుని తిరగడం లేదని అశోక చక్రం లేని విషయాన్ని ఎత్తి చూపారు. మరికొందరు జాతీయ జెండాకు సంబంధించిన నిబంధనలు పాటించి ఉండాల్సిందని సలహా ఇచ్చారు. ఇంకొందరైతే త్రివర్ణం ధరించడం వెనుక ఉద్దేశాన్ని చూడాలని దీన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్

ఒక రోజు ఓ చిన్న పిల్లవాడు సముద్ర తీరంలో ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాడు. అంతలో ఒక్కసారిగా ఓ పెద్ద అల వచ్చి అతని చెప్పులను సముద్రంలోకి లాక్కెళ్లింది. తన చెప్పులు పోవడంతో ఆ బాలుడు బాధపడ్డాడు. వెంటనే ఇసుకపై పెద్ద అక్షరాలతో "సముద్రం ఒక దొంగ" అని రాశాడు. ఆ క్షణంలో అతని దృష్టిలో సముద్రం అంటే తనకు నష్టం చేసిన దొంగ మాత్రమే. కొంతసేపటి తర్వాత అదే సముద్రంలోకి వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు బోలెడన్ని చేపలతో ఆనందంగా తిరిగి తీరానికి చేరుకున్నాడు. ఆ రోజు అతని కుటుంబానికి ఆహారం, ఆదాయం రెండూ సముద్రం వల్లే లభించాయి. కృతజ్ఞతతో అతడు ఇసుకపై "సముద్రుడు గొప్ప దాత" అని రాశాడు. ఒకరికి దొంగగా కనిపించిన సముద్రం, మరొకరికి దాతగా కనిపించింది. అదే సమయంలో ఓ వృద్ధురాలు సముద్రం ఒడ్డున నిలబడి కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకంటే కొంతకాలం క్రితం ఆమె కొడుకు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. తన బాధను తట్టుకోలేక ఆమె ఇసుకపై "సముద్రం ఒక హంతకుడు" అని రాసింది. ఆమె జీవితంలో సముద్రం అంటే తన బిడ్డను దూరం చేసిన క్రూరమైన శక్తి. ఒకరు దొంగ అన్నారు... మరొకరు దాత అన్నారు... ఇంకొకరు హంతకుడు అన్నారు. ఇలా ఒక్కొక్కరు తమ అనుభవాన్ని బట్టి సముద్రానికి ఒక పేరు పెట్టారు. కానీ కొద్దిసేపటికే మరో భారీ అల వచ్చింది. ఇసుకపై రాసిన ఆ మాటలన్నింటినీ ఒక్క క్షణంలో చెరిపేసి వెళ్లిపోయింది. అక్కడ సముద్రం మారలేదు. మారింది కేవలం మనుషుల అభిప్రాయాలే. ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. మన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో దానిపై మన విలువ ఆధారపడి ఉండదు. ఒకరి అవసరానికి అనుగుణంగా మనల్ని పొగడవచ్చు. మరో సందర్భంలో అదే వ్యక్తి మనల్ని విమర్శించవచ్చు. అందుకే పొగడ్తలు వచ్చినా పొంగిపోవద్దు. విమర్శలు వచ్చినా కుంగిపోవద్దు. ఎదుటివారి మాటలను మనసుకు

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుత పాలనా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలనలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని, కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ‘మనవాడా.. కాదా’ అని చూసి సంక్షేమ పథకాలను అందించే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులపై కేసులు పెడుతున్న తీరు మళ్లీ బ్రిటీష్ పాలనను తలపిస్తోందని, మన పూర్వికులు ప్రాణాలర్పించి తెచ్చిన స్వాతంత్ర్య స్ఫూర్తి ఇదేనా అని నిలదీశారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల వైపు కాకుండా ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. ఓటు వేసినా, వేయకపోయినా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే నిజమైన పరిపాలన అని బొత్స స్పష్టం చేశారు. జగన్ హయాంలో విద్య, వైద్యం, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేదరికం లేని సమాజ స్థాపన కోసం పాలన సాగిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే అని భావిస్తోందని... పేదలకు విద్య, వైద్యం అందించడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు