
ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్ లో బీఆర్ ఎస్ నిరసనర్యాలీ
Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన

కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదల కేటీఆర్ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు రైతులు, నిరుద్యోగుల మోసంపై ఫైర్ BRS Charge Sheet: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేక చార్జ్‌షీట్(BRS Charge Sheet)ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వెయ్యి రోజుల పీడనగా మారిందని, ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోందని విమర్శించారు. ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు.. 15 ఏళ్ల తర్వాత రైడ్.. కీలక పత్రాలు స్వాధీనం అభివృద్ధి శూన్యం.. అప్పుల మయం: కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ సెటైర్లు వేస్తూ "అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్" తరహాలో ఉందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోయినా రూ. 4.50 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చి 30 శాతం కమీషన్లు దండుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టే విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు పోటీ పడుతున్నారని, తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరిలా మార్చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రైతాంగానికి కుచ్చుటోపీ.. రుణమాఫీ, రైతుబంధుపై విమర్శలు: రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. రూ. 50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టువేసి, కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే చేసి 70 శాతం మంది రైతులకు కుచ్చుటోపీ పెట్టారని

తెలంగాణలో విద్యార్థులపై పోలీసుల చర్యల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసిన రాహుల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో జరుగుతున్న దాడులపై స్పందించకపోవడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వారు ఆరోపించారు.శుక్రవారం కేటీఆర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ రాహుల్ గాంధీ తీరును తప్పుబట్టారు. "దేశంలో రెండు రకాల భారతాలు ఉన్నాయి. ఒకచోట విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగితే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తారు, ధర్నాలు చేస్తారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణలో విద్యార్థులను ఈడ్చుకెళ్తూ, గొంతు పట్టుకొని హింసిస్తున్నా పట్టించుకోరు. ఢిల్లీ తరహాలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు రాహుల్ గాంధీ ధర్నా చేస్తారా? లేక తెలంగాణ విద్యార్థులంటే మీకు లెక్కలేదా?" అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.ఇదే అంశంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 19న మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థి గొంతును ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ పట్టుకున్న వీడియోను ప్రస్తావిస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. "ఢిల్లీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎఫ్ఐఆర్ కోసం వెళ్లిన రాహుల్, తెలంగాణ ఘటనలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇక్కడి విద్యార్థులను నేరస్థుల్లా చూస్తున్నారు. ఢిల్లీకి మీ ఆవేశం, తెలంగాణకు మీ మౌనం.. విద్యార్థులు మీ నుంచి ఇంతకంటే మెరుగైన తీరును ఆశిస్తున్నారు" అని కవిత అన్నారు
హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేటలో ఉద్రిక్తత సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అప్రకటిత ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ వార్తకు సంబంధించిన

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన, ఇరు పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వేడికి అద్దం పట్టింది.ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్ల పంపిణీతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ, నియోజకవర్గంలో రూ. 2.50 కోట్లతో సమేల రోడ్డు, రూ. 1.50 కోట్లతో పాతగూడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ, పనులు ఎందుకు ప్రారంభం కాలేదని మంత్రిని ప్రశ్నించారు. స్వయంగా మంత్రి ప్రారంభించిన పనులకే ఈ పరిస్థితి ఎదురైతే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆమె నిలదీశారు.దీనిపై మంత్రి జూపల్లి స్పందిస్తూ, 2018 నుంచి 2023 మధ్య కాలంలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు నిర్మించారో చెప్పాలని ఎమ్మెల్యేను ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం ముదిరింది. గత ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేశామని, మంత్రి వ్యాఖ్యలు సరికాదని కోవ లక్ష్మి కౌంటర్ ఇచ్చారు.అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 8.25 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా నుంచి ప్రతి

Flag Hoisting | కోల్ సిటీ, ఆగస్టు 15: రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ పరిధి స్వతంత్ర చౌక్‌లో శనివారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ జెండావిష్కరణ విషయంలో వివాదం తలెత్తింది. డివిజన్ ప్రధాన కేంద్రమైన స్వతంత్ర చౌక్‌లో ప్రతీ సంవత్సరం గెలిచిన కార్పొరేటర్ ప్రజల సమక్షంలో జెండావిష్కరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే 80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్వతంత్ర చౌక్ లో ఏర్పాట్లు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ భర్త తిరుపతి తన అనుచరులతో వచ్చి ఇక్కడ తామే జెండా ఎగురవేయాలని వారించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంకు దారి తీసింది. దీంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి సముదాయించి ఎవరికి వారుగా వేడుకలు జరుపుకోవాలని సూచించి వెళ్లగొట్టారు. శనివారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకొని ఇరువర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన పంద్రాగస్టు వేడుకలకు మరెక్కడా లేనివిధంగా 51వ డివిజన్లో మాత్రమే పోలీసులు బందోబస్తు కల్పించాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. కొద్ది సేపు అక్కడ ఏం జరుగుతుందోనని స్థానికులు అయోమయానికి లోనయ్యారు. చివరకు ఒకే చోట ప్రక్కప్రక్కనే రెండు జాతీయ జెండాలు ఎగరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమైక్యతకు స్ఫూర్తిగా నిలవాల్సింది పోయి వేడుకల్లో ఆధిపత్యం ప్రదర్శించడం, ప్రజా తీర్పుతో గెలిచిన కార్పొరేటర్ ను అవమానించడం పట్ల స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ రేఖ మహేశ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలను వేదికగా చేసుకొని మాజీ కార్పొరేటర్ రాజకీయం చేయడం, పైగా తన పట్ల దౌర్జన్యంకు దిగడం, కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కార్పొరేటర్‌గా ఇక్కడ జెండా ఎగురవేయడం అనేక

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అనుముల కొండల్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తన విమర్శల దాడిని మరింత ఉద్ధృతం చేశారు. సీఎం సోదరుడికి సంబంధముందని ఆరోపిస్తున్న టెస్సారక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూ కేటాయింపుల విషయంలో రూ. 200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి 'అనుముల హబ్స్' ఏర్పాటులో బిజీగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.బుధవారం ఈ అంశంపై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కేటీఆర్ స్పందించారు. "తాము నిజమైన స్టార్టప్‌ల అభివృద్ధి కోసం టీ-హబ్ నిర్మిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం కుటుంబ సభ్యులతో నడిచే, సున్నా ఆవిష్కరణలు, సున్నా ఉద్యోగులతో కూడిన స్కామ్.. అదేనండీ స్కీమ్ అయిన 'అనుముల హబ్స్' సృష్టిస్తున్నారు. అనుముల సోదరుల్లో ఒకరైతే చాలు, ఎలాంటి ప్రశ్నలు లేకుండా చౌక ధరకే ప్రభుత్వ భూమిని కేటాయిస్తారు. సున్నా పెట్టుబడితో రాత్రికి రాత్రే రూ. 200 కోట్లు సంపాదించినందుకు అనుముల కొండల్ రెడ్డిని 'శతాబ్దపు ఆవిష్కర్త'గా ప్రకటించాలి" అని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.కేవలం రూ. లక్ష చెల్లింపు మూలధనం, సున్నా ఉద్యోగులు ఉన్న కంపెనీకి అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. సుమారు రూ. 200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేవలం రూ. 7 కోట్లకే, అంటే గజం రూ. 3,700 చొప్పున కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల నుంచి కోట్లాది రూపాయలు సంపాదించే ఈ మ్యాజిక్ ట్రిక్‌ను కేవలం అనుముల కుటుంబానికే

హిల్ట్ పాలసీ రద్దు చేస్తాం భూమాఫియా ఉచ్చులో పడొద్దు నీటి హక్కులపై మళ్లీ ఉద్యమం Ktr: హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(Ktr) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విధానం పేరుతో సుమారు 10 వేల ఎకరాల విలువైన భూములను దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్‌లో ఈ పాలసీపై పారిశ్రామిక అసోసియేషన్లతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, పారిశ్రామికవేత్తలందరికీ లేఖలు రాస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని, ఈ పాలసీ కింద ఎవరైనా భూమాఫియాతో చేతులు కలిపి డబ్బులు చెల్లిస్తే తీవ్రంగా నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు. Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం.. అధికారిక ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ! కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలు, రైతులు, వ్యవసాయంపై నిర్లక్ష్యం: మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ నేతలు చేస్తోన్న విమర్శలు, వరుణ యాగాలపై తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌లా దైవకార్యాలు, యాగాలు ఎవరూ చేయలేదని, దైవకృపతో పాటు మానవ ప్రయత్నం ఉంటేనే ఫలితం ఉంటుందని హితవు పలికారు. హరీశ్‌రావు ఆలయానికి వెళ్తే క్షుద్ర పూజలంటూ కాంగ్రెస్ నాయకులు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయం, రైతుల సంక్షేమంపై కనీస అవగాహన లేదని, పాలమూరు బిడ్డగా చెప్పుకుంటూనే ఆ జిల్లాకు సాగునీరు అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఎక్కడా జరగడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కుల కొల్లగొట్టుడు, హైడ్రాపై కేటీఆర్ ఆగ్రహం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణ నీటిని కొల్లగొడుతున్నా ప్రస్తుత ప్రభుత్వం మౌనంగా ఉండిపోతోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి బోర్డు సమావేశంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని