ముప్పై ఏళ్లక్రితంప్రేమ పెళ్లి.. భర్తను హత్య చేసి, తల దగ్గర దీపం పెట్టి.. పోలీసులకు లొంగిపోయిన
మూడు దశాబ్దాల కిందట ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లని ఎదురించి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు. భర్తేమో కేబుల్ నెట్వర్క్లో పనిచేస్తుండగా.. భార్య అంగన్వాడీ కార్యకర్త. అయితే, పెళ్లైన ముప్పై ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో అనుమానం పెనుభూతంగా మారింది. తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానంతో పీక కోసి హత్య చేసి, ఆ తర్వాత అతని తల దగ్గర దీపం పెట్టి ఆ భార్య పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన చోడవరంలో చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరం రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన కొండ్ల ఇందిర, వెంకటరావు (58) దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలు కాగా ఒకరికి వివాహమైంది. శనివారం రోజు అనకాపల్లిలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లొచ్చాక భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇందిరకు పట్టరాని కోపం రావడంతో అక్కడే ఉన్న కత్తి తీసుకుని భర్త వెంకటరావు పీక కోసేసి చంపేసింది. అనంతరం తల వద్ద దీపం పెట్టి పోలీసుల ఎదుట ఆమే లొంగిపోయింది.READ ALSO మెడికో ప్రియాంక మృతి కేసులో కీలక పరిణామం.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ పాటిల్కొండ్ల ఇందిర అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ అందరితో బాగుండేది. ప్రతి ఒక్కరికీ తెలిసిన మహిళ.. ఆరోగ్యం, సామాజిక అంశాలపై అవగాహన కూడా కలిగి ఉండేది. అలాంటి మహిళ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇలా చేయడంతో స్థానికులంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకోవడానికి కన్న కూతుర్లను కూడా విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఇందిర, వెంకటరావు స్థానికులే కావడంతో ముప్పై ఏళ్ల కిందట ఇద్దరి మధ్య ప్రేమ వికసించింది. అప్పట్లో వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి మరీ పెళ్లి చేసుకున్నారు. అలాంటి జంట ఇలా అవ్వడంతో