
© 2026 nimisham.in

మాట్లాడితే ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అంటూ జబ్బలు చరుచుకుంటాం.. 1000 కోట్లు పరిచయం చేసింది మేమేనంటాం.. కానీ పర్ఫార్మెన్స్ అలా లేదు. కాస్త కఠువుగానే ఉంటుంది మరి.. ఓ పక్క సింగిల్ లాంగ్వేజ్ సినిమా 1000 కోట్లు కొడుతుంటే.. 2025 నుంచి మనోళ్లు సాధించేందేంటి..? బడ్జెట్స్‌పై పెడుతున్న ఫోకస్.. ఔట్ పుట్లో కనబడట్లేదెందుకు..? మన సినిమాలకు ఏమైంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..! 2022లో RRR 1200 కోట్లు.. 2024లో పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లకు పైగా వచ్చాయి. 2023లో సలార్ 500 కోట్ల క్లబ్బులో చేరింది.. 2024లో దేవర 500 కోట్ల వరకు వసూలు చేసింది. 2025లో మాత్రం కేవలం మాటలే కానీ చేతలేం లేవు. వచ్చిన స్టార్స్ తోక ముడిచారు. 1000 కోట్లని కలలు గన్న గేమ్ ఛేంజర్, వార్ 2, రాజా సాబ్ దారుణంగా నిరాశ పరిచాయి. 2026లోనూ పరిస్థితులు మారలేదు. 2026 వచ్చి 8 నెలలైపోయింది.. ఈ ఏడాది ప్యాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు. అల్లు అర్జున్, మహేష్ లాంటి హీరోలు 2025 నుంచి అసలు కనబడట్లేదు. అది కూడా టాలీవుడ్‌కు మైనస్సే. దాంతో 2026లోనూ 500 కోట్లు కూడా రాబట్టలేకపోయింది టాలీవుడ్. మన శంకరవరప్రసాద్ గారు, పెద్ది సినిమాలు మాత్రమే 300 కోట్ల క్లబ్బులో చేరాయి. పుష్ప 2 తర్వాత సౌత్‌లో అసలు 1000 కోట్లు కొట్టిన సినిమానే లేదు. మరోవైపు ధురంధర్ సింగిల్ లాంగ్వేజ్‌లోనే ఫస్ట్ పార్ట్‌తో 1400 కోట్లు, సెకండ్ పార్ట్‌తో 1800 కోట్లు వసూలు చేసింది. 2025-26లో 1000 కోట్లు దాటిన ఇండియన్ సినిమా ఇదొక్కటే. కన్నడలో కాంతార ఛాప్టర్ 1 మాత్రమే 850 కోట్లకు పైగా వసూలు చేసింది. దాని తర్వాత కూలీ తెచ్చిన 518 కోట్లే సౌత్‌లో హైయ్యస్ట్. ఈ లిస్టులో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. మాట్లాడితే మనమే తోపులం అని జబ్బలు చరుచుకుంటున్న మన హీరోలకు ఇది పెద్ద షాకే. 2026లో ఫౌజీతో ప్రభాస్ మూడోసారి 1000 కోట్ల క్లబ్బులో చేరతారా లేదంటే టాక్సిక్‌తో యశ్ రెండోసారి 1000 కోట్లు వసూలు చేస్తారా..? అదీ కాదంటే మళ్లీ హిందీ నుంచే రామాయణ, షారుక్ ఖాన్ కింగ్ సినిమాలు ఆ ఫీట్ అందుకుంటాయా అనేది చూడాలిక.
పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల
బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి?
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








