ఆగస్టు మూడో వారంలో మేష రాశి నుంచి సూర్యుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారం చివర్లో మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. పరిహారం : సూర్య భగవానుడిని స్మరించుకుంటూ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.
వృషభ రాశి వారికి ఆగస్టు మూడో వారంలో అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి నుంచి సూర్యుడు నాలుగో స్థానంలో, ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంతో నాణ్యమైన సమయం గడిపే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పరిహారం : ఆదివారం రోజున సూర్య మంత్రాలను జపించాలి.
కర్కాటక రాశి వారికి ఆగస్టు మూడో వారంలో శుభప్రదంగా ఉంటుంది. ఇదే రాశిలో గురు గ్రహం మొదటి లగ్నంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వారం చివర్లో మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. పరిహారం : గురువారాల్లో అవసరం ఉన్న వారికి అరటిపండ్లు, శనగపప్పు దానం చేయాలి.
వృశ్చిక రాశి వారికి ఆగస్టు మూడో వారంలో శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. సూర్యుడు, గురుడి ప్రభావంతో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ బంధాలు మరింత బలోపేతం కావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. పరిహారం : ఈ వారం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి.
మకర రాశి వారికి ఆగస్టు మూడో వారంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ వారం గురు గ్రహం సప్తమ స్థానంలో ఉండటం వల్ల మీ ప్రేమ సంబంధాలు బలపడనున్నాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు చేసే పనుల్లో మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు, వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిహారం : గురువారాల్లో అరటి చెట్టుకు నీరు, శనగపప్పు కలిపిన పసుపు మిశ్రమాన్ని సమర్పించాలి. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి





