ఈ ఏడాది శ్రావణ శుక్రవారం వేళ పేదరికంలో ఉండే వివాహిత మహిళలకు, కొత్తగా పెళ్లి చేసుకున్న స్త్రీలకు ఎర్రని రంగులో ఉండే గాజులు, సౌందర్య ఉత్పత్తులు, సింధూరం వంటి వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి, మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగించే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఆర్థిక పరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంపదకు సంబంధించి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రావణ శుక్రవారాన్ని లక్ష్మీదేవితో పాటు శుక్ర గ్రహానికి కూడా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున చిన్నారులకు లేదా బాలికలకు తెల్లని రంగులో ఉన్న మిఠాయిలను దానం చేయాలి. ఇవి దానం చేయడం వల్ల శుక్ర గ్రహ దోష ప్రభావం తగ్గిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. వరలక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభించే అవకాశం ఉంటుంది.
శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇలాంటి వస్తువులను దానం చేయడం వల్ల మీ సంపద పెరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన చక్కెర, పెరుగు, ఉప్పు వంటి పదార్థాలను దానం చేయడం వల్ల ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవట. అంతేకాదు మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. మీ కుటుంబ సంక్షేమం, శ్రేయస్సు పెరుగుతుంది. మీ బంధువులతో, తోబుట్టువులతో విభేదాలన్నీ తొలగిపోయి, మీ బంధం మరింత బలపడొచ్చు.
శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున మీ సోదరీమణులకు లేదా ఇతర మహిళలకు లేదా ఆడపడుచులకు పట్టుచీరలు దానంగా ఇవ్వడం వల్ల మీ కుటుంబజీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం మరింత బలపడొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి.
శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున శ్రీ యంత్రాన్ని తీసుకుని, దాన్ని స్వచ్ఛమైన ఆవు పాలతో శుభ్రం చేయాలి. అనంతరం మీ ఇంటి చుట్టూ దాన్ని కొద్ది కొద్దిగా చల్లాలి. అనంతరం శ్రీ యంత్రాన్ని మీరు ధనాన్ని నిల్వ ఉంచే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి, పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి