
కామాక్షి భాస్కర్ల ((Kamakshi Bhaskarla) నటించిన ‘అగధ’ (Agadha) ఆగస్ట్ 14న థియేటర్లలోకి రాబోతోంది. ఎం.ఎస్.రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా గురించి కామాక్షి భాస్కర్ల చెప్పిన విశేషాలేంటో చూద్దాం.
‘అగధ’ గురించి చెప్పండి? ఎం ఎస్ రాజు గారు మిమ్మల్ని నటించమని ఎప్పుడు అడిగారు?
నాకు ఎం.ఎస్. రాజు గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన తీసిన వాటిల్లో ‘మనసంతా నువ్వే’ నాకు ఆల్ టైం ఫేవరేట్. ఆయన ‘అగధ’ కోసం ఫోన్ చేయడంతో చాలా సంతోషంగా అనిపించింది. నా ‘పొలిమేర’ చూశానని ఆయన అన్నారు. ఆయన ప్రతీ సినిమాలోని ప్రతీ ఆర్టిస్ట్ పవర్ ఫుల్‌గానే కనిపిస్తారు. రాజు గారు నన్ను పిలిచారంటే కచ్చితంగా ఏదో ఒక కొత్త పాయింట్, ముఖ్యమైన పాత్రే అయి ఉంటుందని అర్థమైంది. పైగా రాజు గారు కావడంతో నేను కూడా వెంటనే ఓకే చెప్పాను. ‘అగధ’ కథ, నా పాత్ర చెప్పిన తర్వాత మరింతగా నచ్చేసింది.
ఈ పాత్ర కోసం ఎలా కష్టపడ్డారు? ఈ సినిమాలో మీరు కట్టుకున్న చీర పద్దతి గురించి ఇబ్బంది పడ్డారా?
మహాదేవి పాత్ర కోసం మారేందుకు నాకు టైం పట్టింది. కామాక్షిగా నన్ను నేను పక్కనపెట్టి, నా ప్రిన్సిపల్స్ పక్కన పెట్టి ఆ పాత్ర కోసం మారడానికి ఇబ్బంది అనిపించింది. దేవుడి అనుగ్రహంతో పుట్టే పాత్ర అది. బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను. ప్రతీ ముద్ర గురించి, ఆ పాత్ర నడవడిక గురించి అర్థం చేసుకుని నటించాను. సినిమాలో ఎక్కడా కూడా కామాక్షి కనిపించకూడదని జాగ్రత్తలు తీసుకున్నాను. ‘అగధ’లో ప్రతీది కూడా రాజు విజన్ అని చెప్పుకోవచ్చు. ప్రతీది డిఫరెంట్‌గా ఉండాలని ముందే ఆయన అనుకున్నారు. అలాంటి చీరకట్టులో నాకు కాస్త ఇబ్బంది అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్ కోసం మేం ముందుగానే వర్క్ షాప్స్ చేశాం. రిహార్సల్స్ చేశాం. అయితే సెట్లో చిన్న చిన్న ఇబ్బందులు సహజం.
శ్యాం ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని అనుష్కతో పోల్చారు? దానిపై మీ స్పందన ఏంటి?
అంత పెద్ద నిర్మాత నన్ను అలా పోల్చడం ఆనందంగా అనిపించింది. ఆయన అనుష్క గారితో పోల్చడం అనేది నన్ను మరింత బాధ్యతగా ఉండేలా చేస్తుంది.
మీ 9 ఏళ్ల జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు కదా? ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు?
మగాళ్లు నటిస్తే మేల్ సెంట్రిక్ సినిమాలు అనరు. కానీ ఫీమేల్ చేస్తే మాత్రం ఫీమేల్ సెంట్రిక్ సినిమా అంటారు. ఇంట్లో మహిళలు మల్టీపుల్ టాస్కులు చేస్తుంటారు. స్క్రీన్ మీద ఫీమేల్ కారెక్టర్స్ ఇండిపెండెంట్‌గా ఎందుకు ఉండకూడదు అని అనుకునేదాన్ని. 2019 నుంచి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. చిన్న చిన్న పాత్రల కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. నేను సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాను. ఇప్పటికీ నాకు కారు లేదు. బైక్ మీదే వస్తాను. ఇప్పుడు అందరూ రోడ్ల మీద గుర్తు పట్టి నన్ను ఫాలో అవుతున్నారు ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చే వెహికల్ కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది. మాది మిడిల్ క్లాస్ కావడంతో మాకు కారు పెద్ద విషయం (నవ్వుతూ).
‘పొలిమేర’, ‘అగధ’ వంటి చిత్రాలు మీకు వస్తుండటం ప్లస్ పాయింట్ అనుకుంటున్నారా? మైనస్ అనుకుంటున్నారా?
జానర్స్ రిపీట్ అవుతున్నా పాత్రలు మాత్రం కొత్తగానే ఉంటున్నాయి. ఓ సినిమాని కామాక్షి భుజానికి ఎత్తుకుని ముందుకు తీసుకు వెళ్లగలదు అనే నమ్మకాన్ని ఏర్పర్చాలి. కొన్ని సినిమాల్ని డబ్బుల కోసం చేస్తాం. ఇంకొన్ని మనల్ని మనం సంతృప్తి పర్చుకునేందుకు చేస్తుంటాం. చిన్న అవకాశం, పెద్ద అవకాశం అని నేను చూడను. వచ్చిన అవకాశాల్లో నాకు నచ్చిన పాత్రను ఎంచుకుంటాను. నెక్ట్స్ నేను ఓ లవ్ స్టోరీకి సైన్ చేశాను. ‘పొలిమేర’, ‘అగధ’ వంటి చిత్రాలకే సూట్ అవుతాను అని అనుకునే విషయాన్ని నేను బ్రేక్ చేస్తాను.
‘అగధ’లోని హారర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ గురించి చెప్పండి?
‘అగధ’లో మరీ ఎక్కువ హారర్ మూమెంట్స్ ఉండవు. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. డివైన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. చివరికు అందరికీ ఓ డివైన్ ఫీలింగ్ వస్తుంది.
అవునండి.. కాస్త గ్యాప్ ఇచ్చాను. నేను అక్కడ ఉండే కంటే ఇక్కడే ఇండస్ట్రీలో ఉండాలని అనుకుంటున్నాను. నాలాంటి సాధారణ మహిళల్ని రిప్రజెంట్ చేయాలని, తెరపై వారందరినీ చూపించాలని అనుకుంటున్నాను.
ఇంత వరకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా, రైటింగ్ టీంలోనూ పని చేశాను. నాకు దర్శకత్వం వహించాలనే ఆలోచన కూడా ఉంది. కానీ ఇప్పుడు కాదు. దానికి ఇంకా చాలా టైం పడుతుంది.





