
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Vastu Plants: మన దగ్గర ఏదైనా కిరాయి ఇల్లు చూడాలన్న అది వాస్తు ప్రకారం ఉందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు తరచి చూసుకుంటారు. అలాగే వ్యాపారం చేయడానికైనా ఇతరత్రా ఏదైనా పనుల కోసం కూడా వాస్తు చూడాల్సిందే. ఇక మన సంస్కృతి సాంప్రదాయాల్లో వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు ప్రాముఖ్యత ఉంది. అలాగే, ఇంట్లో కొన్ని మొక్కలను పెంచుకోవడం మంచిదని చాలా మంది జ్యోతిష్యులు చెబుతున్నమాట. ఇప్పుడు, పూజ గదిలో లేదా ఇంటి మూలలో పవిత్రమైనవిగా భావించే కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల ఆ ప్రదేశంలో సానుకూల శక్తి విపరీతంగా పెరుగుతుందని ప్రముఖ వాస్తు నిపుణులు చెబుతున్న మాట.
కాబట్టి, పూజ గది యొక్క పవిత్రతను పెంచి, మనశ్శాంతిని, లక్ష్మీదేవి ఆశీస్సులను కలిగించే 5 ముఖ్యమైన మొక్కల గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ప్రస్తావించబడింది.
హిందూ సంప్రదాయంలో, తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పూజ గదిలో ఈశాన్య లేదా తూర్పు దిశలో ఒక చిన్న తులసి మొక్కను ఉంచడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్న మాట.
మల్లె, పారిజాత పువ్వుల సువాసన దేవునికి చాలా ప్రియమైనది. పూజ గది చుట్టూ వీటిని ఉంచడం వల్ల వచ్చే సహజ సువాసనతో పాటు ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి, మనశ్శాంతిని పెంచుతుందట.
పవిత్రమైన వెదురు మొక్క ఇంటికి శాంతిని, దీర్ఘాయువును తీసుకొస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం, 5 లేదా 7 గుండ్రని కాండాలు గల వెదురు మొక్కను పూజ గదికి సమీపంలో లేదా పూజ గదికి తూర్పు దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సంపదతో పాటు శాంతిని చేకూరుస్తాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఉంచడం మంచిదని చెబుతుంటారు. Rdr ఇది లక్ష్మీదేవికి సంబంధించిన శుక్ర గ్రహానికి ప్రతీక. పూజ గదికి ఆగ్నేయ మూలలో ఒక చిన్న మనీ ప్లాంట్‌ను ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభించి, ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.
జేడ్ ప్లాంట్‌ను అదృష్టాన్ని, సంపదను ఆకర్షించే శక్తివంతమైన మొక్కగా వాస్తు శాస్త్రంలో భావిస్తారు. ఈ మొక్కను దేవుని గది దగ్గర ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడి, వ్యాపారంలో అపారమైన లాభాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతున్న మాట.
పూజ గదిలో ఉంచే ఏ మొక్కలైనా ఎల్లప్పుడూ పచ్చగా, ఆరోగ్యంగా ఉండాలే చూసుకోవాలని వాస్తు పండితులు సలహా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎండిపోయిన మొక్కలను లేదా ఎండిన ఆకులను తీసివేసి, కుండీలను శుభ్రంగా ఉంచడం వల్ల దైవ ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయి.
Disclaimer (గమనిక): ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మతపరమైన జానపద నమ్మకాలతో పాటు వాస్తు శాస్త్రం ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. జీ మీడియా న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




