
© 2026 nimisham.in

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్, నటనతోనే కాకుండా సంపాదనలోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ చెన్నై బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా నిలిచారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రస్తుతం త్రిష నికర ఆస్తి విలువ సుమారు రూ. 85 కోట్లకు చేరింది. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘లియో’ వంటి భారీ విజయాల తర్వాత త్రిష తన రెమ్యునరేషన్‌ను గణనీయంగా పెంచారు. ప్రస్తుతం ఆమె ఒక్కో చిత్రానికి రూ.10 నుంచి 12 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలతో పాటు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ, ఎండార్స్మెంట్ల ద్వారా ఏటా సుమారు రూ.9 కోట్లు ఆర్జిస్తున్నారు. ఆస్తి పెట్టుబడుల్లోనూ త్రిష ముందున్నారు. చెన్నైలో ఆమెకు సుమారు రూ.10 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు ఉంది. అలాగే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండేందుకు ఇక్కడ రూ. 6 నుంచి 6.5 కోట్ల విలువైన మరో ఇల్లు ఉంది. అంతేకాకుండా విదేశాల్లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం.ఇక లగ్జరీ కార్లంటే త్రిషకు చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ ఎవోక్, ఆడి వంటి రూ. 3 నుంచి 4 కోట్ల విలువైన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇలా నటనతో పాటు వ్యాపార దృక్పథంతో ముందుకు సాగుతూ త్రిష తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు.
మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్.. తర్వాత ఏమైందంటే..
Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
టాలీవుడ్లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్ చర్యలు
బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్!
Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.