
కేసీ కెనాల్ కింద ఆరుతడి పంటలు సాగు చేయాలి
Duvvuru: కేసీ కెనాల్ కింద ఆరుతడి పంటలు సాగు చేయాలి! ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Duvvuru: కేసీ కెనాల్ కింద ఆరుతడి పంటలు సాగు చేయాలి! ఈ వార్తకు సంబంధించిన
అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిపై అనుచిత వ్యాఖ్యలుచేశారు. సభలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అవహేళన చేసేలా మాట్లాడారని మండిపడుతూ.. అచ్చెన్నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతులకు సమయానికి యూరియా కూడా ఇప్పించలేకపోతున్నారని, శాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ వార్తకు సంబంధించిన

రెండేళ్ల జాతీయ సగటు కంటే మనదే ఎక్కువ ప్రాజెక్టుల పెట్టుబడుల్లో 75 శాతం, ఎంఎ్‌సఎంఈల్లో 73 శాతం వృద్ధి ప్రణాళిక శాఖ జూలై ఆర్థిక నివేదికలో వెల్లడి ప్రజలపై ధరల భారం లేకుండా చూడండి ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వండి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటోంది. సవాళ్లను ఎదుర్కొంటూ వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రణాళిక విభాగం మంగళవారం అందజేసిన 2026 జూలై ఆర్థిక నివేదికలో అది స్పష్టమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ప్రతీ ప్రభుత్వ శాఖలో లక్ష్యాలను చేరుకునేలా వనరుల నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రజలపై ధరల భారం పడకుండా అధ్యయనానికి ఓ కమిటీ వేయాలని ఆదేశించారు. ఎల్‌నినో సంక్షోభం నేపథ్యంలో నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండలాలవారీ ప్రణాళికల ద్వారా లక్ష్యసాధన సులువవుతుందని చెప్పారు. రెండేళ్ల నుంచి జాతీయ సగటు వృద్ధిరేటు కంటే ఏపీలో ఎక్కువ వృద్ధిరేటు నమోదవుతోందని ప్రణాళిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు పెరిగినప్పటికీ కీలక విభాగాల్లో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో 10.7 శాతం వృద్ధిరేటు నమోదైంది. అంతకుముందు ఏడాది రెండోత్రైమాసికంలో నమోదైన 7 శాతం కంటే ఇది చాలా ఎక్కువ. 2023-24లో మందగమనంలో ఉన్న వ్యవసాయరంగం ఇప్పుడు రెండంకెల వృద్ధి సాధిస్తోంది. 2025-26 తొలి క్వార్టర్లో ఈరంగంలో 9.4 శాతం వృద్ధి నమోదు కాగా రెండో క్వార్టర్లో 13.5 శాతానికి చేరింది. పారిశ్రామిక రంగంలో అంతకుముందు ఏడాది 5.1 శాతం వృద్ధి నమోదవ్వగా, 2025-26లో రెండింతలు పెరిగి 10.6 శాతానికి చేరుకుంది. సేవారంగం వృద్ధి మొదటి త్రైమాసికంలో 8.5 శాతం నుంచి రెండో

ఢిల్లీ: ఏపీలో పంటల బీమా పథకం పడకేసిందనే విషయం లోక్‌సభ సాక్షిగా తేటతెల్లమైంది. 2025-26 లో కేవలం 18.88 లక్షల మంది రైతులు మాత్రమే ఎన్రోల్ అయిన విషయం వెలుగు చూసింది. ఏపీలో పంటల బీమా పథకం గురించి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అడగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. రైతులకు సంబంధించి పంట దిగుబడి డేటాను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలి. డేటా అందిన 21 రోజులలో బీమా కంపెనీల ద్వారా క్లైమ్ పరిష్కారం అవుతుంది. అంటే చంద్రబాబు సర్కారు.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం పై దృష్టి పెట్టలేదనే విషయం కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం సాక్షిగా బయటపడంది. ఈ పథకం ఎందుకో తెలుసా..? ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) అనేది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు లేదా అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భద్రత కల్పించే కేంద్ర ప్రభుత్వ పంట బీమా పథకం. రైతులు తక్కువ ప్రీమియంతో తమ పంటలకు పూర్తి రక్షణ పొందేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇది చంద్రబాబు సర్కారు అలసత్వం.. మరి ఈ పథకాన్ని వినియోగించుకోవడంలో ఏపీ ప్రభుత్వం చూపిన అలసత్వం ఏమిటన్నది తాజాగా రుజువైంది. చంద్రబాబు సర్కారుకు రైతు సమస్యలపై దృష్టి లేదనడానికి ఇదొక ఉదాహరణ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే వైఎస్ జగన్ హయాంలో.. ప్రజా సంక్షేమాన్ని కానీ వారి సమస్యలను కానీ అత్యంత ఎక్కువ శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం. అందుకు ఈ గణాంకాలే ఉదాహరణం. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2022-23లో 123.87 లక్షలు, 2023-24 లో 132.55 లక్షల మంది రైతులకు పంట బీమాకు ఎన్రోల్ అయ్యారు. మరి

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి పథంలో పయనిస్తోంది. జాతీయ వృద్ధి రేటును అధిగమించి, వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్రం మెరుగైన ప్రగతిని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) వృద్ధి రేటు 9.9 శాతానికి చేరుకున్నట్లు జులై 2026 నెలవారీ ఆర్థిక నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రణాళికా విభాగం అధికారులు ఈ నివేదికను సమర్పించారు.నివేదిక ప్రకారం, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. 2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 13.5 శాతం, పారిశ్రామిక రంగం 10.6 శాతం, సేవా రంగం 9.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి 304 శాతం, వాణిజ్య వాహనాల విక్రయాలు 51.6 శాతం, ఎస్టిపిఐ (STPI) ఎగుమతులు 32.2 శాతం మేర పెరిగాయి. సాంకేతికత వినియోగం ద్వారా జీఎస్టీ వసూళ్లు 21 శాతం వృద్ధితో రూ.13,282 కోట్లకు చేరాయి. రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం కూడా ఆశాజనకంగా ఉంది. రూ. 2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల్లో 75.4 శాతం మేర గ్రౌండింగ్ పూర్తయింది.ఈ నివేదికను సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైందని, కృష్ణా నదిలో నీటి లభ్యత లేక శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులు నిండలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీవీ పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర మార్కెట్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరులోని టొబాకో బోర్డు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు సోమవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. పొగాకు రైతులు, కొనుగోలు కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఆయన రైతుల కోసం సమగ్ర ఉపశమన ప్యాకేజీని అధికారికంగా వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా సంక్షోభంలో ఉన్న వేలాది మంది పొగాకు రైతులకు తక్షణమే పెద్ద ఊరట లభించనుంది. గత సీజన్లో పొగాకుకు మంచి ధరలు లభించడంతో ఈసారి రైతులు భారీగా పంట సాగు చేశారు. టొబాకో బోర్డు కేవలం 140 మిలియన్ కిలోల ఉత్పత్తికే అనుమతి ఇచ్చినా, క్షేత్రస్థాయిలో ఏకంగా 240 మిలియన్ కిలోల దిగుబడి వచ్చింది. ఈ రికార్డు స్థాయి అధిక ఉత్పత్తికి తోడు అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పొగాకు ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో పెట్టుబడులు కూడా రాక రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు కంపెనీలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నుంచి నిర్ణీత మద్దతు ధరలకే కొనుగోళ్లు ప్రారంభించాలని మంత్రి స్పష్టం చేశారు. బ్రైట్ గ్రేడ్‌కు కిలోకు కనీసం రూ.230, మీడియం గ్రేడ్‌కు రూ.190, ఆఫ్-స్టైల్‌కు రూ.130, లో గ్రేడ్‌కు రూ.110 చెల్లించాలని ఆదేశించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, అర్హత ఉన్న ప్రతి రైతుకు రెండేళ్ల కాలానికి రూ.50,000 వడ్డీలేని రుణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఫలితంగా రాష్ట్రంలోని దాదాపు 45 వేల మంది పొగాకు రైతులకు వడ్డీలేని రుణాల రూపంలో ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఇదిలా ఉండగా, లో గ్రేడ్ మరియు ఆఫ్-స్టైల్ పొగాకుకు క్వింటాల్‌కు రూ.1,000 చొప్పున అదనపు ఆర్థిక సాయం అందించనున్నట్లు

ఏపీలో భూ యాజమాన్య హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలిదిండిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భూ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకటించారు. ఇకపై పాస్‌బుక్‌లపై ఇతర వ్యక్తుల ఫోటోలు ఉండాల్సిన అవసరం లేదని, మీ భూమి మీకే చెందుతుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 68 లక్షల మందికి ఇంకా పట్టాదారు పాస్‌బుక్‌లు అందాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో భూములను నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన ఆరోపించారు. కేటాయించని భూములను కూడా ప్రోహిబిటెడ్ జాబితాలో పెట్టి ప్రజలను వేధించిన తీరు సరికాదని సీఎం మండిపడ్డారు. ఈ సమస్యలను పరిష్కరించడమే తమ బాధ్యతని ఆయన పునరుద్ఘాటించారు. దీంతో ఇప్పటివరకు నిషేధిత జాబితాలోని సెక్షన్ 22ఏ కింద ఉన్న సుమారు 41 వేల ఎకరాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనివల్ల వేలాది మంది రైతులకు తమ భూములపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు దక్కాయి. ఇదిలా ఉండగా, పాస్బుక్ల జారీ ప్రక్రియను గతంలో కంటే మరింత వేగవంతంగా మరియు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతికతను జోడించడం ద్వారా అవినీతికి తావులేకుండా ఈ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వివరించారు. ఫలితంగా, ప్రభుత్వ పథకాల అమలులో అవినీతిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. 'తల్లికి వందనం' పథకం అమలులో చూపిస్తున్న పారదర్శకతనే భూమి హక్కుల కల్పనలోనూ పాటిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ప్రజల సమస్యలను పరిష్కరించడం వల్లే తమకు ప్రజా మద్దతు లభిస్తుందని, ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా కూటమిదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులందరికీ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చంద్రబాబు ముగించారు. అర్హులైన