హిందూ పురాణాల ప్రకారం, అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ‘ఆది’ అంటే మొట్టమొదటిది అని అర్థం. మనం ఏదైనా సాధించాలంటే ముందుగా ఒక ఆలోచన, కచ్చితమైన లక్ష్యం, దాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పం కచ్చితంగా అవసరం పడుతుంది. అందుకే ఆదిలక్ష్మిని సంకల్పశక్తి, అంతరంగ బలం, ధార్మిక చైతన్యానికి ప్రతీకగా భావించొచ్చు.
మనలో కొందరికి ధైర్యం పుష్కలంగా ఉంటుంది. అయితే జ్ఞానం లేకపోతే సక్సెస్ సాధించడం కష్టం. ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకు తెలివితేటలు, విద్య, జ్ఞానం, నైపుణ్యాలు చాలా అవసరం. వీటన్నింటికీ విద్యాలక్ష్మిని సంకేతంగా భావిస్తారు. అందుకే విద్యను అత్యంత విలువైన సంపదగా పరిగణిస్తారు.
మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని చూసి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేందుకు శక్తి, సామర్థ్యాలు కావాలి. అందుకే ధైర్యలక్ష్మిని సాహసం, సహనం, ఆత్మవిశ్వాసానికి సంకేతంగా పరిగణిస్తారు. క్లిష్టమైన పరిస్థితుల్లో మనోధైర్యంగా ఉండేందుకు, అమ్మవారి అనుగ్రహం ముఖ్యమని పండితులు చెబుతారు.
మనలో ప్రతి ఒక్కరికి ధైర్యం, విద్య, శక్తి, సామర్థ్యాలు ఎన్ని ఉన్నా గెలుపు సాధిస్తేనే అన్నింటికి ప్రయోజనం చేకూరుతుంది. అలాంటి శక్తిని అందించే దేవత విజయలక్ష్మి. గెలుపు అంటే కేవలం పరీక్షల్లో పాస్ అవ్వడం, మంచి ఉద్యోగం సంపాదించడం, వ్యాపారులు మంచి లాభాలు పొందడమే కాదు, మంచి ఆలోచనలతో జీవించడం, ధర్మబద్ధంగా లక్ష్యాలను చేరుకోవడమే నిజమైన గెలుపుకు అర్థం.
మనలో ప్రతి ఒక్కరి జీవిత మనుగడ కోసం ఆహారం అత్యంత ముఖ్యమైనది. ఎంత డబ్బు ఉన్నా ఆహారం లేకుండా జీవితం సాఫీగా సాగదు. అందుకే ధాన్యలక్ష్మిని ఆహారం, వ్యవసాయానికి సంకేతంగా భావిస్తారు. ఇంట్లో ఉండే ఆహారాన్ని అన్నపూర్ణ దేవతగా భావించి పూజిస్తారు. అందుకే ఆకలితో ఉండే వారికి అన్నం పెట్టడం వల్ల ధాన్యలక్ష్మిని ఆశీస్సులు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు.
హిందూ సంప్రదాయం ప్రకారం, ధనలక్ష్మి అంటే డబ్బు, బంగారానికి ప్రతీకగా భావిస్తారు. అయితే ఎవరైతే న్యాయంగా సంపాదిస్తారో, అవసరమైన చోట ఖర్చు చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, కుటుంబ క్షేమం గురించి, దానికి మాత్రం పెట్టే ఖర్చు వల్ల ఆ డబ్బుకు సార్థకత లభిస్తుంది. అందుకే డబ్బును సంపాదించడం ఎంత ముఖ్యమో, దానిని సద్వినియోగం చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే ధనలక్ష్మి ఆశీస్సులు పొందాలంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, దాన్ని సక్రమంగా సంపాదించడం, తెలివిగా ఖర్చు చేయడం అని గుర్తుంచుకోవాలి.
అష్టలక్ష్ముల్లో గజలక్ష్మికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ దేవత అనుగ్రహం ఉంటే రాజసం, హోదా, వైభవం కచ్చితంగా లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే గజరాజులను సంపద, రాజసానికి సంకేతంగా భావిస్తారు. మన జీవితంలో గౌరవం, హోదా, ప్రతిష్ట, అధికారంతో వీటిని బాధ్యతగా వినియోగించినప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుంది.
మనలో ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం సంపాదన, లక్ష్యం సాధించడం మాత్రమే కాదు, కుటుంబం, వంశం, ఆస్తి, అంతస్తులు, ఆహారం, గౌరవం, ధనం అన్నీ కలిపి కుటుంబ సంక్షేమం, కుటుంబ ఐక్యత, బంధాలు వంటి అంశాలు బలంగా ఉంటాయి. కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచి విలువలు తరతరాలకు కొనసాగడం కూడా సంపదతో సమానం. అందుకే సంతాన లక్ష్మీని సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరించిన వారికి, దీపారాధన చేసి, దూప దీప నైవేద్యాలు సమర్పించి, దానధర్మాలు చేసి భక్తి, శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన వారికి అష్టలక్ష్ముల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. గమనిక : ఇక్కడ అందించిన భక్తి, జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి





